Search
  • Follow NativePlanet
Share
» »వాస్కో డా గామా - గోవా షాపింగ్ ల స్వర్గం !

వాస్కో డా గామా - గోవా షాపింగ్ ల స్వర్గం !

By Mohammad

వాస్కో డా గామా అనే పోర్చుగీష్ నావికుడు భారతదేశానికి సముద్రమార్గాన్ని(1498 వ సంవత్సరంలో) కనుగొన్నాడు. ఇతని పేరు మీదనే గోవాలో అతని జ్ఞాపకార్థం ఒక ప్రాంతానికి వాస్కో డా గామా అన్న పేరు పెట్టారు. ఇక్కడ షాపింగ్ సెంటర్ లు అధికం. గోవా వచ్చి 'వాస్కోడా' చూడకపోతే గోవా పర్యటన కిక్కు ఎక్కదు.

ఇది కూడా చదవండి : గోవా - నీ అందం ఆదరహో .. !

వాస్కో డా గామా వాణిజ్య ప్రదేశం. బాలీవూడ్ సినిమా షూటింగ్ లు కూడా ఇక్కడ తీస్తుంటారు. సినిమా చూస్తే చాలు అవి ఈ ప్రదేశంలో తీసినవిగా వెంటనే చెప్పేస్తారు. సినిమా షూటింగ్ లే తీస్తున్నారంటే ఆలోచించండీ ... ఈ ప్రదేశం ఎంత అందంగా ఉంటుందో !. ఇక ఆలస్యం ఎందుకు ఆ అందాలెంటో మనమూ ఒకసారి చూసొచ్చేద్దాం పదండి ..!

వాస్కో డా గామా ఎలా చేరుకోవాలి ?

వాస్కో డా గామా ఎలా చేరుకోవాలి ?

వాయు మార్గం

గోవా మొత్తం మీద ఒకేఒక ఏర్‌పోర్ట్ ఉన్నది. దానిపేరు డబోలిం ఏర్‌పోర్ట్. ఇదొక అంతర్జాతీయ విమానాశ్రయం. దేశ, విదేశాల నుంచి ఇక్కడికి విమానాలు రాకపోకలు సాగిస్తుంటాయి. ముఖ్యంగా పోర్చుగీస్ నుండి విమానాలు నిత్యం తిరుగుతుంటాయి. హైదరాబాద్, బెంగళూరు, ముంబై, ఢిల్లీ, కలకత్తా, చెన్నై నుండి కూడా ప్రతిరోజూ విమానాలు నడుస్తాయి. ఏర్ పోర్ట్ పక్కనే ఉన్న వాస్కో డా గామా కు కేవలం 2 -5 నిమిషాల్లో నడుచుకుంటూ చేరిపోవచ్చు.

చిత్ర కృప : Darius Jijina

వాస్కో డా గామా ఎలా చేరుకోవాలి ?

వాస్కో డా గామా ఎలా చేరుకోవాలి ?

రైలు మార్గం

వాస్కో డా గామా లో రైల్వే స్టేషన్ ఉన్నది. దేశంలోని అన్ని ప్రధాన నగరాల నుండి ఇక్కడికి రైళ్లు నడుస్తుంటాయి. ముంబై నుండి నిత్యం ఒక రైలు ఇక్కడికి తిరుగుతుంది. బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, మంగళూరు, కొచ్చి ల నుండి ఒక్క రాత్రి ప్రయాణంలో చేరుకోవచ్చు.

చిత్ర కృప : Joegoauk Goa

వాస్కో డా గామా ఎలా చేరుకోవాలి ?

వాస్కో డా గామా ఎలా చేరుకోవాలి ?

రోడ్డు మార్గం

గోవా మీదుగా జాతీయ రహదారి 17 వెళుతుంది. ముంబై, మంగళూరు, బెంగళూరు, హైదరాబాద్, పూణే, బెల్గాం పట్టణాల నుండి ప్రతిరోజు బస్సులు తిరుగుతాయి. ఎన్నో అత్యాధునిక సౌకర్యాలు ఉన్న ప్రవేట్ బస్సులు సైతం ప్రధాన నగరాల నుండి రాత్రుళ్ళు నడుస్తాయి.

చిత్ర కృప : Gourav Shinde 94

బీచ్ లు

బీచ్ లు

వాస్కో డా గామా లో బైనా, హన్సా, బొగ్ మాలో, గ్రాండ్ మదర్స్ హోల్ అనే పేరుగల నాలుగు బీచ్ లు ఉన్నాయి. ప్రసిద్ధి చెందిన ఈ బీచ్ ల ను చూడటానికి పర్యాటకులు అధిక సంఖ్యలో వస్తుంటారు.

చిత్ర కృప : Pulin Pegu

గ్రాండ్ మదర్స్ హోల్స్ బీచ్

గ్రాండ్ మదర్స్ హోల్స్ బీచ్

ఈ బీచ్ కు ఒక ప్రత్యేకత ఉన్నది. ఈ బీచ్ కు వెళ్ళాలంటే, పర్యాటకులు ఒక రంధ్రం ద్వారా వెళ్ళాలి. ఫోర్టలేజా శాంతా కేటరీనా ఫోర్ట్ వద్ద ఉన్న రంధ్రం నుండి ఈ తతంగం మొదలవుతుంది. రంధ్రం గుండా వెళితే గ్రాండ్ మదర్స్ హోల్స్ బీచ్ ను చేరుకోవచ్చు. బీచ్ చూడటానికి అందంగా ఉంటుంది. అవసరమైతే చేపలు కూడా పట్టవచ్చు (ఇప్పుడు పట్టొచ్చో లేదో లేదా తెలీదు).

చిత్ర కృప : Sylvester D'souza

బొగ్ మాలో బీచ్

బొగ్ మాలో బీచ్

బొగ్ మాలో బీచ్ కూడా వాస్కో డా గామా లో చూడదగినదే ..! బీచ్ వద్ద ఇసుక తిన్నెల మీద సాయంత్రం పూట కూర్చొని పల్లీలు, బటానీలు తింటూ సూర్యాస్తమాలను వీక్షించవచ్చు. సన్ బాతింగ్, ఈత, నీతి క్రీడలను సైతం చేపట్టవచ్చు.

చిత్ర కృప : Dinesh Bareja

నేవీ ఏవిఏషన్ మ్యూజియం

నేవీ ఏవిఏషన్ మ్యూజియం

బొగ్ మాలో బీచ్ కు సమీపంలో గల నేవల్ ఏవియేషన్ మ్యూజియం తప్పక చూడాలి. ఈ మ్యూజియంలో గోవా నౌకా చరిత్ర పోర్చుగీసుల కాలం నాటినుండి ఎలా ఉందనేది తెలుస్తుంది. అనేక సంవత్సరాలనుండి ఇప్పటి వరకు జరిగిన మార్పులుచేర్పులు, భారతీయ నౌకాదళ విశేషాలు, వింతలు కూడా ఇది చూపుతుంది.

చిత్ర కృప : Faram Khambatta

మార్ముగోవా ఫోర్ట్

మార్ముగోవా ఫోర్ట్

వాస్కో డా గామా లో క్రీ.శ. 1624 వ సంవత్సరంలో కట్టబడిన మార్ముగోవా ఫోర్ట్ అందమైన కోస్తా తీరంలో గలదు. వర్కా బీచ్ కు సమీపాన ఉన్న ఈ ఫోర్ట్ ఎండ, బీచ్, ఇసుక మొదలైన వాటి నుండి కొంత హాయిని ఇస్తుంది.

చిత్ర కృప : Desmond Lobo

మార్ముగోవా ఫోర్ట్

మార్ముగోవా ఫోర్ట్

వాస్కో డా గామా లో క్రీ.శ. 1624 వ సంవత్సరంలో కట్టబడిన మార్ముగోవా ఫోర్ట్ అందమైన కోస్తా తీరంలో గలదు. వర్కా బీచ్ కు సమీపాన ఉన్న ఈ ఫోర్ట్ ఎండ, బీచ్, ఇసుక మొదలైన వాటి నుండి కొంత హాయిని ఇస్తుంది.

చిత్ర కృప : Desmond Lobo

శివాజీ కోట

శివాజీ కోట

వాస్కో డా లో ప్రసిద్ధి గాంచిన మహారాజ్ శివాజీ కోట కలదు. ఇది వాస్కో డా కు ఒక ప్రధాన ఆకర్షణ. ఇక్కడ నుండి నగర పరిసర సౌందర్యాలను, బీచ్ లను చూడవచ్చు.

చిత్ర కృప : Desmond Lobo

దోణాపౌలా బీచ్

దోణాపౌలా బీచ్

గ్రాండ్ మదర్స్ హోల్ బీచ్ సమీపంలో ఉన్న మరొక అందమైన బీచ్ దోణాపౌలా బీచ్. మదర్స్ హోల్ బీచ్ నుండి దోణాపౌలా బీచ్ కు చేరుకోవటానికి మీకు లాంచీలు లేదా ఫెర్రీలు దొరుకుతాయి. దోణాపౌలా పనాజి కు దగ్గర. ఇక్కడ షాపింగ్ లు, నీటి క్రీడలు సూచించదగినవి.

చిత్ర కృప : Ashwin Kumar

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X