Search
  • Follow NativePlanet
Share
» »పంజాబ్ రాష్ట్రంలోని కపుర్తాల లో సందర్శించవలసిన ప్రదేశాలు !!

పంజాబ్ రాష్ట్రంలోని కపుర్తాల లో సందర్శించవలసిన ప్రదేశాలు !!

By Mohammad

పంజాబ్ ... భారత దేశానికి వాయువ్య భాగంలో ఉన్నది. సింధూ నది ఉపనదులు ఈ రాష్ట్రానికి ప్రధానమైన ఆదాయ వనరులుగా చెప్పుకోవచ్చు. పంజాబ్ రాష్ట్రం గుండా 5 నదులు ప్రవహిస్తాయి. అందుకనే దీనిని పంచ నదుల భూమి అని పిలుస్తారు. ఇక్కడి ప్రజల ప్రధాన వృత్తి మనమాదిరే వ్యవసాయం. కానీ వ్యవసాయ రంగంలో మనకంటే ఆగ్రగ్రామిగా ఉన్నది. ఇక్కడ ఉన్న ప్రధాన మతం సిక్కులు ఆ తరువాతే హిందువులు.

ఇది కూడా చదవండి : అమృత్‌సర్ స్వర్ణ దేవాలయ దర్శనం !

గొప్ప చారిత్రక నేపధ్యం ఉన్న పంజాబ్ రాష్ట్రంలో ఏదైనా మంచి ఆకర్షణ గల నగరం ఉందా అంటే ఆది కపుర్తాల. పంజాబ్ లో ఇప్పటి వరకు చూసిన పర్యాటక ప్రదేశాల కంటే ఈ నగరం విలక్షణంగా, వైవిధ్య భరితంగా ఉంటుంది. కపుర్తాల ని క్రీ.శ.11 వ శతాబ్ధంలో కనుగొన్నారు. దీనిని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దినది జైసల్మీర్ రాజు. ఆయన పేరు మీదుగానే దీనికి కపుర్తాల అనే పేరొచ్చింది. పంజాబ్ రాష్ట్రంలోని కపుర్తాల లో సందర్శించవలసిన ప్రదేశాలు సంగతికి వస్తే ...

ఎల్సీ ప్యాలెస్ , కపుర్తాల

ఎల్సీ ప్యాలెస్ , కపుర్తాల

కపుర్తాల లో ఎల్సి ప్యాలెస్ ఒక ప్రధాన పర్యాటక ఆకర్షణగా నిలిచింది.క్రీ.శ. 1862 లో నిర్మించబడిన ఈ ప్యాలెస్ ఫ్రెంచ్ ప్రెసిడెంట్ కు నివాసంగా కూడా వుండేది. ఈ ప్యాలెస్ మొత్తంగా చూస్తే ఫ్రెంచ్ నిర్మాణ శైలి కలిగి వుంటుంది.

చిత్ర కృప : Gurinder Singh Mann

జగత్ జిట్ ప్యాలెస్, కపుర్తాల

జగత్ జిట్ ప్యాలెస్, కపుర్తాల

జగత్ జిట్ పాలస్ ను సైనిక స్కూల్ గా చెపుతారు. దీనిని మహారాజ జగజిట్ సింగ్ క్రీ.శ. 1900 - 1908 ల మధ్య కట్టించినాడు. దీనిని ఒక ఫ్రెంచ్ శిల్పి రూపకల్పన చేయటంతో ఇది ప్రసిద్ధ ఫ్రెంచ్ కట్టడాలను పోలి వుంటుంది.

చిత్ర కృప : francesc_bm

జగత్ జిట్ ప్యాలెస్, కపుర్తాల

జగత్ జిట్ ప్యాలెస్, కపుర్తాల

జగత్ జిట్ పాలస్ లో పెద్దదైన దర్బార్ హాల్, సున్కేన్ పార్క్ వంటివి టూరిస్ట్ లను అమితంగా ఆకర్షిస్తాయి. పాలస్ లోపలి అలంకరణ అంతా ప్రసిద్ధి చెందిన ఐరోపా మరియు భారత దేశ శిల్ప నైపుణ్యతతో నిర్మించినారు.

చిత్ర కృప : Ramesh Lalwani

మజార్ మీర్ నసీర్ అహ్మద్, కపుర్తాల

మజార్ మీర్ నసీర్ అహ్మద్, కపుర్తాల

కపుర్తాల లోని మజార్ మీర్ నసీర్ అహ్మద్ అనే నిర్మాణం సంగీత కళాకారులకు, గాయకులకు ఒక తీర్ధ యాత్ర వంటిది. ఈ భవనంలోని ఆర్చీలు, డోమ్ లు భారతీయ, మొఘలుల శిల్ప శైలిలో ఉంటాయి. ఈ కట్టడాన్ని ప్రసిద్ధ సంగీత గాయకుడు తాన్ సేన్ వారసుని పేరుతో నిర్మించారు.

చిత్ర కృప : bodythongs

దర్బార్ హాల్ , కపుర్తాల

దర్బార్ హాల్ , కపుర్తాల

కపుర్తాల పట్టణానికి మధ్యలో దర్బార్ హాల్ ఉంటుంది. దీనిని ఇండో సరసునిక్ శిల్పశైలిలో నిర్మించినారు. ఈ భవనం లోని ప్రతి హాలు ఆనాటి పాలకుల అధికార దర్పనాన్ని తెలియజేస్తుంది. రాళ్ళపై చెక్కిన నమూనాలు గమనిస్తే అప్పటి రాజులు కళల్ని ఎంతగా అభిమానిస్తారో తెలుస్తుంది.

చిత్ర కృప : Gagan Josan

జగజీత్ క్లబ్, కపుర్తాల

జగజీత్ క్లబ్, కపుర్తాల

కపుర్తాల లో మరొక ప్రధాన ఆకర్షణ జగజీత్ క్లబ్. జగత్ జీత క్లబ్ నిర్మాణం పూర్తిగా గ్రీక్ - రోమన్ శైలి లో జరిగింది. కపుర్తాల రాజ కుటుంబ గొప్పదనానికి ఇది ఒక స్మారకచిహ్నం. 1940 లలో ఒక సినిమా హాల్ గాను , ప్రస్తుతం ఒక క్లబ్ గాను ఇది మార్పుచెందింది.

చిత్ర కృప : OshoSoft Kapurthala

స్టేట్ గురుద్వారా, కపుర్తాల

స్టేట్ గురుద్వారా, కపుర్తాల

స్టేట్ గురుద్వారా అనే భవనం నగరం మధ్యలో సుల్తాన్ పూర్ రోడ్ లో ఉన్నది. క్రీ.శ. 1915 లో ఇండో - సార్సెనిక్ శిల్ప శైలి లో దీని నిర్మాణం జరిగింది. ఎర్ర ఇసుక రాయి తో నిర్మించారు. ఈ ప్రదేశం అనేక మంది భక్తులను, టూరిస్ట్ లను ప్రతి సంవత్సరం ఆకర్షిస్తోంది.

చిత్ర కృప : KayBharti

షాలిమార్ గార్డెన్, కపుర్తాల

షాలిమార్ గార్డెన్, కపుర్తాల

షాలిమార్ గార్డెన్ ని కపుర్తాల లో ఒక భాగం గా చెప్పుకోవచ్చు. ఇక్కడి ప్రధాన ఆకర్షణ రాజస్థూపం. దీని చుట్టూ ఒక కొలను, పార్క్, లైబ్రరీ లు ఉంటాయి. ఈ గార్డెన్ లో ప్రతి ఏటా బసంత్ పంచమి మేలా ఘనంగా జరుగుతుంది. అనేక మంది టూరిస్ట్ లు కపుర్తలకు ఈ సమయం లో వచ్చి ఆనందిస్తారు.

చిత్ర కృప : Esjay Ghosh

ఘంట ఘర్ , కపుర్తాల

ఘంట ఘర్ , కపుర్తాల

ఘంట ఘర్ అనేది క్లాక్ టవర్. దీనిని 1901 నిర్మించారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఈ గడియారం మహారాజ జగత్ జిత్ సింగ్ మరణం తర్వాత ఆగిపోయిందట. ఆ తర్వాత క్లాక్ టవర్ నిర్వహణ పురవస్తు శాఖ ఆధీనంలో తీసుకుంది. ప్రస్తుతం ఈ గడియారం పని చేస్తోంది.

చిత్ర కృప : francesc_bm

బగ్గీ ఖానా, కపుర్తాల

బగ్గీ ఖానా, కపుర్తాల

బగ్గీ ఖానా లో కపుర్తాల పాలకులు తమ మోటార్ కార్లను ఉంచేవారు. ఇక్కడ వారి గుర్రాలను సైతం కట్టేసేవారు కూడా. గుండ్రంగా నిర్మించబడిన ఈ భవనం పర్యాటకులను శిల్ప కళతో బాగా ఆకర్షిస్తున్నది.

చిత్ర కృప : Romesh Bhattacharji

గురుద్వారా బేర్ సాహిబ్, కపుర్తాల

గురుద్వారా బేర్ సాహిబ్, కపుర్తాల

గురుద్వారా బేర్ సాహిబ్ సిక్కులకు ప్రసిద్ధ పుణ్య క్షేత్రం. సిక్కు గురువు గురు నానక్ జి ఇక్కడ 14 సంవత్సరాలు గడిపారు. ఈ ప్రదేశానికి అక్కడ కల బేర్ చెట్టు పేరు పెట్టారు. ఈ ప్రదేశంలో సీలింగ్ ఆకర్షణీయంగా వుంటుంది. ప్రతి ఏట నవంబర్ లో గురు నానక్ దేవ్ జి జన్మ దినోత్సవాలు జరుగుతాయి.

చిత్ర కృప : OshoSoft Kapurthala

పంచ మందిర్, కపుర్తాల

పంచ మందిర్, కపుర్తాల

పంచ మందిర్ లో ఐదు చిన్న టెంపుల్స్ వుంటాయి. వీటిలో హిందూ దేవుళ్ళు, దేవతలు వుంటారు. ప్రవేశం లోనే భక్తులు అయిదు గుడులను ఒకేసారి దర్శించవచ్చు. ఇండియా లోని సూర్యుడికి గల రెండు దేవాలయాలలో ఇది ఒకటి. ఇక్కడ లార్డ్ బ్రహ్మ విగ్రహం కూడా కలదు. ప్రతి రోజూ ఈ ఆలయాలకు వందలాది భక్తులు వస్తుంటారు.

చిత్ర కృప : Abhilash Gaur

మూరిష్ మసీదు, కపుర్తాల

మూరిష్ మసీదు, కపుర్తాల

మూరిష్ మసీదు - కపుర్తాల నగర మధ్యలో వుంటుంది. పురావస్తు శాఖ దీనిని జాతీయ స్మారకంగా గుర్తించింది. విశాలమైన పరిసరాలను మార్బుల్ తో అలంకరించిన ఈ మసీదు చూడటానికి మరింత అందంగా కనపడుతుంది. చరిత్ర, కళలు పట్ల ఆసక్తి కల పర్యాటకులకు ఇది ఒక అపురూప అనుభవం అవుతుంది.

చిత్ర కృప : bodythongs

విల్లా బ్యూనా విస్టా, కపుర్తాల

విల్లా బ్యూనా విస్టా, కపుర్తాల

విల్లా బ్యూనా విస్టా అనేది మహారాజ జగిత్ సింగ్ మనుమడు యొక్క ఒక ప్రైవేటు విల్లా. ఇది సిటీ కి 4 కి.మీ. ల దూరం లో కలదు. గతం లో ఈ విల్లా రాయల్ ఫ్యామిలీ కి హంటింగ్ వసతి గా వుండేది. ప్రస్తుతం దీనిని ఒక పిక్నిక్ స్పాట్ గా చేసి ఇందులో బోటింగ్, ఫిషింగ్ ఏర్పాటు చేసారు.

చిత్ర కృప : Paul Hamilton

జూబిలీ హాల్, కపుర్తాల

జూబిలీ హాల్, కపుర్తాల

జూబిలీ హాల్ ను క్రీ.శ. 1916 సంవత్సరం లో మహారాజ జగత్ జిత్ సింగ్ పాలన కు గుర్తు గా నిర్మించారు. అందమైన ఈ నిర్మాణం కపుర్తాల చేరే పర్యాటకులకు ఒక ప్రసిద్ధ ఆకర్షణ. జూబిలీ హాల్ లోని పచ్చదనం, ప్రశాంత వాతావరణం ఎంతో ఆకర్షిస్తుంది.

చిత్ర కృప : telugu native planet

కంజలి వెట్ ల్యాండ్, కపుర్తాల

కంజలి వెట్ ల్యాండ్, కపుర్తాల

కంజలి వెట్ ల్యాండ్, కపుర్తాల కు 5 కి.మీ. ల దూరం లో కాలి బీన్ నది ఒడ్డున కలదు. ఇది ఒక ప్రసిద్ధ పిక్నిక్ స్పాట్. అనేక మొక్కలు, జంతువులు వుంటాయి. సుమారు 40 నుండి 50 వరకు వివిధ రకాల వలస పక్షులకు ఇది ఆవాసంగా ఉంది. ఫోటోగ్రాఫర్ లకు ఇది ఒక స్వర్గం గా వుంటుంది. ఇక్కడ బోటింగ్ మరియు ఫిషింగ్ క్రీడలు కలవు.

చిత్ర కృప : Esjay Ghosh

వార్ మెమోరియల్, కపుర్తాల

వార్ మెమోరియల్, కపుర్తాల

వార్ మెమోరియల్ ను క్రీ.శ. 1923 లో నిర్మించారు. దీని నిర్మాణం రెడ్ సంద స్టోన్ తో జరిగింది. దీని నిర్మాణం ఇండో - సారసునిక్ స్టైల్ శిల్ప కళలో జరిగింది. దీని చుట్టూ అందమైన గార్డెన్ కూడా కలదు. ఇది విశ్రాంతి పొందటానికి అనువైన స్థలం.

చిత్ర కృప : Romesh Bhattacharji

కపుర్తాల ఎలా చేరుకోవాలి ??

కపుర్తాల ఎలా చేరుకోవాలి ??

విమాన మార్గం

అమృత్‌సర్ లోని ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ కపుర్తాల కు 82 కి.మీ. ల దూరం లో వుంటుంది. ఈ విమానాశ్రయం నుండి దేశంలోని అన్ని నగరాలకు సులభంగా ప్రయాణించవచ్చు. అమృత్‌సర్ నుండి టాక్సీ లలో కపుర్తాల చేరవచ్చు.

రైలు మార్గం

కపుర్తాల లో రైల్వే స్టేషన్ కలదు. ప్రధాన రైలు స్టేషన్ జలంధర్ లో కలదు. ఇక్కడ నుండి పంజాబ్ లోని వివిధ ప్రాంతాలకు, దేశం లోని వివిధ ప్రధాన నగరాలకు రైళ్ళు నడుస్తాయి. జలంధర్ నుండి కపుర్తాల, బస్సు లేదా టాక్సీ లలో తేలికగా చేరవచ్చు.

రోడ్డు మార్గం

కపుర్తాల జలంధర్ - ఫిరోజ్ పూర్ రోడ్ లో కలదు. బస్సు లు తేలికగా దొరుకుతాయి. ప్రభుత్వ మరియు ప్రైవేటు బస్సు లు లభ్యంగా వుంటాయి. టాక్సీ లు కూడా తేలికగా దొరుకుతాయి.

చిత్ర కృప : Vikramjeet Maitra

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X