Search
  • Follow NativePlanet
Share
» »లాహౌల్ స్పితి : ఎత్తైన మంచు లోయల్లో ప్రయాణం !

లాహౌల్ స్పితి : ఎత్తైన మంచు లోయల్లో ప్రయాణం !

By Mohammad

హిమాచల్ ప్రదేశ్ లో ఒకప్పుడు లాహౌల్ మరియు స్పితి అనే రెండు వేర్వేరు జిల్లాలు ఉండేవి. ఇప్పుడు రెండూ కలిసిపోయి ఒకటే జిల్లాగా మార్చబడ్డది. లాహౌల్ నుండి స్పితి లోయకు 'కుంజం పాస్' లేదా 'కుంజం లా' ఒక ద్వారంగా ఉన్నది. ఇది సముద్ర మట్టానికి 4, 551 మీ. మీటర్ల ఎత్తులో ఉంటుంది.

ఇది కూడా చదవండి : హిమాలయ చివరి శ్రేణులు !

సహజ గుణాలలో రెండు లోయలు వేటికవే వేరువేరుగా ఉంటాయి. స్పితి లోయ దాటటానికి కఠినంగా, వృక్షరహితంగా ఉంటుంది. ఈ లోయ సరాసరి సముద్ర మట్టానికి 4 వేల పై చిలుకుల అడుగుల ఎత్తున ఉంటుంది. లాహౌల్ మరియు స్పితి జిల్లాలో ఎక్కవ మంది బౌద్ధ మతాన్ని అనుసరిస్తూ ... ఆ సంప్రదాయాలను, సంస్కృతిని మరియు ఆచారాలను పాటిస్తారు. ఇక్కడి పర్యాటక ప్రదేశాలను ఒకసారి గమనిస్తే .. !

లాహౌల్

లాహౌల్

లాహౌల్ పర్వత ప్రాంతం. విహారాల పై రెపరెపలాడే ప్రార్థనా జెండాలు ఈ ప్రాంత ముఖ్య చిహ్నాలు. ఇక్కడ చేసే విహారాలన్నీ అక్కడి ప్రజల ధార్మిక ధోరణిని ప్రతిబింబిస్తాయి. ఇక్కడి ప్రధాన ఆకర్షణ కిబ్బన్ వన్య ప్రాణి అభయారణ్యం.

చిత్ర కృప : Kuntal Joisher

కిబ్బర్ వన్య ప్రాణి అభయారణ్యం

కిబ్బర్ వన్య ప్రాణి అభయారణ్యం

కిబ్బర్ గ్రామం లాహౌల్ సమీపంలో సముద్రమట్టానికి 4270 మీ. ఎత్తున ఉంటుంది. మంచు చిరుతలు, మస్క్ జింక, హిమాలయ నీలి గొర్రె, గోధుమరంగు ఎలుగు బంట్లు, అడవి దున్నలు, డోజోల్లాంటి జంతువులు ఇక్కడ స్వేచ్ఛగా తిరుగుతూ కనిపిస్తూ ఉంటాయి. పిన్ వాలీ నేషనల్ పార్క్ కూడా ఇతర ఆకర్షణ గా ఉన్నది.

చిత్ర కృప : bm.iphone

కుంజుమ్ పాస్

కుంజుమ్ పాస్

కుంజుమ్ పాస్ హిమాలయ పర్వత శ్రేణుల్లో ఉన్న ఎత్తైన పర్వత మార్గం. ఈ మార్గం కులు లోయను, లాహౌల్ లోయ ను మరియు స్పితి లోయను కలుపుతుంది. దైవ భక్తి ఉన్న వారు ఈ మార్గం వెళ్ళేటప్పుడు కనిపించే దుర్గా దేవి గుడిని దర్శించుకోవచ్చు.

చిత్ర కృప : Anshul Dabral

స్పితి లోయ

స్పితి లోయ

స్పితి లో ప్రధాన ఆకర్షణ కే ఆరామం. ఇది దేశంలోనే పురాతన మఠం గా ప్రసిద్ధి చెందినది. అనేక సాహస కృత్యాలు, స్కీయింగ్ మరియు యాక్ సఫారీ వంటివి స్పితి లో ఆనందించవలసిన వినోద క్రీడలు.

చిత్ర కృప : Carlos Adampol Galindo

కే ఆరామం

కే ఆరామం

కే ఆరామాన్నే కీ లేదా కై ఆరామం గా కూడా పిలుస్తారు. బుద్దులకు ఈ ఆరామం లేదా స్థూపం ప్రధాన పరిశోధనా కేంద్రంగా, శిక్షణా కేంద్రం గా ఉన్నది. అద్భుతమైన కూడ్య చిత్రాలు, అరుదైన రాత ప్రతులు, గార చిత్రాలు మరియు వాయిద్య పరికరాలకు ఇది ప్రసిద్ధి చెందినది.

చిత్ర కృప : 4ocima

ధన్కర్ ఆరామం లేదా స్థూపం

ధన్కర్ ఆరామం లేదా స్థూపం

17 వ శతాబ్ధంలో ధన్కర్ స్పితి లోయ రాజ్యానికి రాజధాని గా ఉండేది. శత్రువుల మీద నిఘా పెట్టేందుకై ఈ స్థూపాన్ని సముద్ర మట్టానికి 3870 మీ. ఎత్తున నిర్మించారు. ఆరామంలో వివిధ ఆలయాలు, విగ్రహాలు కూడా ఉన్నాయి. రాత్రి పూట నిద్రించేవారు తగు సామాగ్రి వెంట తీసుకెళ్ళటం మంచిది.

చిత్ర కృప : Purushottam Pawar

వృక్ష సంపద

వృక్ష సంపద

స్పితి లోయ లో విలువైన వృక్ష సంపద దాగి ఉన్నది. అడవి పుష్పాలు, పెద్ద పెద్ద చెట్లు కలిగి ఉండి, మంచు కింకారణ్యాన్ని తలపిస్తుంది. ఔషధ రంగానికి చెందిన సుమారు 60 కు పైగా మొక్కలు ఉన్నాయి.

చిత్ర కృప : B Balaji

పర్వత బైకింగ్ లేదా మౌంటెన్ బైకింగ్

పర్వత బైకింగ్ లేదా మౌంటెన్ బైకింగ్

మౌంటెన్ బైకింగ్ చేసేవారికి లాహౌల్ మరియు స్పితి లోయ లు అనుకూలంగా ఉంటాయి. ఈ సాహస క్రీడ ద్వారా ఆ ప్రాంతపు అందమైన అందాలను వీక్షించవచ్చు. స్పితి పర్వతారోహణ చేసేవారు డేరాలు, నిద్రించే సామాగ్రి, ఉన్ని వస్తువులు, వంట సామాగ్రి వెంట తీసుకెళ్ళటం మంచిది.

చిత్ర కృప : Mani Babbar Photography

ట్రెక్కింగ్

ట్రెక్కింగ్

కేవలం అనుభవజ్ఞులైన ట్రెక్కర్ల కోసమే ఇక్కడి ట్రెక్కింగ్ సూచించబడింది. సాహస ప్రియులు పిన్ - పార్వతి మార్గం గుండా ట్రెక్కింగ్ చేస్తూ వచ్చి స్పితి ని తరచూ సందర్శిస్తుంటారు. కేవలం ఇదొక్కటే కాక వివిధ రకాల ట్రెక్కింగ్ మార్గాల ద్వారా కూడా లోయ అందాలనూ, ప్రదేశ సౌందర్యాన్ని వీక్షించవచ్చు.

చిత్ర కృప : B Balaji

యాక్ సఫారీ లేదా జడల బర్రె సఫారీ

యాక్ సఫారీ లేదా జడల బర్రె సఫారీ

యాక్ సఫారీ ఇక్కడ తప్ప ప్రపంచంలో మరెక్కడా కనిపించదేమో ..! ఇక్కడి వచ్చే ప్రతి యాత్రికుడు యాక్ మీద కూర్చొని హిమాలయా సానువుల్లోని జంతు మరియు వృక్షజాలాన్ని చూడటానికి ఇష్టపడుతుంటాడు. దీనితో పాటు గుర్రపు స్వారీ కూడా అద్దెకు లభిస్తాయి.

చిత్ర కృప : Ecosphere: Responsible travel in India

లోసర్

లోసర్

లాహౌల్ మరియు స్పితి జిల్లాలో 'లోసర్' ఉత్సవం ప్రతి సంవత్సరం జనవరి - ఫిబ్రవరి నెలల్లో వస్తుంది. దీపావళి ని తపించే ఈ ఉత్సవాన్ని లామా ల ఆధ్వర్యం లో టిబెట్ శైలిలో జరుపుకుంటారు.

చిత్ర కృప : Simon

లాహౌల్ స్పితి ఎలా చేరుకోవాలి ?

లాహౌల్ స్పితి ఎలా చేరుకోవాలి ?

లాహౌల్ మరియు స్పితి జిల్లా పర్యటనలకు వెళ్లే వారికి వాయు, రైలు మరియు రోడ్డు మార్గాలు అందుబాటులో ఉన్నాయి.

వాయు మార్గం

భూంటార్ విమానాశ్రయం లాహౌల్ మరియు స్పితి కు సమీపాన ఉన్న విమానాశ్రయం. ఇది 85 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. ఢిల్లీ, షిమ్లా వంటి ప్రధాన నగరాల నుండి ఈ ఏర్ పోర్ట్ కలుపబడి ఉన్నది. క్యాబ్ లేదా ట్యాక్సీ లలో ప్రయాణించి స్పితి చేరుకోవచ్చు.

రైలు మార్గం

జోగీందర్ నగర్ బ్రాడ్ గేజ్ రైల్వే స్టేషన్(89.2 కి.మీ) లాహౌల్ మరియు స్పితి కు సమీపంలో ఉన్న రైల్వే స్టేషన్. ప్రధాన రైల్వ్ స్టేషన్ చండీఘడ్ రైల్వే స్టేషన్ (217 కి.మీ) గా ఉన్నది. క్యాబ్ లేదా ప్రభుత్వ వాహనాల్లో ప్రయాణించి స్పితి చేరుకోవచ్చు.

రోడ్డు మార్గం

స్పితిని జాతీయ రహదారి- 21 ద్వారా చేరుకోవచ్చు. మనాలి, రోహతంగ్, సిమ్లా, కిన్నార్ నుండి స్పితి చేరుకునేందుకు బస్సులు మరియు టాక్సీలు సులభంగా లభిస్తాయి.

చిత్ర కృప : B Balaji

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X