Search
  • Follow NativePlanet
Share
» »చోప్త హిల్ స్టేషన్ - 'మినీ స్విజర్లాండ్' !

చోప్త హిల్ స్టేషన్ - 'మినీ స్విజర్లాండ్' !

By Super Admin

కాశ్మీర్ లో అందాలే కాదు అద్భుతాలు.. దాగున్నాయి !కాశ్మీర్ లో అందాలే కాదు అద్భుతాలు.. దాగున్నాయి !

సర్పరూపంలో శ్రీమహావిష్ణువు దర్శనమిచ్చేఆలయం ఎక్కడ ఉందో తెలుసా?సర్పరూపంలో శ్రీమహావిష్ణువు దర్శనమిచ్చేఆలయం ఎక్కడ ఉందో తెలుసా?

చుట్టూ పచ్చిక మైదానాలు, ఆకుపచ్చని చెట్లు, కాలుష్యం లేని తాజా గాలుల్లో విహరించాలనుకుంటున్నారా ?? అయితే వెంటనే పెట్టా - బేడా సర్దుకొని ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని చోప్త గ్రామానికి వెళ్లండి. వాహనాల శబ్ధాలు, అరుపులు వంటి వాటికి దూరంగా ... కొండ ప్రాంతంలో ఉన్న చోప్త మిమ్మల్ని సాదరంగా ఆహ్వానిస్తుంది.

ఇది కూడా చదవండి : ఉత్తరాఖండ్ - ఎవరికీ తెలియని హిల్ స్టేషన్లు !

చోప్త గ్రామమే కావచ్చు కానీ ... చూడటానికి, ఆనందించటానికి ఎన్నో అంశాలు ఇక్కడ ఉన్నాయి. కేవలం సేదతీరటం తో సర్ది పెట్టుకోకుండా ట్రెక్కింగ్, సాహసక్రీడ తో హుషారు పొందవచ్చు. వీలైతే ఈ సమ్మర్ లో మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ తో ఇక్కడికి నాలుగు రోజులు టూర్ ప్లాన్ చేసుకోండి. చోప్త వెళ్ళటానికి కూడా ఇదే సరైన సమయం (మార్చి - జూన్). వెళ్ళేటప్పుడు ఉన్ని దుస్తులు తీసుకెళ్ళటం మరవద్దు ..!

చోప్త ఆకర్షణలు

చోప్త ఆకర్షణలు

చోప్త లో తుంగ్నాథ్ గుడి, కల్పేశ్వర్ గుడి, మధ్య మహేశ్వర్ గుడి చూడదగ్గవి. సమీపంలో కస్తూరి జింకల అభయారణ్యం, చంద్రశిల కూడా చూడవచ్చు.

చిత్ర కృప : Travelling Slacker

తుంగ్నాథ్ గిడి

తుంగ్నాథ్ గిడి

అర్జునుడు నిర్మించిన తుంగ్నాథ్ ఆలయం సముద్ర మట్టానికి 3500 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఇదొక శివాలయం. ప్రపంచంలోనే ఎత్తైన శివాలయంగా ముద్రపడింది. ప్రధాన ఆలయంలో నంది విగ్రహం, పాండవుల విగ్రహాలు మరియు చుట్టూ అనేక చిన్న చిన్న ఆలయాలు ఉన్నాయి.

చిత్ర కృప : Vivek Sheel Singh

మధ్యమహేశ్వర్ ఆలయం

మధ్యమహేశ్వర్ ఆలయం

మధ్యమహేశ్వర్ ఆలయం చోప్త కు అనుకోని ఉన్న మరో కుగ్రామం 'మన్సున' లో ఉన్నది. ఇది కూడా శివునికి అంకితం చేయబడినది. ఈ ప్రాంతంలో శివుని కడుపు (ఉదరం) ను కనుగొన్నారని చెబుతారు. భక్తులు కూడా శివ కడుపు ను ఆరాధిస్తారు, పూజలు చేస్తారు.

చిత్ర కృప : Smeet Sinha

కల్పేశ్వర్ మందిర్

కల్పేశ్వర్ మందిర్

చోప్త కి సమీపంలోని ఉర్గం లోయలో సముద్ర మట్టానికి 2134 మీ. ఎత్తులో కల్పేశ్వర్ మందిర్ ఉన్నది. ఇదొక రాతి కట్టడం. ఈ చిన్న స్టోన్ టెంపుల్ ను ఒక గుహ మార్గం ద్వారా చేరుకోవచ్చు. ఈ ఆలయంలో శివుని జుట్టు ను ఆరాధిస్తారు.

చిత్ర కృప : rolling on

చంద్రశిల

చంద్రశిల

చోప్త లో ఎత్తైన ప్రదేశం చంద్రశిల. ఈ శిల సముద్రమట్టానికి 4 వేల మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఇక్కడికి ట్రెక్కింగ్ ద్వారా చేరుకోవచ్చు. ఈ ట్రెక్కింగ్ చోప్త నుండి మొదలై తుంగ్నాథ్ ఆలయం వరకు 5 కి. మీ. లు గా ఉంటుంది. ఈ శిఖరం పైన ఒక ఆలయం కూడా ఉంది.

చిత్ర కృప : SANDY!!!!!!!

క్యాంపింగ్

క్యాంపింగ్

ప్రకృతి ప్రియులకు చోప్త క్యాంపింగ్ సూచించదగినది. ఈ హిల్ స్టేషన్ కు దగ్గరలోనే టెంట్ వేసుకొని ప్రకృతిలో హాయిగాగడి పేయవచ్చు, కొత్త కొత్త అనుభూతులను రుచి చూడవచ్చు. ఇక్కడ మీకు ఎటువంటి అసౌకర్యం కలగదు. ప్రదేశమంతా నిర్మలంగా, ప్రశాంతంగా ఉంటుంది.

చిత్ర కృప : Mainak Hazra

కస్తూరి జింకల అభయారణ్యం

కస్తూరి జింకల అభయారణ్యం

చోప్త నుండి గోపేశ్వర్ వెళ్లే మార్గంలో కంచుల కోరాక్ కస్తూరి జింకల అభయారణ్యం ఉన్నది. ఇది దట్టమైన అటవీ ప్రాంతంలో 5 చ. కి. మీ. ల మేర విస్తరించి ఉన్నది. ఇక్కడ స్పెషల్ కస్తూరి జింకలు. ఇవి కస్తూరి అనే సుగంధ ద్రవ్యాన్ని ఉత్పత్తి చేస్తాయి. ఈ కస్తూరి పర్ఫ్యూమ్ ఖరీదు బహిరంగంగా లీటరు 30 వేల పైమాటే ..!

చిత్ర కృప : sdileeponc

చోప్త లో ఎక్కడ బస చేయవచ్చు ?

చోప్త లో ఎక్కడ బస చేయవచ్చు ?

చోప్త లో ఎకో టూరిస్ట్ విలేజ్ లో, గెస్ట్ హౌస్, టూరిస్ట్ రెస్ట్ రూమ్ లలో ఉండవచ్చు. చవకలో కావాలంటే లాడ్జ్ లు, హోటళ్ళ ను ఆశ్రయించవచ్చు.

చిత్ర కృప : Amit Upadhyay

చోప్త ఎలా చేరుకోవాలి ?

చోప్త ఎలా చేరుకోవాలి ?

వాయు మార్గం

చోప్త కు 202 కి. మీ. దూరంలో డెహ్రాడూన్ జాలీ గ్రాంట్ విమానాశ్రయం ఉన్నది. ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, వైజాగ్ ప్రాంతాల నుండి దేశీయ విమానాలు నడుస్తుంటాయి. ట్యాక్సీ లేదా క్యాబ్ ల ను అద్దెకు తీసుకొని చోప్త చేరుకోవచ్చు. విమాన టికెట్ హైదరాబాద్ నుండి సుమారు 9 వేలు, వైజాగ్ నుండి 10 వేలు గా ఉంటుంది.

రైలు మార్గం

చోప్త కు సమీపాన రిశికేష్ రైల్వే స్టేషన్ ఉన్నది. అక్కడ దిగి చోప్త కు బస్సులో ప్రయాణించవచ్చు. ట్రైన్ టికెట్ వైజాగ్ నుంచి వెయ్యి రూపాయలు, హైదరాబాద్ నుండి పన్నెండు వందల వరకు ఉంటుంది(తరగతులను బట్టి).

రోడ్డు మార్గం

న్యూ ఢిల్లీ నుండి చోప్త కు చక్కని రోడ్డు మార్గం కలదు. చోప్తకు టాక్సీలు మరియు క్యాబ్ లు రిశికేష్, డెహ్రాడూన్, ఉత్తరకాశి, శ్రీనగర్ మరియు గోపేశ్వర్ వంటి సమీపంలోని నగరాల నుండి కూడా సులభంగా అందుబాటులో ఉన్నాయి.

చిత్ర కృప : Vivek Sheel Singh

సమీపంలో చూడవలసినవి

సమీపంలో చూడవలసినవి

చోప్త లో ఉన్నట్లయితే సమీపంలోని కెదర్నాథ్ (43 కి.మీ), రుద్ర ప్రయాగ (24 కి.మీ) వంటి పవిత్ర శైవ క్షేత్రాలను చూడవచ్చు.

ఇది కూడా చదవండి : కెదర్నాథ్ - మంచు కొండల్లో .. మహా రహస్యాలు !

ఇది కూడా చదవండి : రుద్రప్రయాగ - పవిత్ర పుణ్య క్షేత్రం !

చిత్ర కృప : Prithish Ray

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X