Search
  • Follow NativePlanet
Share
» »టోంక్ - కట్టడాలలో చరిత్ర గాధలు !

టోంక్ - కట్టడాలలో చరిత్ర గాధలు !

By Mohammad

టోంక్ .. భారతదేశానికి స్వాతంత్రం రాక ముందు ఒక రాచరిక పట్టణం. ఈ పట్టణాన్ని ఎన్నో రాచరిక వంశాలు పాలించాయి. జైపూర్ నగరానికి 90 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ పట్టణంలో చూడవలసిన అద్భుతాలు అనేకం. ఇక్కడి ఒక్కో కట్టడం ఒక్కో చరిత్ర కు సంబంధించిన కథ ను వివరిస్తుంది.

టోంక్ లో చూడవలసిన పర్యాటక స్థలాలు

టోంక్ లో చూసేందుకు ఎన్నో పర్యాటక స్థలాలు ఉన్నాయి. సునేహ్రి కోఠి, బిసాల్పూర్, రసియా కి టేక్రి, చాం ద్లాయి, ఘంటా ఘర్, గోవింద్ దేవ్ జీ ఆలయం, హతీ భాటా, జల్దేవి మందిరం, జామా మసీద్, మండకల, కల్ప వృక్షం, నాగర్ కోట మొదలైనవి చూడదగ్గవి.

ఇది కూడా చదవండి : జైపూర్ లో తప్పక చూడవలసిన పర్యాటక ప్రదేశాలు !

సునేహ్రి కోఠి

సునేహ్రి కోఠి

చిత్ర కృప : telugu native planet

సునేహ్రి కోఠి

టోంక్ లోని సున్రేహి కోఠి లేదా బంగారు భవనం ప్రతి ఏటా ఎక్కవ మంది పర్యాటకులను ఆకర్షిస్తున్నది. నవాబు ఇబ్రహీం అలీ ఖాన్ కవితా పఠనాల కోసం, సంగీతం, నాట్యం కోసం ఈ మహల్ ను నిర్మించాడు. ఈ కట్టడం లోపలి భాగం బంగారు మెరుపులతో, వజ్రాలు, విలువైన జాతి రాళ్ళతో , గాజుతో చెక్కబడిన అద్భుత కళాఖండాలు ఉంటాయి. ఈ భవనం లోపల ఉన్న అద్భుత నిర్మాణాలు, కళాఖండాల కారణంగా దీనిని మాన్షన్ అఫ్ గోల్డ్ అని కూడా పిలుస్తారు.

హాథీ భాటా

హాథీ భాటా టోంక్ పట్టణం నుండి 22 కిలోమీటర్ల దూరంలో ఉన్న మరొక ప్రసిద్ధ పర్యాటక ప్రదేశం. ఏక శిలను తొలిచి ఏనుగు ఆకారంలో నిర్మించిన ఆ జక్కన ఎవరో గానీ అతని సృజనాత్మకత మెచ్చుకోక తప్పదు. రామ్ నాథ్ స్లాట్ అనే శిల్పి క్రీ.శ. 1200 వ సంవత్సరంలో ఈ శిలను చెక్కినాడు. ఏనుగు కుడి చెవి పై హాథీ భాటా యొక్క చారిత్రక నేపధ్యాన్ని తెలిపే శాశనాలు ఉన్నాయి.

హాథీ భాటా

హాథీ భాటా

చిత్ర కృప : telugu native planet

కల్ప వృక్షం

బలుండా గ్రామం లో కల్ప వృక్షం ఉన్నది. కోరిన కోరిన కోర్కెలను తీర్చే పవిత్ర చెట్టుగా దీనిని పరిగనిస్తారు. కార్తీక మాసంలో ఈ చెట్టు ను చూడటానికి, పూజలు చేయటానికి భక్తులు తరలి వస్తుంటారు.

బిసాల్పూర్

టోంక్ జిల్లాలోని బిసాల్పూర్ గ్రామం గోకర్నేశ్వర ఆలయానికి ప్రసిద్ధి చెందినది. బసన్ నది ఒడ్డున నిర్మించిన ఈ ఆలయం శివరాత్రి పర్వదినాలలో భక్తులు అధిక సంఖ్యలో హాజరవుతారు. సమీపంలో రిజర్వాయర్ చూడదగ్గది.

గోకర్నేశ్వర ఆలయం

గోకర్నేశ్వర ఆలయం

చిత్ర కృప : telugu native planet

గోవింద్ దేవ్ జీ ఆలయం

గోవింద్ దేవ్ జీ ఆలయం కృష్ణుడి కి అంకితం చేయబడిన ఆలయం. మొదట్లో గుడిలోని విగ్రహం బృందావనంలో ఉండేది. ఈ ప్రాంతాన్ని పాలించిన రెండవ సవాయి జై సింగ్ ఈ విగ్రహాన్ని తమ కులదైవం గా భావించి ఇక్కడ స్థాపించాడు. ప్రతి ఏటా భక్తులు ఈ ఆలయాన్ని సందర్శిస్తుంటారు.

గోవింద్ దేవ్ జీ ఆలయం

గోవింద్ దేవ్ జీ ఆలయం

చిత్ర కృప : telugu native planet

ఎలా చేరుకోవాలి ?

విమాన మార్గం

జైపూర్ విమానాశ్రయం 100 KM ల దూరంలో కలదు. టాక్సీ లేదా క్యాబ్ లలో ప్రయాణించి టోంక్ చేరుకోవచ్చు.

రైలు మార్గం

బనస్థలి - నేవాయి రైల్వే స్టేషన్ టోంక్ కు 35 కిలోమీటర్ల దూరంలో కలదు. స్టేషన్ బయట టాక్సీ లేదా ప్రభుత్వ బస్సులలో ప్రయాణించి టోంక్ చేరుకోవచ్చు.

బస్సు మార్గం

ఢిల్లీ, జైపూర్, అజ్మీర్, కోట, బుండీ మొదలైన ప్రదేశాల నుండి టోంక్ కు రాజస్థాన్ రాష్ట్ర సర్వీస్ బస్సులు అందుబాటులో ఉన్నాయి.

టోంక్ ఎలా చేరుకోవాలి ?

టోంక్ ఎలా చేరుకోవాలి ?

చిత్ర కృప : srkblogs

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X