Search
  • Follow NativePlanet
Share
» »కైలాషహర్ - శివుని మరో నివాసం !

కైలాషహర్ - శివుని మరో నివాసం !

By Mohammad

కైలాషహర్ ... త్రిపుర రాష్ట్రానికి ఉత్తరాన ఉన్న ఒక చారిత్రక నగరం. పూర్వం ఈ నగరం త్రిపురి రాజ్యానికి రాజధానిగా ఉండేది. ప్రస్తుతం ఒక జిల్లా ప్రధాన కేంద్రంగా ఉన్నది. ఈ నగరం పక్క దేశమైన బంగ్లాదేశ్ తో సరిహద్దు పంచుకుంటున్నది. కైలషహర్ అనే పేరును 'హర' (శివ మరొక పేరు) మరియు మౌంట్ కైలాష్ (శివ హోమ్) నుండి వచ్చిందని చెబుతుంటారు స్థానికులు. ప్రసిద్ధి చెందిన త్రిపుర రాజు ఆది-ధర్మఫా ఇక్కడ 7 వ శతాబ్దంలో గొప్ప యజ్ఞాలను జరిపించేవాడట ..!

కైలాషహర్ - శివుని మరో నివాసం !

కైలాషహర్ లోని ఒక దృశ్యం

చిత్ర కృప : Dhrubajyoti Debnath

కైలాషహర్ దేవాలయాలకు, పచ్చని తేయాకు తోటలకు ప్రసిద్ధి చెందిందనటంలో ఏమాత్రం సందేశం లేదు. ఎందుకంటే అక్కడ ఆలయాలు అలాగే ఉంటాయి, నాలుగు వైపులా తేయాకు తోటలు అలాగే కానవస్తుంటాయి. ఇక్కడ గల సందర్శనీయ ప్రదేశాలను ఒకసారి గమనిస్తే ..

లాఖీ నారాయణ్ బారి

భారతదేశంలో లాఖీ నారాయణ్ బారి ఆలయాన్ని పురాతన స్మారక చిహ్నంగా గుర్తిస్తారు. ఈ ఆలయం లార్డ్ కృష్ణకు అంకితం చేయబడింది. ఒక్కసారి మీరు ఈ 'శివుని నివాసం' లో అడుగుపెడితే, అక్కడి పరిసరాలు మిమ్మల్ని మైమరిపిస్తాయి. కైలాషహర్ లో దుర్గా పూజా, కాళీమా పూజ ప్రసిద్ధి చెందిన పండుగలు.

రాతి మీద దేవుళ్ళ ప్రతిమలు

రాతి మీద దేవుళ్ళ ప్రతిమలు

చిత్ర కృప : sauman_sinha

చౌడూ దేవోతర్ మందిర్

14 దేవతల ఆలయం లేదా చౌడూ దేవోతర్ మందిర్ లో 14 దేవీ విగ్రహాలు ఉన్నాయి. అగర్తల నుండి ఈ మందిర్ 140 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడి ప్రధాన ఆకర్షణ పురాతన 'త్రిపురి తల్లి' విగ్రహం (క్రీ.శ. 10 - 12 వ శతాబ్ధానికి చెందినది). జూలై మాసంలో జరుపుకొనే ఖర్చి పూజ సమయంలో ప్రజలు ఎక్కువగా వస్తారు.

రాతి మీద దేవతామూర్తుల చెక్కడాలు

రాతి మీద దేవతామూర్తుల చెక్కడాలు

చిత్ర కృప : sauman_sinha

టీ ఎస్టేట్స్

కైలషహర్ లో దేవాలయాలు నుండి కొంత విరామం తీసుకోని గివింగ్ పట్టణం చుట్టూ ఉన్న అనేక టీ ఎస్టేట్లను చూడవచ్చు. ఈ టీ ఎస్టేట్స్ వాటి రుచి కోసం అత్యంత గోప్యంగా నిర్వహించబడతాయి. పూర్తి సంప్రదాయ పద్దతుల్లో ఇక్కడ టీ ని ఉత్పత్తి చేస్తారు. మీరు ఇక్కడికి వెళితే తప్పక టీ రుచి ని ఆస్వాదించండి .. !

అద్భుత సూర్యాస్తమ దృశ్యం

అద్భుత సూర్యాస్తమ దృశ్యం

చిత్ర కృప : GK Dutta

కైలాషహర్ ఎలా చేరుకోవాలి ?

వాయు మార్గం

అగర్తలా విమానాశ్రయం - కైలాషహర్ కు సమీపాన(140 కి. మీ) ఉన్న విమానాశ్రయం. ఈ విమానాశ్రయం నుండి క్యాబ్ మరియు ట్యాక్సీ లు అందుబాటులో ఉంటాయి.

రైలు మార్గం

కైలషహర్ కు 27 కి. మీ. దూరంలో ఉన్న కుమార్ఘాట్ సమీప రైల్వే స్టేషన్. కుమార్ఘాట్ నుండి కైలషహర్ కు రోడ్డు మార్గం ద్వారా చేరటానికి 50 నిమిషాల సమయం పడుతుంది.

బస్సు మార్గం

కైలషహర్ గుండా జాతీయ రహదారి 44 వెళుతుంది. ఇది పట్టణం నుండి నేరుగా రాజధాని నగరం అగర్తలాకు కలుపబడింది. అనేక మార్గాల ద్వారా కైలషహర్ ను చేరుకోవచ్చు. రాష్ట్ర రవాణా బస్సులు మరియు ప్రైవేటు టాక్సీలు ప్రయాణించటానికి కొన్ని మార్గాలు.

పొలానికి వెళ్తున్న అన్నదాత

పొలానికి వెళ్తున్న అన్నదాత

చిత్ర కృప : Dhrubajyoti Debnath

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X