Search
  • Follow NativePlanet
Share
» »కోర్బా - సాంస్కృతిక వారసత్వ స్థలం !

కోర్బా - సాంస్కృతిక వారసత్వ స్థలం !

By Mohammad

చత్తీస్ గర్హ్ కి పవర్ రాజధాని కోర్బా. చుట్టూ పచ్చని అడవులతో నిండి ఉంటుంది. ఇది ఆహిరణ్, హస్డేయో నదుల సంగమ స్థలం ఒడ్డున కలదు. ఇక్కడ ఉన్న పవర్ ప్లాంట్ లు చత్తీస్ గర్హ్ కి విద్యుత్ ని సరఫరా చేస్తాయి. ఇక్కడ బొగ్గు గనులు సైతం ఉన్నాయి. కోర్బా లో గిరిజనులు, ఆదివాసీలు అధికంగా నివసిస్తారు.

చైతుర్గడ్ కోట, కోర్బా

చైతుర్గడ్ కోట, కోర్బా

చిత్ర కృప : Ahmed Hezza

కోర్బా సందర్శనీయ స్థలాలు

చైతుర్గడ్ కోట

లఫాగడ్ కోట గా పిలువబడే చైతుర్గడ్ కోట భారతదేశ సహజ కోటలలో ఒకటి. ఇది పాళి నుండి 19 - 25 కిలోమీటర్ల దూరంలో కలదు. కోటలో కొన్ని గోడలు మాత్రమే ఇప్పుడు తారసపడతాయి. దీనిని ఒకటవ పృధ్వీదేవా రాజుచే నిర్మించబడింది. మేనక, సింహద్వార, హుకుంర అనేవి కోట యొక్క ప్రధాన ద్వారాలుగా ఉన్నాయి.

మహిషాశుర మర్దిని ఆలయం

మహిసశుర మర్దిని ఆలయం చైతుర్గడ్ కోట లోపల ఉన్నది. దుర్గామాత కు ప్రతిరూపంగా భావించే మహిషాశుర మర్దిని యొక్క విగ్రహం పన్నెండు చేతులు కలిగి ఉంటుంది. ఆలయానికి సమీపంలో దాదాపు 3 కిలోమీటర్ల దూరంలో శంకర్ గుహ ఉన్నది. ఈ గుహ ఒక సొరంగం వలే కనిపిస్తుంది. ఇక్కడ 5 కొలనులు, పచ్చని మైదానాలు, చెట్లు, సైట్ సీయింగ్ కై పక్షులు మరియు జంతువులను వీక్షించవచ్చు.

మహిషాశుర మర్దిని ఆలయం, కోర్బా

మహిషాశుర మర్దిని ఆలయం, కోర్బా

చిత్ర కృప : Nikhil Prabhakar

కెండై జలపాతాలు

బిలాస్పూర్ - అంబికాపూర్ జాతీయ రహదారిపై కెండై అనే గ్రామం కలదు. ఇది కోర్బా లో ప్రసిద్ధ విహార కేంద్రం. గ్రామంలో కెండై జలపాతాలు ప్రధాన ఆకర్షణ. జలపాతం 75 మీటర్ల ఎత్తు నుండి కిందకు దూకే దృశ్యాలు పర్యాటకులకు మనోహరాన్ని అందిస్తుంది. ఈ ప్రాంతానికి సమీపంలో బులిసిద్ అనే పురాతన గుహలు ఉన్నాయి. సమయం ఉంటే వీటిని సందర్శించండి.

కెండై జలపాతాలు, కోర్బా

కెండై జలపాతాలు, కోర్బా

చిత్ర కృప : Ice Cubes

మాధవరాణి మందిరం, కోర్బా - చంప రహదారి పై ఒక కొండపై ఉన్నది. ఈ ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుపుతారు. ఈ వేడుక సెప్టెంబర్ - ఆక్టోబర్ మధ్య జరుగుతుంది.

పండుగలు

భారతదేశంలో జరుపుకొనే పండుగలే కాక - పోలా, హరేలి, దేవ్ ఉత్ని, కర్మ మొదలైన గ్రామీణ పండుగలను జరుపుకుంటారు ఇక్కడి ప్రజలు. పోలా నాడు ఎద్దులను పూజిస్తారు. ఎడ్ల పందేలను నిర్వహిస్తారు. హరేలి శ్రావణ మాసంలో రైతులు జరుపుకొనే పండుగ. ఆ సమయంలో రైతులు వ్యవసాయ పనిమూట్ల ను పూజిస్తారు.

కోర్బా సంప్రదాయ వేడుకలు

కోర్బా సంప్రదాయ వేడుకలు

చిత్ర కృప : Pankaj Oudhia

షాపింగ్

కోర్బా ప్రాంతం అధిక నాణ్యత గల బట్టలకు, డ్రస్ మెటీరియల్స్ కు, కొసా అనబడే ప్రత్యేక సిల్క్ ఉత్పత్తికి పేరుగాంచినది. కొసా చీరలు ప్రపంచ ప్రసిద్ధి గాంచినవి. వీటిని హాట్స్ లలో మరియు స్థానిక మార్కెట్ లలో కొనుక్కోవచ్చు.

కోర్బా ఎలా చేరుకోవాలి ?

వాయు మార్గం

కోర్బా కు సమీపాన రెండు విమానాశ్రయాలు కలవు. ఒకటి రాయ్ పూర్ ఎయిర్ పోర్ట్ (164 కిలోమీటర్ల దూరంలో), మరొకటి రాంచి ఎయిర్ పోర్ట్ (292 కిలోమీటర్ల దూరంలో). ఈ రెండు ఎయిర్ పోర్ట్ ల నుండి క్యాబ్ లేదా టాక్సీ లలో ప్రయాణించి కోర్బా చేరుకోవచ్చు.

రైలు మార్గం

కోర్బా లో రైల్వే స్టేషన్ ఉన్నది. దేశంలోని అన్ని ప్రధాన నగరాల నుండి ఇక్కడికి రైలు వస్తుంటాయి. ఉదాహరణకి వైనగంగా రైలు (యశ్వంతపూర్ - కోర్బా).

వైనగంగ ఎక్ష్ ప్రెస్ ( యశ్వంతపూర్ - కోర్బా)

వైనగంగ ఎక్ష్ ప్రెస్ (యశ్వంతపూర్ - కోర్బా)

చిత్ర కృప : Adityamadhav83

రోడ్డు మార్గం

ఝార్సుగూడ (143 కిలోమీటర్లు, చత్తీస్ గర్హ్), బుర్ల (151 కిలోమీటర్లు, ఒడిష), మరియు సమీప పట్టణాల నుండి కోర్బా వరకు ప్రభుత్వ / ప్రవేట్ బస్సులు వాహనాలు ప్రతిరోజూ నడుస్తుంటాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X