Search
  • Follow NativePlanet
Share
» »హస్సన్ - హొయసుల వారసత్వ నగరం !

హస్సన్ - హొయసుల వారసత్వ నగరం !

By Mohammad

హస్సన్ కర్నాటక రాష్ట్రానికి చెందిన జిల్లా మరియు జిల్లా ప్రధాన కేంద్రం. క్రీ.శ. 11 వ శతాబ్ధంలో చన్న కృష్ణప్ప అనే సామాంతరాజు చేత స్థాపించబడింది. స్థానిక దేవత హన్సనంబ పేరిట ఈ నగరానికి ఆ పేరొచ్చిందని స్థానికుల నమ్మకం. హొయసులు ఈ జిల్లా అంతటా అద్భుత నిర్మాణాలను, ఆలయాలను నిర్మించారు.

ఇది కూడా చదవండి : బేలూరు, హళేబీడ్ పర్యాటక స్థలాలు !

హొయసుల గొప్ప సంస్కృతి జిల్లా అంతటా గొప్పగా కనిపిస్తుంది. ఈ ప్రాంత రాజులు జైన మతాన్ని ఆచరించినప్పటికీ ... చాలా భాగం శివాలయాలు తారసపడతాయి. జిల్లాలో బేలూరు, హళేబీడ్, శ్రావణబెళగొళ, సకలేశ్ పూర్ లు ప్రసిద్ధ ఆకర్షణలు గా ఉన్నాయి. కర్నాటక లో చరిత్ర, ఘనమైన సంస్కృతి పట్ల అవగాహన పెంచుకోవాలని మీరను కుంటే హస్సన్ ను తప్పక సందర్శించాలి.

నుగ్గేహళ్లి

నుగ్గేహళ్లి

హస్సన్ జిల్లా నుగ్గేహళ్లి పట్టణంలో సబ్బు రాయి తో నిర్మించిన శ్రీ లక్ష్మి నరసింహ స్వామి ఆలయాన్ని, సదాస శివాలయాన్ని తప్పక సందర్శించాలి. ఈ రెండు ఆలయాలు హస్సన్ నగరానికి 50 కి. మీ. దూరంలో ఉంటాయి. వీటిని హొయసుల రాజు వీర సోమేశ్వర మహారాజు దగ్గర సేనాధిపతి గా పనిచేసిన బొమ్మన్న దండనాయక కట్టించినాడు.

చిత్ర కృప : telugu native planet

లక్ష్మి నరసింహ స్వామి ఆలయం

లక్ష్మి నరసింహ స్వామి ఆలయం

ఆలయ నిర్మాణాలు

క్రీ.శ. 1246 వ సంవత్సరంలో నిర్మించిన శ్రీ లక్ష్మి నరసింహ స్వామి ఆలయంలో మూడు గోపురాలు, గోడలపై చెక్కిన అనేక శిల్పాలు మరియు ఒక ప్రార్థనా మందిరం ఉన్నాయి. నిలబడి ఉన్న పార్వతి దేవి విగ్రహం ఇక్కడ ప్రధాన ఆకర్షణ.

చిత్ర కృప : Balaji Ganesh

సదాస శివాలయం

సదాస శివాలయం

నాగారం శైలి లో వుండే గోపురం తో సదాశివాలయాన్ని ఏకకూట నిర్మాణ శైలి లో నిర్మించారు. ఈ పుణ్య క్షేత్రం లోని గర్భ గుడిలో పెద్ద శివలింగం వుంది. రాతి గవాక్షాలతో కూడుకున్న ఒక పెద్ద గదిలో అందంగా చెక్కిన నంది విగ్రహాన్ని ఉంచారు.

చిత్ర కృప : Balaji Ganesh

యగాచి

యగాచి

హస్సన్ నగరానికి 45 కి. మీ. దూరంలో ఉన్న యగాచి బేలూరులోని ఆకర్షణల్లో ఒకటి. ఇదొక డ్యామ్. కావేరీ నదికి ఉపనదైన యగాచి నది మీద, సముద్రమట్టానికి 965 అడుగుల ఎత్తులో ఈ జలాశయాన్ని నిర్మించారు.

చిత్ర కృప : Roopesh Kohad

సాహస క్రీడలు

సాహస క్రీడలు

ఇక్కడికి వచ్చే పర్యాటకులను ఆకర్షించేందుకు జలాశయం వద్ద సాహాస క్రీడల కేంద్రాన్ని ఏర్పాటుచేశారు. కాబట్టి ప్రయాణీకులు ఇక్కడ బనానా బోట్ రైడ్, .క్రూఇస్ బోట్, స్పీడ్ బోట్, కాయాకింగ్, జెట్ స్కింగ్, బంపర్ రైడ్ వంటి క్రీడల్లో పాల్గొనవచ్చు.

చిత్ర కృప : Prashanth M

ఒమ్బత్తు గుడ్డ

ఒమ్బత్తు గుడ్డ

పర్వతారోహణ మీద ఆసక్తి గలవారికి ఒమ్బత్తు గుడ్డ సూచించదగినది. దీనినే నైన్ హిల్స్ (ఒమ్బత్తు అంటే తొమ్మిది, గుడ్డ అంటే కొండ) అంటారు. ఇది సముద్ర మట్టానికి 971 మీ. ఎత్తులో ఉంటుంది.

చిత్ర కృప : tejaswi navilarekallu

ఒమ్బత్తు గుడ్డ

ఒమ్బత్తు గుడ్డ

ఇక్కడ స్థానికులను దారి అడిగేటప్పుడు ప్రయాణీకులు ముర్కల్ గుడ్డ అనే స్థానిక పేరుతో అడగాలి. ఈ స్థలం కబ్బినలే రిసర్వ్ ఫారెస్ట్ లోపల గుండియ చెక్ పోస్ట్ నుంచి 20 కి.మీ. దూరంలో ఉంది. ఈ స్థలం కబ్బినలె అటవీ ప్రాంతం తోనూ, శిరాది స్రిశ్లా అటవీ ప్రాంతం తోనూ, బాలూరు అటవీ ప్రాంతం తోనూ చుట్టబడి ఉంటుంది.

చిత్ర కృప : vinesh_ravindran

ఒమ్బత్తు గుడ్డ

ఒమ్బత్తు గుడ్డ

ఇక్కడ స్థానికులను దారి అడిగేటప్పుడు ప్రయాణీకులు ముర్కల్ గుడ్డ అనే స్థానిక పేరుతో అడగాలి. ఈ స్థలం కబ్బినలే రిసర్వ్ ఫారెస్ట్ లోపల గుండియ చెక్ పోస్ట్ నుంచి 20 కి.మీ. దూరంలో ఉంది. ఈ స్థలం కబ్బినలె అటవీ ప్రాంతం తోనూ, శిరాది స్రిశ్లా అటవీ ప్రాంతం తోనూ, బాలూరు అటవీ ప్రాంతం తోనూ చుట్టబడి ఉంటుంది.

చిత్ర కృప : Anandprakash Yadav

హళేబీడ్

హళేబీడ్

హళేబీడ్ లో హొయసుల రాజుల రాచరిక హంగులను గమనించవచ్చు. ఇక్కడ ఉన్న హొయలేశ్వర, శాంతాలేశ్వర, కేదారేశ్వర, బెలవడి, బసాదిహల్లి నిర్మాణంలో నాటి రాచరిక వైభవాలు, సంస్కృతి, సంప్రదాయాల ను ప్రతిబింబించే విధంగా శిల్పాలను చెక్కినారు. ఇది శిధిలమైన నగరం అయినప్పటికీ పర్యాటకులను అమితంగా ఆకట్టుకుంటుంది.

చిత్ర కృప : Leon Meerson

బేలూరు

బేలూరు

హస్సన్ నగరం నుండి బేలూరు 38 కి. మీ. దూరంలో ఉన్నది. ఇక్కడ ప్రముఖ ఆకర్షణ చెన్నకేశవ ఆలయం. విష్ణుమూర్తి కోసం నిర్మించిన ఈ ఆలయం గాలి గోపురం ఎత్తు ఎంతో ప్రసిద్ధి చెందినది. కప్పె చేన్నిగరాయ ఆలయం, వీర నారాయణ స్వామి ఆలయం, దర్పణ సుందరి, గ్రావిటీ పిల్లర్ లు చూడదగ్గ ఆకర్షణలు.

చిత్ర కృప : Raya Goupra

సకలేశ్ పూర్

సకలేశ్ పూర్

హస్సన్ నుండి సకలేశ్ పూర్ 41 కి. మీ. దూరంలో, సముద్ర మట్టానికి 947 మీ. ఎత్తున ఉంటుంది. ఇక్కడ కాఫీ, యాలకులను ఎక్కువగా పండిస్తారు. ముంజరాబాద్ ఫోర్ట్, బిస్లె ఘాట్ లు చూడదగ్గ ప్రదేశాలు.

చిత్ర కృప : white_whitehouse

శ్రావణబెళగొళ

శ్రావణబెళగొళ

శ్రావణబెళగొళ గోమఠేశ్వర విగ్రహానికి ప్రసిద్ధి చెందినది. హస్సన్ నగరం నుండి ఇది 53 కి. మీ. దూరంలో ఉంటుంది. ఇదొక ప్రాచీన జైన మత కేంద్రం. అక్కన మందిరం, భండారిబసడి ఆలయం, చంద్రగిరి దేవాలయం , జైన మఠం, కాళమ్మ దేవాలయం ,వింధ్యగిరి దేవాలయం లు ఇక్కడ చూడదగ్గ స్థలాలు.

చిత్ర కృప : Sughoshdivanji

హస్సన్ ఎలా చేరుకోవాలి ?

హస్సన్ ఎలా చేరుకోవాలి ?

హస్సన్ చేరుకోవటానికి వాయు, రైలు మరియు రోడ్డు మార్గాలు అందుబాటులో ఉన్నాయి.

వాయు మార్గం

హస్సన్ కు సమీపాన 117 కి. మీ. దూరంలో బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం కలదు. క్యాబ్ లేదా ట్యాక్సీ లలో ప్రయాణించి ఇక్కడికి చేరుకోవచ్చు.

రైలు మార్గం

హస్సన్ లో రైల్వే స్టేషన్ నగరం నుండి 2 కి. మీ. దూరంలో ఉంది. బెంగళూరు, మైసూరు, మంగళూరు నుండి ఈ స్టేషన్ కు నిత్యం రైళ్లు రాకపోకలు సాగిస్తుంటాయి.

రోడ్డు మార్గం

బెంగళూరు, మంగళూరు, మైసూరు, మడికేరి పట్టణాల నుండి ప్రతి రోజూ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బస్సులు తిరుగుతాయి.

చిత్ర కృప : rishikeshshetty

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X