Search
  • Follow NativePlanet
Share
» »పర్వతాలకు రారాణి ... కులు మనాలి !

పర్వతాలకు రారాణి ... కులు మనాలి !

By Super Admin

ఈ గ్రామంలో ఇక్కడ ఇంటికి, బ్యాంకులకు తలుపులు ఉండవు !ఈ గ్రామంలో ఇక్కడ ఇంటికి, బ్యాంకులకు తలుపులు ఉండవు !

అక్కడి మంచు పర్వతాలను చూస్తే ఎవ్వరైనా చిన్న పిల్లలు అవ్వాల్సిందే ..! ఆ ప్రదేశంలో చిన్నా - పెద్దా అనే తేడా లేకుండా పోటీపడి మంచు ముక్కలతో ఆడుకుంటుంటారు. ఆ ప్రాంతం ఏదని అనుకుంటున్నారా ? అదే కులు మనాలి.

చాలా మంది కులు మనాలి అంటే ఒకే ఊరి పేరు అనుకుంటారు. కానీ, రెండూ వేర్వేరు ఊరి పేర్లు. ఈ రెండు ఊర్లు ఒకదానికొకటి 45 కిలోమీటర్ల దూరంలో ఉంటాయి. హిమాలయ పర్వత ప్రాంతంలో విస్తరించిన ఈ రెండు ప్రదేశాలు ... తెల్లని మంచు దుప్పటి కప్పుకొని దేశ, విదేశీ పర్యాటకులను ఆకర్షిస్తుంటాయి.

హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర రాజధాని షిమ్లా నుండి 260 కి.మీ. దూరంలో ఉన్న మనాలికి చేరుకోవటానికి 9 గంటల సమయం పడుతుంది. అదే దేశ రాజధాని ఢిల్లీ నుంచైతే 18 గంటల ప్రయాణం. న్యూఢిల్లీ నుండి మనాలి కి చేరుకోవటానికి టూర్ ప్యాకేజీ లు, ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంటాయి. కనుక, పర్యాటకులు ఎక్కవ భాగం ఇక్కడి నుంచే బయలుదేరుతుంటారు.

ఇవి రెండూ పుణ్య క్షేత్రాలు కావు ... వేసవి విడిది కేంద్రాలు. అక్కడి వాతావరణం చల్లగా, ఆహ్లాదకరంగా ఉంటుంది. వివిధ రకాల సాహస క్రీడల్లో, మంచు క్రీడల్లో మరియు ఈ ప్రాంతపు ప్రత్యేక క్రీడలైన యాక్ సఫారీ, యాక్ స్కీయింగ్ లలో కూడా పాల్గొనవచ్చు.

కులు మనాలి ప్రాంతంలో వేసవి ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయిలో నమోదైతూ ఉంటాయి. కనుక, వేసవి నుండి ఉపశమనం పొందేందుకై యాత్రికులు కుటుంబసభ్యులతో, స్నేహితులతో వస్తుంటారు. ఇదొక హనీమూన్ స్పాట్ కూడా అండోయ్ ..! ప్రస్తుతం పెళ్ళిళ్ల సీజన్ కాబట్టి చాలా మంది హనీమూన్ కొరకై ఇక్కడికి రావచ్చు కూడా ! ఇక ఆలస్యం ఎందుకు ... చుట్టుప్రక్కల ప్రాంతాలను ఒక లుక్ వేద్దాం పదండి .. !

రోహతాంగ్ పాస్ లేదా రోహతాంగ్ కనుమ

రోహతాంగ్ పాస్ లేదా రోహతాంగ్ కనుమ

మనాలి కి 55 కిలోమీటర్ల దూరంలో ఉన్న రోహతాంగ్ కనుమ తప్పక చూడదగ్గది. సముద్ర మట్టానికి 4111 మీటర్ల ఎత్తున్నఈ ప్రాంతం నుండి అందమైన పర్వతాలు, ప్రకృతి దృశ్యాలు మరియు గ్లెసియర్ లు కనువిందు చేస్తాయి. ఈ కనుమ దాటి వెళ్తే లాహుల్ జిల్లా, తర్వాత లఢక్ ప్రాంతం వస్తుంది.

చిత్ర కృప : sandeepachetan.com travel photography

హంతా పాస్

హంతా పాస్

మనాలి లో సముద్ర మట్టానికి 4268 మీ. ఎత్తున హంతా పాస్ కలదు. లాహౌల్ లో ఉన్న చంద్రా నది హెడ్ వాటర్స్ వరకు ఈ ట్రెక్ బేస్ ద్వారా చేరుకోవచ్చు. స్నో బ్రిడ్జ్ లు ఇక్కడి అదనపు ఆకర్షణలు.

చిత్ర కృప : Rajat

చంద్రఖని పాస్

చంద్రఖని పాస్

సముద్ర మట్టానికి 3600 మీ. ఎత్తున్న చంద్రఖని పాస్ ట్రెక్కింగ్ కి అనువైనది. కులు - మలానా లోయలతో సంభంధమున్న పార్వతి లోయలో ఈ పాస్ ఉంటుంది. పర్వతారోహకులు ఈ పాస్ గుండా ట్రెక్కింగ్ చేయటానికి మే - అక్టోబర్ మాసాలు అనుకూలంగా ఉంటాయి.

చిత్ర కృప : Mark E

సోలాంగ్ లోయ లేదా సోలాంగ్ వ్యాలీ

సోలాంగ్ లోయ లేదా సోలాంగ్ వ్యాలీ

సోలాంగ్ లోయ, మనాలి కి వాయువ్య దిశలో 13 కి. మీ. దూరంలో ఉంటుంది. ఇది స్నో పాయింట్ కు ప్రసిద్ధి చెందినది. స్కయింగ్, జోర్బింగ్, పారాగ్లైడింగ్ మరియ గుర్రపు స్వారీ వంటి ఎన్నో ఆక్టివిటీస్ సోలాంగ్ వాలీ లో పర్యాటకులు చేపట్టొచ్చు. హిందూ దైవం అయిన శివుడికి అంకితమివ్వబడిన ఒక ఆలయం పర్వతం పైన ఉంది.

చిత్ర కృప : Ankur Dauneria

మణికరన్

మణికరన్

కులు నుండి మనాలి వెళ్లే మార్గంలో మణికరన్ ప్రదేశం ఉన్నది. పార్వతి నది ఒడ్డున ఉన్న ఈ ప్రదేశం వేడి నీటి బుగ్గ కు ప్రసిద్ధి చెందినది.

చిత్ర కృప : sandeepachetan.com travel photography

సుల్తాన్ పుర ప్యాలెస్

సుల్తాన్ పుర ప్యాలెస్

రూపి ప్యాలెస్ గా పిలువబడే సుల్తాన్ పుర ప్యాలెస్ కులు లోని అద్భుతమైన చారిత్రక కట్టడం. ఈ ప్యాలెస్ ను పహాడీ మరియు పాశ్చాత్య మిశ్రమ శైలి లో నిర్మించినారు. గోడలపై నిర్మించిన అనేక సూక్ష్మ చిత్రాలు భవంతి అందాన్ని మరింత పెంచాయి.

చిత్ర కృప : ruth998

నెహ్రూ కుండ్

నెహ్రూ కుండ్

మనాలి కి 6 కి. మీ. దూరంలో కెలాంగ్ రోడ్డు మార్గంలో నెహ్రూ కుండ్ సరస్సు కలదు. సమీపంలోనే భ్రిగు సరస్సు కూడా ఉన్నది. ఇక్కడ భ్రిగు మహర్షి ధ్యానం చేసి, ' భ్రుగ సంహిత' కావ్యాన్ని ఇక్కడే రచించాడని పురాణాల కథనం.

చిత్ర కృప : Andrey Polyanskiy

హిడింబా దేవి ఆలయం

హిడింబా దేవి ఆలయం

హిడింబా ఇక్కడి స్థానిక దేవత. పాండవ రాజుల్లో ఒకరైన భీముని భార్య హిడింబా దేవి పేరు మీద క్రీ.శ. 1553 వ సంవత్సరంలో ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయం దాని యొక్క ఆలయ గోపురాలకి మరియు సున్నితమైన దారు చెక్కాడాలకి ప్రసిద్ధి చెందినది.

చిత్ర కృప : Manfred Sommer

బిజీలీ మహదేవ్ ఆలయం

బిజీలీ మహదేవ్ ఆలయం

బిజీలీ మహదేవ్ ఆలయం సముద్ర మట్టానికి 2460 మీ. ఎత్తులో ఉంటుంది. కులు నుండి 10 కిలోమీటర్ల దూరంలో ఉండే ఈ శివాలయం యాత్రికులను కనువిందు చేస్తుంది. పక్కనే ఉన్న కులు లోయలో మీ సాహస క్రీడల సరదా తీర్చుకోవచ్చు.

చిత్ర కృప : Jorge Q

రఘునాథ్ దేవాలయం

రఘునాథ్ దేవాలయం

రఘునాథ్ దేవాలయం శ్రీరాముడు కోసం నిర్మించిన ధార్మిక కేంద్రం. క్రీ.శ. 16 - 17 వ శతాబ్ధంలో రాజా జగత్ సింగ్ నిర్మించిన ఈ దేవాలయం పిరమిడ్, పహాడీ శైలుల మిశ్రమ శైలిలో ఉంటుంది. మండి - మనాలి జాతీయ రహదారి పై ఉన్న హనోగి మాతా ఆలయం కూడా చూడదగినది.

చిత్ర కృప : HariNiwas Palace

బసవేశ్వర్ మహదేవ్ ఆలయం

బసవేశ్వర్ మహదేవ్ ఆలయం

క్రీ.శ. 9 వ శతాబ్ధంలో శివుని కోసం నిర్మించిన బసవేశ్వర్ మహదేవ్ ఆలయం, కులు పట్టణం నుండి 15 కి. మీ. దూరంలో జాతీయ రహదారి పై ఉన్న బజ్రు గ్రామంలో ఉన్నది. కులు లోని బెఖ్లి లో కూడా 1500 ఏళ్ల క్రితం నాటి జగన్నాథ దేవి ఆలయాన్ని(విష్ణువు సోదరి భువనేశ్వరి కోసం నిర్మించినది) చూడవచ్చు. ఈ రెండు ఆలయాలు కూడా పహాడీ శైలినే ప్రతిబింబిస్తాయి.

చిత్ర కృప : Candace Hope

జగన్నాథ ఆలయం

జగన్నాథ ఆలయం

భూంతర్ నుండి కేవలం 3 కి. మీ. దూరంలో ఉన్న జగన్నాథ ఆలయం పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తున్నది. కొండ పై ఉన్న ఈ ఆలయానికి ట్రెక్కింగ్ లేదా కాలినడకన చేరుకోవచ్చు. కొండ మీద నుండి చుట్టుప్రక్కల ఆనందాలను వీక్షించవచ్చు.

చిత్ర కృప : palash576

గొంపా

గొంపా

గొంపా అనేవి బౌద్ధ మతానికి చెందిన ఆధ్యాత్మిక కేంద్రాలు మరియు మఠాలు. మనాలి పరిసరాల్లో ఉన్న గదన్ తెక్చ్హోక్లింగ్ గొంపా, మనాలి గొంపా గోడలపై చిత్రలేఖనాలు, స్థూపాలు మరియు బౌద్ధ విగ్రహాలు ఉంటాయి. ఈ మఠానికి సమీపంలో ఉన్న షాప్ లలో టిబెటన్ ల హస్తకళాకృతులు, కార్పేట్ లు కొనుగోలు చేసుకోవచ్చు.

చిత్ర కృప : Steve Smith

నగ్గర్ కోట

నగ్గర్ కోట

మనాలి నుండి కులు వెళ్లే మార్గంలో 21 కి. మీ. దూరంలో నగ్గర్ కోట ఉన్నది. ఇక్కడున్న శిలలు, దారు శిల్పాలు పాల సామ్రాజ్యపు కళా నైపుణ్యాన్ని గుర్తుకు తెస్తాయి. కోట ను హోటల్ గా మార్చబడి ప్రస్తుతం పర్యాటక శాఖ ఆధీనంలో ఉంది.

చిత్ర కృప : omzy

బీస్ కుండ్

బీస్ కుండ్

బీస్ కుండ్ హిందూ మతానికి చెందిన ఒక పవిత్ర స్థలం. ఇక్కడ వ్యాస మహర్షి స్నానం ఆచరించాడని భక్తులు విశ్వసిస్తారు. ఈ సరస్సులో మునగడం ద్వారా అన్ని రకాల వ్యాధులు నయమవుతాయని స్థానికుల నమ్మకం. మనాలి కి 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న వశిష్ట విలేజ్ కూడా సందర్శించదగినదే .. !

చిత్ర కృప : Munish Chandel

ఫ్రెండ్‌షిప్ పీక్

ఫ్రెండ్‌షిప్ పీక్

సోలాంగ్ వాలీ నుండి 18 కిలోమీటర్ల దూరంలో ఫ్రెండ్‌షిప్ పీక్ కలదు. పీర్ పంజల్ రేంజ్ లో ఉన్న ఈ శిఖరం సముద్ర మట్టం నుండి 5289 మీటర్ల ఎత్తులో ఉంటుంది. సోలాంగ్ నాలా తో అనుసంధానించబడి బీస్ కుండ్ ప్రాంతం లో ఈ శిఖరం ఉంది.

చిత్ర కృప : Rambonp love's all creatures of Universe.

గ్రేట్ హిమాలయాన్ నేషనల్ పార్క్

గ్రేట్ హిమాలయాన్ నేషనల్ పార్క్

కులు లోని గ్రేట్ హిమాలయాన్ నేషనల్ పార్క్ అనేక రకాల పూల, పండ్ల జాతి వృక్షాలు, క్షీరాదాలకు, పక్షులకు ఆవాసంగా ఉన్నది. ఇక్కడికి వచ్చే పర్యాటకులు ఈ పార్క్ తో పాటుగా పిన్ వాలీ నేషనల్ పార్క్ ను కూడా సందర్శిస్తే ఎన్నో విషయాలను తెలుసుకోవచ్చు.

చిత్ర కృప : trekshimalaya

ఇంద్రాసన్ శిఖరం

ఇంద్రాసన్ శిఖరం

సముద్ర మట్టం నుండి 6223 మీటర్ల ఎత్తులో ఉన్న ఇంద్రాసన్ పీక్ ఒక ప్రసిద్దమైన ట్రెక్కింగ్ ట్రయల్. పార్వతి నది అలాగే బీస్ నది మధ్యలో ఉన్న ఎత్తైన కొండ వద్దకి ఈ ట్రెక్కింగ్ ట్రయల్ తీసుకువెళుతుంది. ఈ మార్గం లో పయనించే పర్యాటకులు మంచుతో కప్పబడిన పర్వత శిఖరాలు గమనించవచ్చు.

చిత్ర కృప : Nishanth Jois

కోఠి

కోఠి

కోఠి, మనాలి నుండి 16 కి. మీ దూరంలో ఉన్న అందమైన గ్రామం. ఇరుకైన లోయఅందాలు మరియు బీస్ నది అందాలను తిలకించవచ్చు. రాళ్ళ నుండి ఉద్భవించే వేడి నీటి కొలనులు ఈ ప్రాంతపు అదనపు ఆకర్షణలు.

చిత్ర కృప : Satyender S Dhull

ఓల్డ్ మనాలి

ఓల్డ్ మనాలి

ఓల్డ్ మనాలి, ప్రధాన మనాలి కి 3 కి. మీ. దూరంలో ఉంటుంది. పురాతా గెస్ట్ హౌస్ లు, మఠాలు, ఆలయాలు ఇక్కడ ఉన్నాయి. మను మహర్షి ఆలయం, మనాలి ఘర్ ఫోర్ట్ లు ఈ ప్రాంతంలోని మరికొన్ని పర్యాటక ఆకర్షణలు.

చిత్ర కృప : Denise M

క్లబ్ హౌస్

క్లబ్ హౌస్

క్లబ్ హౌస్ లో ఇండోర్ అండ్ ఔట్ డోర్ క్రీడలను ఆనందించవచ్చు. మనాలి కి నడిబొడ్డున ఉండే వన్ విహార్ లో సాయంత్రంవేళ బోటింగ్ చేస్తూ గడీపేయవచ్చు.

చిత్ర కృప : GK Dutta

రహల్లా జలపాతం

రహల్లా జలపాతం

సముద్ర మట్టానికి 2501 మీటర్ల ఎత్తులో, మనాలి నుండి 16 కి.మీ. దూరంలో రోహతాంగ్ పాస్ ప్రారంభమయ్యే చోట రహల్లా జలపాతం ఉన్నది. గ్లెసియర్ నుండి వచ్చే నీళ్ళు నిటారుగా అక్కడే ఉన్న రాళ్ళ మీద పడుతుంటే ... దాన్ని చూసే వారికి నయాగర జలపాతం తలపిస్తుంది. వీలైతే అదే మార్గంలో రోజీ ఫాల్స్ చూడండి.

చిత్ర కృప : cord rehren

జానా ఫాల్స్

జానా ఫాల్స్

జానా ఫాల్స్ మూడు జలపాతాల సమూహం. మనాలి నుండి 35 కి. మీ. దూరంలో ఉన్న జానా అనే కుగ్రామంలో ఈ జలపాతం ఉంటుంది. రెండు జలపాతాలు వేర్వేరుగా, ఒక జలపాతం రోడ్డుకి దగ్గర గా ఉండి పర్యాటకులను ఆకర్షిస్తుంది.

చిత్ర కృప : vishal mehta

ట్రెక్కింగ్, ఫిషింగ్ - కులు లో

ట్రెక్కింగ్, ఫిషింగ్ - కులు లో

ట్రెక్కింగ్ కు సముద్రమట్టానికి 6001మీ. ఎత్తున ఉండే దేవ్ టిబ్బ సూచించదగినది. నడిచి వెళ్ళేటప్పుడు జగత్ సుఖ్ గ్రామం, 2200 మీ. ఎత్తున ఉండే ఖనోల్ గ్రామం చూడవచ్చు. చేపలు పట్టేందుకై తీర్థాన్ నది, నగ్గర్, రసోల్, కట్రైన్ లు ఉత్తమమైనవి.

చిత్ర కృప : KamleshPandey

సాహస క్రీడలు - మనాలి లో

సాహస క్రీడలు - మనాలి లో

మౌంటైనీరింగ్, మౌంట్ బైకింగ్, పారాగ్లైడింగ్, రివర్ రాప్టింగ్, ట్రెక్కింగ్, జోర్బింగ్ క్రీడలను మనాలి పరిసరాల్లో ఆడవచ్చు. అలాగే యాక్ సఫారీ వంటి అరుదైన క్రీడ లో పాల్గొని ఆనందించవచ్చు.

చిత్ర కృప : Ankur P

పండో డ్యామ్

పండో డ్యామ్

కులు నుండి మనాలి వెళ్లే మార్గంలో చూడవలసిన మరో ఆకర్షణ పండో డ్యామ్. ఈ డ్యామ్ వద్ద ఉన్న సౌందర్యానికి పర్యాటకులు తప్పక అనుభూతికి లోనవుతారు.

చిత్ర కృప : saket sankhyan

హోటళ్లు

హోటళ్లు

కులు మనాలి ప్రాంతాలకి వేసవి సెలవుల్లో పర్యాటకులు అధికంగా వస్తుంటారు. కాబట్టి హోటళ్ళలో గదులు దొరకడం కాస్త కష్టం. వేసవి కాలంలో హోటల్ అద్దె గదులు రూ.800 పైగా రేట్లు ఉంటాయి. అదే మిగితా సమయాల్లో 300 - 500 వరకు ఉంటాయి. కనుక, ముందుగా రిజర్వ్ చేసుకోవటం ఉత్తమం.

చిత్ర కృప : Vikas Panghal

కులు మనాలి ఎలా చేరుకోవాలి ?

కులు మనాలి ఎలా చేరుకోవాలి ?

కులు మనాలి కి వాయు, రైలు మరియు రోడ్డు మార్గాలు చక్కగా అందుబాటులో ఉన్నాయి

సమీప ఏర్ పోర్ట్ : భుంతర్ విమానాశ్రయం (మనాలి నుండి 50 కి. మీ దూరంలో, కులు నుండి 10 కి. మీ. దూరంలో)

సమీప రైల్వే స్టేషన్ : జోగీందర్ నగర్ రైల్వే స్టేషన్ (మనాలి నుండి 135 కి. మీ. దూరంలో, కులు నుండి 125 కి. మీ. దూరంలో). మనాలి కి 300 కి. మీ. దూరంలో ఉన్న చండీఘర్ రైల్వే స్టేషన్ ప్రధాన రైల్వే జంక్షన్.

రోడ్డు మార్గం : ఢిల్లీ నుండి, సిమ్లా నుండి ప్రతి రోజూ కులు మనాలి కి ప్రభుత్వ / ప్రవేట్ బస్సులు నడుస్తుంటాయి.

చిత్ర కృప : Suresh Kumawat

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X