Search
  • Follow NativePlanet
Share
» »బారాముల్లా - ఓ అరుదైన వరాహ దంతం ... !

బారాముల్లా - ఓ అరుదైన వరాహ దంతం ... !

By Mohammad

బారాముల్లా జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం పాక్ ఆక్రమిత కాశ్మీర్ భూభాగంలో సరిహద్దు జిల్లాగా ఉంది. బారాముల్లా అన్న పేరు రెండు సంస్కృత పదాలైన 'వరాహ' మరియు 'ముల్' నుండి వచ్చింది. వరాహ అనగా పంది, ముల్ అనగా దంతం. శ్రీనగర్ కు ఈ పట్టణం 54 కి. మీ. దూరంలో, గుల్మార్గ్ 49 కి. మీ. దూరంలో ఉంటుంది.

ఇది కూడా చదవండి : మంచు కొండల మహత్యం - గుల్మార్గ్ !

బారాముల్లా కి ఆ పేరు రావటానికి గల ప్రధాన కారణం కాశ్మీర్ యొక్క పురాతన కావ్యమైన 'నిల్మతపూర్ణ' లో చక్కగా వివరించబడింది. ఆ కావ్యం ప్రకారం, జలోధ్భవుడు అనే రాక్షసుడు ఒకప్పటి కాశ్మీర్ లోయలోని 'సతిసరస్' అని పిలువబడే పార్వతి యొక్క సరస్సుని ఆక్రమించాడు. ఇది తెలుసుకున్న విష్ణుమూర్తి ఆ తరువాత వరాహ అవతారాన్ని ఎత్తి, తన దవడతో కొండను చీల్చడంతో నీళ్ళు బయటికి ప్రవహిస్తుంది అందువలన ఇది బారాముల్లా అయ్యిందని భావిస్తారు.

దీని చరిత్ర తెలుసుకున్నారు కదా ..! మరి ఇక్కడున్న ఆ సుందర ప్రకృతి దృశ్యాలు కూడా ఒకసారి అలా చూసొద్దాం పదండి !

ఏమి చూడవచ్చు ?

ఏమి చూడవచ్చు ?

బారాముల్లా లో గుడులు, మఠాలు, గురుద్వారాలు పర్యాటకులు తరచూ సందర్శిస్తుంటారు. 34 కి. మీ. దూరంలోని గుల్మార్గ్ ని పర్యాటకులు తప్పక సందర్శించాలి. ఇది సముద్ర మట్టానికి 2730 మీటర్ల ఎత్తులో ఉంటుంది. దీంతో పాటు పరిహాస్పొర పట్టణం తప్పక చూడవలసిన మరొక సందర్శనీయ స్థలం.

చిత్ర కృప : sandeepachetan.com travel photography

పరిహాస్పొర పట్టణం

పరిహాస్పొర పట్టణం

శ్రీనగర్ కు 25 కి. మీ. దూరంలో గల 'పరిహాస్పొర' పట్టణం బారాముల్లా లో చూడవలసిన ప్రసిద్ధ దర్శనీయ స్థలం. ఇక్కడ స్మారక చిహ్నాలైన "పటాన్ బజార్","పరిహాస్పొరా పట్టన్" లు సందర్శించవచ్చు. బౌద్ధుల స్థూపం మరియు బౌద్ధ మఠ ఆనవాళ్ళని కూడా దర్శించవచ్చు.

చిత్ర కృప : RameshSharma1

బండీపూర్

బండీపూర్

పర్యాటకులు ఊలార్ సరస్సుకు తూర్పు ఒడ్డున ఉన్న బండీపూర్ తప్పక చూడాలి. ఊలార్ సరస్సులు ఆసియా ఖండంలోనే అతిపెద్ద మంచి నీటి సరస్సు. ఈ సరస్సులో చేపలను పట్టవచ్చు. పక్కనే మొఘల్ గార్డెన్ ను తలపించే పార్క్ పర్యాటకులను కనువిందు చేస్తుంది.

చిత్ర కృప : Muzamil

బండీపూర్

బండీపూర్

బండీపూర్ లో ఆటవిడుపుల విషయానికి వస్తే, చేపలు పట్టడమే కాదు ట్రెక్కింగ్, పర్వతారోహణ చేపట్టవచ్చు. పర్వతారోహణ లో హర్మూక్ పర్వతం అధిరోహించడం తప్పక చేయాలి.

చిత్ర కృప : telugu native planet

సోపూర్

సోపూర్

బారాముల్లా కు 17 కి. మీ. దూరంలో సోపూర్ ప్రదేశం కలదు. దీనిని ' యాపిల్ టౌన్ ఆఫ్ ఇండియా' అంటారు. ఇక్కడ దొరికే నాణ్యమైన యాపిల్ పండ్లు దేశంలో మరెక్కడా దొరకవు. ఇక్కడ వివిధ మతాలకు చెందిన ప్రార్థనా స్థలాలు దర్శించవచ్చు.

చిత్ర కృప : sonu gupta

ఎకో పార్క్

ఎకో పార్క్

బారాముల్లా జిల్లాలోని ఖుద్నియార్ గ్రామం వద్ద ఉన్న ఎకో పార్క్ జెహ్లమ్ నది ద్వీపంలో ఉన్నది. ఇది బారాముల్లా - ఉరి మార్గంలో ఉన్నది. ఇక్కడికి చెక్క వంతెన ద్వారా చేరుకోవచ్చు.

చిత్ర కృప : Faisal H. Bhat

ఎకో పార్క్

ఎకో పార్క్

పర్వత శిఖరాల నేపథ్యంలో ఎకో పార్క్ చూడముచ్చటగా కనిపిస్తుంది. పక్కనే ప్రవహిస్తున్న నది, దాని చుట్టూ పచ్చిక బయళ్లతో ఉన్న ఈ గార్డెన్ మరింత అందాన్ని ప్రదర్శిస్తుంది. అందమైన చెక్క కుటీరాలు కూడా పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి.

చిత్ర కృప : Muzaffar Bukhari

మహారాణీ/మోహినేస్వర శివాలయం

మహారాణీ/మోహినేస్వర శివాలయం

పర్యాటకులు బారాముల్లా జిల్లాలోని 'మహారాణీ/మోహినేస్వర శివాలయం' గా పిలవబడే శివాలయాన్ని కూడా దర్శించవచ్చు. ఈ గుడి గర్భాలయంలో లయకారుడైన శివుడు మరియు ఆయన అర్ధాంగి పార్వతీ దేవి ఉంటారు.

చిత్ర కృప : Vishal Kapur

చత్తీ పడ్షాహీ

చత్తీ పడ్షాహీ

చత్తీ పడ్షాహీ లోగల సిక్కు దేవాలం కూడా దర్శనీయ స్థలమే. ప్రకృతి మధ్యలో పచ్చటి పర్వతాల మధ్య గల సహజ సిద్ధ జలపాతాలు, సరస్సులు ఆహ్లాదం కలిగిస్తూ ఉంటాయి. ప్రకృతి ప్రేమికులకి ఇది చక్కటి విడిది.

చిత్ర కృప : dtravelersworld

ఇంకా ఏమి చూడవచ్చు ?

ఇంకా ఏమి చూడవచ్చు ?

బారాముల్లాలో సమయముంటే 'మన్సబల్ సరస్సు' , 'అల్పాటార్ సరస్సు' చూడవచ్చు. మతపరమైన కట్టడాల విషయానికి వస్తే, తంగ్ మార్గ్ లోని 'జెయరత్ బాబా రేషీ', సోపోర్ లో గల 'జెయరత్ తుజ్జర్ షరీఫ్', అహ్మద్పూరా లో ఉన్న 'ఇమాంబరా గూం', 'జేరత్ జంబాజ్ వాలి' లు చూడదగ్గవి. వత్లాబ్ లో ఉన్న 'జెయరత్ బాబా షక్రుద్దీన్', బండీపూర్ లో గల 'జెయరత్ అహీం షరీఫ్' లు ప్రసిద్ధి చెందిన దేవాలయాలు.

చిత్ర కృప : Munir Ahmad

బారాముల్లా ఎలా చేరుకోవాలి ?

బారాముల్లా ఎలా చేరుకోవాలి ?

బారాముల్లా చేరుకోవటానికి వాయు, రైలు మరియు రోడ్డు మార్గాలు అందుబాటులో ఉన్నాయి.

బారాముల్లా సమీప విమానాశ్రయాలు - శ్రీనగర్ విమానాశ్రయం (49 కి.మీ. దూరంలో), సత్వారీ విమానాశ్రయం (169 కి.మీ. దూరంలో).

బారాముల్లా సమీప రైల్వే స్టేషన్ లు - ఉధంపూర్ ( 161 కి. మీ. దూరంలో), రాంనగర్ (169 కి. మీ. దూరంలో)

రోడ్డు మార్గం - గుల్మార్గ్, శ్రీనగర్, కార్గిల్, జమ్మూ నుండి రోజువారీ బస్సులు

చిత్ర కృప : ROHITH B

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X