Search
  • Follow NativePlanet
Share
» »గోకర్ణ - ఆత్మలింగాన్ని దర్శిద్దాం పదండి !

గోకర్ణ - ఆత్మలింగాన్ని దర్శిద్దాం పదండి !

By Mohammad

'భూకైలాస క్షేత్రం' గా ప్రసిద్ధి చెందిన గోకర్ణ కర్ణాటక రాష్ట్రంలోని ఉత్తర కన్నడ జిల్లాలో కలదు. ఇది బెంగళూరు మహానగరానికి 550 కి. మీ ల దూరంలో, హుబ్లీ కి చేరువలో ఉంది. ఇదొక యాత్రా స్థలమే కాదు అందమైన సముద్ర తీర పట్టణం కూడా.

గోకర్ణ అనే పేరు ఎలా వచ్చిందంటే ?

గోకర్ణ రెండు అగ్నశిని మరియు గంగావతి అనే రెండు నదుల మధ్యలో కలదు. ఈ రెండు నదులు కలిసి గోవు చెవి ఆకారంలో ఏర్పడతాయి కనుక దీనిని 'గోకర్ణ' అన్నారు. గోకర్ణ శివాలయానికి ప్రసిద్ధి చెందినది. ఈ క్షేత్రం ఆవిర్భవించటానికి గల కధనం ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది.

అదేమిటంటే రావణాసురుడు తల్లైన 'కైకసి' ని పూజించుకోవడం కోసం 'కైలాసగిరి' ని తీసుకురావాలని నిశ్చయించుకుంటాడు. అందుకోసం ఏకాంత ప్రదేశంలో ఘోర తపస్సు చేసి విఫలమైనా, శివుడు అతని ప్రయత్నానికి మెచ్చి తన ఆత్మ లింగాన్ని ఇచ్చినట్టే ఇచ్చి షరతు విధిస్తాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆత్మలింగాన్ని కింద పెట్టరాదని ... ఒకవేళ పెడితే దానిని పైకి ఎత్తడం కష్టమని చెప్తాడు.

ఇది కూడా చదవండి : దక్షిణ భారతదేశంలో సముద్రపు ఒడ్డున ఉన్న అద్భుత శివాలయాలు !

ఆత్మలింగాన్ని తీసుకొని రావణుడు తన నగరానికి బయలుదేరుతాడు. ఎలాగైనా ఈ ఆత్మలింగాన్ని నగరానికి తీసుకుపోనీయకుండా అడ్డుపడతారు బ్రహ్మ, విష్ణువులు. అందుకు రాయబారిగా నారదుడిని పంపిస్తారు. నారదుడు అది ఆత్మలింగం కాదని చెప్పి భంగపడతాడు. చివరికి గోపాలుడి రూపంలో వినాయకుడు ప్రత్యక్షమైతాడు.

సంధ్యా సమయం అయిందన్న విషయాన్ని తెలుసుకున్న రావణుడు, తాను సంధ్య వార్చుకొని వచ్చేంతవరకు శివలింగాన్ని పట్టుకోమని గోపాలుడి వేషంలో ఉన్న వినాయకుడికి చెబుతాడు. తాను 3 సార్లు పిలుస్తానని .. ఈ లోగా రాకపోతే శివలింగాన్ని కింద పెడతానని చెబుతాడు గోపాలుడు. రావణుడు వెళ్ళగానే గబగబ 3 సార్లు పిలిచి శివలింగాన్ని కింద పెడతాడు వినాయకుడు.

రావణుడు పరిగెత్తుకుంటూ వచ్చి లేవనెత్తగా లింగం ఇంచుకూడా కదలదు. ఈ కారణంగానే ఇక్కడి శివయ్యను "మహాబలేశ్వరుడు" అని పిలుస్తాడు. క్షేత్ర కధనం అయితే విన్నారుగా, మరి ఇక్కడ సందర్శనీయ ప్రదేశాలు చూసొద్దాం పదండి..!

గోకర్ణ ఎలా చేరుకోవాలి ?

గోకర్ణ ఎలా చేరుకోవాలి ?

వాయు మార్గం : గోకర్ణ కు సమీపాన గోవాలోని డబోలిం అంతర్జాతీయ ఎయిర్ పోర్ట్ కలదు. అక్కడి నుండి క్యాబ్ లేదా టాక్సీ అద్దెకు తీసుకొని గోకర్ణ చేరుకోవచ్చు.

రైలు మార్గం : గోకర్ణ లో రైల్వే స్టేషన్ లేదు. సమీపాన అంకోలా రైల్వే స్టేషన్ కలదు. ఇది 20 కి. మీ ల దూరంలో ఉంటుంది. ఈ స్టేషన్ నుండి స్థానిక బస్సు లేదా టాక్సీ లలో గోకర్ణ చేరుకోవచ్చు.

రోడ్డు / బస్సు మార్గం : బెంగళూరు, హుబ్లీ, మంగళూరు, మార్గోవా తదితర ప్రాంతాల నుండి గోకర్ణ కు ప్రతి రోజూ ప్రభుత్వ/ ప్రవేట్ బస్సులు తిరుగుతుంటాయి.

చిత్ర కృప : Miran Rijavec

భద్రకాళీ ఆలయం

భద్రకాళీ ఆలయం

భద్రకాళీ ఆలయం మాతా ఉమ కు చెందినది. ఇది గోకర్ణ పట్టణానికి కిలోమీటర్ దూరంలో కలదు. మాతా ఊరి మొత్తాన్ని రక్షిస్తుందని, అందుకే గ్రామ దేవత అయ్యిందని చెబుతారు. స్థానికులు, చుట్టుప్రక్కల ప్రజలు వచ్చి అమ్మవారిని దర్శించి ముడుపులు చెల్లించుకుంటారు.

ఇడగుంజి

ఇడగుంజి

ఇడగుంజి ప్రాంతంలో వినాయకుడు ప్రధాన ఆకర్షణ. ఇక్కడ ఏమి కోరుకున్న జరుగుతుందని భక్తుల విశ్వాసం. ఇక్కడి వినాయకుడి విగ్రహం ఒక చేతిలో పద్మం, మరో చేతిలో లడ్డు కలిగి ఉంటుంది. ఎలా లక్షల సంఖ్యలో భక్తులు హాజరవుతుంటారని అంచనా.

చిత్ర కృప : Santhosh Bettakadur Santhu

మహాబలేశ్వర్ దేవాలయం

మహాబలేశ్వర్ దేవాలయం

గోకర్ణ అతి ప్రధాన ఆకర్షణ మహాబలేశ్వర్ దేవాలయం. ఆలయం ద్రావిడ నిర్మాణ శైలిని పోలి ఉంటుంది. గుడిలోని శివలింగాన్ని దర్శించుకోవటానికి భక్తులు మొదట సమీపంలోని అరేబియా సముద్రంలో స్నానం చేసి .. ఆతరువాత గుడికి చేరుకుంటారు. ఏటా శివరాత్రి పర్వదినాన చుట్టుపక్కల ప్రాంతాల నుండి అధిక సంఖ్యలో భక్తులు వస్తుంటారు.

చిత్ర కృప : Nvvchar

తామ్ర గౌరీ దేవాలయం

తామ్ర గౌరీ దేవాలయం

ఈ దేవాలయాన్ని భక్తులు తప్పక సందర్శించాలి. పీఠం పై ఆరు అడుగుల ఎత్తుగల శివలింగం ఉంటుంది. నాలుగు దశాబ్దాల కొకసారి జరిగే కుంభాభిషేకం నాడు మాత్రమే భక్తులు దీనిని చూస్తారట.

చిత్ర కృప : Sri Mahabaleshwara Temple, Gokarna

మహా గణపతి దేవాలయం

మహా గణపతి దేవాలయం

మహాగణపతి దేవాలయం గోకర్ణ లో ప్రసిద్ధి చెందిన మరొక దేవాలయం. రావణుడిని మోసగించి ఆత్మలింగాన్ని కిందపెట్టిన వినాయకుడికి గుర్తుగా ఈ ఆలయాన్ని నిర్మించారు. మహాబలేశ్వర్ దేవాలయానికి సమీపంలోనే ఇది కలదు. ఈ దేవాలయంలోని 1. 3 మీటర్ల పొడవైన గణేశ విగ్రహం భక్తులను ఎంతో ఆకర్షిస్తుంది.

చిత్రకృప : manoj Sai

ఉమా మహేశ్వర దేవాలయం

ఉమా మహేశ్వర దేవాలయం

గోకర్ణ ను సందర్శించే ప్రతి యాత్రికుడు తప్పక మహా గణపతి దేవాలయం సమీపంలోని అద్భుత పవిత్రతలు గల ఉమా మహేశ్వర దేవాలయాన్ని దర్శించాలి.

Sbblr geervaanee

కోటితీర్థ

కోటితీర్థ

కోటితీర్థ ఒక పవిత్ర కొలను. ఇది మహాబలేశ్వర్ ఆలయానికి సమీపాన కలదు. విష్ణువు వాహనమైన గరుడునిచే ఈ కొలను సృష్టించబడింది. యాత్రికులు తరచూ కొలనులో స్నానం చేసి, దేవాలయంలో పూజలు చేస్తారు.

చిత్ర కృప : louise clements

గోకర్ణ బీచ్

గోకర్ణ బీచ్

గోకర్ణ బీచ్, పట్టణానికి సమీపంలో కలదు. బీచ్ కు ఒకవైపు అరేబియా సముద్రం, మరోవైపు పడమటి కనుమలు పర్యాటకులను ఆకట్టుకుంటాయి. స్థానిక హోటళ్లలో లభ్యమయ్యే రుచికరమైన ఆహారం, సన్ బాతింగ్, వాటర్ స్పోర్ట్స్ వంటివి ఆనందించవచ్చు.

చిత్ర కృప : Nimesh.singh90

ఓం బీచ్

ఓం బీచ్

ఈ బీచ్ వద్ద పర్యాటకులు ఎంతో ఉద్విగ్నం గా, ఆధ్యాత్మిక భావనతో ఉంటారు. ఇక్కడికి వచ్చే పర్యాటకులు స్కయింగ్, సర్ఫింగ్, బనానా బోట్ వంటి ప్రయాణాలను చేసి ఆనందిస్తారు. ఈ బీచ్ లో పర్యాటకులకు టీ, తిరుచిండ్లు లభిస్తాయి.

చిత్ర కృప : Nithesh Yashodhar Rai

అర్ధ చంద్రాకార బీచ్

అర్ధ చంద్రాకార బీచ్

దీనినే హాఫ్ మూన్ బీచ్ అని కూడా పిలుస్తారు. గోకర్ణ వచ్చే పర్యాటకులకు చాలా మందికి ఇది తెలీదు. ఓం బీచ్ నుండి బోట్ ద్వారా ఇక్కడకు చేరుకోవాలి. ఈ రెండు బీచ్ లను వేరు చేస్తూ మధ్యలో కొండ ఉంటుంది. ఈ కొండెక్కి అరేబియా అందాలను, చుట్టూరా పరిసలను, నీటి క్రీడలను, ఇండోర్ గేమ్స్ లను, ఇసుక తిన్నెల మీద సేదతీరుతూ ఆనందించవచ్చు.

చిత్రకృప : Abhijit Shylanath

కుడ్లే బీచ్

కుడ్లే బీచ్

ఈ బీచ్ కు చేరాలంటే పర్యాటకులు మహా గణపతి దేవాలయం నుండి ఆటో రిక్షా ఎక్కి చేరుకోవచ్చు. హోటళ్లు, చిన్న చిన్న గుడిసెలు స్థానిక ఆహారాన్ని రుచికరంగా వండి వడ్డిస్తారు.

చిత్రకృప : Happyshopper

పారడైజ్ బీచ్

పారడైజ్ బీచ్

పారడైజ్ బీచ్ ప్రశాంతంగా, నిశబ్ధంగా ఉంటుంది. ఇక్కడ సముద్రపు నీరు శుభ్రంగా ఉంటుంది కనుక పర్యాటకులు ఎక్కువ సమయం గడపవచ్చు. నీటి క్రీడలు ఆడటానికి అనువైనది మరియు మిగితా బీచ్ లతో పోలిస్తే సముద్రం లోతు కాస్త తక్కువ.

చిత్రకృప : kalibushido

మిర్జన్ ఫోర్ట్

మిర్జన్ ఫోర్ట్

మిర్జన్ ఫోర్ట్ ను పర్యాటకులు తప్పక సందర్శించాలి. ఈ ఫోర్ట్ గోకర్ణ - కుమటా రోడ్డు మార్గం లో కలదు. ఫోటోలు తీసుకోవటానికి అందమైన లొకేషన్లు / సైటీసీఇంగ్ స్థలాలు కలవు.

చిత్రకృప : Ramnath Bhat

శివ గుహ

శివ గుహ

గోకర్ణ లో శివ గుహ వీలుంటే చూసిరండి. ఇందులోకి వెళ్ళటడం ఒక సాహస యాత్ర వలే ఉంటుంది. ఇదొక చీకటి గుహ కనుక వెలుతురు కొరకై ఏదైనా వస్తువును వెంట తీసుకెళ్లండి.

చిత్ర కృప : Miran Rijavec

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X