Search
  • Follow NativePlanet
Share
» »గణపతిపూలే - 'భారతదేశ కరేబియన్' !

గణపతిపూలే - 'భారతదేశ కరేబియన్' !

By Mohammad

భారతదేశ కరేబియన్ ద్వీపం గా పేరుగాంచిన గణపతి పూలే ను పర్యాటకులు తప్పనిసరిగా సందర్శించాలి. ఇది కొంకణ్ తీరాన గల మనోహరమైన ఓడరేవు. ఈ ప్రాంతం ముంబైకు 375 కిలోమీటర్ల దూరంలో రత్నగిరి జిల్లాలో ఉంది. మహారాష్ట్ర లోని ఈ చిన్న గ్రామం వేగంగా జరుగుతున్న నగరీకరణకు దూరంగా తన సహజసిద్ధమైన రమణీయతతో ఆహ్లాదకరంగా ఉంటుంది.

స్వయంభు గణపతి దేవాలయం

స్వయంభు గణపతి దేవాలయం

చిత్రకృప : Kprateek88

మతం, సముద్ర తీరం, చరిత్ర - అన్నీ ఒకేచోట

గణపతిపులే లోని స్వయంభు గణపతి దేవాలయం ఈ చిన్ని గ్రామానికి గొప్ప ఆకర్షణ. 400 ఏళ్ళ నాటిదని చెప్పబడే ఇక్కడి గణపతి విగ్రహాన్ని ఏకరాతి నుండి చెక్కారు. ప్రతి ఏడాది వేలాదిమంది యాత్రికులు గణపతి ఆశిస్సుల కోసం ఇక్కడకు వస్తారు. గణపతి దేవుని పశ్చిమ ద్వారదేవత అంటారు. గణపతిపులే గ్రామంలో ప్రజలు తమ క్షేమానికి కారణం ఈ దేవుని అనుగ్రహమేనని నమ్ముతారు.

ఇది కూడా చదవండి : సాజన్ - మాన్సూన్ ట్రెక్కింగ్ స్థావరం !

గణపతిపులే లోని తీరప్రాంతాలు స్వచ్చమైన నీటితో బాటు అపరిమితమైన వృక్ష సంపదను కల్గిఉన్నాయి. ఈ తీరప్రాంతం వెంబడి గల కొబ్బరి చెట్లు అనేక పొదలు దూరం నుండి ఎంతో రమ్యంగా కనబడతాయి. ఈ ప్రాంతానికే చెందిన మరో రెండు ప్రదేశాలు రాయగడ్ కోట, రాయగడ్ లైట్ హౌస్ చూడడం మరవకండి.

బీచ్ వద్ద అద్భుత సూర్యాస్తమం

బీచ్ వద్ద అద్భుత సూర్యాస్తమం

చిత్రకృప : Yogendra Joshi

గణపతి పూలే బీచ్

గణపతి పూలే బీచ్ లో వెండి లాంటి తెల్లటి ఇసుక ధగధగ మెరుస్తూ ఉంటుంది. తీరం వెంబడి మామిడి, జీడిపప్పు వృక్షాలు వరుసగా కనపడతాయి. సాయంత్రం పూట బీచ్ వద్దకు వెళ్లి, సేదతీరుతూ మరాఠా రుచులను తిని చూడండి. వీలుంటే ఒంటె సవారీ కూడా ప్రయత్నించండి.

ఇతర ఆకర్షణలు

గణపతి పూలే కు కిలోమీటరు దూరంలో ఉండే మాల్గుండ్ గ్రామం, ద్వీపకల్పపు కోన భాగాన గల సిద్ధ బురుజ్ లోని జైగడ్ లైట్ హౌస్, 35 కిలోమీటర్ల దూరంలో గల జైగడ్ కోట, 38 కిలోమీటర్ల దూరంలోని వెల్నేశ్వర్ చూడదగ్గవి.

ప్రాచీన కొంకణ్ మ్యూజియం

ప్రాచీన కొంకణ్ మ్యూజియం

చిత్రకృప : Pradeep717

ఆహారపు అలవాట్లు

ఇక్కడి రుచులు ఎండు మామిడి అప్పడం అంబాపోలి, పనస అప్పడం ఫనస్పోలి తినడం మరవకండి . ప్రసిద్ధి చెందిన ఇంకో వంటకం కోకంకడి. మీరు వేసవిలో గణపతిపులే వెళ్తే ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన దేవగడ్ హపస్ మామిడి తినడం మరవొద్దు. గణపతి దేవునికి ఇష్టమైన రుచికరమైన తీపి వంటకం కుడుములు తినకుండా మీరు ఇక్కడినుండి రాలేరు.

ఇది కూడా చదవండి : రత్నగిరి పర్యాటక ఆకర్షణలు !

ఈ ప్రాంత సందర్శనలో గుర్తుంచుకోవలసిన కొన్ని విషయాలు:

గణపతిపులే గ్రామ ప్రజలు గొప్ప గణపతి భక్తులు. అతిధులను చాలా మర్యాదగా చూస్తారు. ఇక్కడ మరాఠీ ఎక్కువగా వాడినా యాత్రికులు తరచూ సందర్శించే ప్రాంతమైనందున ఇంగ్లీష్, హిందీ కూడ మాట్లాడతారు.

గణపతిపులే అరేబియన్ సముద్రానికి దగ్గరగా ఉండటంవల్ల ఇక్కడి వాతావరణం చాలా అధ్భుతంగా ఉంటుంది.

వేసవి కాలం కొంత వేడిగా ఉండటం వల్ల సాధారణంగా యాత్రికులు ఈ కాలంలో రారు.

బీచ్ మరియు రిసార్ట్ వ్యూ

బీచ్ మరియు రిసార్ట్ వ్యూ

చిత్రకృప : Pradeep717

మీరు ఈ ప్రాంతాన్ని చూడాలనుకుంటే మాత్రం ఇక్కడి మనోహర మైన వాతావరణాన్ని ఆస్వాది౦చడానికి ఒక జత ఈత దుస్తులు తెచ్చుకోండి.

కానీ వర్షాకాలంలో రోడ్డు ప్రయాణం ఈ స్వర్గంలో మైమరపించే మరువలేని మధురానుభూతిని కల్గిస్తూ సందర్శనకు అనువుగా ఉంటుంది.

ఇది కూడా చదవండి : చిఖల్ ధారా సందర్శనీయ స్థలాలు !

పుష్కలంగా కురిసే వర్షాల వల్ల ఈ ప్రాంతం అధివాస్తవిక అందాలతో రమణీయంగా ఉంటుంది. వర్షాలంటే ఇష్టం లేనివారు శీతాకాలంలో ఈ పవిత్ర ప్రదేశాన్ని దర్శించవచ్చు.

మొదటిసారి ఇక్కడికి వచ్చే వారికి గణపతిపులే రావడం చాలా సులువు.

గణపతిపూలే - కొల్హాపూర్ బస్సు

గణపతిపూలే - కొల్హాపూర్ బస్సు

చిత్రకృప : Yogendra Joshi

గణపతిపూలే ఎలా చేరుకోవాలి ?

వాయు మార్గం : 25 km ల దూరంలో రత్నగిరి విమానాశ్రయం, 327 km ల దూరంలో ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం కలదు.

రైలు మార్గం : రత్నగిరి సమీప రైల్వే స్టేషన్. పూణే, ముంబై నుండి ప్రతి రోజూ ఇక్కడికి రైళ్లు వస్తుంటాయి.

రోడ్డు మార్గం : ముంబై, గోవా, పూణే, కొల్హాపూర్, రత్నగిరి మోడైన ప్రాంతాల నుండి గణపతి పూలే కు ప్రభుత్వ/ ప్రవేట్ బస్సులు నడుస్తాయి

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Nativeplanet sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Nativeplanet website. However, you can change your cookie settings at any time. Learn more