Search
  • Follow NativePlanet
Share
» »జగేశ్వర్ ప్రసిద్ధ జ్యోతిర్లింగ క్షేత్రం !

జగేశ్వర్ ప్రసిద్ధ జ్యోతిర్లింగ క్షేత్రం !

By Mohammad

భారతదేశంలో శివాలయాలకు కొదువ లేదు. కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, అరుణాచల్ ప్రదేశ్ నుండి గుజరాత్ వరకు లెక్కకు మించి శివుని ఆలయాలు కనిపిస్తాయి. అందులో ముఖ్యంగా చెప్పుకోవలసినవి 12 జ్యోతిర్లింగ క్షేత్రాలు. ఇది వరకే మనము ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాల గురించి తెలుసుకున్నాం ...!

12 జ్యోతిర్లింగ క్షేత్రాల గురించిన సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి12 జ్యోతిర్లింగ క్షేత్రాల గురించిన సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇక్కడ మీకు చెప్పబోతున్న క్షేత్రం జగేశ్వర్. జగేశ్వర్ ప్రసిద్ధ జ్యోతిర్లింగ క్షేత్రం గా ప్రసిద్ధి చెందినది. ఇది సముద్రమట్టానికి 1870 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని అల్మోరా జిల్లాలో నెలకొని ఉన్న ఈ ప్రసిద్ధ మత పట్టణం చరిత్ర ప్రకారం, ఒకప్పుడు లకులిష్ శైవత్వాన్ని కేంద్రంగా సేవలు అందించింది. జగేశ్వర్ క్షేత్రం జతగంగా నది ఒడ్డున లోయలో ఉంది. ఆ లోయ ప్రాంతం అంతా విస్తారమైన పచ్చిక బయళ్లు, దేవదారు చెట్ల తో నిండి ఉండి మనసుకి ప్రశాంతతను, ఆధ్యాత్మిక భావాలను చేకూరుస్తుంది.

జగేశ్వర్ సందర్శనీయ స్థలాలు

జగేశ్వర్ క్షేత్రం, దేశంలోని 12 జ్యోతిర్లింగాలలో ఎనిమిదవది గా ప్రసిద్ధికెక్కింది. ఇక్కడి ప్రధాన ఆలయాన్ని(జగేశ్వర్ మహదేవ్ ఆలయం) 'నగేష్ జ్యోతిర్లింగ' అని పిలుస్తారు. ఈ ప్రదేశం చుట్టూ హిందూ దేవుడైన శివుడికి అంకితం చేయబడిన 124 ఆలయాలు ఉన్నాయి. దందేశ్వర్ ఆలయం, చండికా ఆలయం, మహామృత్యుంజయ ఆలయం, కుబెర్ ఆలయం, నవ-గ్రహ ఆలయం, మరియు నందా దేవి ఆలయం ఇక్కడ ప్రముఖ దేవాలయాలుగా ఉన్నాయి. ఈ ప్రదేశంలో చూడవలసిన ఇతర పర్యాటక స్థలాల విషయానికి వస్తే ..

దందేశ్వర ఆలయం ,జగేశ్వర్

దందేశ్వర ఆలయం ,జగేశ్వర్

దందేశ్వర్ ఆలయం, జగేశ్వర్ క్షేత్రంలో అతి పెద్ద ఆలయం. ఈ ఆలయంలోని శివలింగం అక్కడి మిగితా ఆలయాలన్నింటిలో కెల్లా భిన్నంగా సహజ రాయితో ఉంటుంది. ఆలయ గేట్ వద్ద భారీ ఇనుప గంట కట్టబడి, లోపల అందమైన పురాతన చిత్రాలతో అలంకరించబడి ఉంటుంది. అంతేకాకుండా, క్రీ.శ. 18 వ శతాబ్దంలో బయటపడ్డ డ్యాన్సింగ్ శివ విగ్రహం కూడా ఆలయ సముదాయంలో ఉంది.

చిత్ర కృప : Varun Shiv Kapur

మహా మృత్యుంజయ మహదేవ్ ఆలయం, జగేశ్వర్

మహా మృత్యుంజయ మహదేవ్ ఆలయం, జగేశ్వర్

మహా మృత్యుంజయ మహదేవ్ ఆలయం జగేశ్వర్ ఆలయం యొక్క సముదాయంలో గల పురాతమైన ఆలయం. ఈ ఆలయంలో శివుడు తూర్పు ముఖంగా తిరిగి ఉంటాడు. ఇక్కడి శివలింగం కన్ను ఆకారంలో తెరిచి ఉంటుంది. 'మరణాన్ని' పాలద్రోలే శివలింగం గా ప్రసిద్ధి చెందినది. చాలా శక్తివంతమైన మహా మృత్యుంజయ మంత్ర పారాయణం చేయటం వల్ల దుష్ట ప్రభావాలు తొలిగిపోతాయని భక్తుల నమ్మకం.

చిత్ర కృప : Gautam Dhar

పుష్టి దేవి ఆలయం , జగేశ్వర్

పుష్టి దేవి ఆలయం , జగేశ్వర్

పుష్టి ఆలయం, జగేశ్వర్ లో ఉన్న ముఖ్య మత ప్రదేశాలలో ఒకటి. ఇక్కడున్న విగ్రహానికి ప్రతి సంవత్సరం పూజా కార్యక్రమాలు, అభిషేకాలు, మంగళ హారతులు జరుగుతుంటాయి. పెద్ద సంఖ్యలో భక్తులు ఇక్కడ ప్రార్థనలు నిర్వహించడం కోసం వస్తుంటారు.

చిత్ర కృప : Graham Smart

బడ్ జగేశ్వర్ ఆలయం, జగేశ్వర్

బడ్ జగేశ్వర్ ఆలయం, జగేశ్వర్

ట్రెక్కింగ్ ద్వారా ఆలయాన్ని సందర్శించాలనుకొనే వారు బడ్ జగేశ్వర్ లేదా బ్రిద్ధ జగేశ్వర్ ఆలయాన్ని సందర్శించవచ్చు. ఇది జగేశ్వర్ క్షేత్రానికి 3 కి. మీ. దూరంలో ఒక కొండ మీద నెలకొని ఉంది. ట్రెక్కింగ్ ద్వారా మాత్రమే చేరుకొనే విధంగా ఉండే ఈ ఆలయానికి ఆసక్తి గల యాత్రికులు వెళ్ళటం సూచించదగినది.

చిత్ర కృప : jayant0v

జగేశ్వర్ మహదేవ్ ఆలయం, జగేశ్వర్

జగేశ్వర్ మహదేవ్ ఆలయం, జగేశ్వర్

జగేశ్వర్ మహదేవ్ ఆలయం జగేశ్వర్ లోని ప్రధాన దేవాలయం మరియు దేశంలోని ప్రఖ్యాత దేవాలయం. ఈ ఆలయాన్ని తరుణ్ జగేశ్వర్ అని కూడా పిలుస్తారు. ఇక్కడి శివున్ని బాల జగేశ్వర్ గా పూజిస్తారు. ఆలయం లోని శివ లింగం రెండు భాగాలుగా విభజించబడి ఉంటుంది. మొదటి సగం శివున్ని మరో సగం పార్వతి దేవి ని సూచిస్తుంది.

చిత్ర కృప : telugu native planet

ఝాన్కేర్ సైమ్ ఆలయం, జగేశ్వర్

ఝాన్కేర్ సైమ్ ఆలయం, జగేశ్వర్

ఝాన్కేర్ సైమ్ మహదేవ్ ఆలయం జగేశ్వర్ లో ఉన్న ఒక ప్రసిద్ధ మత కేంద్రం. ఇక్కడి వారి నమ్మకం ప్రకారం, హిందూ మత దేవుడైన శివుడు ఈ ప్రదేశంలో ధ్యానం చేసుకొంటుంటే కొంతమంది రాక్షసులు ఆయనను ఇబ్బంది పెట్టేవారట. ఆ సమయంలో, హిందూ దేవుడు ఝాన్కేర్ సైమ్ తన తినేత్ర రూపంలో వచ్చి రాక్షసులను హతమార్చాడని చెబుతారు.

చిత్ర కృప : Robyn

వినాయక్ క్షేత్ర, జగేశ్వర్

వినాయక్ క్షేత్ర, జగేశ్వర్

వినాయక్ క్షేత్ర, జగేశ్వర్ పరిధిలోని అర్టోల గ్రామం నుండి సుమారు 200 మీటర్ల దూరంలో ఉంది. ఈ ప్రదేశం ఝాన్కేర్ సైమ్ ఆలయం సమీపంలో ఉంటుంది.

చిత్ర కృప : Varun Shiv Kapur

పండుగలు, జగేశ్వర్

పండుగలు, జగేశ్వర్

జగేశ్వర్ లో బాగా ప్రసిద్ధి పొందిన, ఆకర్షణగా నిలిచిన ఉత్సవం జగేశ్వర్ మాన్సూన్ ఫెస్టివల్. ప్రతి సంవత్సరం జూలై 15 నుండి ఆగస్టు 15 వరకు జరిగే ఈ వేడుకలు శివుని గౌరవార్థం జరుపుతారు. ఈ వేడుకలను తిలకించడానికి చుట్టుప్రక్కల ప్రాంతాల నుండి, దేశం లోని వివిధ ప్రాంతాల నుండి శివ భక్తులు వస్తుంటారు.

చిత్ర కృప : Himanshu Dutt

జగేశ్వర్ చేరుకోవడం ఎలా

జగేశ్వర్ చేరుకోవడం ఎలా

వాయు మార్గం

జగేశ్వర్ కి సమీప ఏర్ పోర్ట్ ప్యాంట్ నగర్ ఏర్ పోర్ట్( 150 కి. మీ.). ఈ విమానాశ్రయం దేశంలోని అన్ని ప్రధాన విమానాశ్రయలకు ముఖ్యంగా ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంతో బాగా అనుసంధానించబడింది. ప్యాంట్ నగర్ ఏర్ పోర్ట్ నుండి క్యాబ్ లేదా ట్యాక్సీ ద్వారా జగేశ్వర్ చేరుకోవచ్చు.

రైలు మార్గం

కత్గోడం రైల్వే స్టేషన్(125 కి.మీ.) జగేశ్వర్ సమీపంలోని రైల్వే స్టేషన్. ఈ రైల్వే స్టేషన్ కూడా సాధారణ రైళ్లు లక్నో, ఢిల్లీ, మరియు కోలకతా వంటి భారతీయ గమ్యస్థానాలకు అనుసంధానించబడింది. టాక్సీలు రైల్వే స్టేషన్ నుండి జగేశ్వర్ కు అందుబాటులో ఉంటాయి.

రోడ్డు మార్గం

జగేశ్వర్ కు సాధారణ బస్సు సేవలు సమీపంలోని స్థలాల నుండి అనుసంధానించబడింది. ప్రభుత్వ యాజమాన్యంలోని బస్సులు జగేశ్వర్ కు అల్మోర , పితోరగర్, మరియు హాల్డ్వాని వంటి గమ్యం నుండి అందుబాటులో ఉన్నాయి.

చిత్ర కృప : Rajeev Tivari

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X