Search
  • Follow NativePlanet
Share
» »పుట్టలో కొలువైన .... పుట్టింగళ్ దేవి !

పుట్టలో కొలువైన .... పుట్టింగళ్ దేవి !

By Mohammad

'పరవూర్' గురించి నిన్నమొన్నటి వరకూ ఎవరికీ తెలీదు. ఒక్కసారిగా గత నాలుగు రోజుల నుండి ఈ పట్టణం పేరు వార్తల్లో, ప్రసార మధ్యమాల్లో, సోషల్ మీడియా లో హాల్ చల్ చేస్తున్నది. మరి పరవూర్ ఎందుకు వార్తల్లో నిలిచిందో, అక్కడ ఏమి ఉన్నాయో ఓసారి తెలుసుకుందాం పదండి ...!

ఇది కూడా చదవండి : కొల్లాం - జీడిపప్పుల నగరం !

పరవూర్ అందమైన కోస్తా తీర పట్టణం. కేరళ రాష్ట్రంలోని కొల్లాం జిల్లాకు చెందిన ఈ పట్టణం అరేబియా సముద్రం ఒడ్డున ఉన్నది. కొల్లాం నుండి 21 కి.మీ. దూరంలో, వర్కాల నుండి 13 కి.మీ. దూరంలో ఉన్న ఈ పట్టణానికి సమీపాన కొల్లాం జంక్షన్ స్టేషన్ (12 కి.మీ) సమీపంలో ఉన్నది.

ఇది కూడా చదవండి : వర్కాల - ఒక ప్రసిద్ధ బీచ్ పట్టణం !

సందర్శించు ప్రదేశాలు

సందర్శించు ప్రదేశాలు

పరవూర్ లో చూడటానికి పుట్టింగళ్ దేవి ఆలయం, సరస్సులు, బీచ్ లు, కప్పిల్ బోట్ క్లబ్ ఉన్నాయి. వీలైతే సమీపంలోని వర్కాల బీచ్ పట్టణాన్ని(13 కి.మీ) కూడా చూసిరావచ్చు.

చిత్ర కృప : Martin Thomas

పుట్టింగళ్ దేవి ఆలయం

పుట్టింగళ్ దేవి ఆలయం

తిరువనంతపురం నగరానికి 60 కి. మీ. దూరంలో ఉన్న పుట్టింగళ్ దేవి ఆలయం, పురవూర్ పట్టణానికి ప్రధాన ఆకర్షణ. మలయాళంలో 'పుట్టు' అంటే పుట్ట అని అర్థం. ఈ క్షేత్రంలో పుట్టలో కొలువైన అమ్మవారిని పుట్టింగళ్ దేవి గా భక్తులు పూజిస్తారు.

చిత్ర కృప : Sathyan Photography

పుట్టింగళ్ దేవి ఆలయం

పుట్టింగళ్ దేవి ఆలయం

పుట్టింగళ్ క్షేత్రానికి గల మరొక పేరు 'కురుమండలం'. ప్రతి ఏటా ఏప్రియల్ - మే నెలలో మళయాళ పంచాగం ప్రకారం మీనభరణి వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు.

చిత్ర కృప : Arunvrparavur

పుట్టింగళ్ దేవి ఆలయం

పుట్టింగళ్ దేవి ఆలయం

మీన భరణి ఉత్సవాల్లో ప్రధాన ఆకర్షణ 'మత్సర కంబం'. ఆ పేరుతో సాయంత్రంవేళ బాణాసంచా ప్రదర్శన పోటీలు నిర్వహిస్తారు.

చిత్ర కృప : Sudheeshthulaseedharan

పుట్టింగళ్ దేవి ఆలయం

పుట్టింగళ్ దేవి ఆలయం

కేవలం మీన భరణి వేడుకల సమయంలోనే కాదు అశ్వతి విలక్కు, కంపడికలి, కథకళి, మరమేడప్పు మొదలైన ఉత్సవాలలో కూడా పెద్ద ఎత్తున బాణాసంచా ప్రదర్శన ను ఈ ఆలయం బయట ఉండే విశాల ప్రాంగణంలో కాలుస్తారు.

చిత్ర కృప : Sreejith Bharathan

పుట్టింగళ్ దేవి ఆలయం

పుట్టింగళ్ దేవి ఆలయం

కన్నుల పండగ గా సాయంత్రం నుండి పొద్దుపోయే వరకు జరిగే ఈ బాణాసంచా ప్రదర్శన ను తిలకించడానికి కేరళ రాష్ట్రం నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తారు (మొన్న జరిగిన దుర్ఘటనకి ప్రధాన కారణం ఈ బాణాసంచా ప్రదర్శనే ..!).

చిత్ర కృప : Arunvrparavur

పరిశ్రమలు

పరిశ్రమలు

పరవూర్ లో కేరళ ప్రభుత్వం 5 ఎకరాల్లో ఐటీ పార్క్ ఏర్పాటు చేయాలని చూస్తున్నది. అలాగే పీచు తయారీ పరిశ్రమలను, చేనేత పరిశ్రమలను మరియు ఫుడ్ పార్క్ ను ఏర్పాటు చేయాలని యోచిస్తున్నది.

చిత్ర కృప : Tom

సరస్సులు మరియు తీర ప్రాంతం

సరస్సులు మరియు తీర ప్రాంతం

పరవూర్ కయల్(సరస్సు) మరియు అరేబియా సముద్ర తీర ప్రాంతం, బ్యాక్ వాటర్ అందాలు పర్యాటకులను మరియు ఇక్కడికి వచ్చే విదేశీ యాత్రికులను ఆకర్షిస్తున్నాయి.

చిత్ర కృప : Sathyan Photography

పరవూర్ చేరుకోవటం ఎలా ?

పరవూర్ చేరుకోవటం ఎలా ?

పరవూర్ చేరుకోవటానికి వాయు, రైలు మరియు రోడ్డు మార్గాలు అందుబాటులో ఉన్నాయి.

వాయు మార్గం

తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయం పరవూర్ కు 60 కి. మీ. దూరంలో ఉన్నది. అక్కడి నుండి క్యాబ్ లేదా ట్యాక్సీ లలో ప్రయాణించి పరవూర్ పట్టణానికి సులభంగా చేరుకోవచ్చు.

రైలు మార్గం

పరవూర్ కు సమీపాన 12 కి. మీ. దూరంలో కొల్లాం జంక్షన్ కలదు. ట్యాక్సీ లేదా ప్రభుత్వ బస్సుల్లో ప్రయాణించి ఇక్కడికి సులభంగా చేరుకోవచ్చు

రోడ్డు లేదా బస్సు మార్గం

తిరువనంతపురం, కొల్లాం, వర్కాల, పరిప్పల్లి తదితర పట్టణాల నుండి పరవూర్ కు నిత్యం ప్రభుత్వ / ప్రవేట్ బస్సులు నడుస్తుంటాయి.

చిత్ర కృప : Arunvrparavur

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X