Search
  • Follow NativePlanet
Share
» »మున్నార్ లో కన్నన్ దేవన్ హిల్స్ చాలా థ్రిల్లింగ్, డోన్ట్ మిస్ ఇట్

మున్నార్ లో కన్నన్ దేవన్ హిల్స్ చాలా థ్రిల్లింగ్, డోన్ట్ మిస్ ఇట్

కన్నన్ దేవన్ ప్రాంతంలో విశ్రాంతి పొందండం ఆదర్శవంతమైనది. టూరిస్ట్ లకు ఇక్కడ ట్రెక్కింగ్ మరియు నేచర్ వాక్ కు ఆహ్లాదంగా ఉంటాయి.

కన్నన్ దేవన్ హిల్స్ పేరు కాస్త వింతగా ఉన్నా, ఈ ప్రదేశం చూడటానికి మాత్రం ఉత్కంఠభరితంగా ఉంటుంది. మున్నార్ ఇక్కడ ఉన్న ప్రకృతి సౌందర్యం పర్యాటకులను అధికంగా ఆకర్షించడం వలన ఇది ప్రముఖ పర్యాటక ఆకర్షణగా గుర్తింపు పొందింది. కేరళ రాష్ట్రంలోని మున్నారు నుండి 15 కి.మీ దూరంలో కన్నన్ దేవన్ హిల్స్ ఉన్నాయి. ఈ హిల్స్ దాదాపు 97చదరుపు కిలోమీటర్లలో విస్తరించి ఉన్న వన్యప్రాణి సంరక్షణ ప్రాంతం. ఇది సముద్ర మట్టానికి 1700మీ ఎత్తున ఉన్న ఈ ప్రదేశం మున్నార్ లో ఎత్తైన ప్రదేశం. కన్నన్ దేవన్ హిల్స్ లో ఉన్న లోయలు,12 ఏళ్ళకొకసారి పువ్వులు పూసే అరుదైన నీలకూరింజి పూల మొక్కలను టాప్ స్టేషన్ నుండి చూడవచ్చు. పడమన నుండి చూస్తే ఉత్కంఠభరితమైన దృశ్యాలు కనబడుతాయి.

కన్నన్ దేవన్ ప్రాంతంలో విశ్రాంతి పొందండం ఆదర్శవంతమైనది. టూరిస్ట్ లకు ఇక్కడ ట్రెక్కింగ్ మరియు నేచర్ వాక్ కు ఆహ్లాదంగా ఉంటాయి.

పురాణాల ప్రకారం బ్రిటిష్ వారు మొదటి సారి మున్నార్ ను సందర్శించినప్పడు, ఇద్దరు ముదువన్ గిరిజనలు వారికి ఆ చుట్టు ప్రక్కల ప్రదేశాలను చూపించడానికి సహాయపడినారు. వారు కొండలలో నివసించే వారు, అందువల్ల బ్రిటీష్ వారికి కన్నన్ దేవన్ చుట్టు ప్రక్కల కొంత ప్రాంతాలను కూడా చూపించే వారట. తర్వాత వచ్చే పర్యాటకులకు కూడా వీరు టూరిస్ట్ గైడ్లుగా ప్రదేశాలను చక్కగా చూపించే వారట. అందువల్ల ఈ కొండలకు వారి పేర్లు కన్నన్ మరియు దేవన్ అని పేర్లు పెట్టారు. మన ఇండియాలోని కేరళ రాష్ట్రంలో ఇడుక్కి జిల్లాలో ఈ కన్నన్ దేవన్ హిల్స్ ఉన్నాయి. తర్వత వీటిని లండన్ మరియు పెర్మెడులు టీ తోటల పెంపకానికి జాన్ డేనియల్ మన్రో కు అద్దెకు ఇవ్వబడినవి.

కన్నన్ దేవన్ హిల్స్ ప్లానిటేషన్ లో గర్వించదగ్గ విషయం ఏంటంటే, ఈ మొదటి టీతోటల పెంపక కంపెనీలో పనిచేసే ఉద్యోగులందరూ వాటాదారులే. ఇది 2005 ఏప్రిల్ 1 టాటా టీ టిమిటెంట్ కంపెనీని అధిగమించింది. మరియు 24000 హెక్టార్ల విస్తీర్ణంతో ఏడు తేయాకు తోటలను కలిగి ఉంది.

Thralling Places To Visit In Kannan Devan Hills, Things to do and how to reach

కన్నన్ దేవన్ హిల్స్ కు ఎలా చేరుకోవాలి:

రోడ్డు మార్గం: కన్నన్ దేవన్ హిల్స్ బస్ స్టాండ్ లో లోకల్ బస్ స్టాప్ నుండి ఫ్రీక్వెంట్ బస్సులు అందుబాటులో ఉంటాయి. దీనికి దగ్గరలో ఎర్నాకులం కెఎస్ఆర్టిసి బస్ స్టేన్ ఉంది. రోడ్డు మార్గంలో కొచ్చి నుండి కన్నన్ దేవన్ హిల్స్ చేరడానికి 4గంటల సమయం పడుతుంది. అదే విధంగా, కోయబత్తూర్ నుండి 148కి.మీ దూరం. మదురై నుండి 5గంటల సమయం పడుతుంది.

రైలు మార్గం: మీరు రైలు మార్గంలో ప్రయాణించదలుచుకుంటే పాలక్కడ్ జంక్షన్ రైల్వే స్టేషన్ చాలా దగ్గరి ప్రదేశం. మరో దగ్గర రైల్వే ట్రైన్ స్టేషన్ థేనీ రైల్వే స్టేషన్.

విమాన మార్గం: కొచ్చి ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్. మేజర్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ .

కన్నన్ దేవన్ హిల్స్ స్టేషన్ చూడాలని టూర్ ప్లాన్ చేసుకున్నపన్పుడు ఈ హిల్స్ చుట్టు ప్రక్కల చూడదగ్గ మరికొన్ని ప్రదేశాలు కూడా ఉన్నాయి. వీటిని ఎట్టి పరిస్థితిలో మిస్ చేయకండి.

రాజమలై నేషనల్ పార్క్ :

రాజమలై నేషనల్ పార్క్ :

కేరళలో రాజమలై (ఎరావికులమ్ నేషనల్ పార్క్ ) ఉంది. ఈ రాజమలై వన్యమృగ సంరక్షణ కేంద్రంలో నీలగిరి తహ్ర్ ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో ఉన్నాయి. ఈ పార్క్ దక్షిణ భూభాగంలో ఆనముడి శిఖరం ఉంది. ఈ శిఖరం భూభాగంలో అధికంగా పసిరకభూమి కలదు. ఈ ప్రాంతంలో ఎక్కువగా వర్షాలు కురుస్తాయి.

PC: Harikrishnan S

రాజమలై నేషనల్ పార్క్ :

రాజమలై నేషనల్ పార్క్ :

ఈ నేషనల్ పార్క్ ప్రాంతంలో నీల కురుంజి అనే పువ్వులు పూస్తాయి. ఇవి 12 సంవత్సరాల కొకసారి మాత్రమే వికసించి, పర్యాటకులను ఎక్కువగా ఆకర్షిస్తుంటాయి.

PC:keralatourism

రాజమలై నేషనల్ పార్క్ :

రాజమలై నేషనల్ పార్క్ :

గడ్డిమైదానాలకు ఆవాసం అయిన ఎర్నాకులం నేషనల్‌ పార్కు, మూడు ప్రాంతాలుగా.. కోర్‌ ఏరియా, బఫర్‌ ఏరియా మరియు టూరిస్ట్‌ ఏరియాగా విభజించబడింది. పర్యాటకులను రాజమలలోని టూరిస్ట్‌ ఏరియా వరకు మాత్రమే అనుమతిస్తారు. ఫారెస్ట్‌ డిపార్ట్‌మెంట్‌ వారు తమ వాహనాల్లో రాజమలై వరకు తీసుకెళ్ళి గ్రాస్‌లాండ్‌ ఎకో సిస్టమ్స్‌ను పరిచయంచేస్తారు.

Photo Courtesy:Jiths

మట్టుపట్టి డ్యాం:

మట్టుపట్టి డ్యాం:

మున్నార్ నుండి 13కిలో మీటర్ల దూరంలో మట్టుపట్టి డ్యాం ఉంది. ఇక్కడి వెళితే ఒక మ్యాజికల్ ఫీలింగ్ కలుగుతుంది. మట్టుపట్టి నదిపై కట్టిన ఆనకట్ట, దాని వల్ల ఏర్పడిన జలాశయం ఉన్నాయి. ఈ డ్యాంను సందర్శించడం వ్యూ పాయింట్ చాలా బాగుంటుంది. డ్యాం చుట్టూ ఉన్న గ్రీన్ వాలీ, మట్టిపట్టి లేక్ ను చూడటానికి చాలా మంది ఇష్టపడుతాయి.

PC: DdraconiandevilL

మట్టుపట్టి డ్యాం:

మట్టుపట్టి డ్యాం:

ఇక్కడి నుండి కొంచెం దూరం వెళితే మట్టుపట్టి జలాశయంలో బోట్ లో షికారు చేయడానికి డిస్ట్రిక్ట్ ప్రొమోషనల్ కౌన్సిల్ ఏర్పాట్లు చేస్తుంది. దీనిని పశువుల గ్రామం అని కూడా పిలుస్తారు. దిగుబడినిచ్చే వందలాది రకాల పశువులు పొలాల్లో ఉండటాన్ని చూస్తే ఆనందం కలుగుతుంది.

Photo Courtesy: Jiths

మట్టుపట్టి డ్యాం:

మట్టుపట్టి డ్యాం:

ఈ ప్రదేశానికి చాలా సులభంగా చేరుకోవచ్చు. ముఖ్యంగా పర్యాటకులకు మే మరియు ఆగస్ట్ నెలలు సైట్ సీయింగ్ కు సౌకర్యవంతంగా ఉంటుంది. ఇక్కడి వాతావరణం మరియు వాటర్ స్పీడ్ బోటింగ్ వంటివి ఇడుక్కి డిస్ట్రిక్ట్ ప్రొమోషనల్ కౌన్సిల్ ఏర్పాటు చేసే బోటింగ్ మంచి అనుభూతిని కలిగిస్తాయి.
అలాగే ఇక్కడే షోలా ప్రొజెక్ట్ ట్రెక్కింగ్ ఎంజాయ్ చేయవచ్చు.

మీసపులిమల:

మీసపులిమల:

మున్నార్ లో ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తో ట్రెక్కింగ్ కు అద్భుతమైన ప్రదేశం మీసపులిమలై. మీకు ఎప్పుటీకి కలగని అనుభూతిని కలిగిస్తుంది. దక్షిణ భారత దేశంలో రెండవ ఎత్తైన శిఖరంగా కూడా ఇది పరిగణింపబడుతుంది. ఇక్కడ పర్వతారోహన చేయడం చాలా సరదా అనుభూతిని కలిగిస్తుంది. ఈ శిఖరం ఎత్తు దాదాపు 2600మీ ఉంటుంది. మున్నార్ లోని ఉడుక్కి జిల్లాలో ఉండే ఈ ప్రదేశాన్ని సందర్శించడం చాలా బాగుంటుంది.
PC: Sarathgks92

మీసపులిమల:

మీసపులిమల:

అడ్వెంచర్ ప్రియులకు ఈ పర్వతాన్ని చేరుకోవడం చాలా ఆహ్లదకరమైన ఆనందాన్ని కలిగిస్తుంది. మున్నార్ లో చూడదగ్గ ప్రదేశాల్లో వర్త్ సీయింగ్ పాయింట్ గా మీసపులిమల అని భావిస్తారు! మీసపులిమల శిఖరం తమిళనాడు, కేరళ సరిహద్దుల విస్తృత దృశ్యాలు ఆహ్లాదం కలిగిస్తాయి.

Photo Courtesy: Bimal K C

మీసపులిమల:

మీసపులిమల:

మీరు మీసపులిమల వయా కురంగిని నుండి వెళ్ళవచ్చు. ఇక్కడి నుంది 9గంటల సమయం పడుతుంది. 15కిలో మీటర్ల దూరం నుండి ఎక్కువ సమయం పడుతుంది. కొలుక్కమలై టీ ఎస్టేట్స్ చేరుకున్న తర్వాత అక్కడ విశ్రాంతి తీసుకుని , మరికొన్ని ప్రదేశాల యొక్క వివరాలను తెలుసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. ఆకుపచ్చని పచ్ఛికబయలు, దట్టమైన షోలా అడవులు ఆహ్లాదాన్ని ఇస్తాయి,. ఈ ప్రదేశాన్ని సందర్శించే పర్యాటకులు మీసపులిమల ట్రెక్కింగ్ చేయకుండా టూర్ ను పూర్తి చేయరు. కనుక నెక్స్ట్ టైమ్ మీరు వెళ్ళినప్పుడు ఈ ప్రదేశాన్ని మిస్ చేయకండి.
Photo Courtesy:Jiths

చిన్నార్ వైల్డ్ లైఫ్ శాంక్చురి:

చిన్నార్ వైల్డ్ లైఫ్ శాంక్చురి:

ఇది పొల్లాచికి 65కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడ వివిధ రకాల జంతువులు, ప్రత్యేకించి మెరుపులు కల అతి పెద్ద ఉడుత ఇక్కడ ఒక ప్రధాన ఆకర్షణ. ఇంకా లంగూర్ అనే కోతులు ఆకర్షణగా ఉంటాయి.

PC: Charles J Sharp

చిన్నార్ వైల్డ్ లైఫ్ శాంక్చురి:

చిన్నార్ వైల్డ్ లైఫ్ శాంక్చురి:

అలాగే తూవనం వాటర్ ఫాల్స్, వాచ్ టవర్ లు ఈ ప్రాంత అందాలను మరింత ద్విగుణీకృతం చేస్తాయి. ఇక్కడ కూడా ట్రెక్కింగ్, జంగల్ సఫారీ, జంగల్ వాక్ వంటి కార్యక్రమాలకు వీలుంటుంది.

Photo Courtesy:Bimal K C

కొలుక్కుమలై టీ ఎస్టేట్ :

కొలుక్కుమలై టీ ఎస్టేట్ :

టీ ప్రియులకు ఇది ఒక అద్భుతమైన ప్రదేశం. సముద్ర మట్టానికి 7900అడుగుల ఎత్తులో ఈ తేయాకు తోటలున్నాయి. ప్రపంచంలో అత్యధిక తేయాకు తోటలకు నిలయం మున్నార్ లో కొలుక్కమలై ఎస్టేట్. ఇక్కడ టీ వివిధ రకాల రుచులలో ప్రసిద్ది చెందింది. ఇక్కడ సందర్శించే పర్యాటకులు వివిధ రకాల టీ ల రుచులను ఆస్వాదించవచ్చు. అలాగే ఇక్కడ తాజా టీ పొడి దొరుకుతుంది. సూర్యాస్తమయాలలో కొలుక్కమలై టీ ఎస్టేట్ అందాలను చూడటానికి రెండు కళ్లు సరిపోవు

Photo Courtesy:Arun Suresh

ఎకో పాయింట్ :

ఎకో పాయింట్ :

ఎకో పాయింట్ మున్నార్ కు 18 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ నేచర్ కారణంగానే దీనికి ఎకో అనే పేరు వచ్చింది. యువ పర్యాటకులకు క్యాంపింగ్, మరియు ఫోటో గ్రఫీ కోసం ఒక గొప్ప పిక్నిక్ ప్రదేశం. అంతే కాదు ఇది ఒక షూటింగ్ స్పాట్ కూడా. ఇక్కడ కుండలే లేక్ , చుట్టుపక్కల పెద్ద పర్వతాలు, బ్యాక్ గ్రౌండ్ పచ్చిక బయలు షూటింగ్ లకు అద్భుతమైన ప్రదేశాలు. ఈ ఎకోపాయింట్ ప్రదేశంలో నదిలో బోట్ రైడ్ చేసే అవకాశం ఉంది. ఈ ప్రదేశానికి వెళ్ళి ఒక పెద్ద కేక వేయండి, తిరిగి మీకు ఆ కేక ఏవిధంగా వినిపిస్తుందో చూడండి.ఆశ్చర్యం కలుగుతుంది

లక్కం వాటర్ ఫాల్స్:

లక్కం వాటర్ ఫాల్స్:

లక్కం జలపాతం మున్నార్ నుండి 11 కిలోమీటర్ల దూరంలో ఉంది. లాకాం జలపాతాలు ఎరవికులం నేషనల్ పార్క్లో భాగంగా ఉన్నాయి. ఈ జలపాతాలు మరియు వీటి చుట్టూ ఉన్నసుందరమైన పరిసరాలు సందర్శించడానికి పర్యాటకులకు ఇష్టమైన స్థలంగా మారుతుంది.

PC:Firos AK

అట్టుకాడ్ జలపాతాలు:

అట్టుకాడ్ జలపాతాలు:

ఇది మున్నార్ మరియు పల్లివాసల్ మధ్య ఉన్న సుందరమైన జలపాతాలుగా ఉంది. ఇది మున్నార్ నుండి 9 కిలోమీటర్ల దూరంలో ఉంది. రుతుపవన కాలంలో ఈ జలపాతాలు అందంగా కనిపిస్తాయి. ఈ జలపాతాలలోని నీరు చాలా చల్లగా ఉంటాయి. ఈ ప్రదేశం మున్నార్ లో గొప్ప ట్రెక్కింగ్ కేంద్రంగా ప్రసిద్ధి చెందింది.

PCAmal94nath

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X