Search
  • Follow NativePlanet
Share
» »కర్ణాటకలోని పంచక్షేత్రాలు మరియు మురుడేశ్వర దర్శనం !

కర్ణాటకలోని పంచక్షేత్రాలు మరియు మురుడేశ్వర దర్శనం !

లార్డ్ శివుని పెద్ద విగ్రహం అంటే అందరికీ గుర్తుకొచ్చేది మురుడేశ్వర. ఇక్కడే శివునికి అతి పెద్ద విగ్రహం కలదు.

By Mohammad

లార్డ్ శివుని పెద్ద విగ్రహం అంటే అందరికీ గుర్తుకొచ్చేది మురుడేశ్వర. ఇక్కడే శివునికి అతి పెద్ద విగ్రహం కలదు. చాలా మంది ఇక్కడికి వెళ్ళిరావాలని అనుకుంటారు కానీ టైం దొరకక రాలేకపోతారు. కానీ మురుడేశ్వర గురించి, ఇక్కడ చెబ్బబోయే విషయాలు తెలిస్తే మాత్రం ఎప్పుడు టైం దొరుకుంటుందా ? ఎప్పుడు మురుడేశ్వరకు వెళదామా ? అని అనిపిస్తుంది.

మురుడేశ్వర కర్ణాటకలోని ఉత్తరకన్నడ జిల్లాలో గల పట్టణం మరియు భట్కల్ తాలూకాలో ఉన్నది. భత్కల్ నుంచి మురుడేశ్వర 50 కిలోమీటర్ల దూరం.

త్రేతాయుగం

త్రేతాయుగం

మురుడేశ్వర చరిత్ర త్రేతాయుగం నాటిది. చరిత్రలోకి వెళితే ... రావణాసురుడు గొప్ప శివభక్తుడు. కైలాసంలో శివున్ని ప్రసన్నం చేసుకొని ఆత్మలింగాన్ని భూమి మీదకు తెస్తాడు. అయితే ఆత్మలింగాన్ని కింద పెట్టకూడదని, ఒకేవేళ పెడితే తిరిగి ఎత్తలేవని చెప్పి ఇస్తాడు శివుడు.

చిత్రకృప : Макс Вальтер

విష్ణుమూర్తి

విష్ణుమూర్తి

ఆత్మలింగాన్ని లంక కు తీసుకెళితే విపత్కర పరిణామాలు చోటు చేసుకుంటాయని భావించిన దేవతలు ఎలాగైనా ఆ ఆత్మలింగాన్ని కింద పెట్టేటట్లు చేయాలని అనుకొని విష్ణుమూర్తిని వేడుకొనగా .. ఆయన సూర్యాస్తమం అయ్యేటట్లు చేస్తాడు. నారదుడు జరిగిన విషయాన్నీ వినాయకుడికి చెబుతాడు.

చిత్రకృప : Iramuthusamy

ఆత్మలింగం

ఆత్మలింగం

వినాయకుడు బాల బ్రాహ్మణ వేషంలో రావణాసురుడు వైపుగా వెళుతుండగా, రావణాసురుడు పిలిచి తానూ వెళ్ళి సంధ్య వార్చుకొని వచ్చేంతవరకు ఈ లింగాన్ని పట్టుకోమని చెబుతాడు. తాను ఎక్కువ బరువు మోయలేనని, మూడు సార్లు పిలుస్తానని రాకపోతే కింద పెడతానని బాల బ్రాహ్మణుడు (వినాయకుడు) చెబుతాడు. అందుకు అంగీకరించిన రావణుడు సంధ్య వార్చుకోవటానికి వెళతాడు. గణపతి వెనువెంటనే మూడుసార్లు పిలిచి ఆత్మలింగాన్ని కింద పెడతాడు.

చిత్రకృప :Prof tpms

పంచక్షేత్రాలు

పంచక్షేత్రాలు

సంధ్య మధ్యలోని వదిలి పెట్టి పరిగెత్తుకుంటూ వచ్చినా ... అప్పటికే జరిగే నష్టం జరిగిపోయింది. ఆత్మలింగాన్ని బలంతో ఎంత పైకి ఎత్తిన లింగం ఉన్న చోటు నుంచి రవ్వంతైన కదలలేదు. విష్ణువు తన మాయని తొలగించగా సూర్యుడు వెంటనే ఆకాశంలో కనిపిస్తాడు. ఇది గ్రహించిన రావణుడు కోపంతో ఆత్మలింగాన్ని కోపంతో పెకిలించి విసిరేస్తాడు. అలా పెకిలించి వేయగా ఒక్కో వస్తువు ఒక్కో చోట పడి, అక్కడ శివలింగాలు ఉద్భవించి ప్రముఖ పుణ్యక్షేత్రాలుగా వర్ధిల్లుతున్నాయి. ఈ ఐదు క్షేత్రాలన్నీ కర్ణాటక రాష్ట్రంలో 'పంచక్షేత్రాలు' గా ప్రసిద్ధి చెందాయి.

చిత్రకృప :Макс Вальтер

గోకర్ణ

గోకర్ణ

రావణాసురుడు ఆత్మలింగాన్ని నిలిపిన స్ధలం గోకర్ణ. ఇదే మహాబలేశ్వర దేవాలయం గా ప్రసిద్ధి చెందినది. ఇందులోనే పవిత్ర ఆత్మలింగం గర్భగుడిలో కొలువై ఉంటుంది. సమీపంలో ఉన్న అరేబియా సముద్రంలో స్నానం చేసి భక్తులు దేవాలయాన్ని దర్శిస్తారు.

గోకర్ణ మరింత సమాచారం కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.

చిత్రకృప : Nvvchar

సజ్జేశ్వర

సజ్జేశ్వర

ఆత్మలింగం పైనున్న కవచాన్ని విచ్ఛిన్నం చేసి విసిరేస్తే అది గోకర్ణకు 35-40 KM దూరంలో ఉన్న సజ్జేశ్వర అనే ప్రదేశంలో పడుతుంది. గోకర్ణ నుండి ఇక్కడికి గంటలో చేరుకోవచ్చు.

చిత్రకృప : Yogesa

గుణేశ్వర

గుణేశ్వర

లింగం పై నున్న మూత తొలగించి విసిరేస్తే అది గోకర్ణకు 40-50 KM ల దూరంలో ఉన్న గుణేశ్వర లో పడుతుంది. గోకర్ణ - గోవా జాతీయ రహదారి గుండా వెళితే గుడికి చేరుకోవచ్చు.

చిత్రకృప : Yogesa

దారేశ్వర

దారేశ్వర

లింగం పైనున్న దారం తొలగించి విసిరేస్తే అది గోకర్ణకు దక్షిణం వైపు ఉన్న దారేశ్వర లో పడుతుంది. గోకర్ణ నుండి దారేశ్వర 27 కిలోమీటర్ల దూరంలో ఉన్నది.

చిత్రకృప : Yogesa

కందూక పర్వతం

కందూక పర్వతం

లింగం పైనున్న వస్త్రం విసిరేస్తే అది కందూక (బంతి) పర్వతం పై నున్న మృదేశ్వర లో పడుతుంది. అదే కాలక్రమంగా మురుడేశ్వర గా మారింది. మురుడ అంటే కన్నడంలో వస్త్రం అని అర్థం. గోకర్ణ నుండి ఈ పట్టణం 70 కిలోమీటర్ల దూరంలో ఉన్నది.

చిత్రకృప : Abhithgowda

మురుడేశ్వర ఆలయం

మురుడేశ్వర ఆలయం

ఈ దేవాలయం కందూక పర్వతం మీద వెలసింది. గుడి గోపురం 20 అంతస్తులు కలిగి ఉంటుంది. దేవాలయానికి వెళ్ళే మార్గంలో రెండు నిజమైన ఏనుగులను గమనించవచ్చు.

చిత్రకృప : Pvnkmrksk

దేవాలయ విశిష్టత

దేవాలయ విశిష్టత

ఇక్కడికి దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి భక్తులు వస్తుంటారు. స్వామి వారిని దర్శించి పూజలు చేస్తే కోరికలు నెరవేరుతాయని భక్తులు నమ్మకం. నిత్యం అభిషేకాలు, కుంకుమ పూజలు మొదలైన ఆరాధనలు జరుగుతాయి.
సందర్శించు సమయం : 3 AM నుండి 1 PM మరియు తిరిగి 3 PM నుండి 8 PM వరకు.

చిత్రకృప : Siddarth.P.Raj

తీర్థాలు

తీర్థాలు

మురుడేశ్వర లో స్నానాలు చేయటానికి అనేక తీర్థాలు ఉన్నాయి. వాటిలో బ్రహ్మ తీర్థం, కమండల తీర్థం, అగ్ని తీర్థం, భీమ తీర్థం, దేవ తీర్థం మొదలుగునవి ముఖ్యమైనవి.తీర్థాలలో స్నానాలు చేస్తే దీర్ఘకాల రోగాలు నయమవుతాయని భక్తుల విశ్వాసం.

చిత్రకృప : Foliate08

మురుడేశ్వర కోట

మురుడేశ్వర కోట

మురుడేశ్వర ప్రధాన ఆలయానికి వెనుక భాగంలో మురుడేశ్వర కోట ఉన్నది. దీనిని మైసూర్ పాలకులు టిప్పు సుల్తాన్ పునరుద్ధరించాడు.

చిత్రకృప : Gandharva S

శివుని విగ్రహం

శివుని విగ్రహం

123 అడుగుల (37 మీటర్లు) పొడవైన శివుని విగ్రహం మురుడేశ్వర దేవాలయం సముదాయంలో కలదు. ఈ విగ్రహం చాలా దూరం నుంచి కనిపిస్తుంది. దీనిని చెక్కి, ప్రతిష్టించటానికి రెండేళ్ళు పట్టింది. ప్రపంచంలోనే అతి పెద్ద శివుని విగ్రహం గా కూడా గుర్తించబడింది. దీని ప్రత్యేకత విగ్రహం పై సూర్యరశ్మి పడితే మెరుస్తుంది. విగ్రహానికి వెనకాల ఉన్న బీచ్ కూడా సందర్శించదగినదే !

చిత్రకృప : Sam valadi

సందర్శించదగిన ఇతర దేవాలయాలు

సందర్శించదగిన ఇతర దేవాలయాలు

మురుడేశ్వర ఆలయ ప్రాకారంలోనే ఇతర చిన్న దేవాలయాలు ఉన్నాయి. వాటిలో గణపతి, గౌరీ, దత్తాత్రేయ, సుబ్రమణ్య, ఆంజనేయ మందిరాలు ముఖ్యమైనవి. నాగప్రతిమాలు, ధ్వజస్థంభం, హోమాలు, మండపాలు, ముడుపులు కట్టే రావి చెట్టు ఉన్నాయి.

చిత్రకృప : Макс Вальтер

బస

బస

మురుడేశ్వర లో వసతికై హోటళ్ళు,సత్రాలు, వసతి గృహాలు మొదలుగునవి ఉన్నాయి. తక్కువ ధరకే గదులు లభ్యమవుతాయి. సీజన్ లో అంటే శివరాత్రి, రథీత్సవం ఉత్సవాలలో గదులు ముందుగానే బుక్ చేసుకోవాలి.

చిత్రకృప : Yogesa

మురుడేశ్వర టౌన్

మురుడేశ్వర టౌన్

మురుడేశ్వర ఎలా వెళ్ళాలి ?

విమాన మార్గం : 165 కిలోమీటర్ల దూరంలో ఉన్న మంగళూరు విమానాశ్రయం సమీపాన ఉన్నది. ఇక్కడ నుండి క్యాబ్ లేదా టాక్సీ లలో ప్రయాణించి మురుడేశ్వర చేరుకోవచ్చు. పనాజీ, హుబ్లీ కూడా దగ్గరి విమానాశ్రయాలే!

రైలు మార్గం : మురుడేశ్వర లో రైల్వే స్టేషన్ కలదు. కానీ ఇక్కడ ప్యాసింజర్ రైళ్ళు మాత్రమే ఆగుతాయి. మంగళూరు - గోవా వెళ్ళే ప్యాసింజర్ రైళ్ళు నిలుస్తాయి.

రోడ్డు మార్గం : మంగళూరు, గోకర్ణ, భట్కల్, బెంగళూరు గోవా తదితర ప్రాంతాల నుండి మురుడేశ్వర పట్టణానికి ప్రభుత్వ / ప్రవేట్ బస్సులు నడుస్తాయి.

చిత్రకృప : Pradeep717

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X