Search
  • Follow NativePlanet
Share
» »హేమిస్ - దక్షిణ ఆసియా అతిపెద్ద నేషనల్ పార్క్ !

హేమిస్ - దక్షిణ ఆసియా అతిపెద్ద నేషనల్ పార్క్ !

By Mohammad

ప్రకృతి ఒడిలో సేదతీరాలనుకోనేవారికి ఎంతో అనువైనది ... హేమిస్. ఈ గ్రామం జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలోని లెహ్ నుండి 40 కి.మీ. ల దూరంలో కలదు. మీకు తెలిసే ఉంటుంది గ్రామం అంటే ఏంటో. చూడవలసిన ప్రదేశాలు తక్కువే, అయినప్పటికీ ప్రకృతి పర్యాటకులను అలరిస్తుంది. ఈ గ్రామం మొత్తం మీద చూడవలసిన పర్యాటక స్థలాలు రెండు. అందులో ఒకటి హేమిస్ మొనాస్టరీ, మరొకటి నేషనల్ పార్క్.

ఇది కూడా చదవండి : అందాల జమ్మూ కాశ్మీర్ పర్యటన !

హేమిస్ మొనాస్టరీ

హేమిస్ ఆశ్రమం లేదా గొంప గా ప్రాచూర్యం చెందిన హేమిస్ మొనాస్టరీ టిబెట్ నిర్మాణ శైలిలో నిర్మించబడింది. ఇందులో బౌద్ధ మత సంస్కృతి, అలాగే వారి జీవన విధానాలు తారసపడతాయి. ఈ ఆశ్రమంలో ప్రధాన ఆకర్షణ బుద్ధుని తామ్ర విగ్రహం.

క్రీ.శ. 1630 లో సత్సంగ్ రస్ప నవంగ్ గ్యాట్సో మొదటి అవతరముచే ఈ ఆశ్రమం నిర్మించబడింది. మరళా క్రీ.శ. 1672 వ సంవత్సరంలో మహాయోగ తంత్ర పాఠశాల ఆధ్యాత్మిక బోధనలు ప్రచారం చేసేందుకు రాజా సెంగె నంపర్ చే పునఃస్థాపించబడినది.

హేమిస్ మొనాస్టరీ ప్రాంగణం

హేమిస్ మొనాస్టరీ ప్రాంగణం

చిత్ర కృప : Michael Douglas Bramwell

దుఖంగ్, త్షోంగ్ఖాంగ్ అనే ప్రధాన విభాగాలు మొనాస్టరీ లోపల ఉన్నాయి. జూన్ - జూలై మధ్యలో ఈ ప్రాంతాన్ని సందర్శించడానికి అధిక సంఖ్యలో పర్యాటకులు విచ్చేస్తారు.సింహఘర్జన గురువు గా పేరొందిన గురు పద్మసంభవ గౌరవార్ధం వేల మంది ప్రజలు జూన్ / జూలైలలో హేమిస్ లో వార్షిక ఉత్సవం నిర్వహిస్తారు.

నేషనల్ పార్క్

హేమిస్ నేషనల్ పార్క్ ను 'హై అల్టిట్యూడ్ నేషనల్ పార్క్' అని కూడా పిలుస్తారు. ఇది సింధూ నది తీరాన, సముద్ర మట్టానికి 3000 నుండి 6000 మీటర్ల ఎత్తున ఉంటుంది. అరుదైన జంతు జాలాలకు, వృక్ష జాలాలకు స్థావరమైన ఈ నేషనల్ పార్క్ దక్షిణ ఆసియాలోనే అతి పెద్ద నేషనల్ పార్క్.

హేమిస్ నేషనల్ పార్క్ లోని మంచు చిరుతపులి

హేమిస్ నేషనల్ పార్క్ లోని మంచు చిరుతపులి

చిత్ర కృప : Fanus Weldhagen

మర్మట్స్, లంగుర్స్, రెడ్ ఫాక్స్, డీర్, స్నో లెపర్డ్, ఇంకా అంతరించిపోతున్న అరుదైన జంతు జాతులు ఇక్కడ గమనించవచ్చు. 70 రకాల పక్షులు, 16 రకాల క్షీరదాలు, రాబందులు మరియు వృక్ష జాలాలు ఇక్కడ ఉన్నాయి. ఈ నేషనల్ పార్క్ సంవత్సరం పొడవునా తెరిచే ఉంటుంది. అయినా ఎప్పుడు పడితే అప్పుడు పోలేం కదా .. ! మే - అక్టోబర్ ఈ ప్రాంతాన్ని సందర్శించేందుకు అనువైన సమయం.

హేమిస్ ఎలా చేరుకోవాలి ?

వాయు మార్గం

హేమిస్ కు సమీపాన 40 కి.మి ల దూరంలో లెహ్ విమానాశ్రయం కలదు. ఢిల్లీ, శ్రీనగర్, పూణే వంటి నగరాల నుండి ఈ ఎయిర్ పోర్ట్ అనుసంధానించబడింది. ఎయిర్ పోర్ట్ నుండి క్యాబ్ లేదా టాక్సీ లను అద్దెకు తీసుకొని లేదా బస్సులో ప్రయాణించి హేమిస్ చేరుకోవచ్చు.

రైలు మార్గం

హేమిస్ లో రైల్వే స్టేషన్ లేదు. కానీ 743 కి.మీ ల దూరంలో జమ్మూ తావీ రైల్వే స్టేషన్ కలదు. ఢిల్లీ, పూణే, చెన్నై, హైదరాబాద్, బెంగళూరు, కన్యాకుమారి, కలకత్తా, ముంబై వంటి నగరాలతో ఈ స్టేషన్ చక్కగా కనెక్ట్ చేయబడింది. స్టేషన్ బయట హేమిస్ చేరుకొనేందుకు బస్సులు అందుబాటులో ఉంటాయి.

బస్సు మార్గం

లెహ్ నుండి హేమిస్ చేరుకోవటానికి గంట సమయం (40 కి.మీ) పడుతుంది. లోకల్ గా ప్రభుత్వ/ ప్రవేట్ బస్సులు లభిస్తాయి. టికెట్ ధర రూ .30 నుండి రూ.60 వరకు ఉండవచ్చు.

హేమిస్ గొంప వెళ్ళే రోడ్డు మార్గం

హేమిస్ గొంప వెళ్ళే రోడ్డు మార్గం

చిత్ర కృప : Sankara Subramanian

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X