Search
  • Follow NativePlanet
Share
» »ఇటానగర్ భారతదేశం యొక్క అతిపెద్ద ఈశాన్య రాష్ట్ర రాజధాని !

ఇటానగర్ భారతదేశం యొక్క అతిపెద్ద ఈశాన్య రాష్ట్ర రాజధాని !

By Mohammad

ఇటానగర్ భారతదేశం యొక్క అతిపెద్ద ఈశాన్య రాష్ట్ర రాజధాని మరియు అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్ర రాజధాని. ఇటానగర్ ను 'మినీ భారతదేశం' అని పిలుస్తారు. ఇక్కడ దేశంలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చి స్థిరపడిన భిన్న జాతుల ప్రజలు నివసిస్తుంటారు. అందమైన హిమాలయాల కొండ శిఖరాల దిగువన ఉన్న ఈ నగరం చరిత్ర పరంగా, సంస్కృతి - సంప్రదాయాల పరంగా ఎంతో ఖ్యాతి గడించింది.

ఇటానగర్ చుట్టుప్రక్కల గల పర్యాటక ప్రదేశాలు

క్రీ.శ. 14 -15 వ శతాబ్దంలో జితరి రాజవంశ రాజులలో ఒకడైన రామచంద్ర రాజు మొదట ఈ ప్రదేశాన్ని గుర్తించాడు. ఆ తరువాత ఎన్నో రాజవంశాలు ఈ ప్రదేశాన్ని పరిపాలించాయి. ఇక్కడి చారిత్రక నేపథ్యానికి గుర్తుగా ఒక కోట కూడా ఉన్నది. ఇదే ఇటానగర్ యొక్క ప్రధాన ఆకర్షణ. అలాగే గంగా సరస్సు, జవహర్ లాల్ మ్యూజియం, రాజ్‌భవన్ మరియు పార్కులు మొదలగునవి ఇతర ఆకర్షణలు గా ఉన్నాయి.

ఇటా ఫోర్ట్ లేదా ఇటానగర్ కోట

ఇటా ఫోర్ట్ లేదా ఇటానగర్ కోట

ఇటా ఫోర్ట్ పేరు మీదనే ఈ నగరానికి ఇటానగర్ అన్న పేరొచ్చింది. ఇటానగర్ పురావస్తు తవ్వకాలకు సంభంధించిన ప్రాంతంగా ప్రసిద్ధికెక్కింది. ఈ కోట నగరం నడిబొడ్డున ఉండటం వలన చేరుకోవటం చాలా సులభం. ఆటో రిక్షాలు, షేర్ ఆటోలు లేదా సిటీ బస్సుల్లో ప్రయాణించి కోట వద్ద కు చేరుకోవచ్చు.

చిత్ర కృప : AshLin

ఇటా ఫోర్ట్ లేదా ఇటానగర్ కోట

ఇటా ఫోర్ట్ లేదా ఇటానగర్ కోట

ఇటా కోట క్రీ.శ.14 -15 వ శతాబ్దం నాటిది. దీనిని జితరి రాజవంశీయుడైన రామచంద్ర రాజు నిర్మించినాడు. సుమారు 80 లక్షల ఇటుకలను ఉపయోగించి ఈ కోట నిర్మాణాన్ని చేపట్టారు. ఇటుకలను అహోం భాషలో 'ఇటా' అని పిలుస్తారు అందుకే ఈ కోట కు ఆ పేరొచ్చింది.

చిత్ర కృప : AshLin

ఇటా ఫోర్ట్ లేదా ఇటానగర్ కోట

ఇటా ఫోర్ట్ లేదా ఇటానగర్ కోట

ఇటాకోట కు మూడువైపులా (పశ్చిమం, తూర్పు, దక్షిణం) మూడు ద్వారాలు ఉన్నాయి. వీటి ద్వారా కోటలోనికి సులభంగా ప్రవేశించవచ్చు. కోట ద్వారాలు పెద్దగా ఉండి శత్రువులు దాడి చేయలేని విధంగా ఉంటాయి. ఈ కోట ఇప్పటికీ రాజఠీవీని ఒలకబోస్తున్నది.

చిత్ర కృప : AshLin

ఇటానగర్ వన్య ప్రాణుల అభయారణ్యం

ఇటానగర్ వన్య ప్రాణుల అభయారణ్యం

ఇటానగర్ వన్య ప్రాణుల అభయారణ్యం 140.30 చ. కి. మీ. విస్తీర్ణంలో కలదు. ఈ అభయారణ్యానికి పశ్చిమాన పచిన్ నది, ఈశాన్యంలో నెఒరొచి, తూర్పున పామ్ నది, ఉత్తరమున చిన్గ్కే ప్రవాహం లు సరిహద్దులుగా ఉన్నాయి. వివిధ రకాల పక్షులు, ఆర్చిడ్ జాతులు, జంతు జాలం లను ఇక్కడ గుర్తించవచ్చు.

చిత్ర కృప : GK Dutta

ఇటానగర్ వన్య ప్రాణుల అభయారణ్యం

ఇటానగర్ వన్య ప్రాణుల అభయారణ్యం

ఈ దట్టమైన ఇటానగర్ వన్య ప్రాణుల అభయారణ్యంలో చూడదగినవి : జింక, బీర్, టైగర్పాం, థర్స్ బార్కింగ్, సాంబార్ గృహాలు, ఏనుగులు వంటి తదితర జంతువులు మరియు వివిధ జాతుల పక్షులు.

చిత్ర కృప : GK Dutta

గంగా సరస్సు

గంగా సరస్సు

గంగా సరస్సు ఇటానగర్ కు 6 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. స్థానికులు దీనిని గేకర్ సిన్యి లేదా గేకర్ సెన్యిక్ అని పిలుస్తారు. ఈ సరస్సు చుట్టూ పొడవైన చెట్లు, ఆర్కిడ్లు, ఆదిమ జాతి వృక్షాలు ఉండి ప్రశాంత వాతావారణాన్ని తలపిస్తుంది.

చిత్ర కృప : GK Dutta

గంగా సరస్సు

గంగా సరస్సు

గంగా సరస్సు స్థానికులకు ఒక విహార కేంద్రంగా ఉన్నది. బోటింగ్, స్విమ్మింగ్ వంటి క్రీడలను ఆడవచ్చు. సరస్సు ఒడ్డున చుట్టూ ఉన్న అడవి చెట్ల మధ్యన విహరిస్తూ ఆనందాన్ని పొందవచ్చు. హిమాలయాల దిగువన ఉన్న ఈ సరస్సు అడవి చెట్లతో, మొక్కలతో కప్పబడి ఉన్నందున వెచ్చగా ఉంటుంది.

చిత్ర కృప : Rudrajit Mukhopadhyay

జవహర్ లాల్ నెహ్రూ మ్యూజియం

జవహర్ లాల్ నెహ్రూ మ్యూజియం

ఇటానగర్ లోని జవహర్ లాల్ నెహ్రూ మ్యూజియం ప్రపంచ వ్యాప్తంగా చరిత్ర, వైజ్ఞానిక, సంస్కృతి మరియు సంప్రదాయం లకు సంభంధించిన వస్తువులను పరిరక్షిస్తున్నది. మ్యూజియంలో దుస్తులు, ఆయుధాలు, ఆభరణాల, తలపాగాలు, సంగీత పరికరాలు, హస్తకళ మరియు పురావస్తు త్రవ్వకాల సంబంధితాల కళాఖండాలు ప్రదర్శించబడుతుంటాయి.

చిత్ర కృప : AshLin

ఇందిరాగాంధీ పార్క్

ఇందిరాగాంధీ పార్క్

ఇటానగర్ లోని పార్క్ లలో ఇందిరాగాంధీ పార్క్ ఒకటి. హిమాలయాల కొండ దిగువన ఉన్న ఈ పార్క్ చల్లగా, ఆహ్లాదకరమైన వాతావరణంతో ఉల్లాసభరితంగా ఉంటుంది. పర్యాటకులు సాధారణంగా సాయంత్రంవేళ పార్క్‌లో కూర్చొని పక్షులను తిలకించటం, కెమరా ఉంటే ఫోటో లు తీయటం వంటివి చేస్తుంటారు.

చిత్ర కృప : Abhijit Borah

ఇటానగర్ ఎలా చేరుకోవాలి ??

ఇటానగర్ ఎలా చేరుకోవాలి ??

ఇటానగర్ చేరుకోవటానికి రోడ్డు, రైలు మరియు విమాన మార్గాలు అందుబాటులో ఉన్నాయి.

వాయు మార్గం

ఇటానగర్ కు అస్సాం లోని తేజ్‌పూర్ మరియు లిలబరి సమీప విమానాశ్రయాలు గా ఉన్నాయి. లిలబరి ఇటానగర్ నుండి 71 కిలోమీటర్ల దూరంలో కలదు. గౌహతి నుండి నహర్లగు వరకు రెగ్యులర్ గా హెలికాప్టర్ సేవలు అందుబాటులో ఉంటాయి. నహర్లగున్ నుండి బస్సుల్లో లేదా ప్రవేట్ వాహనాల్లో 10 కిలోమీటర్లు ప్రయాణించి ఇటానగర్ చేరుకోవచ్చు.

రైలు మార్గం

ఇటానగర్ లో ఎటువంటి రైల్వే స్టేషన్ లేదు. దీనికి సమీపాన ఉన్న రైల్వే స్టేషన్ హర్ముతి రైల్వే స్టేషన్. ఇది సుమారు 32 కిలోమీటర్ల దూరంలో కలదు. ట్యాక్సీ లేదా ప్రభుత్వ బస్సుల్లో ప్రయాణించి ఇటానగర్ కు చేరుకోవచ్చు.

రోడ్డు మార్గం

ఇటానగర్ 52 ఏ జాతీయ రహదారి ద్వారా చక్కగా అనుసంధానించబడుంది. గౌహతి నుండి నహర్లగున్ వరకు ఉన్న బస్సు సౌకర్యం ద్వారా ఇటానగర్ కు సులభంగా చేరుకోవచ్చు. బందేరదేవ, ఉత్తర లఖింపూర్, తేజ్పూర్ మరియు అస్సాం లోని ఇతర ప్రదేశాల నుండి ఇటానగర్ కు బస్సులు రాకపోకలు సాగిస్తుంటాయి.

చిత్ర కృప : Omar Ahsan

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X