Search
  • Follow NativePlanet
Share
» »ఇండియాలో డిసెంబర్ లో పర్యటించవలసిన పర్యాటక ప్రదేశాలు !!

ఇండియాలో డిసెంబర్ లో పర్యటించవలసిన పర్యాటక ప్రదేశాలు !!

By Mohammad

డిసెంబర్ మాసం సంవత్సరంలోని నెలలన్నింటిలో చివరి నెల. ఈ నెలలో ఈశాన్య ఋతుపవనాలు కాస్త ప్రభావం చూపిస్తుంటాయి. ప్రస్తుతం అయితే వర్షాలు, చలితో ఈ నెల హడలెత్తిస్తున్నది.

పిల్లలు, పెద్దలు ఇలా ఏ వయసువారైనా సరే డిసెంబర్ నెల నుండి బయటపడటానికి నానాతంటాలు పడుతుంటారు. ఏవేవో ప్రయత్నాలు సైతం చేస్తుంటారు. వాటిలో కొన్ని కాస్తో కూస్తో ఫలిస్తుంటాయి. డిసెంబర్ నెల నుండి మీరు, మీ పిల్లలు లేదా కుటుంబసభ్యులు పూర్తిగా బయటపడటానికి ఒక మార్గం ఉన్నది.

పర్యాటక ప్రదేశాలు చాలా వరకు మీ సమస్యలకు మెడిసిన్ లాగా ఉపయోగపడతాయి. కొన్ని ప్రదేశాలను సందర్శిస్తే మీ బాధలు, మానసిక రుగ్మతలు తొలగిపోతాయి. అలాగే ఈ డిసెంబర్ మాసం నుండి తప్పించుకోవడానికి మన భారత దేశంలో కొన్ని ప్రదేశాలు ఉన్నాయి. ఈ ప్రదేశాలు వెచ్చగా ఉండి మిమ్మల్ని ఎంతగానో మైమరిపిస్తుంటాయి.

ఈ ప్రదేశాలలో స్వెటర్లు, చెవులకి టోపీలు, మఫ్‌లర్‌లు, శాలువలు, గొడుగులు లాంటివి ఏమీ కూడా అవసరం లేకుండా మామూలుగానే పర్యటించవచ్చు. ఇండియాలో డిసెంబర్ లో పర్యటించవలసిన పర్యాటక ప్రదేశాలు గా ఇవి పర్యాటక శాఖచే గుర్తించబడ్డాయి. మరి ఇంతగా గుర్తింపు పొందిన ప్రదేశాలు ఎక్కడ ఉన్నాయి ? అక్కడ వెళితే ఏమి చూడాలి ??

కోణార్క్, ఒరిస్సా

కోణార్క్, ఒరిస్సా

కోణార్క్, ఒరిస్సా రాజధాని భువనేశ్వర్ కు 60 కి. మీ. దూరంలో ఉన్నది. ఇక్కడ స్మారక కట్టడాలు, అందమైన బంగాళాఖాత సముద్ర తీరం వీక్షించవచ్చు. కోణార్క్ లో ప్రముఖంగా చూడవలసినది సూర్య దేవాలయం. సూర్యుడి కి అంకితం ఇవ్వబడిన ఈ రాతి ఆలయం వరల్డ్ హేరిటేజ్ సంస్థ చే గుర్తింపు పొందినది. ఇక్కడ కోణార్క్ డాన్స్ ఫెస్టివల్ వైభవంగా జరుగుతుంది.

ఇది కూడా చదవండి : కోణార్క్ లోని మరిన్ని పర్యాటక ఆకర్షణలు !!

చిత్ర కృప : Parshotam Lal Tandon

పట్నీతోప్, జమ్ముకాశ్మీర్

పట్నీతోప్, జమ్ముకాశ్మీర్

పట్నీతోప్, జమ్ముకాశ్మీర్ రాష్ట్రంలోని ఉధంపూర్ జిల్లాలో ఉన్న అందమైన పర్వత ప్రాంతం. ఈ ప్రదేశం సముద్రమట్టానికి 2024 మీటర్ల ఎత్తులో పీఠభూమి మీద ఉన్నది. దట్టమైన దేవదారు అడవులు, కొండలు, ఉత్కంఠభరిత దృశ్యాలు మరియు ప్రశాంత వాతావరణం పట్నీతోప్ అందాల్ని మరింతగా పెంచుతున్నాయి. డిసెంబర్ లో నిర్వహించే స్కీయింగ్ మరియు ట్రెక్కింగ్ వంటి బహిరంగ కార్యక్రమాలను తిలకించేందుకు, పాల్గొనటానికి పర్యాటకులు వస్తుంటారు.

ఇది కూడా చదవండి : పట్నీతోప్ లోని మరిన్ని పర్యాటక ఆకర్షణలు !!

చిత్ర కృప : Mihir Mehta

రనతంబోర్, రాజస్థాన్

రనతంబోర్, రాజస్థాన్

రనతంబోర్, రాజస్థాన్ రాష్ట్రంలోని సుందర ప్రదేశం. సంవత్సరం పొడవునా ఒక మోస్తరు వాతావరణాన్ని కలిగి, డిసెంబర్ మాసంలో పర్యటనకు అనుకూలంగా ఉంటుంది. ఈ ప్రదేశం ప్రపంచంలో ప్రఖ్యాతి గాంచిన టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ లలో ఒకటిగా ప్రసిద్ధి చెందినది. వివిధ రకాల మొక్కలకు, జంతువులకు మరియు అరుదైన పక్షులకు ఆవాసంగా ఉన్న ఈ అడవిలో సాంబార్, చిరుత, ఎలుగుబంటీలు, హైనా వంటి జంతు జాలాన్ని చూడవచ్చు.

ఇది కూడా చదవండి : రనతంబోర్ లోని మరిన్ని పర్యాటక ఆకర్షణలు !!

చిత్ర కృప : Vijayamurthy sadagopalan

మురుడేశ్వర్, కర్నాటక

మురుడేశ్వర్, కర్నాటక

కర్నాటక రాష్ట్రం లోని పశ్చిమ తీర ప్రాంతంలో మురుడేశ్వర్ పట్టణం ఉన్నది. ఈ పట్టణంలో ప్రపంచంలోని రెండవ అతి పెద్ద శివ విగ్రహం ఉన్నది. ఈ విగ్రహం పట్టణంలోని ఏ ప్రాంతం నుండైనా కనిపించేవిధంగా ఉంటుంది. సాధారణంగా ఒక దీవి లా కనిపించే ఈ పట్టణానికి మూడువైపులా అరేబియా మహా సముద్రం ప్రవహిస్తుంటుంది. పిల్లలు, పెద్దలు సేదతీరటానికి బీచ్ ప్రదేశం అనుకూలంగా ఉంటుంది. సూర్యోదయం, సూర్యాస్తమం సామ్యాలు ఇక్కడ అద్భుతంగా ఉంటాయి.

ఇది కూడా చదవండి : మురుడేశ్వర్ లోని మరిన్ని పర్యాటక ఆకర్షణలు !!

చిత్ర కృప : Harikuttan333

కజీరంగా నేషనల్ పార్క్, అస్సాం

కజీరంగా నేషనల్ పార్క్, అస్సాం

కజీరంగా నేషనల్ పార్క్ అస్సాం రాష్ట్రానికి ఉండటం ఒక గర్వ కారణం. ఈ నేషనల్ పార్క అంతరించిపోతున్న ఖడ్గ మృగాలకి నివాస స్థలం. కజీరంగా జాతీయ పార్క్ సంవత్సరంలో 6 నెలలు మూసి ఉంటుంది మరో ఆరు నెలలు తెరిచి ఉంటుంది. వేసవి కాలంలో వాతావరణం పొడిగా, వర్షాకాలంలో తరచూ వరదలతో ఉండే ఈ పార్క్, శీతాకాలం ఆహ్లాదకరమైన వాతావరణం కలిగి పర్యటనకు అనుకూలంగా ఉంటుంది.

ఇది కూడా చదవండి : కజీరంగా లోని మరిన్ని పర్యాటక ఆకర్షణలు !!

చిత్ర కృప : cirdantravels

 త్రిస్సూర్, కేరళ

త్రిస్సూర్, కేరళ

కేరళ రాష్ట్రంలో విశ్రాంతి సెలవులను గడపాలంటే త్రిస్సూరు తప్పక సందర్శించాలి. ఆధ్యాత్మికానికి, చరిత్రకి, సంస్కృతికి మరియు విశ్రాంతికి చక్కటి ఉదాహరణ ఈ ప్రదేశం. ఆధ్యాత్మికం మాత్రమే కాకుండా ఎన్నో జలపాతాలు, బీచ్ లు, డ్యాం ల వంటి వివిధ ఆకర్షణలతో ఈ ప్రాంతం పర్యాటకులను ఆకర్షిస్తున్నది. ఆధ్యాత్మికత, విశ్రాంతి కోరుకోనేవారు త్రిస్సూరు ప్రదేశాన్ని చూసి రావటానికి డిసెంబర్ మాసం అనువైన సమయం.

ఇది కూడా చదవండి : త్రిస్సూర్ లోని మరిన్ని పర్యాటక ఆకర్షణలు !!

చిత్ర కృప : Abhilash C

లక్నో , ఉత్తరప్రదేశ్

లక్నో , ఉత్తరప్రదేశ్

ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి రాజధానైన లక్నో గోమతి నది ఒడ్డున ఉన్నది. ఇక్కడి ప్రధాన ఆకర్షణ అందమైన కట్టడాలు మరియు భవంతులు. కేవలం ఇవే కాదు లక్నో లో చూడవలసినవి మరియు చెయ్యవలసినవి చాలానే ఉన్నాయి. ఈ ప్రదేశం ముస్లిం నవాబుల కాలం నాటి చరిత్ర, సంస్కృతికి నిదర్శనం. ఇక్కడ తయారయ్యే వంటకాలు దేశ, విదేశాలలో ప్రసిద్ధి చెందినాయి.

ఇది కూడా చదవండి : లక్నో లోని మరిన్ని పర్యాటక ఆకర్షణలు !!

చిత్ర కృప : Urniel

మంగళూరు, కర్నాటక

మంగళూరు, కర్నాటక

మంగళూరు కర్నాటక రాష్ట్రానికి ముఖ ద్వారం అని చెబుతుంటారు. ఒక పక్క అరేబియా మహా సముద్రం మరో పక్క పశ్చిమ కనుమలు ఈ ప్రాంత అందాల్ని మరింత పెంచుతున్నాయి. మంగళూరు లో చూడవలసిన అందాలు, సహజ కట్టడాలు, ప్రకృతి సంపద ఇలా ఎన్నో ఉన్నాయి. అరేబియా సముద్రం లోని బీచ్ లు, తాటిచెట్ల వరుసలు, ఆలయాలు ఇక్కడి ప్రధాన ఆకర్షణలు. ప్రకృతిని ఆస్వాదించాలనుకునే వారికి మంగళూరు ఒక స్వర్గం లో ఉంటుంది. డిసెంబర్ మాసం సందర్శనకు అనువైనది.

ఇది కూడా చదవండి : మంగళూరు లోని మరిన్ని పర్యాటక ఆకర్షణలు !!

చిత్ర కృప : Arindambasu

గోవా

గోవా

ఇండియాకి పశ్చిమ దిశలో ఉన్న గోవా పర్యాటకులకి స్వర్గధామం అనే చెప్పాలి. ఇక్కడ లభించే చవకైన అల్కాహాల్ నుండి అందమైన బీచ్ లు అన్నీ కూడా ఆకర్షణీయమే. పూర్వం ఇది పోర్చుగీసు వారి ఆధీనంలో ఉండేది ఆ తరువాత జరిగిన పెను మార్పుల వల్ల ఇది భారతదేశంలో అంతర్భాగంగా ఉన్నది. షాపింగ్ చేసేవారికి, నిక్కర్లు తొడుక్కొని బీచ్ ల వైపు పరిగెత్తడానికి ఈ ప్రదేశం సౌకర్యవంతంగా ఉంటుంది. భారత దేశం మొత్తం మీద పర్యాటకులు ఎక్కువగా ఈ ప్రదేశాన్ని సందర్శించడానికి వస్తుంటారు.

ఇది కూడా చదవండి : గోవా లోని మరిన్ని పర్యాటక ఆకర్షణలు !!

చిత్ర కృప : Zerohund~commonswiki

కొహిమా, నాగాలాండ్

కొహిమా, నాగాలాండ్

ఈశాన్య భారతదేశంలోని కొహిమా నగరం ఎంతో సుందర ప్రదేశం. ఈ ప్రదేశం నాగాలాండ్ రాష్ట్ర రాజధానిగా ఉన్నది. మొహాలన్ని కూడా చైనా, మ్మయన్మార్ దేశాల ప్రజల మాదిరిగా ఉంటాయి. కొహిమా ప్రదేశం సేఫ్టీ జోన్ పరిధిలో వస్తుంది కనుక నగరంలో ప్రవేశించాలనుకొనేవారు అధికారుల నుండి ముందస్తు అనుమతి పొందాలి. స్థానిక ఆహారాలు రుచిగా ఉండి మరువలేనివిగా ఉంటాయి.

ఇది కూడా చదవండి : కొహిమా లోని మరిన్ని పర్యాటక ఆకర్షణలు !!

చిత్ర కృప : Jackpluto

ఔలి, ఉత్తరాఖండ్

ఔలి, ఉత్తరాఖండ్

ఔలి ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని ప్రముఖ పర్యాటక ప్రదేశం. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న స్కీయింగ్ క్రీడలకి ఈ ప్రదేశం ప్రసిద్ధి చెందినది. ఈ సుందర ప్రదేశం సముద్ర మట్టానికి 2800 మీటర్ల ఎత్తులో ఉన్నది. ఔలిలో అన్ని రకాల సాహస క్రీడలు చేయవచ్చు కానీ సరైన గైడ్ సహకారం తీసుకుంటే మంచిది. హిమాలయ పర్వత శ్రేణులు, యాపిల్ చెట్లు, దేవదారు చెట్లు ఈ ప్రాంత అందాల్ని మరింతగా పెంచుతున్నాయి. ఈ ప్రాంత సందర్శనకు ఉత్తమ సమయం డిసెంబర్ మాసం.

ఇది కూడా చదవండి : ఔలి లోని మరిన్ని పర్యాటక ఆకర్షణలు !!

చిత్ర కృప : Biswajit_Dey

జోధ్‌పూర్, రాజస్థాన్

జోధ్‌పూర్, రాజస్థాన్

రాజస్థాన్ లో గల జోధ్‌పూర్ ను బ్లూ సిటీ గా అభివర్ణిస్తారు. థార్ ఎడారికి అంచున ఉండటం వల్ల దీన్ని థార్ ముఖ ద్వారం అని పిలుస్తారు. ఇక్కడ ప్యాలెస్ లు, కోటలు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. ఇక వంటల విషయానికి వస్తే పెరుగు, పంచదార తో చేసే మఖనియా లస్సీ ఎంతగానో రుచిగా ఉంటుంది. ఇక్కడికి వచ్చే ప్రతి యాత్రికుడు లస్సీ రుచి చూడకుండా ఉండలేరు. అదే కాక ఏనుగు, ఒంటెల మీద సవారీ చేయటం మరో ఆకర్షణ.

ఇది కూడా చదవండి : జోధ్‌పూర్ లోని మరిన్ని పర్యాటక ఆకర్షణలు !!

చిత్ర కృప : Ajajr101

కైమూర్, బీహార్

కైమూర్, బీహార్

కైమూర్, బీహార్ రాష్ట్రంలో ఉన్న ఒక నగరం. కైమూర్ ప్రధాన ఆకర్షణలలో అభయారణ్యం, ఆలయాలు ముఖ్యంగా చూడదగినవి. క్రీస్తు పూర్వం నుండి దీని చరిత్ర అక్కడక్కడ ప్రకాశిస్తూనే ఉంది. కైమూర్ కి సమీపంలో ఉన్న జలపాతం పర్యాటకులను చూపు తిప్పుకోకుండా కనువిందు చేస్తున్నది. ఈ ప్రదేశాన్ని సందర్శించడానికి ఉత్తమ సమయం డిసెంబర్ మాసం.

ఇది కూడా చదవండి : కైమూర్ లోని మరిన్ని పర్యాటక ఆకర్షణలు !!

చిత్ర కృప : bot

బటిండా, పంజాబ్

బటిండా, పంజాబ్

భారత దేశంలో ఉన్న పురాతన నగరాలలో పంజాబ్ రాష్ట్రంలోని బటిండా పట్టణం ఒకటి. దీనికున్న సంపన్న సంస్కృతి మరియు వారసత్వం కారణంగా అనేక మంది పర్యాటకులను దేశ, విదేశాల నుండి ఆకర్షిస్తున్నది. ఎన్ని గురుద్వారాలు మరియు దేవాలయాలు ఉన్నా, ప్రధాన ఆకర్షణ మాత్రం పురాతన కోట ముబారక్ దే. చిన్న చిన్న ఇటుకలను ఉపయోగించి అందమైన స్మారక చిహ్నం నిర్మించడం ప్రధాన హైలెట్ గా చెప్పవచ్చు.

ఇది కూడా చదవండి : బటిండా లోని మరిన్ని పర్యాటక ఆకర్షణలు !!

చిత్ర కృప : Guneeta

హిసార్, హర్యానా

హిసార్, హర్యానా

హిసార్ ఒక ఉక్కు నగరంగా పేరుగాంచినది. ఇది హర్యానా రాష్ట్రంలో ప్రముఖ పట్టణంగా ఉన్నది. ఇక్కడి ప్రధాన ఆకర్షణ ఆగ్రోహ ఆలయం. చరిత్రను బాగా ఇష్టపడే వారికి హిసార్ చక్కటి ఉదాహరణ. ఈ ప్రాంత సందర్శనకు ఉత్తమ సమయం డిసెంబర్ మాసం.

ఇది కూడా చదవండి : హిసార్ లోని మరిన్ని పర్యాటక ఆకర్షణలు !!

చిత్ర కృప : Archit Ratan

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X