Search
  • Follow NativePlanet
Share
» »బ్యూటిఫుల్ సీనరీస్ చూడాలంటే మలయత్తూర్ వెళ్ళాల్సిందే..

బ్యూటిఫుల్ సీనరీస్ చూడాలంటే మలయత్తూర్ వెళ్ళాల్సిందే..

మలయత్తూర్ ప్రదేశం గురించి విన్నారా? ఇది అలువ తాలూకాలోని ఒక గ్రామం. ఖచ్చితంగా చెప్పాలంటే ఎర్నాకులం జిల్లా నార్త్ ఈస్ట్ ఆంగమలికి 16కి.మీ దూరంలో ఉంది. మరి ఈ ప్రదేశానికి మలయత్తూర్ అనే పేరు మూడు పదాల కలయిక

PC: Civildigital

మలయత్తూర్ ప్రదేశం గురించి విన్నారా? ఇది అలువ తాలూకాలోని ఒక గ్రామం. ఖచ్చితంగా చెప్పాలంటే ఎర్నాకులం జిల్లా నార్త్ ఈస్ట్ ఆంగమలికి 16కి.మీ దూరంలో ఉంది. మరి ఈ ప్రదేశానికి మలయత్తూర్ అనే పేరు మూడు పదాల కలయిక నుండి వచ్చింది. మల(కొండలు)ఆర్(నది)ఊర్(ప్రదేశం) ఈ మూడు పదాల కలయికే మలయత్తూర్ . అంటే అందమైన కొండలు, నది, ప్రదేశాల కలయికే మలయత్తూర్.

కొచ్చికి 47కి.మీ దూరంలో ఉన్న ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక ప్రదేశం కూడా. ఇక్కడ మలయత్తూర్ కొండపైన అతి పెద్ద పురాతన క్యాథలిక్ చర్చి బాగా ప్రసిద్ది చెందినది. ఇక్కడ క్రైస్తవ బోధకుడు సెయింట్ థామస్ కు అంకితమివ్వడినది. ఈ స్థలం క్రైస్తవులకు యాత్రా ప్రదేశం మాత్రమే కాదు, బహు సుందర అందాలు గల పట్టణం. ఇక్కడ మార్చి మరియు ఏప్రిల్ నెలల్లో మలయూర్ పెరునల్ ను జరుపుకునేందుకు చాలామంది భక్తులు ఇక్కడి వస్తుంటారు.

ఇక్కడ సెయింట్ థామస్ చర్చి మాత్రమే కాక, మరో రెండు చర్చిలు కూడా ప్రసిద్ది చెందాయి. వీటిని చర్చి ఆఫ్ మేరీ ఇమ్మాక్యులేట్ మరియు సెయింట్ సెబాస్టియన్ చర్చిలని అంటారు. ఇక్కడే దుర్గా దేవి దేవాలయం కూడా ఉంది. మలయత్తూర్ కు వచ్చే యాత్రికులు మూలం కుజ్జి మరియు మహాగని తోట్టం ప్రదేశాలు కూడా సందర్శించవచ్చు. ఈ ఆథ్యాత్మిక ప్రదేశంలో అద్భుతమైన రుచులను చవి చూడవచ్చు. మరియు అన్ని కాలాల్లో భక్తులు మరియు పర్యాటకులు సంవత్సరం పొడవునా ఈ చర్చికి వస్తుంటారు. చర్చి ఎప్పుడూ జీజస్ ను కొలిచే భక్తులతో రద్దీగా ఉంటుంది. అయితే, వర్షాకాలంలో మాత్రం అదిక వర్షాల వల్ల సైట్ సీయింగ్ కు సాద్యపడదు.

మలయత్తూర్ పర్యటనకు శీతాకాలం అనుకూలమైనది. ఈ సమయంలో వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. మలయత్తూర్ కొచ్చి నుండి 47 కి.మీ. ల దూరంలో ఉండి, ఇరుగు పొరుగు జిల్లాలకు రవాణా సౌకర్యాలు కలిగి ఉంది. ఇక్కడ తయారయ్యే ఆహారాలు మళయాళీల రుచులుగా ఉంటాయి. చిన్న హోటళ్ళు, కాఫీ హౌస్ లు ఈ ప్రదేశం ప్రత్యేకత. పండుగ సందర్భాలలో టవున్ బిజీ గా ఉండే సమయంలో పర్యాటకుల సౌకర్యార్ధం కొత్త తాత్కాలిక హోటళ్ళు కూడా తెరుస్తారు.

Top 10 Places To Visit In Malayattoor, Kerala

Ranjithsiji

హిస్టరీ
మలయత్తూర్ చర్చి ప్రపంచ ఖ్యాతి గాంచినది. అంతర్జాతీయ గుర్తింపు ఈ చర్చికి లభించింది. సీజన్ తో నిమిత్తం లేకుండా భక్తులు ఈ చర్చికి వస్తూంటారు. జీసస్ శిష్యుడైన సెయింట్ ధామస్ అరబ్ వ్యాపారి పాత్రలో ఇక్కడకు వచ్చి తన సందేశాన్ని ఇచ్చాడని చెబుతారు. .శ. 52 లో, మలయట్టూర్లో ఒక క్రైస్తవ సంఘాన్ని నిర్మించడానికి తను బాధ్యత తీసుకున్నాడు. ఆ సమయంలో తను కొడుంగల్లూర్, క్విలన్, నిరంగం, నీలక్కల్, కొకమమంగళం, కొట్టవకు మరియు పాలయూర్లోని చర్చిలను కనుగొన్నాడని నమ్ముతారు. సెయింట్ ధామస్ వందల సంవత్సరాల కిందట స్ధాపించిన మేరీ విగ్రహం కల ప్రదేశంలోనే నేటి మలయత్తూర్ చర్చి కలదని చెపుతారు.

ఇది భారతదేశంలోని అతి పెద్ద యాత్రాస్థలం అని నమ్ముతారు, సెయింట్ థామస్ యొక్క అతి ముఖ్యమైన పండుగ ఈస్టర్ తర్వాత మొదటి ఆదివారం నాడు జరుగుతుంది. మలయత్తూర్ కొండలపై గల ఈ మత సంస్ధ ప్రతి సంవత్సరం మిలియన్ల కొలది భక్తులను ఆకర్షిస్తుంది. ఈ చర్చిని గ్రీసు మరియు రోమన్ శిల్ప శైలిలో నిర్మించారు. ఇక్కడ అనేక చెక్కడాలు, పెయింటింగులు, ఫైవ్ జాయ్ ఫుల్ మిస్టరీస్ ఆఫ్ జీసస్ క్రీస్ట్ వంటివి చర్చి గోడలపై కలవు.

మీరు ప్రధాన బలిపీఠం వెనుకవైపుకు వెళ్లినట్లయితే, మీరు క్రీస్తు యొక్క అయిదు సంతోషకరమైన మిస్టరీలను కలిగి ఉన్న శిల్పాలు, నమూనాలు మరియు చిత్రాలను చూడవచ్చు. వాటిని చూడటంతో మీరు ఆధ్యాత్మిక భానలోకి వెళతారు. ఈ చర్చిలోపల రెండు ఏర్పాట్లు కల్పించబడుతుంది. మలయట్టూర్ తీర్థయాత్ర ప్రదేశంలో పురాతన బాప్టిస్మల్ చెరుబు మరియు సంప్రదాయక పల్ఫ్ట్ కూడా మీరు గమనించవచ్చు. ఇక్కడ చారిత్రకు సంబంధించిన విలువైన వస్తువులెన్నో ఉన్నాయి. మలయత్తూర్ పర్యటలో ఈ ప్రసిద్ద చర్చితో పాటు చూడదగ్గ ప్రదేశాలు కొన్ని...

అతిరాప్పిల్లి - జలపాతాల పులకరింతలు

అతిరాప్పిల్లి - జలపాతాల పులకరింతలు

PC:Souradeep Ghosh

అతిరాప్పిల్లి త్రిస్సూర్ జిల్లా ముకుందాపురం తాలూకా లో ఉంది.అద్భుతమైన జలపాతాలకి, అమోఘమైన వర్షాధార అడవులకి ఇది నెలవు. సమృద్ధి గా కనిపించే జీవ వైవిద్యం ఇక్కడి విశిష్టత. పర్యావరణ మంత్రి జై రాం రమేష్ దీన్ని "సైలెంట్ వ్యాలీ" గా అభివర్ణించారు. అతిరాప్పిల్లి లో వళచల్, చార్పా జలపాతాలు కుడా ఉన్నాయి. ఇక్కడి జీవావరణవ్యవస్థ కేరళ రాష్ట్రానికే ప్రత్యేకమైనది గా పరిగణించబడుతుంది. జంతుజాలం తో విరాజిల్లుతూ ...ఈ ప్రాంతం అత్యంత హరిత ప్రదేశం గా, ఉజ్వలమైన వన్యప్రాణుల తావుగా పేరు గాంచిన పశ్చిమ కనుమల సమీపంలో ఉన్నది. ఈ కనుమలు అతిరాప్పిల్లి వళచల్ ప్రాంతంగా సుపరిచితమైన అడవులకు ప్రసిద్ధిగాంచాయి. వర్షాకాలం లో ప్రధాన నది అయిన చలకుడి, ఇంకా అనేక చిన్న కాలువలు వీక్షకులను ఆకట్టుకుంటాయి. పరిసర ప్రాంతం అంతా జీవ కళ తొణికిసలాడుతూ తన ఉనికి కనుక్కుని పులకరించమంటూ పలకరిస్తూ సందడి చేస్తుంది. అందమైన జలపాతాలకి చిరునామా.

ఇల్లితోడు:

ఇల్లితోడు:

PC: Geyo John

ఇది కేరళలోని ఎర్నాకులం జిల్లాలోని ముంగుజ్హిలో ఒక ప్రదేశం. సెప్టెంబరు నుండి మే నెల వరకు ఈ ప్రదేశానికి సందర్శనా వెళ్ళవచ్చు.ఈ నెలల్లో ఇక్కడ ఆనందంగా గడపడానికి ప్రశాంతమైన వాతావరణం ఉన్నది. వారాంతాల్లో ఒక ప్రశాంతమైన అనుభూతిని కలిగిస్తుంది. ఇది మలయత్తూర్ నుంచి సుమారు 10 కిలోమీటర్ల దూరంలో మరియు కొచ్చి నుండి 62 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇల్లితోడుకు ఒక వైపున ఉన్న అద్భుతమైన పెరియార్ నదితో మరియు మరొక వైపున ఎత్తైన పర్వతాలతో అద్భుతమైన ప్రక్రుతి అందాలతో ఊపిరి తీసుకోనివ్వదు.

సెయింట్ థామస్ సిరో-మలబార్ కేథలిక్ చర్చి:

సెయింట్ థామస్ సిరో-మలబార్ కేథలిక్ చర్చి:

PC: Geyo John

కేరళలోని ఎర్నాకులం జిల్లాలో ఉన్న ఈ చర్చి గురించి తెలుసుకోవాలనుకున్నప్పుడు , ఇది కేరళలో ప్రసిద్ది చెందిన చర్చిలలో ఇది ఒకటి. మలత్తూర్ కొండపైన ఉన్న చర్చి 'మలయట్టూర్ చర్చి' 609 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఇప్పుడు ఈ ప్రదేశం ఒక అంతర్జాతీయ తీర్థయాత్ర ప్రదేశంగా ప్రసిద్ది చెందినది, కేరళలో క్రిస్టియన్ కమ్యూనిటీని ప్రారంభించిన సెయింట్ థామస్ కు ఈ పుణ్యక్షేత్రం అంకితం చేయబడింది.

కోడనాండ్ ఎలిఫెంట్ ట్రైనింగ్ సెంటర్:

కోడనాండ్ ఎలిఫెంట్ ట్రైనింగ్ సెంటర్:

PC: Dvellakat
కేరళలో భారీ ఉత్సవాల్లో మీకు ఎక్కువగా కనిపించే జంతువు ఏది? గ్రాండ్ గా అలంకరించిన అతి పెద్ద ఏనుగులు, కదా? ఎందుకనగా అవి చాలా మనోహరమైన జంతువు అని భావించబడుతున్నాయి మరియు కేరళలో ఏ ఉత్సవం జరిగినా ఏనుగుల ఊరేగింపు గొప్పతనం లేకుండా ఏ విధమైన ఉత్సవము ఉండదు. అది ఒక అసంపూర్ణంగా భావిస్తారు. అందుకే, కేరళలో ప్రతి ఉత్సవంలో ఏనుగుల ఊరేగింపును గౌరవార్థకంగా మరియు రాజసంగా భావిస్తారు. ఏనుగులకు కప్రికాడ్ కు సమీపంలో అభయారన్యంలో ట్రైనింగ్ ఇస్తుంటారు.

థంబోమోజ్జయ్ డ్యామ్:

థంబోమోజ్జయ్ డ్యామ్:

PC: Jan Joseph George
అత్యంత ప్రసిద్ది చెందిన బ్రిడ్జ్. ఈ ఫూట్ బ్రిడ్జి హ్యాంగ్ బ్రిడ్జ్ లా ఊహించని విధంగా ఉంటుంది. థంబోమోజ్జయ్ డ్యామ్, రివర్ వ్యూ గార్డెన్, ఎజట్టుముఖం ఎకో విలేజ్ మరియు సీతాకోకచిలుక తోట మిమ్మల్ని మెస్మరైజ్ చేస్తుంది. ఈ వంతెనై రెండు ప్రధానమైన హాట్ స్పాట్స్ ఉన్నాయి. ఎజ్జుటుక ఎకో విలేజ్ మరియు థుంభోర్మూజి డ్యామ్ రెండింటి కలయిక .

 ఆది శంకరాచార్యుల జనన స్థలం:

ఆది శంకరాచార్యుల జనన స్థలం:

PC: Shishirdasika
కేరళ రాష్ట్రంలోని గురువాయూర్ పట్టణానికి 75 కి.మీ. దూరంలో ఉన్న కాలడి గ్రామం ఎర్నాకులం జిల్లాలో ఉన్నది. ఇక్కడే జగద్గురు ఆది శంకరాచార్యులు వారు జన్మించినది. ఈ గ్రామం పెరియార్ నదికి సమీపంలో ఉన్నది. ఇక్కడి నుండే శంకరాచార్యులు కాలినడకన దేశమంతటా తిరిగి నాలుగు పీఠాలను స్థాపించారు.
కాలడి గ్రామం దేశవ్యాప్తంగా ఆది శంకరాచార్య మతాన్ని ఆచరించేవారందరికీ మరియు పీఠాధిపతులకు ఒక పవిత్ర యాత్రా స్థలంగా ప్రసిద్ధిగాంచినది. కాలడి అంటే మలయాళంలో అర్థం పాద ముద్ర అని. ఈ గ్రామంలో దేవాలయాలు, ఆశ్రమాలు ఉన్నప్పటికీ ఆది శంకరాచార్యుల జనన స్థలం ప్రముఖంగా చెప్పుకోవాలి. ఆధ్యాత్మిక కీర్తి పతాకాన్ని ప్రపంచమంతా చాటిచెప్పిన ఆ మహనీయుని జన్మ స్థలం .
కాలడి గ్రామం లో ప్రవేశించగానే కంచికామకోటి పీఠం వారు నిర్మించిన ఎనిమిది అంతస్తుల " కీర్తి స్థంభం " అనే బృహత్ భవనం కనిపిస్తుంది. ఆది శంకరుల జీవిత చరిత్ర అంతా చిత్రాలలో ప్రదర్శించారిక్కడ. మండపంలో శ్రీ శంకరాచార్య, గణపతి విగ్రహాలు ఉన్నాయి. ఈ క్షేత్రంలో అన్ని మతాల వారికి అనుమతి ఉంది. పై అంతస్తుకు వెళ్లి నగర దర్శనం చేయవచ్చు.

అభయారణ్యం జూ:

అభయారణ్యం జూ:


PC: PrasanPadale
అభయారణ్యం జూ పర్యాటకుల సందర్శన ఎక్కువగా ఉండటం వల్ల ఇక చిన్నజంతు ప్రదర్శనశాలను ఏర్పాటు చేయడం జరిగింది. కోడనాడ్ మొత్తం ప్రాంతంలో సుమారు 2.5 ఎకరాలు మరియు జంతువులు విశ్రాంతి తీసుకోవడానికి ఒక పెద్ద జూను ఎర్పాటు చేశఆరు. 2010లో 200ఎకారాల్లో ఏర్పాటు చేసిన ఈ అభయారణ్యం జూను తర్వాత అందులో 100 ఎకరాల స్థలాన్ని ఏనుగుల శిక్షణా శిబిరాల కొరకు ఇచ్చారు. అలాగే మినీ జూ, కాప్రికేకాడ్లోని అభయారణ్యంలోకి మార్చబడింది.

సిల్వర్ స్ట్రోమ్

సిల్వర్ స్ట్రోమ్

అతిరాప్పిల్లిలో ఉన్న ఈ పార్క్ త్రిశూర్ నుండి 49 కిలోమీటర్ల దూరంలో ఉంది. రోడ్ రైడ్స్, నీటిలో డ్రైవ్ కు ప్రసిద్ది చెందినది. ఒది ఒక స్టాప్ డెస్టినేషన్.ఇకడ విశ్రాంతి సమయం గడపడానికి అనుకూలం, ఫ్యామిలి, ఫ్రెండ్స్ తో గడపడానికి వినోద కేంద్రంగా ఉంది.

నాగన్చేరి మన పార్క్ :

నాగన్చేరి మన పార్క్ :

నాగన్చేరి రాజ కుటుంబం గురించి విన్నారా?వారు ఇరింగోల్ యొక్క భూస్వాములు .పెరుంబవూర్ నుండి 3 కిలోమీటర్ల దూరంలో ఈ పార్క్ ఉంది. ఇది చిన్న పిల్లల కోసం ఒక ఆనందించే నివాసం. ఇది కూడా పెద్దలకు ఒక పునరుద్ధరణ ప్రదేశం. ఈ ఉద్యానవనం నాగచ్చేరి మాహా బ్రాహ్మణులకు చెందినది, కానీ స్థానిక ప్రభుత్వం దానిపై శ్రద్ధ వహించడానికి చేపట్టింది.
PC: Jobin Alex

పనియేలి పొరు:

పనియేలి పొరు:


PC: Joshypj
ఈ ట్రెక్కింగ్ ప్రదేశాన్ని ఉదయం 4 గంటలకు, సాయంత్రం 8గంటల సమయంలో సందర్శించవచ్చు.1.5కిలోమీటర్లు ప్రయాణిస్తే పెరియార్ రివర్ ను చేరుకుంటారు. మరి పొరు పేరు వెనుక కథ ఏంటి. పురుషులను పురాతన సంప్రదాయంలోనికి తీసుకురావడానికి ఒక వినూత్నమైన మార్గాన్ని ఎంపిక చేసుకున్నారు. ఈ డ్యామ్ అతిరాప్పిల్లి నుండి 40 కి. మీ. ల దూరంలో కలదు. డ్యాం చుట్టూ ఉన్న అడవులు వివిధ జీవ, వృక్ష, జంతు జాలాలకు ఆశ్రయం కల్పిస్తున్నది. డ్యాం లో బోట్ విహారం మరువలేని అనుభూతి .... !

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X