Search
  • Follow NativePlanet
Share
» »హిసార్ పర్యాటకులను ఆకర్షించే అయస్కాంత నగరం !

హిసార్ పర్యాటకులను ఆకర్షించే అయస్కాంత నగరం !

By Mohammad

హిసార్ ... దేశ రాజధాని న్యూఢిల్లీ కి పశ్చిమాన 164 కిలోమీటర్ల దూరంలో హర్యానా రాష్ట్రంలో కలదు. జాతీయ రహదారికి చేరువలో ఉన్నది కనుక ఢిల్లీ వచ్చే పర్యాటకులు హిసార్ ను తప్పక సందర్శిస్తుంటారు. హిసార్ పర్యాటకులను ఆకర్షించే అయస్కాంత నగరం గా ఖ్యాతి గడించింది.

చరిత్ర గురించి ఒక్కమాటలో చెప్పాలంటే ...!

పూర్వం ఢిల్లీ రాజ్యంలో భాగమైన హిసార్ ను క్రీ.శ.13 వ శతాబ్ధంలో తుగ్లక్ వంశీయుడైన ఫిరోజ్ షా తుగ్లక్ స్థాపించాడు. ఆ తరువాత క్రీ.శ.16 వ శతాబ్ధంలో మొఘలులు కూడా ఈ ప్రాంతాన్ని పాలించారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత పంజాబ్ లో భాగమై, 1966 లో హర్యానా లో విలీనమైపోయింది.

ఇది కూడా చదవండి : ఢిల్లీ - చూడవలసిన ప్రదేశాలు దృశ్యాలలో ..!

హిసార్ చుట్టూ ఉన్న పర్యాటక ప్రదేశాలు

హిసార్ లో చూడటానికి చాలా ప్రదేశాలు ఉన్నాయి. అందులో మొదట చెప్పుకోవలసినది సెయింట్ ధామస్ చర్చి. అగ్రోహ ఆలయం, అగ్రోహ దిబ్బ, లోహరి లాఘో గ్రామం, రాఖీగార్హి, దుర్గహ్ చార్ కుతుబ్, ఫిరోజ్ షా ప్యాలెస్ కాంప్లెక్స్ మొదలగునవి ఇక్కడ చూడదగ్గవి.

అగ్రోహ ధామ్

అగ్రోహ ధామ్

అగ్రోహ ధామ్ హిసార్ పట్టణానికి చేరువలో గల అగ్రోహ గ్రామంలో కలదు. దీని నిర్మాణానికి 8 సంవత్సరాలు పట్టింది. ఆలయ సముదాయం మూడు భాగాలుగా ఉంటుంది. ప్రధాన భాగంలో దేవత మహాలక్షి విగ్రహం, పశ్చిమాన సరస్వతి దేవత మరియు తూర్పున అగ్రోహ పాలకుడు అగర్సెన్ అంకితం చేయబడ్డారు.

చిత్ర కృప : telugu native planet

అగ్రోహ ధామ్

అగ్రోహ ధామ్

శక్తి సరోవర్ పేరుతో ఒక పెద్ద చెరువు అగ్రోహ ఆలయం వెనక భాగాన ఉంటుంది. అలాగే దాని పక్కనే దేవతలు, రాక్షసులు సముద్రమును చిలికిన పౌరాణిక దృశ్యం ఉన్నది. ఈ ఆలయం యోగా మరియు అనుబంధ చికిత్సలు ద్వారా రోగులకు చికిత్స కోసం ఒక ప్రకృతి సెంటర్ ను నిర్వహిస్తుంది.

చిత్ర కృప : Pavan Gupta

సెయింట్ ధామస్ చర్చి

సెయింట్ ధామస్ చర్చి

సెయింట్ ధామస్ చర్చి హిసార్ నగరంలోని జాతీయ రహదారి పక్కనే ఉన్నది. విక్టోరియన్ శైలి లో చర్చిని నిర్మించటానికి 4 సంవత్సరాల వ్యవధి(క్రీ.శ. 1860 - క్రీ.శ. 1864) పట్టింది. చర్చి లో ఒక బలిపీఠం, ప్రబోదాల కొరకు విశాలమైన స్టేజి, ప్రధాన హాలు, బాప్టిస్ట్రరీ లు ఉన్నాయి.

చిత్ర కృప : telugu native planet

ఫిరోజ్ షా ప్యాలెస్ సముదాయం

ఫిరోజ్ షా ప్యాలెస్ సముదాయం

హిసార్ లో ఉన్న ఫిరోజ్ షా ప్యాలెస్ సముదాయాన్ని క్రీ.శ 1354 లో ఫిరోజ్ షా తుగ్లక్ నిర్మించారు. ఢిల్లీ గేట్, మోరీ గేట్, నాగురి గేట్ మరియు తలకి గేట్ కలిగిన ఈ సముదాయం లోపల ఒక ప్రాకారంతో ఉంటుంది. లాటి కి మసీదు, 20 అడుగుల ఎత్తైన ఇసుకరాయి స్థూపం, గుజ్రి మహల్ లు ఇక్కడ చూడదగ్గవి.

చిత్ర కృప : telugu native planet

అగ్రోహ దిబ్బ

అగ్రోహ దిబ్బ

చారిత్రక అంశాలతో ముడిపడి ఉన్న అగ్రోహ దిబ్బ, అగ్రోహ గ్రామం నుండి 1.5 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. ఆర్కియాలాజికల్ తవ్వకాల్లో బయటపడ్డ ఈ ప్రదేశంలో ఏడు వేల కళాఖండాలు, విగ్రహ ఘటాలు, రక్షణ గోడ, నివాస భవనాల అవశేషాలు మరియు ఇతర వస్తువులు కనుగొన్నారు.

చిత్ర కృప : telugu native planet

పృథ్వీరాజ్ ఫోర్ట్

పృథ్వీరాజ్ ఫోర్ట్

పృథ్వీరాజ్ ఫోర్ట్ హిసార్ జిల్లాలో హన్సి నగరంలో ఉన్నది. ఈ కోట 12 వ శతాబ్దంలో ప్రముఖ రాజ్ పుట్ వంశీయుడు పృథ్వీరాజ్ నిర్మించారు. ఈ కోట చతురస్రాకార ఆకారంలో 30 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి మరియు 52 అడుగుల ఎత్తు మరియు 37 అడుగుల మందపాటి గోడ చుట్టుముట్టి ఉంటుంది.

చిత్ర కృప : Pavan Gupta

పృథ్వీరాజ్ ఫోర్ట్

పృథ్వీరాజ్ ఫోర్ట్

పృథ్వీరాజ్ కోట ద్వారాలకు పక్షులు, జంతువులు మరియు హిందూ మత దేవుళ్ళ మరియు దేవతల యొక్క అందమైన చిత్రాలతో చెక్కారు. ఈ కోటలో లార్డ్ బుద్ధ మరియు లార్డ్ మహావీర్ విగ్రహాలు కూడా ఉన్నాయి. దీనిని భారతదేశ రక్షిత స్మారక చిహ్నం గా ఆర్కియాలాజికల్ వారు గుర్తించారు.

చిత్ర కృప : Pavan Gupta

పురాతన గుంబద్

పురాతన గుంబద్

నిజానికి చెప్పాలంటే పురాతన గుంబద్ బాబా పన్నీర్ బాద్‌షా అనే ఆధ్యాత్మిక గురువు యొక్క సమాధి. ఈ సమాధి చతురాస్త్రాకారంలో ఉండి నాలుగు వైపులా ఆర్చ్ వంటి ఓపెనింగ్ కలిగి ఉంటుంది. దిగువ సగ భాగం కంకర రాయితో, ఎగువ సగభాగం లఖురి ఇటుకలతో నిర్మించబడి ఉంటుంది.

చిత్ర కృప : Saad Akhtar

దుర్గహ్ చార్ కుతుబ్

దుర్గహ్ చార్ కుతుబ్

హిసార్ సమీపంలోని హన్సి లో ఉన్న దుర్గహ్ చార్ కుతుబ్ నాలుగు సూఫీ సన్యాసుల సమాధి ప్రదేశం. ప్రముఖ సూఫీ సన్యాసీ బాబా ఫరీద్ ఇక్కడ ప్రార్థనలు మరియు ధ్యానం చేసేవారు. ఈ ప్రదేశంలో జరిగే ఉరుసు ఉత్సవాలకు దేశంలోని ముస్లిం లు అధిక సంఖ్యలో హాజరవుతారు.

చిత్ర కృప : Saad Akhtar

రాఖిగార్హి

రాఖిగార్హి

రాఖిగార్హి అనే గ్రామము హిసార్ జిల్లాలో చారిత్రక ప్రాధాన్యత కలది. ఆర్కియాలజికల్ తవ్వకాల్లో బయటపడ్డ ఈ గ్రామం, క్రీ.పూ. 2000 సంవత్సరాల క్రితం నాటిదని, హరప్పా మరియు సింధూ లోయ నాగరికత లో భాగంగా ఉండేదని గుర్తించారు. త్రవ్వకాల్లో ఇటుక వరుసలు, టెర్రకోట విగ్రహాలు, కాంస్య కళాఖండాలు మొదలగునవి కనుగొన్నారు.

చిత్ర కృప : Parth Joshi

లోహరి రాఘో

లోహరి రాఘో

హిసార్ నగరానికి 52 కిమీ దూరంలో ఉన్న చారిత్రక గ్రామం లోహరి రాఘో. ఇక్కడ దర్గా, గురుద్వారా కంబోజ్ సభ, గురుద్వారా బాండ బహదూర్ మరియు శివ మందిర్, బాబా బాలాక్ నాథ్ దేవాలయం, సనతాన్ ధరం మందిర్ మరియు కొన్ని పాత మసీదులు అనేక దేవాలయాలు, చెరువులు ఉన్నాయి.

చిత్ర కృప : Pavan Gupta

హిసార్ ఎలా చేరుకోవాలి ?

హిసార్ ఎలా చేరుకోవాలి ?

విమానాశ్రయం

హిసార్ లో ఎటువంటి విమానాశ్రయం లేదు. సమీప విమానాశ్రయం 165 కి. మీ. దూరంలో ఉన్న ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయం. క్యాబ్ లేదా ట్యాక్సీ వంటి రవాణా సాధనాలనుపయోగించి హిసార్ నగరానికి చేరుకోవచ్చు.

రైలు మార్గం

హిసార్ లో రైల్వే స్టేషన్ కలదు. ఈ రైల్వే స్టేషన్ దేశంలోని అన్ని ప్రధాన నగరాలతో చక్కగా అనుసంధానించబడి ఉన్నది. సమీప ప్రాంతాల నుండి అనగా ధిలీ, చండీఘర్, నోయిడా వంటి ప్రాంతాల నుండి ప్రతి రోజు ఎక్స్‌ప్రెస్ రైళ్లు రాకపోకలు సాగిస్తుంటాయి.

రోడ్డు మార్గం

హిసార్ గుండా జాతీయ రహదారి వెళుతుంది. ఢిల్లీ నుండి 165 కిలోమీటర్ల దూరంలో ఉన్న హిసార్ కు చేరుకోవటానికి ప్రవేట్ మరియు ప్రభుత్వ బస్సులు అందుబాటులో ఉన్నాయి.

చిత్ర కృప : Sriram SN

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X