Search
  • Follow NativePlanet
Share
» »శ్రీనాథ్ జీ మందిర్, నాథ్ ద్వారా, రాజస్థాన్ !

శ్రీనాథ్ జీ మందిర్, నాథ్ ద్వారా, రాజస్థాన్ !

By Mohammad

'మేవార్ర్ అపోలో' గా ప్రసిద్ధి కెక్కిన నాధ్ ద్వారా రాజస్ధాన్ లోని ఉదయపూర్ జిల్లాలో బనాస్ నది ఒడ్డున కలదు. కళ మరియు కళా ఖండాల ప్రదేశం ఈ పట్టణం ప్రసిద్ధి గాంచిన పిచ్చవాయి పెయింటింగులకు రంగు రంగుల టెర్రకోటా ఉత్పత్తులకు పేరు పడింది.అన్ని కళలలోకి మీనా వర్క్ ఈ ప్రాంతంలోని ప్రధాన ఆకర్షణ. ఈ ప్రదేశాన్ని సందర్శించే పర్యాటకులు సాంప్రదాయ కళా వస్తువులకు చక్కగా షాపింగ్ చేసుకోవచ్చు.

ఇది కూడా చదవండి : నాగౌర్ లో సందర్శించవలసిన పర్యాటక ప్రదేశాలు !

పురాతన దేవాలయాలు నాధ్ ద్వారా కళామ తల్లికి నిలయమే కాక హిందువుల ఆరాధ్య దైవాలు క్రిష్ణడు, విష్ణుమూర్తి మరియు ఆయన అవతారాలకు కూడా నిలయంగా ఉంది. నాధ్ ద్వారా సందర్శించే పర్యాటకులు విష్ష్ణుమూర్తి అవతారమైన ద్వారకాధీష్ దేవాలయాన్ని తప్పక దర్శించాలి. ఈ దేవాలయం లోని విగ్రహం ఎర్రటి రాతితో ఒకే పాలరాతితో చెక్కబడింది. ఈ ప్రాంతంలో మరిన్ని పర్యాటక ఆకర్షణల విషయానికి వస్తే ..

ఏక్ లింగ్ జీ ఆలయం

ఏక్ లింగ్ జీ ఆలయం

ఉదయ్ పూర్ కు 24 కి. మీ ల దూరంలో ఉన్న ఈ దేవాలయంలో శివుడు ఉంటాడు. ఇది క్రీ. శ. 734 లో ఆచార్య విశ్వరూప చే నిర్మించబడిందని నమ్ముతారు. 50 అడుగుల ఎత్తు ఉండి, నాలుగు ముఖాలు కలిగిన నల్లని శివలింగం ఇక్కడి ప్రత్యేకత. ఆలయ ప్రాంగణంలో 108 దేవాలయాలు ఉన్నాయి.

చిత్ర కృప : Dennis Jarvis

ద్వారకాధీశ్ ఆలయం

ద్వారకాధీశ్ ఆలయం

నాధ్ ద్వారా లోని కంకోళి గ్రామంలో ఉన్న ద్వారకాదీశ ఆలయం ఇక్కడి మరో ప్రధాన ఆకర్షణ. ఇది వైష్ణవ మతానికి, వల్లభాచార్యులకు చెందినది. ఇందులో శ్రీకృషుడు ఉంటాడు. బర్డ్ వాచింగ్ మీద ఆసక్తి గలవారు సమీపంలోని కంకోళి డ్యాం వద్దకు వెళ్ళవచ్చు.

చిత్రకృప : Ian Sutton

శ్రీనాథ్ జీ ఆలయం

శ్రీనాథ్ జీ ఆలయం

శ్రీనాథ్ జీ ఆలయం క్రీ.శ. 12 వ శతాబ్దానికి చెందినది. ఇందులో శ్రీకృష్ణుని నల్లని పాలరాతి విగ్రహం ఉంటుంది. ఎపి లోకి తిరుపతి తర్వాత ఇదే ధనవంత ఆలయం గా చెబుతారు.

చిత్రకృప : Redtigerxyz

చార్ భుజ దేవాలయం

చార్ భుజ దేవాలయం

చార్ భుజ సమీప చిన్న పట్టణం. ఇక్కడ చార్ భుజాజీ దేవాలయం కలదు. విగ్రహం విష్ణుమూర్తి అవతారంలో ఉంటుంది మరియు దేవాలయం శిల్పకళకు ప్రసిద్ధి చెందినది. సమయముంటే రాజ పుత్ర రాజులు నిర్మించిన కోట సందర్శించండి.

చిత్రకృప : SAPEDIYA

రాజసమండ్

రాజసమండ్

నాధ్ ద్వారా కు 15 కి. మీ. ల దూరంలో రాజసమండ్ ప్రదేశం కలదు. హాండ్ లూమ్ ఉత్పత్తులకు, మార్బుల్ ఉత్పత్తులకు ఇది ఫెమస్. డ్యాం, సరస్సులు, కోటలు మొదలైనవి చూడవచ్చు.

చిత్రకృప : Rajsamand Blog

షాపింగ్

షాపింగ్

నాధ్ ద్వారా లో షాపింగ్ ఆసక్తికరంగా ఉంటుంది. సంప్రదాయ వస్తువులు తక్కువ ధరకే లభిస్తాయి. టెర్రా కోట వస్తువులు, చేతి వస్తువులు మొదలైనవి కొనుగోలు చేయవచ్చు. స్థానిక మిఠాయిలు ఎంతో రుచికరంగా ఉంటాయి.

చిత్ర కృప : Prakhar Amba

కుంభాల్ ఘర్ కోట

కుంభాల్ ఘర్ కోట

నాథ్ ద్వారా నుండి 51 కిలోమీటర్ల దూరంలో ఉన్న చారిత్రాత్మక ప్రదేశం కుంభాల్ ఘర్ కోట గురించి ఇక్కడ క్లిక్ చేయండి.

చిత్ర కృప : Honza Soukup

అద్భుత ఆలయం

అద్భుత ఆలయం

నాథ్ ద్వారా నుండి 57 కిలోమీటర్ల దూరంలో ఉన్న అద్భుత ఆలయం రానక్ పూర్ గురించి ఇక్కడ క్లిక్ చేయండి.

చిత్ర కృప : Paul Asman and Jill Lenoble

 నాథ్ ద్వారా ఎలా చేరుకోవాలి ?

నాథ్ ద్వారా ఎలా చేరుకోవాలి ?

వాయు మార్గం : 45 కి. మీ ల దూరంలో ఉదయపూర్ విమానాశ్రయం కలదు. ఇది ఢిల్లీ, ముంబై, కలకత్తా తదితర ప్రాంతాల నుండి కనెక్ట్ చేయనాడింది. ఈ విమానాశ్రయం నుండి క్యాబ్ లేదా టాక్సీ లలో నాథ్ ద్వారా చేరుకోవచ్చు.

రైలు మార్గం : నాథ్ ద్వారా కు 13 కి. మీ ల దూరంలో ఒక చిన్న రైల్వే స్టేషన్, 48 కి.మీ ల దూరంలో ఉదయపూర్ రైల్వే స్టేషన్ కలదు.

రోడ్డు మార్గం : ఉదయపూర్, రానక్ పూర్, పుష్కర్, ఢిల్లీ, జైపూర్, అజ్మీర్ తదితర ప్రాంతాల నుండి నాథ్ ద్వారా కు ప్రభుత్వ/ ప్రవేట్ బస్సులు కలవు.

చిత్ర కృప : indian railinfo

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X