Search
  • Follow NativePlanet
Share
» »రాజస్థాన్ లోని అల్వార్ లో చూడవలసిన పర్యాటక ప్రదేశాలు !!

రాజస్థాన్ లోని అల్వార్ లో చూడవలసిన పర్యాటక ప్రదేశాలు !!

By Mohammad

అల్వార్ రాజస్థాన్ రాష్ట్రంలో ఉన్న ప్రముఖ పర్వత ప్రాంతం. ఇది రాజస్థాన్ కి వాయువ్యాన ఉన్న అరావళి పర్వత పంక్తుల లో రాళ్లు రప్పల మధ్య ఉన్నది. పురాణాల్లో "మత్స్య దేశం" గా పిలువబడ్డ ఈ ప్రదేశంలో పాండవులు తమ అరణ్యవాసం గడిపారని పేర్కొనబడింది.

అల్వార్ అందమైన సరస్సులు, పెద్ద పెద్ద భవంతులు, స్మారక కట్టడాలు మరియు ఆలయాలకు ప్రసిద్ధి చెందినది. దీనితో పాటుగా ఇక్కడికి వచ్చే పర్యాటకులు నాలుగు కిలోమీటర్ల దూరంలోని సరిస్క అనే ప్రాంతాన్ని తప్పక చూస్తారు. సరిస్క టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ గా ప్రసిద్ధి చెంది ప్రపంచం నలుమూలల నుండి యాత్రికులను ఆకర్షిస్తున్నది.

ఇది కూడా చదవండి : మహాభారతంలో కనుగొన్న ప్రదేశం !

అల్వార్ ను చారిత్రకంగా 'మేవార్' అని కూడా పిలుస్తారు. అల్వార్ లో తప్పక చూడవలసిన వాటిలో బాల ఖిలా కోట ప్రధానమైనది.. దీనిని హసన్ ఖాన్ మేవాటి క్రీ.శ. 1550 వ సంవత్సరంలో అద్భుతమైన నమూనాతో ఇతర రాజులు ఈర్శ పడే విధంగా కట్టించినాడు. సిటీ భవనం, విజయ మందిరం లు అల్వార్ లోని ఇతర ప్రధాన ఆకర్షణలు. రాజస్థాన్ లోని అల్వార్ లో చూడవలసిన పర్యాటక ప్రదేశాలు, ఆకర్షణల విషయానికి వస్తే రాష్ట్రంలో ఎక్కడా లేనటువంటి కట్టడాలు, రాజసం ఉట్టిపడే నిర్మాణాలు ఇంకా ...

కోటలు, అల్వార్

కోటలు, అల్వార్

అల్వార్ మొత్తం చెప్పుకోదగ్గ కోటలలో బాల ఖిలా, భాన్ గర్హ్ కోట, నీమ్ రాణా హిల్ ఫోర్ట్, అజబ్ ఘడ్ కోట, కంకవారి కోట లు ఉన్నాయి.

చిత్ర కృప : Manfred Sommer

బాల ఖిలా కోట , అల్వార్

బాల ఖిలా కోట , అల్వార్

అల్వార్ కోట గా పిలువబడే బాల ఖిలా, అల్వార్ లో చెప్పుకోదగ్గ ప్రసిద్ధ ప్రసిద్ధ కట్టడం. అల్వార్ కోట ని హసన్ ఖాన్ మేవాటి అనే రాజు కొండ మీద నిర్మించాడు. ఈ కోట ఉత్తరం నుండి దక్షిణానికి 5 కి. మీ. లు, తూర్పు నుండి పడమర కి 2 కి. మీ. లు విస్తరించి ఉంది.

చిత్ర కృప : Don't just "click" pictures; Shoot Stories!

బాల ఖిలా కోట , అల్వార్

బాల ఖిలా కోట , అల్వార్

బాల ఖిలా కోట ఆరు ప్రత్యేకమైన ద్వారాలు కలిగి ఉంది. ఈ కోటకు తుపాకులు పేల్చేందుకు 446 గోడలోనే వుంచిన రంద్రాలు ఉన్నాయి. 15 పెద్ద స్తంభాలు, 51 చిన్న స్తంభాలు ఈ గొప్ప కట్టడానికి ఆధారమై ఉన్నాయి. దీనిని మొఘలుల కాలంలో నిర్మించినారు.

చిత్ర కృప : Don't just "click" pictures; Shoot Stories!

భాన్ గర్హ్ కోట, అల్వార్

భాన్ గర్హ్ కోట, అల్వార్

రాజస్థాన్ లోని ఆల్వార్ జిల్లా లో గల భాన్ గర్ పట్టణం నందు భాన్ గర్హ్ కోట ఉంది. అంబర్ కు చెందిన గొప్ప మొగల్ సేనాని మాన్ సింగ్ కుమారుడు మాదో సింగ్ క్రీ.శ. 1613 లో ఈ కోటను నిర్మించాడు. ఈ కోట మైదానంలో జలపాతాలు, తోటలు, సెలయేళ్లు, అంతఃపురాలు, మర్రి చెట్లు మరియు ఆలయాలు ఉన్నాయి.

చిత్ర కృప : Parth Joshi

భాన్ గర్హ్ కోట, అల్వార్

భాన్ గర్హ్ కోట, అల్వార్

భాన్ గర్హ్ ఒక కొండ గొడుగులా ఉండి మిగిలిన ప్రాంతాల కంటే వేరుగా ఉంటుంది. అనేక శతాబ్దాల నుండి భాన్ గర్ పట్టణం లోను, కోటలోనూ దెయ్యాలు సంచరిస్తున్నాయని ప్రజలు విశ్వసిస్తారు. భాన్ గర్హ్ ను సందర్శించే యాత్రికులకు ఏ ఎస్ ఐ వారు సూర్యోదయానికి ముందు సూర్యాస్తమయానికి తర్వాత ఈ ప్రాంతంలో ప్రవేశం నిషేదించారు.

చిత్ర కృప : Anchit Kakoty

నీమ్ రాణా హిల్ ఫోర్ట్, అల్వార్

నీమ్ రాణా హిల్ ఫోర్ట్, అల్వార్

అల్వార్ లోని కేస్రోలిలో కల పర్వత కోట క్రీ.శ. 14 వ శతాబ్దానికి చెందినది. ఈ కోట ఒక కొండమీద ఉంటుంది. శ్రీకృష్ణుని యదు వంశారాజులు దీనిని నిర్మించినట్లు చెపుతారు. ఈ కోటను శత్రువుల బారి నుండి రక్షణ పొందేందుకై నిర్మించారు. తర్వాత దీనిని హేరిటేజ్ హోటల్ గా మార్పు చేశారు. ఎన్నో అట్టహాసాలు కల ఈ కోట ఇండియాలోని హెరిటేజ్ హోటళ్ళలో ఉత్తమమైనదిగా చెప్పబడుతుంది.

చిత్ర కృప : Saad Akhtar

అజబ్ ఘడ్ కోట, సరిస్క

అజబ్ ఘడ్ కోట, సరిస్క

సరిస్క కి అతి సమీపంలో గల అజబ్ ఘడ్ కోట రాజస్థాన్ రాష్ట్రంలోని అల్వార్ జిల్లాలో గల ఒక పర్యాటక ఆకర్షణ. మదో సింగ్ మనవడు అజబ్ సింగ్ రాజవత్ నిర్మించిన ఈ కోట తన ముగ్ధ మనోహరమైన అందానికి నిదర్శనం.

చిత్ర కృప : Naveen Agrawal

కంకవారి కోట , సరిస్క

కంకవారి కోట , సరిస్క

అల్వార్ లోని సరిస్క నేషనల్ పార్క్ లోపల ఉన్న కంకవారి కోట గృహం చారిత్రక ప్రాధాన్యత కలది. ఒకప్పుడు మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు తన అన్న కుమారుడు దారా షికోహ్ ను బంధించడానికి ఉపయోగించాడు. ఈ కోట కొండ మీద ఉన్నది కనుక ఇక్కడి నుండి టైగర్ రిజర్వ్ అందాలను తిలకించవచ్చు.

చిత్ర కృప : Nitten

రాజభవంతులు, అల్వార్

రాజభవంతులు, అల్వార్

ఇప్పుడు రాజభవంతుల విషయానికి వద్దాం. ఇక్కడ ప్రధానంగా రెండు రాజభవనాలు ఉన్నాయి. వాటిలో ఒకటేమో సిటీ ప్యాలెస్ మరొకటేమో మోతి డూన్గ్రీ.

చిత్ర కృప : Carlton Browne

సిటీ ప్యాలెస్ , అల్వార్

సిటీ ప్యాలెస్ , అల్వార్

వినయ్ విలాస్ మహల్ గా కూడా పిలువబడే అల్వార్ లోని సిటీ పేలస్ మహారాజుల జీవనశైలిని తెలిపే ఒక గొప్ప భవనం. ఈ కట్టడాన్ని బఖ్తావర్ మహారాజు క్రీ.శ. 1793 లో నిర్మించాడు. బాబర్, జహంగీర్ వంటి మొఘల్ చక్రవర్తులు, రాజపుత్ర రాజు ప్రతాప్ సింగ్ వంటి అనేక రాజులు ఈ కోటలో జీవనం సాగించారు.

చిత్ర కృప : telugu native planet

సిటీ ప్యాలెస్ , అల్వార్

సిటీ ప్యాలెస్ , అల్వార్

సిటీ ప్యాలెస్ కట్టడం ప్రాంగణం మధ్యలో పాలరాయితో నిర్మించిన పద్మాకారపు బురుజు కు ప్రసిద్ది. ఈ భవనపు కోశాగారంలో బంగారంతో అలంకరించిన ముఖమల్ సింహాసనం ఉంది.ఈ భవనంలో ప్రస్తుతం రాచరిక జ్ఞాపకాలు, చారిత్రిక ప్రదర్శితాలు, బహుమతి వస్తువులు, ఇంకా ఇతర అరుదైన చేతి వ్రాతలను సంరక్షించే మ్యూజియం ఉంది.

చిత్ర కృప : Bornav27may

మోతీ డూన్గ్రి, అల్వార్

మోతీ డూన్గ్రి, అల్వార్

మోతీ డూన్గ్రి లేదా పెరల్ హిల్ అల్వార్ దగ్గరలోని రాజభవనం. జైపూర్ చివరి రాజైన రెండవ సవాయి మాన్ సింగ్ నివాసమైన ఈ రాజభవనం స్కాటిష్ కోటను పోలి ఉంది. కొండపైన ఉన్న ఆలయంలో వినాయకుడి విగ్రహం ఉంది.

చిత్ర కృప : Carlton Browne

సరిస్క ప్యాలెస్, సరిస్క

సరిస్క ప్యాలెస్, సరిస్క

సరిస్క లో అందమైన ఒక రాజ ప్యాలెస్ ఉన్నది. దీనిని సరిస్క ప్యాలెస్ అని పిలుస్తారు. ఈ ప్యాలెస్ ను మొఘల్ రాజులు, రాజపుత్రులు అడవి వేటకై వచ్చేటప్పుడు తమ నివాసంగా ఉపయోగించేవారు. ఇప్పటికీ రాజదర్పనాన్ని ప్రతిబింబించేలా ఉంటుంది ఈ ప్యాలెస్.

చిత్ర కృప : Jaisingh rathore

సాగర్ సరస్సు, అల్వార్

సాగర్ సరస్సు, అల్వార్

సిటీ ప్యాలెస్ వెనుక సాగర్ సరస్సు ఉంది. ఈ సరస్సు ను పవిత్ర స్నానపు ఘాట్ గా పరిగణిస్తారు. అంతే కాదు సంప్రదాయంగా పావురాలకు ఆహారం అందిస్తారు. ఈ సరస్సు గట్టుపై విగ్రహాలు, ఆలయాలు ఉండి మనోహరమైన వాతావరణాన్ని రేకెత్తిస్తున్నది.

చిత్ర కృప : Carlton Browne

జై సమంద్ సరస్సు, సరిస్క

జై సమంద్ సరస్సు, సరిస్క

ఆల్వార్ నగరానికి కేవలం 6 కి.మీ.దూరంలో గల జై సమంద్ ఒక కృత్రిమ సరస్సు. క్రీ.శ. 1910 లో జై సింగ్ మహారాజు చే నిర్మిచబడిన ఈ సరస్సు ఒక ప్రసిద్ధ వినోద కేంద్రం. ఇక్కడ పర్యాటకులు జల క్రీడలు, చేపలు పట్టడం వంటి ఆటలతో వినోదించవచ్చు.

చిత్ర కృప : Mirza Asad Baig

స్మారక కట్టడాలు, అల్వార్

స్మారక కట్టడాలు, అల్వార్

అల్వార్ లో స్మారక కట్టడాల విషయానికి వస్తే రెండు ఉన్నాయి. వాటిలో మూసి మహారాణి కి చాత్రి, క్లాక్ టవర్ లు చెప్పుకోదగ్గవి.

చిత్ర కృప : Carlton Browne

మూసి మహారాణి కి చాత్రి, అల్వార్

మూసి మహారాణి కి చాత్రి, అల్వార్

మూసి మహారాణి కి చాత్రి అల్వార్ లో ఉన్న ప్రాముఖ్యత కలిగిన స్మారక కట్టడం. దీనిని బఖ్తావార్ మరియు అతని భార్య మూసి జ్ఞాపకార్థం గుర్తుగా వినయ్ సింగ్ మహారాజు క్రీ.శ. 1815 లో నిర్మించినాడు. ఈ నిర్మాణంలో ఇసుక రాయి స్తంభాలపై ఉన్న ఏనుగునిర్మాణ నమూనా అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ఈ కట్టడపు లోపలి భాగాలలో అద్భుతమైన చెక్కడాలు, స్థంబింపచేసే కుడ్యచిత్రాలు ఉన్నాయి.

చిత్ర కృప : Carlton Browne

క్లాక్ టవర్, అల్వార్

క్లాక్ టవర్, అల్వార్

క్లాక్ టవర్ అల్వార్ లోని చర్చి రోడ్డు లో ఉన్న ఒక నిర్మాణం. ఈ బురుజు పైన, చాల దూరానికి కనబడే ఒక పెద్ద నాల్గు ప్రక్కల గడియారం ఒక ప్రధాన పర్యాటక ఆకర్షణ. ఈ పురాతన బురుజు ఇప్పటికి పురాతన మార్కెట్లు, దగ్గరలోని రద్దీగా ఉండే ప్రాంతాల నాలుగు రోడ్ల కూడలిలో ఉంది.

చిత్ర కృప : abhi_nirvana

ఆలయాలు, అల్వార్

ఆలయాలు, అల్వార్

అల్వార్ గల ఆలయాల విషయానికి వస్తే ప్రధానంగా చెప్పుకోవలసిన ఆలయాలు కొన్నే ఉన్న. వాటిలో నాలదేశ్వర ఆలయం, భర్తృహరి దేవాలయం, నీలకంఠ మహాదేవ ఆలయం మరియు హనుమాన్ ఆలయం ప్రసిద్ధి చెందినది.

చిత్ర కృప : Parth Joshi

నాలదేశ్వర ఆలయం ,అల్వార్

నాలదేశ్వర ఆలయం ,అల్వార్

అల్వార్ కు దక్షిణాన 24 కిలోమీటర్ల దూరంలో అల్వార్ - సరిస్క పోయే దారిలో నలదేశ్వర్ గ్రామం ఉంది. అందమైన ఈ గ్రామం పురాతన మహాదేవ దేవాలయనికి ప్రసిద్ది. దీని చుట్టూ గులకరాళ్ళ శిఖరాలు, మైమరపించే పచ్చదనం ఉన్నాయి. ఈ దేవాలయంలోని సహజ శివలింగాన్ని ఏడాది పొడవున భక్తులు పెద్ద సంఖ్యలో పూజిస్తారు.

చిత్ర కృప : Manfred Sommer

భర్త్రిహరి దేవాలయం, సరస్క

భర్త్రిహరి దేవాలయం, సరస్క

రాజస్థాన్ లోని ఆల్వార్ నుండి 30 కి.మీ. దూరం లో గల భర్త్రిహరి దేవాలయం ప్రసిద్ధ సరిస్క నేషనల్ టైగర్ రిజర్వు కు అతి చేరువలో ఉంది. దేశం నలు మూలల నుండి భారి సంఖ్యలో భక్తులు యోగి భర్తృహరినాథ్ కు చెందిన ఈ దేవాలయానికి వస్తుంటారు. రాజస్థానీ వాస్తు నిర్మాణ శైలికి అధ్భుత నిదర్శనమైన ఈ దేవాలయం.

చిత్ర కృప : Parth Joshi

నీలకంఠ మహాదేవ ఆలయం, సరిస్క

నీలకంఠ మహాదేవ ఆలయం, సరిస్క

అల్వార్ లోని సరిస్క నేషనల్ పార్క్ లో నీలకంఠ మహాదేవ ఆలయ సముదాయం ఉంది. ఇది సరిస్క నేషనల్ టైగర్ రిజర్వు ప్రవేశ ప్రాంతం నుండి 32 కి. మీ. దూరం లో ఉంది. ఈ సముదాయంలో గల 300 దేవాలయాలలో ఇప్పటికి కొన్ని ఆలయాలు భక్తులతో పూజలందు కొంటున్నాయి. మరి కొన్ని శిధిలావస్థలో ఉన్నాయి.

చిత్ర కృప : Nitten

హనుమాన్ ఆలయం ,సరిస్క

హనుమాన్ ఆలయం ,సరిస్క

అల్వార్ లోని సరిస్క టైగర్ రిజర్వ్ లో గల హనుమాన్ ఆలయం, సరిస్క లో ఎక్కువగా సందర్శించే స్థలం. ఈ ప్రాంతంలోనే పాండవులలో బాలశాలియైన భీముడు ఆంజనేయస్వామి చేతిలో ఓడిపోతాడు. ఇక్కడి ప్రధాన ఆకర్షణ హనుమంతుడి విగ్రహం మరియు అందమైన జలపాతం.

చిత్ర కృప : Manfred Sommer

కంపెనీ బాగ్, అల్వార్

కంపెనీ బాగ్, అల్వార్

కంపెనీ బాగ్ పచ్చదనం, ఆకర్షణీయమైన రంగురంగుల పచ్చిక బయళ్ళతో నిండిన ఒక అందమైన తోట. ఈ ఉద్యానవనాన్ని శివదాన సింగ్ మహారాజు క్రీ.శ. 1868 లో నిర్మించాడు. ఈ అద్భుతమైన తోట ఒక ప్రత్యెక బెంగాలీ తరహలో వంపులు ఉన్న గొడుగులా ఉంటుంది.

చిత్ర కృప : Ashish Gupta

సరిస్క నేషనల్ పార్క్, సరిస్క

సరిస్క నేషనల్ పార్క్, సరిస్క

రాజస్థాన్ లోని ఆల్వార్ జిల్లా లో ఢిల్లీ - ఆల్వార్ - జైపూర్ మార్గంలో ఉండే సరిస్క నేషనల్ పార్క్ ను సరిస్క టైగర్ రిజర్వు అని కూడ అంటారు. ఈ నేషనల్ పార్క్ రమణీయ ఆరావళి కొండలలో 800 చ. కి.మీ. వైశాల్యం మేర విస్తరించి ఉంది. ఇది గడ్డి భూములు, పొడి ఆకురాల్చు అడవులు, రాళ్ళతో నిండిన ప్రకృతి దృశ్యాల వంటి విభిన్న భూభాగాలను కల్గి ఉంది.

చిత్ర కృప : Nandanupadhyay

సరిస్క నేషనల్ పార్క్, సరిస్క

సరిస్క నేషనల్ పార్క్, సరిస్క

సరిస్క నేషనల్ పార్క్ ప్రధాన భాగం డోక్ వృక్షాలతో నిండి అనేక వన్య ప్రాణి జాతులకు ఆశ్రయమిస్తుంది. సరిస్క నేషనల్ పార్క్ లో విభిన్న వన్య మృగాలైన చిరుతపులులు, సాంబార్లు, జింకలు, నిల్గై లు, నాలుగు కొమ్ముల దుప్పులు, అడవి పందులు, రీసస్ మకాక్స్, లంగూర్లు, హైనాలు మొదలైనవి చూడవచ్చు.

చిత్ర కృప : Roshan Panjwani

కలిఘటి, సరిస్క

కలిఘటి, సరిస్క

సరిస్క నేషనల్ పార్క్ లోపల ఉన్న కలిఘటి కి , ప్రవేశ ద్వారం వద్ద ఉన్న కలిఘటి పేరు నుండి వచ్చింది. కాలిఘటి పరిసరాల్లో పులులు, చిరుత లు వంటి క్రూర మృగాలు కనపడతాయి.

చిత్ర కృప : Karthik R

జంగల్ సఫారీ, సరిస్క

జంగల్ సఫారీ, సరిస్క

సరిస్క నేషనల్ పార్క్ లో ఉన్న వన్యమృగాల కు తోడు అరుదైన వృక్ష సంపద కలిగి ఉండటం వల్ల జంగల్ సఫారీ ఉత్కంఠ ను కలిగిస్తుంది. నడక, పర్వతారోహణ, జీపు ద్వారా సరిస్క లో జంగల్ సఫారీ చేస్తూ అనేక ప్రంతహాలను చూడవచ్చు.

చిత్ర కృప : Saad Akhtar

ప్రభుత్వ మ్యూజియం, అల్వార్

ప్రభుత్వ మ్యూజియం, అల్వార్

ఇక్కడి ప్రభుత్వ మ్యూజియం అల్వార్ చరిత్రను తెలియ చేస్తుంది. ఇది సిటీ ప్యాలెస్ లోపల ఉంది. ఈ మ్యూజియం తాటాకుల పై చిత్రాల, రాతల అరుదైన సేకరణను కల్గి ఉంది. పర్యాటకులు పురాతన రాచరిక ఆయుధాలు, వివిధ భాషలో రాసిన చేతి వ్రాతలు, సంగీత వాయిద్యాలు, సున్నితమైన చిత్రాలు, కొండలు, కా౦స్యపు పని కూడా చూడవచ్చు. ఏనుగు దంతపు పని, లక్క శిల్పాలు ఈ మ్యూజియం ప్రాధమిక ఆకర్షణలు.

చిత్ర కృప : Manfred Sommer

కలాకండ్ మార్కెట్, అల్వార్

కలాకండ్ మార్కెట్, అల్వార్

కలాకండ్ మార్కెట్ షాపింగ్ ప్రియులకు ఆనందాన్నిచ్చే ప్రదేశం, ప్రత్యేకంగా ఇది నోరూరించే తీపి వంటలకు ప్రసిద్ది. ఈ మార్కెట్ లో అనేక వీధులను అక్కడ దొరికే ప్రముఖ వంటకాలను బట్టి పిలుస్తారు. పర్యాటకులు ఆకర్షణీయమైన హస్త కళలు, ఆభరణాలు దగ్గరలోని దుకాణాలలో సరసమైన ధరలకు కొనుగోలు చేయవచ్చు.

చిత్ర కృప : Abhilash Gaur

అల్వార్ ఎలా చేరుకోవాలి ??

అల్వార్ ఎలా చేరుకోవాలి ??

వాయు మార్గం

అల్వార్ కు 162 కి. మీ. దూరంలో ఉన్న జైపూర్ విమానాశ్రయం సమీపంలో గల విమానాశ్రయం. ఇక్కడి నుండి దేశంలోని వివిధ ప్రాంతాలకు ప్రయాణించవచ్చు. ఈ విమానాశ్రయం నుండి క్యాబ్ అద్దెకు తీసుకొని అల్వార్ చేరుకోవచ్చు.

రైలు మార్గం


అల్వార్ రైల్వే స్టేషన్ ఢిల్లీ, జోద్ పూర్, ముంబై లతో బాటు భారత దేశంలోని ఇతర ప్రాంతాలకు కలప బడింది. ఈ స్టేషన్ నుండి అల్వార్ కు క్యాబ్లు అందు బాటులో ఉంటాయి.

రోడ్డు మార్గం

అల్వార్ కు , రాజస్తాన్ లోని నగరాలతో బాటుగా, భారతదేశంలోని ఇతర ప్రక్క రాష్ట్రాలనుండి రాష్ట్ర ప్రభుత్వ బస్సులు, టాక్సీలు ఉన్నాయి.

చిత్ర కృప : Jay

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X