Search
  • Follow NativePlanet
Share
» »కేరళ లోని గురువాయూర్ లో గల ప్రముఖ ప్రదేశాలు !!

కేరళ లోని గురువాయూర్ లో గల ప్రముఖ ప్రదేశాలు !!

By Mohammad

ఎంద గురువాయరప్ప ..! అని తమ్ముడు సినిమాలో అలీ ఏమీ తెలియని అమాయకుడిలా చెప్పే డైలాగ్ గుర్తుందా ..! ఆ గురువాయూర్ గురించే ఇప్పుడు మీకు చెప్పబోయేది. ఈ గురువయూర్ చాలా పురాతనమైనది. దీని గురించి పురాణాల్లో కూడా పేర్కొన్నారు. కలియుగం మొదట్లో ఇక్కడ బృహస్పతి శ్రీ కృష్ణుని విగ్రహాన్ని కనుగొన్నాడట. ఇంతకీ ఈ గురువాయూర్ ప్రదేశం ఎక్కడ ఉంది అనేగా మీ ప్రశ్న ?

ఇది కూడా చదవండి : త్రిస్సూర్ లోని పర్యాటక ఆకర్షణలు !

గురువాయూర్ దక్షిణ భారత దేశాన కేరళ రాష్ట్రంలో ఉన్నది. ఇది పర్యాటక ప్రదేశం మరియు ఆధ్యాత్మిక నగరం కూడా. ఇక్కడున్న గురువాయూరప్పన్ దేవాలయమే ఈ ప్రాంత ప్రధాన ఆకర్షణ. ఈ ప్రదేశాన్ని విష్ణుమూర్తి రెండవ అవతారమైన శ్రీ కృష్ణుని నివాసంగా భావిస్తారు. భారత దేశంలో గురువాయూరప్పన్ ఆలయం నాల్గవ పెద్ద దేవాలయం. ఇదే కాకుండా ఏనుగుల క్యాంప్ కూడా గురువాయూర్ ఆకర్షణలలో ఒకటిగా చెబుతారు. ఇక్కడ మీరు ఏనుగులకు స్నానం చేపించవచ్చు అలాగే ఏనుగు మీద ఎక్కి సఫారీ చేయవచ్చు. వీటితో పాటు ఇక్కడున్న మరిన్ని పర్యాటక ప్రదేశాలను ఒకసారి గమనిస్తే ..

గురువాయూరప్పన్ దేవాలయం, గురువాయూర్

గురువాయూరప్పన్ దేవాలయం, గురువాయూర్

గురువాయూరప్పన్ ఆలయం దేశంలో ప్రసిద్ధి చెందినది. ఈ గుడి ని కలియుగ వైకుంఠం గా భావిస్తుంటారు ఇక్కడికి వచ్చే భక్తులు. ఈ ఆలయంలో ప్రధాన దైవం బాల గోపాలన్ కృష్ణుడి శిశువు.

చిత్ర కృప : Ramesh NG

గురువాయూరప్పన్ దేవాలయం, గురువాయూర్

గురువాయూరప్పన్ దేవాలయం, గురువాయూర్

గురువాయూరప్పన్ ఆలయం లో ఉన్న ప్రధాన విగ్రహానికి నాలుగు చేతులలో శంఖం, సుదర్శన చక్రం, కౌముదకి మరియు పద్మం ఉంటాయి. దేవాలయం వివిధ రకాల కూడ్య చిత్రాలతో కృష్ణుని లీలలను చూపుతూ అందంగా అలంకరించబడి ఉంటుంది.

చిత్ర కృప : Sridhar

గురువాయూరప్పన్ దేవాలయం, గురువాయూర్

గురువాయూరప్పన్ దేవాలయం, గురువాయూర్

గురువాయూరప్పన్ దేవాలయం కర్నాటక సంగీతం మరియు అనేక సాంప్రదాయ నృత్య శిక్షణలను నేర్పిస్తున్నది. వీటిని నేర్చుకోవడానికి కేరళ రాష్ట్రం నలుమూల నుండి విద్యార్థులు వస్తుంటారు.

చిత్ర కృప : Pyngodan

గురువాయూరప్పన్ దేవాలయం, గురువాయూర్

గురువాయూరప్పన్ దేవాలయం, గురువాయూర్

గురువాయూరప్పన్ ఆలయానికి ప్రతి రోజు వేల సంఖ్యలో భక్తులు వస్తుంటారు. దేవస్థానం వారు భక్తులకు రోజుకు రెండు సార్లు ఉచిత భోజనం పెడతారు. ఈ ఆలయంలో వివాహాలు ఆట్టహాసంగా జరుగుతాయి. ఈ దేవాలయం లో ఏనుగులతో జరిగే శివేలీ ఉత్సవాన్ని తప్పక చూడాలి.

చిత్ర కృప : hariharan swastik

మమ్మియూర్ మహాదేవ ఆలయం, గురువాయూర్

మమ్మియూర్ మహాదేవ ఆలయం, గురువాయూర్

మమ్మియూర్ మహాదేవ ఆలయం గురువాయూరప్పన్ ఆలయానికి సమీపంలో ఉన్నది. పేరులో సూచించినట్టుగానే ఇది మహాదేవుని(శివుని) ఆలయం. ఈ గుడి అందమైన కూడ్య చిత్రాలచే అలంకరించబడి ఉంటుంది. విష్ణు మూర్తిని మోహినీ అవతారంలో చూపించిన చిత్రాన్ని కూడా చూడవచ్చు.

చిత్ర కృప : telugu native planet

మమ్మియూర్ మహాదేవ ఆలయం, గురువాయూర్

మమ్మియూర్ మహాదేవ ఆలయం, గురువాయూర్

మమ్మియూర్ మహాదేవ ఆలయం లోపలి భాగంలో, పార్వతి విగ్రహం కూడా కలదు. గణపతి, సుబ్రమణ్య, అయ్యప్ప, విష్ణు వులను కూడా ఈ దేవాలయంలో దర్శించవచ్చు.

చిత్ర కృప : wikicommons

మమ్మియూర్ మహాదేవ ఆలయం, గురువాయూర్

మమ్మియూర్ మహాదేవ ఆలయం, గురువాయూర్

మమ్మియూర్ మహాదేవ ఆలయాన్ని చూడకపోతే గురువాయూర్ పర్యటన పూర్తి కాదని చెబుతారు. కనుక ఈ దేవాలయాన్ని భక్తులు తప్పక సందర్శించుకుంటారు.

చిత్ర కృప : wikicommons

పార్థసారథి దేవాలయం, గురువాయూర్

పార్థసారథి దేవాలయం, గురువాయూర్

పార్థసారధి దేవాలయం గురువాయూర్ పట్టణంలో ప్రసిద్ధి చెందినది. ఈ దేవాలయంలోని విగ్రహం ఆదిశంకరాచార్యుల వారిచే ప్రతిష్టించబడింది. ప్రధాన దేవాలయం రధం ఆకారంలో వుంటుంది. దేవాలయ గోడలు కళాత్మక చెక్కడాలు కలిగి వుంటాయి.

చిత్ర కృప : RanjithSiji

చోవల్లూర్ శివాలయం, గురువాయూర్

చోవల్లూర్ శివాలయం, గురువాయూర్

చోవల్లూర్ శివాలయం, శివాలయాలలో ఒకటిగా చెపుతారు. శివాలయం అంటే శివ భగవానుడి నివాసం అని అర్ధం. ఈ దేవాలయంలో శివుడు ప్రధానంగా ఉన్నప్పటికి ప్రవేశంలో తిరుబంబాడి క్రిష్ణ విగ్రహం కూడా ఉంటుంది. ఇక్కడ శివరాత్రి పండుగ బాగా జరుగుతుంది.

చిత్ర కృప : wikicommons

చాముండేశ్వరి దేవాలయం, గురువాయూర్

చాముండేశ్వరి దేవాలయం, గురువాయూర్

చాముండేశ్వరి దేవాలయం గురువాయురప్పన్ దేవాలయానికి సమీపంలో వుంటుంది. ఈ దేవత దుర్గా దేవి అవతారం. చాముండేశ్వరి దేవాలయం చాలా పురాతనమైనది. ప్రతి సంవత్సరం వేలాది మంది భక్తులు దర్శించుకుంటారు. ధ్యానం చేసుకోవటానికి మరియు దైవ శక్తి పొందేందుకు ఈ దేవాలయం సరైనది.

చిత్ర కృప : HARI PISHARODI

వెంకటాచలపతి దేవాలయం, గురువాయూర్

వెంకటాచలపతి దేవాలయం, గురువాయూర్

వెంకటాచలపతి దేవాలయం, పార్ధసారధి దేవాలయం సమీపంలో కలదు. ఈ దేవాలయంలో విష్ణుమూర్తి అవతారం వెంకటాచలపతి దర్శనమిస్తాడు. దేవాలయ పరిసరాలు అందంగా, ప్రశాంతంగా ఉంటాయి. ప్రతి సంవత్సరం భక్తులు వేలాదిగా వచ్చి దర్శించుకుంటారు.

చిత్ర కృప : wikicommons

హరికన్యక దేవాలయం, గురువాయూర్

హరికన్యక దేవాలయం, గురువాయూర్

హరికన్యక దేవాలయం గురువాయూర్ కు సమీపంలో అరియనూర్ గ్రామంలో కలదు. హరికన్యక దేవాలయం విష్ణుమూర్తిది. హరికన్యక అంటే విష్ణువు కన్యగా ఉన్నప్పటి అవతారం. హరికన్యకాపురాన్ని గతంలో అరియన్నూర్ అనేవారు. మార్చి , ఏప్రిల్ నెలలో జరిగే 15 రోజుల ఉత్సవాలకు వేలాది పర్యాటకులు వస్తారు.

చిత్ర కృప : wikiommons

ఇన్స్టిట్యూట్ ఆఫ్ మ్యురాల్ పెయింటింగ్, గురువాయూర్

ఇన్స్టిట్యూట్ ఆఫ్ మ్యురాల్ పెయింటింగ్, గురువాయూర్

ఇన్స్టిట్యూట్ ఆఫ్ మ్యురాల్ పెయింటింగ్ ఒక అద్భుత ప్రదేశం. ఇది గురువాయుర్ దేవాలయ సమీపంలో కలదు. కుడ్య చిత్రాలలో ఈ సంస్థ శిక్షణను ఇస్తుంది. సంప్రదాయక విధానాలను గురుకులం పద్ధతిలో బోధిస్తుంది. కేరళ సంస్కృతికి సంబంధించి వివిధ సెమినార్లు, ప్రదర్శనలు, శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తుంది. ఆసక్తి ఉంటే మీరూ ప్రయత్నించండి.

చిత్ర కృప : wikicommons

పాలయూర్ చర్చి, గురువాయూర్

పాలయూర్ చర్చి, గురువాయూర్

పాలయూర్ చర్చి ఆకర్షణీయంగా వుంటుంది. చర్చి లో శిల్ప శైలి సుమారు పద్నాలుగు గ్రానైట్ విగ్రహాలు కలిగి, సెయింట్ థామస్ జీవితాన్ని వివిధ దశలలో చూపుతుంది. పాలయూర్ మహాతీర్ధ పండుగ వేడుకలలో దేశంలోని వివిధ భాగాలనుండి చెక్క శిలువలు మోసుకుంటూ క్రీస్తు భక్తులు ఇక్కడకు వస్తారు.

చిత్ర కృప : www.keralapilgrim centers.com

ఏనుగుల శిబిరం, గురువాయూర్

ఏనుగుల శిబిరం, గురువాయూర్

ఏనుగుల శిబిరం గురువాయురప్పన్ దేవాలయానికి సుమారు ౩ కి.మీ. దూరంలో పున్నుతుర్ కొట్ట లో కలదు. ఈ ఏనుగుల శిబిరం ఇండియాలోనే అతి పెద్దది.

చిత్ర కృప : Renjith Menon

ఏనుగుల శిబిరం, గురువాయూర్

ఏనుగుల శిబిరం, గురువాయూర్

ఏనుగుల శిబిరం సుమారు పది ఎకరాలలో విస్తరించి ఉంటుంది. సుమారు 60 ఏనుగులకు ఈ శిబిరం ఆశ్రయం ఇస్తోంది. ఇవి అధిక సంఖ్యలో జనాలను ఆకర్షిస్తాయి. దేవాలయ పండుగలలో మరియు ఊరేగింపులలో దేవతలను మోస్తాయి.

చిత్ర కృప : telugu native planet

ఏనుగుల శిబిరం, గురువాయూర్

ఏనుగుల శిబిరం, గురువాయూర్

ఏనుగుల శిబిరం లోని ఏనుగులు దేవాలయం నిర్వహించే పందేలలో పాల్గొంటాయి. రేసులో గెలిచిన ఏనుగును గురువాయురప్పన్ విగ్రహాన్ని మోయటానికి వినియోగిస్తారు.

చిత్ర కృప : telugu native planet

దేవస్వోం మ్యూజియం, గురువాయూర్

దేవస్వోం మ్యూజియం, గురువాయూర్

దేవస్వోం మ్యూజియం గురువాయురప్పన్ దేవాలయానికి తూర్పు గేటు లో కలదు. దీనిలో అనేక పురాతన సంగీత సాధనాలు, ప్రాచీన వస్తువులు , కుడ్య చిత్రాలు, పండుగలలో ఏనుగులకు అలంకరించే ఆభరణాలు మొదలైనవి వుంటాయి.

చిత్ర కృప : guruvayurdevaswom.nic.in

దేవస్వోం మ్యూజియం, గురువాయూర్

దేవస్వోం మ్యూజియం, గురువాయూర్

దేవస్వోం మ్యూజియం లో ప్రసిద్ధి చెందిన కవులైన పూన్తనం మరియు మేలప్తూర్ ల చిత్రాలు కూడా కలవు. కధకళి కృష్ణ నాట్యం లలో ఉపయోగించే ఆభరాణాలు కూడ కలవు. ఈ ప్రదేశం కేరళ సంస్కృతిని వెల్లడిస్తుంది.

చిత్ర కృప : guruvayurdevaswom.nic.in

షాపింగ్, గురువాయూర్

షాపింగ్, గురువాయూర్

గురువాయూరప్ప దేవాలయం బయట అనేక దుకాణాలు కలవు. ఈ దుకాణాలు సాధారణంగా సాంప్రదాయ పూజా వస్తువులు దీపాలు, కొబ్బరికాయలు, పూలు వంటివి అమ్ముతాయి. కొన్ని బొమ్మలు, ఎలక్ట్రానిక్ వస్తువులు, డ్రస్ లు ఫొటోగ్రాఫులు, తినుబండారాలు కూడా కొనుగోలు చేయవచ్చు. కొన్ని షాపులలో చేతి కళల వస్తువులు, కేరళ నగలు, కుడ్య చిత్రాలు దొరుకుతాయి.

చిత్ర కృప : Navaneeth Ashok

గురువాయూర్ ఎలా చేరుకోవాలి ??

గురువాయూర్ ఎలా చేరుకోవాలి ??

విమాన మార్గం

కొచ్చిన్ లో కల నెడుంబస్సెరీ అంతర్జాతీయ విమానాశ్రయం గురువాయూర్ కు 87 కి.మీ.ల దూరం లో ఉన్న సమీప విమానాశ్రయం. కాలికట్ అంతర్జాతీయ విమానాశ్రయం ఈ పవిత్ర పట్టణానికి సుమారు 100 కి.మీ.ల దూరంలో ఉన్న మరొక ఏర్‌పోర్ట్. టాక్సీలు, బస్ లు విమానాశ్రయం నుండి గురువాయూర్ కు తేలికా లభ్యమవుతాయి.

రైలు మార్గం

గురువాయూర్ లో రైల్వే స్టేషన్ కలదు. ఇక్కడి నుండి ఇరుగు పొరుగు పట్టణాలకు, నగరాలకు రైళ్ళు వెళుతుంటాయి. సమీప రైలు జంక్షన్ త్రిస్సూర్. ఇది 27 కి.మీ.ల దూరం. ఇక్కడి నుండి దేశంలోని ప్రధాన నగరాలకు రైళ్ళు కలవు.

రోడ్డు మార్గం

గురువాయూర్ పట్టణానికి కేరళలోని అన్ని ప్రదేశాల నుండి ప్రభుత్వ బస్ లు కలవు. ఇండియాలోని ఇతర నగరాల నుండి అంటే కొచ్చిన్, కాలికట్, పాల్ఘాట్, త్రివేండ్రం, చెన్నై, బెంగుళూర్, కోయంబత్తూర్, సేలం ల నుండి నేరు బస్ లు కూడా ఉన్నాయి.

చిత్ర కృప : Vinayaraj

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X