Search
  • Follow NativePlanet
Share
» »కర్ణాటక లో ప్రసిద్ధి చెందిన 7 ఫేమస్ స్వీట్స్ !

కర్ణాటక లో ప్రసిద్ధి చెందిన 7 ఫేమస్ స్వీట్స్ !

By Mohammad

నోరూరించే రుచులంటే ఎవరికి ఇష్టముండదు చెప్పండి ..! పిల్లలు, పెద్దలు లొట్టలేసుకుని మరీ తింటారు. ఇదివరకే మనము ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడెక్కడ ఏమేమి తినాలో తెలుసుకున్నాం. ఇప్పుడు మన పక్క రాష్ట్రం కర్ణాటక కు వెళితే ఏమి తినాలో తెలుసుకుందాం ..!

ఇడ్లీ, దోసె, ఉప్మా, వడ .. ఇవన్నీ కామన్ గా తినే ఐటమ్స్. ఎప్పుడూ ఉండే తిండే కదా !! కాస్త అవి పక్కకు పెట్టేసి సంప్రదాయ రుచుల వైపు తిరగండి. మీకు తెలీదనుకుంటా .. కర్ణాటకలో సంప్రదాయ రుచులు చాలా బాగుంటాయి. ముఖ్యంగా స్వీట్స్ రుచి తప్పక చూడాలి. హొలిగే, పాయాసం వాసనలకే నోట్లో లాలాజలం పారుతుంది. మరి కర్ణాటకలో ఏ ఏ ప్రదేశాలలో ఏ ఏ స్వీట్ తినాలో ఒక ట్రిప్ వేద్దాం పదండి ..!

తలకాడు - భూమిలోకి ఇంకిపోయిన దేవాలయాలు !

మైసూర్ పాక్ - మైసూర్

మైసూర్ పాక్ - మైసూర్

కమ్మని నెయ్యి, షుగర్, శనగ పిండి లతో తయారు చేసే తీపి మైసూరు పాక్ తింటే మైసూరు లో తినాలి. పాక్ లేదా పాకం అంటే తియ్యనైన షుగర్ పాకం అని అర్ధం. చరిత్ర మేరకు ఈ మైసూరు పాక్ ను ఒకప్పుడు మైసూరు వంటశాల లో మైసూరు మహారాజు తినటం కొరకు చేసేవారు. అద్భుతమైన ఈ రుచికి మెచ్చిన మైసూరు రాజు ఈ స్వీట్ ను సామాన్యులకు కూడా పాలస్ లో బయటి దుకాణాలలో లభ్యంగా ఉంచమని ఆర్డర్ వేశాడట.

చిత్ర కృప : Charles Haynes

ధారవాడ పేడ

ధారవాడ పేడ

మీరు ధారవాడ వెళుతున్నారా ? అయితే అక్కడికి వెళితే పేడ తినటం మరవకండి. దూద్ పేడ మాదిరి ధారపేడ ఒక స్వీట్ పేరు. దీనికి ఒక చరిత్ర ఉన్నది. 19 వ శతాబ్దంలో ఠాకూర్ కుటుంబం మధ్య ప్రదేశ్ నుండి ధారవాడ వచ్చినప్పుడు వారి స్వీట్ అయిన ఈ పేడ ఇక్కడ తయారుచేయబడి శ్రీ రామ్ రతన్ సింగ్ ద్వారా పాపులర్ అయ్యింది.

చిత్ర కృప : Pamri

కుందా - బెళగవి

కుందా - బెళగవి

కుందా స్వీట్ కాస్త ఆటో ఇటో ధారవాడ పేడ మాదిరిగానే కనిపిస్తుంది. కాకుంటే, ఇది కాస్త ద్రవ స్థితిలో అగుపిస్తుంది. ఇది బెళగవి యొక్క ఫెమస్ స్వీట్ డిష్. నోట్లో వేసుకుంటే చాకోలెట్ పేవర్ వలె ఇట్టే కరిగిపోతుంది.

గోకక్ - కరదంటు

గోకక్ - కరదంటు

కరదంటు స్వీట్ గోకక్ లో ఫెమస్ స్వీట్. పెళ్లిళ్లలో, స్వీట్ బాక్స్ లలో దీనిని పెడుతుంటారు. బంక వలె మెత్తగా ఉండి నమిలే విధంగా ఉంటుంది . దాని పైన పిస్తా, బాదం, ఎండు ద్రాక్ష తో గార్నిష్ చేసి ఉంటారు.

చిత్ర కృప : Manuhubli

ఉడిపి - హయగ్రీవ

ఉడిపి - హయగ్రీవ

శనగలు, బెల్లం మరియు కొబ్బెర తో తయారుచేసిన యమ్మీ యమ్మీ స్వీట్ హయగ్రీవ. ఉడిపికి, ఈ స్వీట్ కి ఒక బంధం ఉంది. అదేమిటంటే, ఇళ్లలో చేసుకొని తింటే ఎంతైనా తింటారు అదే ఉడిపి బయట తింటే అయిపోవడం కాస్త కష్టం.

బెంగళూరు మరియు మైసూర్ - హల్బాయి

బెంగళూరు మరియు మైసూర్ - హల్బాయి

బియ్యము, బెల్లం, కొబ్బెర వేసి హల్బాయి ని తయారుచేస్తారు. స్వీట్ మెత్తగా రావటానికి కొబ్బెర ఉపయోగిస్తారు. బెంగళూరు మరియు మైసూర్ ప్రాంతాలలో ఈ స్వీట్ రుచిగా ఉంటుంది. హాలు అంటే పాలు అని అర్థం. అందుకే స్వీట్ ని తింటుంటే పాల టేస్ట్ వస్తుంది.

మంగళూరు(కొంకణ్ కోస్ట్) - చిరోటి

మంగళూరు(కొంకణ్ కోస్ట్) - చిరోటి

చిరోటి స్వీట్ ను ఎక్కువగా పెళ్లిళ్లలో తయారుచేస్తారు. ఇది కొంకణ్ తీరంలోని సంప్రదాయ స్వీట్ డిష్. మైదా ని లేయర్ లుగా చేసి ఫ్రై చేస్తారు. పాలు మరియు చెక్కెర తో దీనిని తింటారు. మీరు కన్నడ పెళ్లిళ్లకు వెళితే తప్పక చిరోటి రుచి చూస్తారు !

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X