Search
  • Follow NativePlanet
Share
» »ms ధోని జీవితంతో ముడిపడివున్న ప్రదేశాలు !

ms ధోని జీవితంతో ముడిపడివున్న ప్రదేశాలు !

By Mohammad

ఎం. ఎస్.ధోని ... ఈ పేరు గురించి ఇండియాలో ఎవరికి తెలీదు చెప్పండి. భారతజట్టులో మిడిల్ ఆర్డర్ బ్యాట్స్ మెన్ గా, వికెట్ కీపర్ గా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మహేంద్ర సింగ్ ధోని, 2007 లో రాహుల్ ద్రావిడ్ నుండి కెప్టెన్సీ భాధ్యతల్ని తీసుకొని అత్యధిక విజయాలను అందించాడు మరియు అనేక కెప్టెన్సీ రికార్డులను తిరగరాశాడు. ప్రస్తుత ఇండియన్ క్రికెట్ జట్టుకు కెప్టెన్ .. ఎం.ఎస్. ధోనియే !

<strong>ఐపీఎల్ స్టార్లు... పుట్టిన ప్రదేశాలు!!</strong>ఐపీఎల్ స్టార్లు... పుట్టిన ప్రదేశాలు!!

ఎం. ఎస్. ధోని గురించి ఎన్నో పుస్తకాలు వెలువడ్డాయి. ఇప్పడు అతని జీవితంలో జరిగిన కొన్ని యదార్థ సంఘటనల గురించి ఒక సినిమాని కూడా తీశారు. అదే 'ఎం.ఎస్.ధోని : ది ఆన్ టోల్డ్ స్టోరీ'. ఇందులో ఎం.ఎస్.ధోని బాల్యం నుంచి ఇప్పటివరకు ఎలా ఎదిగాడు, అతని కృషికి కారకులెవరు, అతని మైండ్ సెట్ క్రికెట్ కు ఎలా మళ్లింది .. ఇలా ఇత్యాది ఆసక్తికరమైన సన్నివేశాలు, అతని జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలు ఉన్నాయి.

<strong>గిరిదిహ్ - కొండలు మరియు గుట్టలు గల భూమి !!</strong>గిరిదిహ్ - కొండలు మరియు గుట్టలు గల భూమి !!

ఈ సినిమాలో అతనికి సంబంధించిన కొన్ని ప్రముఖమైన ప్రదేశాల గురించి కూడా చూపించారు. ఆ ప్రదేశాలు ఏంటో, అవెక్కడ ఉన్నాయో ? మీకు తెలుసుకోవాలని లేదూ ! అయితే ఎప్పుడూ కూల్ గా కనిపించే ఎం.ఎస్.ధోని లో ఆ కసి, పట్టుదల రావటానికి, అతని విజయాలకు సంబంధించిన కొన్ని ప్రదేశాలను వీక్షిద్దాం పదండి!

<strong>చత్ర - సుందర దృశ్యాల పట్టణం !</strong>చత్ర - సుందర దృశ్యాల పట్టణం !

రాంచి

రాంచి

ఎం.ఎస్.ధోని గురించి ఎప్పుడు వచ్చిన 'రాంచి' ముందువరుసలో నిలబడుతుంది. అలా రాంచికి, ధోనికి ఒక కనెక్షన్ కుదిరింది కారణం ధోని రాంచి లో పుట్టి, పెరగడమే. రాంచి జార్ఖండ్ రాష్ట్ర రాజధాని. ఈ నగరం భారతదేశం గర్వించే ఒక క్రీడాకారుడిని అందించింది.

చిత్రకృప : thatscriket.com

చూడవలసిన ప్రదేశాలు

చూడవలసిన ప్రదేశాలు

రాంచిని ఒకప్పుడు (బీహార్ లో అంతర్భాగమైనప్పుడు) బీహార్ లోని హిల్ స్టేషన్ లలో ఒకటిగా పరిగణించేవారు. రాంచి 'సిటీ ఆఫ్ వాటర్ ఫాల్స్ ' గా ఖ్యాతికెక్కింది. ధోని పుట్టిన ఈ ప్రదేశంలో చూడటానికి ఎన్నో పర్యాటక ఆకర్షణలు ఉన్నాయి. దస్సామ్ ఫాల్స్, హిర్ని ఫాల్స్, హున్డ్రు ఫాల్స్ మొదలైనవి వాటిలో కొన్ని.

చిత్రకృప : Samratbit

 క్రీడాకారుడు

క్రీడాకారుడు

ఎం.ఎస్.ధోని విషయానికి వద్దాం. ఇతను చిన్నప్పటి నుంచే మంచి క్రీడాకారుడు. మొదటి నుంచి క్రికెట్ అంటే ఎంతో ఇష్టం. స్కూల్ డేస్ లోనే ఫుట్ బాల్, బాట్మింటన్ మరియు ఇలా ఎన్నో క్రీడలు ఆడాడు. రాంచి లో ధోని అతని కుటుంబసభ్యులతో నివసిస్తున్నాడు.

చిత్రకృప : thatscriket.com

ఆలయం

ఆలయం

రాంచి లో ధోని కి ఇష్టమైన ఆలయం ఉన్నది. ధోని రాంచి లో ఉన్నప్పుడు ఈ ఆలయాన్ని తప్పక సందర్శిస్తుంటాడు. దేవ్ రి మందిర్ (మా దేవ్ రి మందిర్) అతనికి ఫెవరెట్ ప్రదేశం అని, మొక్కులు ఇక్కడే తీర్చుకుంటాడని చెబుతాడు. దుర్గా దేవత ఈ ఆలయం యొక్క ప్రధాన దేవత. ఈ దేవాలయం రాంచి కి 60 కి. మీ ల దూరంలో కలదు.

చిత్రకృప : TribhuwanKumar

సమీప పర్యాటక ఆకర్షణలు

సమీప పర్యాటక ఆకర్షణలు

దస్సామ్ ఫాల్స్ ఈ ఆలయానికి 40 కి. మీ లాదూరంలో ఉన్నాయి. ఈ జలపాతం కాంచి నది నుండి ఏర్పడింది. పర్యాటకులు ఈ జలపాతాన్ని చూడటానికి తరచూవస్తుంటారు.

చిత్రకృప : Eddyvishal

జైడా ఆలయం

జైడా ఆలయం

జైదా ఆలయం శివ భగవానుడికి అంకితం చేసిన ఆలయం. ఇది జార్ఖండ్ రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన గుడి. ఈ మందిరం చాండిల్ పట్టణంలో కలదు. ఇక్కడి నుండి మా దేవ్ రి ఆలయం 50 కి. మీ ల దూరంలో ఉంటుంది.

చిత్రకృప : Anupmahato

స్వస్థలం

స్వస్థలం

లవాలి ఎం.ఎస్.ధోని యొక్క స్వస్థలం. అల్మోరా లో ఈ గ్రామం కలదు. ధోని తల్లితండ్రులు మొదట ఇక్కడే నివసించేవారు. ఉద్యోగ బదిలీ రీత్యా రాంచి వెళ్ళటం జరిగింది. ఈ ప్రదేశం చూడటానికి, సాహసాలు చేయటానికి అనుకూలంగా ఉంటుంది.

చిత్రకృప : Travelling Slacker

బీహార్ రంజీ టీం

బీహార్ రంజీ టీం

ధోని మొదట బీహార్ రంజీ టీం తరుపున క్రికెట్ ఆడాడు. ఆతరువాత రాష్ట్రస్థాయి, జాతీయ స్థాయి క్రికెట్ లో ప్రతిభ కనబర్చాడు. ధోనికి మొదటి నుంచి ఫుట్ బాల అంటే ఇష్టం. స్కూల్ డేస్ లో కూడా ఫుట్ బాల్ ఆటనే ఆడేవాడు.

చిత్రకృప : Akash Guruji

ధార్మిక కేంద్రాలు

ధార్మిక కేంద్రాలు

బీహార్ చరిత్ర మహోన్నతమైనది. క్రీ. పూ. - క్రీ. శ వరకు ఎన్నో రాజ్యాలకు ప్రస్తుత పాట్నా ( పూర్వం పాటలీపుత్రం) రాజధానిగా ఉండేది. జైనులు, బొద్దులూ, హిందువులకు చెందిన ఎన్నో ధార్మిక కేంద్రాలు ఇక్కడ ఉన్నాయి. బిహారీ వంటకాలు శాకాహారం తో నిండి ఉంటాయి.

చిత్రకృప : Amaroks

టికెట్ ఎక్సమినర్

టికెట్ ఎక్సమినర్

ధోని డొమెస్టిక్ క్రికెట్ ఆడేటప్పుడు, ఖరగ్పూర్ రైల్వే స్టేషన్ లో 'ట్రావెలింగ్ టికెట్ ఎక్సమినర్' గా పనిచేస్తుండేవాడు. ఖరగ్పూర్ లో ఝార్గ్రామ్ పాలస్, చిల్కి గర్హ్, గోపే గర్హ్ హెరిటెజ్ పార్క్ మరియు బిష్ణు ఆలయం మొదలైనవి చూడదగ్గవి.

చిత్రకృప : Ambuj Saxena

జార్ఖండ్ క్రికెట్ టీమ్

జార్ఖండ్ క్రికెట్ టీమ్

ధోని కొన్నాళ్ళకు జార్ఖండ్ క్రికెట్ టీమ్ లో ఆడటం మొదలుపెట్టాడు. బీసీసీఐ నిర్వహించిన టెస్టుల్లో పాసై భారత క్రికెట్ జట్టులో సభ్యునిగా చేరాడు. భారత జట్టుకి విజయాలను అందించాడు.

చిత్రకృప : Akash Guruji

డెహ్రాడూన్

డెహ్రాడూన్

డెహ్రాడూన్ లో 'సాక్షి' తో ధోని వివాహం 2010 లో జరిగింది. ఆమె (స్కూల్ మేట్) డెహ్రాడూన్ వాసి కావడంతో అక్కడే వివాహం జరిపించారు. డెహ్రాడూన్ లోని విశ్రాంతి రిసార్ట్ లో వివాహం జరిగింది.

చిత్ర కృప : oneindia

స్పా

స్పా

విశ్రాంతి రిసార్ట్ ఒక జంగల్ రిసార్ట్. ఇది డూన్ లోయలో దుర్భేద్యమైన చెట్ల మధ్య కలదు. ఇదొక లగ్జరీ రిసార్ట్. లోపల ఇంటీరియర్ డిజైన్, గదులు అత్యాధునిక హంగులతో మెరుపులుదిద్దారు. ఈ రిసార్ట్ స్పా వంటి కార్యక్రమాలను కూడా అందిస్తుంది.

చిత్రకృప : Rahul de Cunha

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X