Search
  • Follow NativePlanet
Share
» »లుంగ్లీ లో సందర్శించవలసిన పర్యాటక స్థలాలు

లుంగ్లీ లో సందర్శించవలసిన పర్యాటక స్థలాలు

By Mohammad

చుట్టూ కొండలు, లోతైన లోయలు మరియు వంకరటింకరగా ఉండే నదులు ... ఇవి భారత దేశ ఈశాన్య రాష్ట్రాల సాధారణ లక్షణంగా చెప్పవచ్చు. ఈశాన్య రాష్ట్రాలు ఏడు ఉన్నాయని తెలుసు వీటిని ఏడు సోదరీమణుల కొండలతో పోలుస్తారు అక్కడి ప్రజలు. అందులో ఒకటి ఇప్పుడు మనం చెప్పబోయే మిజోరం. బ్లూ మౌంటైన్స్ మరియు రోలింగ్ కొండలతో ఉన్న ఒక చిన్న అందమైన రాష్ట్రం ఈ మిజోరం. మిజో అనే పదానికి అర్దము కొండ యొక్క వ్యక్తి అని మరియు రామ్ అంటే భూమి అని అర్దము.

ఇది కూడా చదవండి : ఈశాన్య భారతదేశంలో పర్యాటక ప్రదేశాలు !

మిజోరం రాష్ట్రంలో ప్రముఖంగా చూడవలసిన ఆకర్షణ లుంగ్లీ. ఇది ఆ రాష్ట్రంలోనే రెండవ పెద్ద నగరం. దీనిని లంగ్లీ అని కూడా పిలుస్తారు. లుంగ్లీ అంటే, రాతి వంతెన అని అర్థం. త్లవంగ్ అనే నదికి ఉపనది అయిన నఘసిహ్ వద్ద వంతెన లా ఒక రాయి కనపడింది. ఈ రాయి వలెనే ఈ ప్రాంతానికి లుంగ్లీ అనే పేరు వచ్చింది.

జలపాతాలు

జలపాతాలు

ప్రకృతిని తవివితీరా ఆస్వాదించాలనుకొనే వారికి, కొత్త పర్యటనలు చేయాలనుకొనేవారికి లుంగ్లీ ప్రదేశం అనుకూలంగా ఉంటుంది. వృక్షజాలం, జంతుజాలం, వెదురు అడవులు, పారే జలపాతాలు, అందమైన వరి క్షేత్రాలు అన్నీ లోయలలో సందర్శించడానికి అద్భుతంగా ఉంటాయి. ఇక్కడి ప్రజలు నిత్యం రంగురంగుల దుస్తులను ధరించి వారి సంస్కృతిని పర్యాటకులకు చాటిచెప్తుంటారు.

చిత్ర కృప : Seven Sisters

ప్రేమికుల స్వర్గం

ప్రేమికుల స్వర్గం

వృక్ష జాలం మరియు జంతు జలాలు సమృద్దిగా ఉన్న నగరం లుంగ్లీ. ప్రకృతి ప్రేమికుల స్వర్గం గా ఈ ప్రాంతాన్ని అభివర్ణించవచ్చు. ఈ పట్టణ పరిసరాలలో ఎన్నో విశాలమైన ప్రదేశాలు కలవు.

చిత్ర కృప : Imnasenla Jamir

మువల్చెంగ్ గ్రామం

మువల్చెంగ్ గ్రామం

లుంగ్లీ నుండి 50 కిలోమీటర్ల దూరం లో ఉన్న మువల్చెంగ్ గ్రామంలో బుద్ధుడి యొక్క చిత్రం మలచబడినది ఉంది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈ రాష్ట్రంలో ఉన్న ఏకైక బుద్ధుని ప్రాచీన స్మారక చిహ్నం ఇది. ఈ చిత్రం ఇక్కడికి ఎలా వచ్చిందో ఎవరికీ అంతుబట్టలేదు. లుంగ్లీ పర్యటనలో ఆసక్తికరమైన అంశాలలో ఇది ఒకటి.

చిత్ర కృప : telugu native planet

ఫుట్ బాల్ గ్రౌండ్, లుంగ్లీ

ఫుట్ బాల్ గ్రౌండ్, లుంగ్లీ

ఖాంగ్లంగ్ వైల్డ్ లైఫ్ స్యాంక్చురీ , ఖాంజావి పార్క్, సైకుతి హాల్(స్థానిక చిత్రకారుల గాలెరి తో పాటు ఈవెంట్స్ మరియు కొన్ని రకాల ప్రదర్శనల కోసం ఏర్పాటయిన హాల్) మరియు తాంలుయియా ముయల్ లో ఉన్న రెండవ టర్ఫ్ ఫుట్ బాల్ గ్రౌండ్ వంటివి లుంగ్లీ జిల్లాలో ఉన్న పర్యాటక ఆకర్షణలలో కొన్ని. వీటితో పాటు సాహసోపేతమైన ట్రెక్స్ కి అలాగే పిక్నిక్ స్పాట్ లకి లుంగ్లీ ప్రసిద్ధి చెందినది.

చిత్ర కృప : Malrosanga .

ఖాంగ్లంగ్ వైల్డ్ లైఫ్ స్యాంక్చురీ, లుంగ్లీ

ఖాంగ్లంగ్ వైల్డ్ లైఫ్ స్యాంక్చురీ, లుంగ్లీ

ఈశాన్య భారతావని లోని అరణ్యాలను సందర్శించాలనుకొనే వారికి సరైన ప్రదేశం ఖాంగ్లంగ్ వైల్డ్ లైఫ్ స్యాంక్చురీ. మిజోరం రాష్ట్ర రాజధానైన ఐజావల్ (ఐజ్వాల్) నుండి దాదాపు 170 కి. మీ. దూరం లో ఈ స్యాంక్చురీ ఉన్నది.

చిత్ర కృప : mizoram.gov.in

ఖాంగ్లంగ్ వైల్డ్ లైఫ్ స్యాంక్చురీ, లుంగ్లీ

ఖాంగ్లంగ్ వైల్డ్ లైఫ్ స్యాంక్చురీ, లుంగ్లీ

చుట్టూ పచ్చటి కొండలతో అలాగే ఎత్తైన శిఖరాలతో కప్పబడి ఉన్న ఈ ఖాంగ్లంగ్ వైల్డ్ లైఫ్ స్యాంక్చురీ 1300 మీటర్ల ఎత్తులో దాదాపు 35 చ.అ. మేరకు విస్తరించబడి ఉంది. సెరో, బార్కింగ్ డీర్, గిబ్బన్, వైల్డ్ బోర్, సంబా డీర్, హూలోక్ మరియు చిరుతల వంటివి ఇక్కడ సాధారణంగా కనపడే జంతువులు. ఐజ్వాల్ నుండి టూరిస్ట్ వెహికల్ ని అద్దెకి తీసుకోవడం ఖాంగ్లంగ్ వైల్డ్ లైఫ్ స్యాంక్చురీ చేరుకునేందుకు ఉత్తమ మార్గం.

చిత్ర కృప : mizoram.gov.in

లుంగ్లీ చేరుకోవడం ఎలా?

లుంగ్లీ చేరుకోవడం ఎలా?

వాయు మార్గం

లుంగ్లీ కి 193 కి.మీ. దూరంలో ఉన్న లెంగ్ పుయి విమానాశ్రయం సమీప విమానాశ్రయం. ఈ విమానాశ్రయం నుండి గువహతి (గౌహతి), ఇంఫాల్, అగర్తలా మరియు కలకత్తా లకి ప్రత్యక్ష విమాన సేవలు అందుబాటులో ఉన్నాయి. ఇక్కడి నుండి క్యాబ్ లేదా ఇతర రవాణా సాధనాలను ఉపయోగించి లుంగ్లీ చేరుకోవచ్చు.

రైలు మార్గం


మిజోరాం రాష్ట్రానికి అంతగా రైలు సదుపాయాలు లేవు కానీ, సిల్చార్ ప్రాంతం లోని రైల్వే స్టేషన్ లుంగ్లీకి సమీపం లో ఉన్నది.

రోడ్డు మార్గం

జాతీయరహదారి నెంబర్ 54, మిజోరం లోని లుంగ్లీ తో పాటు ఇతర పట్టణాలకు చక్కగా అనుసంధానం అవుతుంది. రోడ్డు మార్గాలు ఇక్కడ ప్రధాన రవాణా మార్గాలుగా చెప్పుకోవచ్చు. రాష్ట్రం లోని అన్ని ప్రాంతాల నుండి లుంగ్లీ చేరుకునేందుకు బస్సులు ఉన్నాయి. అలాగే, ప్రైవేటు వాహనాల సౌకర్యం కూడా ఉంది.

చిత్ర కృప : Lalzarzoa Ralte

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X