Search
  • Follow NativePlanet
Share
» »మీకు తెలియని కృష్ణపరమాత్ముని విషయాలు !

మీకు తెలియని కృష్ణపరమాత్ముని విషయాలు !

భారతదేశంలో ప్రత్యేకించి వైష్ణవ హిందూమతంలో కృష్ణుని పూజ ప్రత్యేకం. దాదాపు ప్రతిచోట శ్రీకృష్ణుని ఆలయాలు ఉన్నాయి. ఈయన విష్ణుమూర్తి యొక్క పది అవతారాలలో తొమ్మిదో అవతారం.

By Mohammad

శ్రీకృష్ణుడు హిందూ మతంలో అర్చింపబడే దేవుడు. ఈయన విష్ణుమూర్తి యొక్క పది అవతారాలలో తొమ్మిదో అవతారం. చిలిపి బాలునిగా, గోపికల మనసు దోచుకున్న వాదిగా, యాదవ రాజుగా, రుక్మిణీ సత్యభామల ప్రభువుగా, అర్జునిని రథ సారథిగా, దేవదేవునిగా ... ఇలా బహు విధాలుగా శ్రీకృష్ణుని రూపాలు ఇతిహాసాలలో చెప్పబడ్డాయి.

<strong>భారతదేశంలో భగవద్గీత, మహాభారతం జరిగిన ప్రదేశాలు !</strong>భారతదేశంలో భగవద్గీత, మహాభారతం జరిగిన ప్రదేశాలు !

భారతదేశంలో ప్రత్యేకించి వైష్ణవ హిందూ మతంలో కృష్ణుని పూజ ప్రత్యేకం. దాదాపు ప్రతి చోట శ్రీ కృష్ణుని ఆలయాలు ఉన్నాయి. వీటిలో కొన్ని చరిత్ర ప్రసిద్ధిగాంచినవి. ఉదాహరణకు మథుర లో బాలకృష్ణుడుగా , తిరుపతిలో వెంకటేశ్వర స్వామిగా, పూరిలో జగన్నాథుడుగా, గురువాయూర్ లో గురువాయరప్పగా, ఉడిపిలో కృష్ణుడిగా దర్శనం ఇస్తుంటాడు.

జననం

జననం

మధుర ను యాదవరాజ్యానికి చెందిన సూరసేన మహారాజు పాలిస్తుండేవాడు. ఈయనకు వసుదేవ కుమారుడు. ఇతనికి ఉగ్రసేన మహారాజు కుమార్తె దేవకి ని ఇచ్చి వివాహం జరిపిస్తారు. చెల్లలు అంటే ఎంతో ప్రేమకల కంసుడు అత్తవారింటికి సాగనంపుతున్న వేళ అశరీరవాణి దేవకి గర్భంలోని 8 వ సంతానం సంహరిస్తుందని కంసుడికి చెబుతుంది. వెంటనే దేవకీ వసుదేవ మరియు తండ్రి ఉగ్రసేనుడిని చెరసాలలో బంధిస్తాడు కంసుడు.

చిత్రకృప : Abhi Sharma

బలరాముడు

బలరాముడు

దేవకి ఏడో గర్భం బలరాముడు. అయితే ఈ గర్భాన్ని నందనవనంలో నందుడి భార్య రోహిణి గర్భంలో విష్ణువు తన మాయతో ప్రవేశపెడతాడు. కొన్ని రోజులకు దేవకీ వసుదేవుడు కు ఎనిమిదో సంతానం కలుగుతుంది. ఎక్కడ తన కుమారుడిని చంపేస్తారో అని వసుదేవుడు చెరసాల నుంచి తప్పించుకొని స్నేహితుడైన నందుడి ఇంటికి వెళ్లి యశోద పక్కనున్న శిశువు ప్రదేశంలో పెట్టి, అక్కడున్న శిశువును చెరసాలకు తీసుకొస్తాడు.

చిత్రకృప : Praveenp

యోగ మాయ

యోగ మాయ

చెరసాల కు తీసుకురాగానే శిశువు ఏడుస్తుంది. అది విన్న కంసుడు, ఆ పసివాడిని పైకి విసరగా "తాను యోగ మాయనని, నిన్ను చంపేవాడు వేరే చోట పెరుగుతున్నాడని" చెప్పి మాయమవుతుంది.

చిత్రకృప : Praveenp

కృషుడి బాల్యం

కృషుడి బాల్యం

కాళిందీ నది లో ఉన్న కాళీయుడి తలపై నృత్యం చేసి తాండవ కృష్ణుడయ్యాడు. ప్రళయకాలంలో గోవర్ధనగిరిని చిటికెన వేలితో ఎత్తి వ్రేపల్లె వాసుల మదిలో భగవంతుడయ్యాడు. అల్లరి పనులతో అలరించి, ఆపత్కాలంలో ఆదుకుని, ధైర్యసాహసాల ప్రదర్శనతో వ్రేపల్లెను మురిపించాడు.

చిత్రకృప : Abhi Sharma

ద్వారకకు ప్రయాణం

ద్వారకకు ప్రయాణం

కృషుడు భగవంతుడు. ఈయనకు అన్నీ తెలుసు. తాను ఎందుకు పుట్టానో, ఏమి చేయాలో అన్నీ తెలుసు. కంసుడు కృషుడిని చంపడానికి పథకాన్నీ రచించి, శ్రీకృష్ణ బలరాములు మధురకు రప్పిస్తాడు. కృష్ణుడు కంసుడిని వధించి తాత ను చెరసాల నుంచి విడిపించి రాజును చేస్తాడు. చెరలో ఉన్న తల్లితండ్రులను విడిపించి ద్వారక కు పయనమవుతాడు శ్రీకృష్ణుడు.

చిత్రకృప : Redtigerxyz

 ద్వారకలో

ద్వారకలో

శ్రీకృష్ణుడు ద్వారక రాజు. ఈయన కాలంలో రాజ్యం అంతా అష్టైశ్వర్యాలతో, ఆయురారోగ్యాలతో తలతూగేది. ఇదెప్పుడో క్రీ.పూ. 5000 ఏళ్ల క్రితం నాటి మాట. ఇప్పుడు ఆ రాజ్యం కనుమరుగైపోయింది. అరేబియా సముద్రగర్భంలో అడుగున ద్వారకా రాజ్య అవశేషాలు కనిపిస్తాయి.

చిత్రకృప : Seetarambabu

సంహారం

సంహారం

శ్రీకృష్ణుడు లోకాలను బాధిస్తున్న నరకాసుడిని వధించి అతని కొడుకు భగదత్తునికి పట్టాభిషిక్తుడిని చేస్తాడు. కాలయవనుడు, జరాసంధుడు, సాళ్వుడు మొదలైన వారిని ఓడించాడు.

చిత్రకృప : Abhi Sharma

అర్జునుని రథసారథిగా

అర్జునుని రథసారథిగా

మేనత్త కుమారులైన పాండవులతో శ్రీకృష్ణుడి చెలిమి, అనుబంధం మరువలేనిది. పాండవుల ప్రతి సంఘటనలో కృష్ణుడి పాత్ర చెప్పుకోదగ్గది. ద్రౌపది ని సొంత చెల్లాయి సుభద్ర కంటే బాగా చూసుకున్నాడు. అర్జునుని రథసారథిగా మారి కురుక్షేత్ర యుద్ధం ముగిసే వరకు పాండవులకు రక్షణగా ఉన్నాడు.

చిత్రకృప : Abhi Sharma

శ్రీ కృష్ణుని మరణం

శ్రీ కృష్ణుని మరణం

మహాభారత యుద్ధానంతరం యాదవకులం కూడా అంతఃకలహాలతో నశిస్తుందని గాంధారి శపించింది. అలాగే యాదవకులంలో కొందరి చిలిపి పనుల కారణంగా పుట్టిన ముసలం (రోకలి) అందరి మరణానికీ కారణమయ్యింది. బలరాముడు యోగం ద్వారా దేహాన్ని త్యజించాడు. కృష్ణుడు అరణ్యాలకు వెళ్ళాడు. అక్కడినుండి కృష్ణుడు స్వర్గానికి నేరుగా వెళ్ళాడని వ్యాసుని భారతంలో ఉంది. అయితే ఒక నిషాదుని (పూర్వజన్మలో వాలి) బాణం వలన కృష్ణుడు గాయపడి దేహాన్ని త్యజించాడని మరికొన్ని పురాణాలలో ఉంది.

చిత్రకృప : Sridhar1000

గోమతి నది

గోమతి నది

కృష్ణుడు చనిపోయిన ప్రదేశం భలక తీర్థ్ (ప్రభాస్ పతన్). ఇది గుజరాత్ నైరుతి భాగాన గోమతి నది ధనవంతరి సముద్రంలో (అరేబియా సాగరం) కలిసే చోట కలదు.

చిత్రకృప : Manoj Khurana

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X