Search
  • Follow NativePlanet
Share
» »అత్యంత శోభాయమానంగా త్రిశూర్‌ పూరం ఫెస్టివల్‌లో గజరాజుదే ప్రధానాకర్షణ..

అత్యంత శోభాయమానంగా త్రిశూర్‌ పూరం ఫెస్టివల్‌లో గజరాజుదే ప్రధానాకర్షణ..

కేరళ రాష్ట్రంలో ఉత్తరంగా ఉన్నత్రిస్సూర్ జిల్లాలోని ప్రముఖ పుణ్య స్థలం గురువాయూరు. ఇక్కడ త్రిస్సూర్ గురించి చెప్పుకోవాలి. త్రిస్సూర్ ఒకప్పుడు కొచ్చిన్ రాజవంశీయులకి ముఖ్య పట్టణంగా ఉండేది. ఇది కేరళకి సాంస్కృతిక రాజధానిగా పేరొందింది. ఇది 'తెక్కినాడు మైదాన్' అనే చిన్న కొండమీద ఉన్నది.త్రిశూర్ లేదా త్రిశివపెరుర్(మహా శివుడి పేరుతో ఉన్న ప్రాంతం) వడ్డక్కుంనాథన్ క్షేత్రం లో కొలువైన దేవుడి పేరు మీద ప్రాచుర్యం పొందింది.

సంప్రదాయాలు, ఆచారాల్లో కేరళ ప్రత్యేకమైనది. మేడం మాసంలో (ఏప్రిల్ -మే) త్రిశూర్ పూరం పండుగ అత్యంత శోభాయమానంగా జరుగుతుందిక్కడ. ప్రతీ ఏటా ఎండాకాలంలో ఈ ఉత్సవాలను నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. సంబరాల్లో భాగంగా కాళీమాతను త్రిసూర్‌ వీధుల్లో ఊరేగిస్తారు. పది గ్రామాల నుంచి అమ్మవారి ఉత్సవ విగ్రహాలు ఏనుగులపై ఊరేగుతూ.. త్రిశూర్‌ చేరుకుంటాయి. పూరం పండుగలో ఏనుగుల ప్రదర్శన ప్రత్యేకమైనది.

త్రిశూర్ లో ని వడుక్కునాథన్ (శివుడు)ఆలయం

త్రిశూర్ లో ని వడుక్కునాథన్ (శివుడు)ఆలయం

త్రిశూర్ లో ని వడుక్కునాథన్ (శివుడు)ఆలయం వేదికగా జరిగే ఉత్సవంలో చుట్టుపక్కల గ్రామాల దేవుళ్లూ భాగస్వాములవుతారు. వడక్కునాథుని సన్నిధిలో ప్రత్యేక పూజల తర్వాత ఆలయ సమీపంలోని థెక్కిన్‌కాడు మైదానంలో అసలు సంబరం మొదలవుతుంది. గజరాజుల గమనం, వాటిపై ఊరేగి వచ్చే ఉత్సవమూర్తుల రాజసం గురించి ఎంత చెప్పినా తక్కువే. జనాల ఉత్సాహాన్ని రెట్టిస్తూ పంచ వాద్యాల హోరు మిన్నంటుతుంది. ఈ వేడుకను వీక్షించడానికి దేశవిదేశాల నుంచి పర్యాటక ప్రియులు తరలి వస్తారు.

Photo Courtesy : Adarsh Padmanabhan

వడక్కునాథన్ దేవాలయం పరశురాముడు స్థాపించినట్లు

వడక్కునాథన్ దేవాలయం పరశురాముడు స్థాపించినట్లు

వడక్కునాథన్ దేవాలయం పరశురాముడు స్థాపించినట్లు చెబుతారు. ఇది కేరళ కు చెందిన ప్రత్యేక వాస్తు శిల్పం తో నిర్మించబడింది. ఈ ఆలయంలోని శివలింగానికి వందల ఏళ్లుగా నెయ్యితో అభిషేకాలు చేయగా చేయగా అది ఒక పెద్ద గుట్టలా పేరుకుపోయిందని అంటారు. సుమారు అయిదారు మీటర్ల ఎత్తున్న నెయ్యిగుట్ట శివలింగాన్ని పూర్తిగా కప్పేసిందట. దాని కింద శివలింగం ఉందట.

pc: Rameshng

త్రిశూర్ లోని ఇతర ఆకర్షణలు:

త్రిశూర్ లోని ఇతర ఆకర్షణలు:

దైవత్వం, ప్రకృతి మరియు సంస్కృతి ల సమ్మేళనం త్రిశూర్ నగరం. త్రిసూర్ జిల్లాలో చారిత్రకంగా పేరొందిన అనేక దేవాలయాలున్నాయి. అందులో ముఖ్యంగా ‘వడకున్నాథన్' దేవాలయం, ‘గురువాయూర్ ‘దేవాలయం చెప్పుకోదగ్గవి. త్రిసూర్ జిల్లాలో ‘కొడంగళూర్' తాలూకాలో ఉన్న ‘చేరామన్ జుమా మసీదు' ఒక ప్రత్యేకతను కలిగి ఉంది. ఇక్కడి మసీదుపైన హిందూ మత సంస్కృతి కనిపిస్తుంది. ఇక్కడ అఖండ దీపం వెలుగుతుంటుంది. అన్ని మతాల ప్రజలూ, భక్తులు ఇక్కడి అఖండ దీపంలో నూనెను పోసి వెళ్లవచ్చు.ఎన్నో జలపాతాలు, బీచ్ లు, డ్యాం వంటి వివిధ ఆకర్షణలతో ఈ ప్రాంతం పర్యాటకులను అమితంగా ఆకర్షిస్తుంది.

గురువాయూర్

గురువాయూర్

గురువాయూరప్పన్ దేవాలయం దేశవ్యాప్తంగా ప్రసిద్ధిగాంచిన దేవాలయం. త్రిసూర్ నుండి 29కిలోమీటర్ల దూరంలో ఉన్న గురువాయూర్ రోడ్ మార్గంలో వెలితే గురువాయూర్ చేరుకోవచ్చు. ఈ ఆలయాన్ని ‘భూలోక వైకుంఠం’ గా పిలుస్తారు. విష్ణుమూర్తిని కృష్ణుడి రూపంలో పూజిస్తారిక్కడ. నాలుగుచేతులతో ఉన్న కృష్ణ విగ్రహం శంఖం, సుదర్శన చక్రం, తులసి మాల, కలువ పువ్వులను కలిగి ఉంటుంది. గురువాయూర్ ను ‘దక్షిణాది ద్వారక’ గా చెబుతారు. భారత దేశంలోని ఐదు ప్రముఖ వైష్ణవ దేవాలయాలలో ఇది ఒకటి.

Photo Courtesy : commons.wikimedia.org

గురువాయూర్ లోని దేవాలయంలోని విగ్రహం విష్ణుమూర్తి

గురువాయూర్ లోని దేవాలయంలోని విగ్రహం విష్ణుమూర్తి

గురువాయూర్ లోని దేవాలయంలోని విగ్రహం విష్ణుమూర్తి అవతారమైనా అది కృష్ణుని దేవాలయం గా చెబుతారు. దేవుని గురువాయూరప్పన్ గా పిలుస్తారు. ఈ విగ్రహం పంచలోహాలతో తయారైందని చెబుతారు. ప్రతిరోజూ ఈ విగ్రహానికి నువ్వుల నూనెను రాస్తారు. ఆపైన నీటితో అభిషేకం చేస్తారు. ఆనీటిని పవిత్రతీర్థంగా భక్తులు తీసుకుంటారు. దేవాలయానికి ఉత్తర దిక్కున ‘రుద్రతీర్థం' అనే నీటి కొలను ఉంది.

pc:: hariharan swastik

దక్షిణాది దేవాలయాలకు తమవైన ఏనుగులు ఉండటం ఆచారంగా

దక్షిణాది దేవాలయాలకు తమవైన ఏనుగులు ఉండటం ఆచారంగా

దక్షిణాది దేవాలయాలకు తమవైన ఏనుగులు ఉండటం ఆచారంగా వస్తోంది. అలాగే గురువాయూర్ దేవాలయానికి సంబంధించి అనేక ఏనుగులు ఉన్నాయి. ఇక్కడ భక్తులు అనేక రకాల కానుకలను భక్తితో సమర్పిస్తారు, అందులో ఏనుగులను కానుకగా ఇవ్వటం ప్రముఖంగా కనిపిస్తుంది. ఈ ఏనుగులు దేవాలయం నిర్వహించే అనేక పండుగలలో ప్రముఖ పాత్రని కలిగున్నాయి.

గురువాయూర్ ఏనుగులలో ‘కేశవన్ ‘ అన్న ఏనుగు ప్రపంచ ప్రసిధ్ధి పొందింది. కేశవన్ సత్ ప్రవర్తనతో గురువాయురప్పకు సేవ చేసిందని గజరాజు బిరుదును కూడా ఇచ్చారు. 1975 లో వచ్చిన మలయాళ సినిమా ‘గురువాయూర్ కేశవ' సినిమాకు ఈ ఏనుగు ప్రేరణగా చెబుతారు.

PC: Manojk

పున్నత్తూర్ కోట

పున్నత్తూర్ కోట

గురువాయూరుకు రెండు కిలోమీటర్ల దూరంలో ‘పున్నత్తూర్ కోట’ అనే ప్రాంతంలో దేవాలయానికి చెందిన దాదాపు 75 ఏనుగులను సంరక్షిస్తున్నారు. ఈ కోట పూర్వం ఒక రాజ వంశీయులకు చెందిన కోట. ప్రస్తుతం ఏనుగుల మ్యూజియంగా మారిన ఈ కోటను ప్రత్యేక అనుమతి రుసుముతో సందర్శించవచ్చు. ఇక్కడ ప్రతి ఉదయం ఏనుగులకు స్నానం చేయించడాన్ని చూడవచ్చు. వాటికి భోజనం తినిపించడం చూడవచ్చు.

P.C: You Tube

పరంబిక్కులం వైల్డ్ లైఫ్ సాంక్య్చురి :

పరంబిక్కులం వైల్డ్ లైఫ్ సాంక్య్చురి :

ప్రకృతి ప్రేమికులకి ఈ పరంబిక్కులం వైల్డ్ లైఫ్ సాంచురి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుంది. తమిళనాడు లో ఉన్న అన్నామలై మరియు కేరళ లో ఉన్న నేల్లింపతి పరిధుల మధ్యలో ఉన్న ఈ లోయ సహజమైన ప్రకృతి సౌందర్యానికి ఉదాహరణ. ఈ సాంచురి దాదాపు 285 చదరపు కిలోమీటర్ల మేరకు విస్తరించింది. ఇందులో వివిధ రకాల వృక్ష మరియు జంతు జాలాన్ని గమనించవచ్చు.
Photo Courtesy : en.wikipedia.org

వాడక్కుంనాథన్ టెంపుల్ :

వాడక్కుంనాథన్ టెంపుల్ :

ఈ గుడిలో మహా శివుడు కొలువై ఉంటాడు. పురాణాల ప్రకారం, విష్ణు మూర్తి అవతారమైన పరశురాముడు నిర్మించిన గుడులలో ఇది మొట్ట మొదటి గుడి. ఈ గుడిలో దైవత్వం యొక్క ప్రశాంత కిరణాలు భక్తులపై ప్రసరిస్తాయి. ఈ గుడికి నలువైపులా ఉన్న అధ్బుతమైన బురుజులు కేరళ యొక్క నిర్మాణకళ ని ప్రతిబింబిస్తాయి.
Photo Courtesy : Adarsh Padmanabhan

తిరువంబడి కృష్ణ టెంపుల్

తిరువంబడి కృష్ణ టెంపుల్

శ్రీ కృష్ణుడి భక్తులకి ఆధ్యాత్మిక స్వర్గం ఈ తిరువంబడి కృష్ణ టెంపుల్. శతాబ్దాల క్రితం, ఎన్నో పురాణాలు, కథలలో ఈ గుడి అత్యంత ప్రాచుర్యం పొందింది. ఉదయం 5 నుండి 11 గంటల వరకు మళ్లీ సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8:30 నిమిషాల వరకు ఈ గుడి తెరిచి ఉంచే వేళలు. స్వరాజ్ రౌండ్ కి దగ్గరగా ఈ గుడి ఉంది. త్రిశూర్ పూరం పండుగలో రెండు విభాగాలైన త్రిశూర్ కి ప్రతినిధిగా కేరళలో జరిగే ఈ వేడుకలలో ప్రధానంగా పాల్గొనే రెండు గుడులలో తిరువంబడి కృష్ణ టెంపుల్ ఒకటి.

Photo Courtesy : commons.wikimedia.org

అతిరాపల్లి వాటర్ ఫాల్

అతిరాపల్లి వాటర్ ఫాల్

త్రిశూర్ జిల్లాలో ఉంది ఈ వాటర్ ఫాల్. త్రిశూర్ నుంచి 60 కిలోమీటర్ల దూరంలో ఉంది. కొచ్చిన్ నుంచి అయితే 70 కిమీల దూరంలో ఉంటుంది. చలకుడి అనే నది మీద ఈ జలపాతం ఉంటుంది.ప్రముఖ పిక్నిక్ స్పాట్ ఉంది. 80 మీటర్ల ఎత్తు నుంచి జాలువారుతున్న సెలయేర్లను చూసి మైమరిచిపోవాల్సిందే. అతిరాపల్లి వాటర్ ఫాల్‌నే ఇండియా నయగారా ఫాల్స్ అని కూడా పిలుస్తారు. కేరళలోనే అత్యంత పెద్ద వాటర్ ఫాల్ ఇది.

Photo Courtesy : commons.wikimedia.org

త్రిశూర్ లో ఉన్న అర్కేలాజికల్ మ్యుజియం

త్రిశూర్ లో ఉన్న అర్కేలాజికల్ మ్యుజియం

త్రిశూర్ లో ఉన్న అర్కేలాజికల్ మ్యుజియం 1938 లో ఏర్పాటైంది. ప్రస్తుతం కనిపిస్తున్న పురావస్తు గాలెరి మరియు పిక్చర్ గాలెరి ల అనుసంధానం మాత్రం 1975 లో రూపుదిద్దుకుంది. పురాతన లిఖిత ప్రతులు, త్రవ్వకాలలో లభించిన పదార్ధాలు మరియు ఏడవ శతాబ్దానికి చెందిన రాతి శిల్పాలు వంటి ఆసక్తికరమైన చారిత్రిక అంశాలతో ఈ మ్యూజియం సందర్శన గొప్ప పర్యాటక అనుభవాన్ని కలిగిస్తుంది.
Photo Courtesy : Arjuncm

పీచి డ్యాం:

పీచి డ్యాం:

(20 కి.మీ; నగరం నుండి కి.మీ) ఇది ఒక మంచి పిక్నిక్ స్పాట్ ఉంది
Photo Courtesy : commons.wikimedia.org

త్రిశూర్ ఎలా చేరుకోవాలి ?

త్రిశూర్ ఎలా చేరుకోవాలి ?

త్రిశూర్ రైల్వే స్టేషన్ PC : Arjuncm3

వాయు మార్గం : త్రిశూర్ కు సమీపాన 58 కిలోమీటర్ల దూరంలో కొచ్చి అంతర్జాతీయ ఎయిర్ పోర్ట్ కలదు. ఇక్కడికి దేశ, విదేశాల నుండి విమానాలు వస్తుంటాయి. క్యాబ్ లేదా టాక్సీ అద్దెకు తీసుకొని త్రిశూర్ వెళ్ళవచ్చు.

రైలు మార్గం : త్రిశూర్ లో రైల్వే స్టేషన్ కలదు. చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, తిరువేండ్రం తదితర ప్రాంతాల నుండి ఇక్కడికి రైళ్లు వస్తుంటాయి.
రోడ్డు మార్గం : కేరళ రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుండి త్రిశూర్ కు బస్సులు వస్తుంటాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X