Search
  • Follow NativePlanet
Share
» »కుంటాల - తెలంగాణ లో అతి ఎత్తైన జలపాతం !!

కుంటాల - తెలంగాణ లో అతి ఎత్తైన జలపాతం !!

కుంటాల జలపాతం పర్యాటకులని కాక శివభక్తులను సైతం ఆకర్షిస్తుంది. వందల అడుగుల ఎత్తు నుండి కింద పడే జలధార మధ్యలో ఒక గుహ ఉన్నది. అందులో సోమేశ్వరుడు, నాగదేవత విగ్రహాలు ఉన్నాయి.

By Super Admin

మహిళలు ఒంటరిగా ప్రయాణం చేయవలసివచ్చినప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు !మహిళలు ఒంటరిగా ప్రయాణం చేయవలసివచ్చినప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు !

తెలంగాణ రాష్ట్రంలో అతి పెద్ద జలపాతం కుంటాల. దేశంలోనే అతి పొడవైన 44 వ జాతీయ రహదారి (పూర్వం 7 వ నెంబర్ జాతీయ రహదారి) కి అనుకోని ఉన్నది ఈ జలపాతం. దీనిని 'తెలంగాణ నయాగరా' అని పర్యాటకులు ముద్దుగా పిలుస్తుంటారు. ఇక్కడికి చేరుకోవటానికి రవాణా సదుపాయాలు బాగానే ఉన్నా ... వాచ్ మెన్, గైడ్ లు లేకపోవడం పర్యాటకులకు ఒకింత ఇబ్బంది కలిగించే విషయం. కొన్ని సార్లు పర్యాటకులు ప్రమాదాలకు గురైతుంటారు కనుక జాగ్రత్త !!

కొండల మధ్యలో పరవశింపజేసే జలపాతం !!కొండల మధ్యలో పరవశింపజేసే జలపాతం !!

కుంటాల జలపాతం ఆదిలాబాద్ జిల్లా కడెం ప్రాజెక్టుకు కింద ఉంది. సహ్యాద్రి పర్వతశ్రేణుల్లో ఏర్పడిన సహజసిద్ధ జలపాతం ఇది. కడెం నదిపై కుంటాల గ్రామం వద్ద నేలమీదకు దూకే దృశ్యాలను ఆస్వాదించడానికి రెండు కళ్లు చాలవు. కేంద్ర ప్రభుత్వం ఇటీవలే ప్రకటించిన కవ్వాలా టైగర్ జోన్ పరిధిలోకి ఇది వస్తుంది. అక్కడికి ఎలా చేరుకోవాలి ? ఏమేమి చూడాలి ?? అనే విశేషాలకు వస్తే ...

ఎక్కడ ఉంది ?

ఎక్కడ ఉంది ?

కుంటాల జలపాతం జాతీయ రహదారి 44 కు దగ్గరలో ఉంది. ఆదిలాబాద్ నుండి నిర్మల్ పోయే దారిలో కొద్దిగా కుడివైపునకు, మండలకేంద్రమైన నేరేడిగొండ కు 12 కిలోమీటర్ల దూరంలో ఉంది.

చిత్రకృప : Sumanth Garakarajula

ఇలా వెళ్ళండి

ఇలా వెళ్ళండి

ఆదిలాబాద్ నుండి లేదా నిర్మల్ నుండి ప్రభుత్వ బస్సులలో నేరేడిగొండ చేరుకొని .. అక్కడి నుండి ప్రవేట్ జీపులలో లేదా షేర్ ఆటోలలో ఎక్కి జలపాతం సులభంగా చేరుకోవచ్చు.

చిత్రకృప : Nikhilb239

సహ్యాద్రి పర్వతాలు

సహ్యాద్రి పర్వతాలు

మీరు దిగిదిగ్గానే జలపాతాల హోరు మిమ్మల్ని ఆకర్షిస్తుంది. చుట్టూ దట్టమైన అడవులు, భారతదేశాన్ని ఉత్తర, దక్షిణాలుగా విభజించే సహ్యాద్రి పర్వత శ్రేణులు, గోదావరి ఉపనది అయిన కెండెం నది పర్యాటకులను ఆకట్టుకుంటాయి. 45 మీటర్ల ఎత్తు నుండి కింద పడే నీటి సవ్వడులు, చప్పుళ్ళు ఎంత అనుభవించిన తనివితీరదు.

చిత్రకృప : Magentic Manifestations

జలపాతము

జలపాతము

జలపాతము యొక్క దిగువభాగము సమతల బండరాయితో కూడుకొని నునుపుదేలి జారుడుగా ఉండును. జలపాతం వద్ద గుండాలు చాలా లోతుగా ఉండి సుళ్ళు తిరుగుతూ ఉండటం వలన ఇక్కడి నీళ్ళలో ఈదటం చాలా కష్టం.

చిత్రకృప : Ppavan1

జలపాతానికి ఆ పేరెలా వచ్చింది ??

జలపాతానికి ఆ పేరెలా వచ్చింది ??

జలపాతానికి ఈ పేరు దుష్యంతుడి భార్య శకుంతల నుంచి వచ్చిందని స్థానిక ప్రజల విశ్వాసం. ఈ జలపాతం మరియు పరిసరాల దృశ్యం చూసి శకుంతల మైమరిచిపోయి, తరుచుగా ఈ జలపాతంలో స్నానం చేసేదని ఇక్కడి ప్రజలు నమ్ముతారు.

చిత్రకృప : రహ్మానుద్దీన్

చుట్టుప్రక్కల ఏమేమి చూడాలి ?

చుట్టుప్రక్కల ఏమేమి చూడాలి ?

జలపాతం చుట్టూ కుంటాల రిజర్వ్ ఫారెస్ట్, నాగమల్ల, రోల్ మామడ, సిరిచెల్మ రిజర్వ్ ఫారెస్ట్, కవాల్‌ వైల్డ్ లైఫ్ సాంచురీ, గుండాలు మరియు చిన్న చిన్న జలపాతాలు, నీటి ప్రవాహాలు చూడదగ్గవి.

చిత్రకృప : Vedhanarayanang

కవాల్‌ వన్యప్రాణుల అభయారణ్యం

కవాల్‌ వన్యప్రాణుల అభయారణ్యం

జలపాతం వద్ద నుండి కవాల్‌ వన్యప్రాణుల అభయారణ్యం 100 కి. మీ ల దూరంలో ఉన్నది. ఇది టైగర్ రిజర్వ్ ఫారెస్ట్. ఆదిలాబాద్ జిల్లాలో అతి ముఖ్యమైన అభయారణ్యం ఇది.

చిత్రకృప : Adityamadhav83

పులులు

పులులు

సుమారు 893 చ.కి.మీ. మేర విస్తరించిన దట్టమైన అడవులలో పులులు, చిరుత, జింక, ఎలుగుబంటి వంటి అనేక జంతువులు, పక్షులు, సరీసృపాలను ఈ అభయారణ్యంలో చూడవచ్చు.

చిత్రకృప : Vijaymp

శివ భక్తులు

శివ భక్తులు

కుంటాల జలపాతం పర్యాటకులని కాక శివభక్తులను సైతం ఆకర్షిస్తుంది. వందల అడుగుల ఎత్తు నుండి కింద పడే జలధార మధ్యలో ఒక గుహ ఉన్నది. అందులో సోమేశ్వరుడు, నాగదేవత విగ్రహాలు ఉన్నాయి.

చిత్రకృప : Chavakiran

జలపాతాలు, గుండాలు

జలపాతాలు, గుండాలు

జలపాతం పరిధిలో మూడు జలపాతాలు, గుండాలు ఉన్నాయి. ఈ గుండాల్లో ముఖ్యమైనది సోమన్న గుండం. ఇక్కడ కొలువైన సోమేశ్వర స్వామి పేరుమీదనే దీనికి ఆపేరొచ్చింది.

చిత్రకృప : Adityamadhav83

శివలింగాలు

శివలింగాలు

జలపాతం వద్ద ప్రకృతిసిద్ధమైన రాతిగుహల్లో శివలింగాలు ప్రతిష్టమై ఉండటంవల్ల ప్రతి సంవత్సరం శివరాత్రి రోజున భక్తులు ఈ శివలింగాలను దర్శించుకొని పూజలు నిర్వహిస్తారు.

చిత్రకృప : Rajib Ghosh

జాతర

జాతర

కుంటాల జలపాతం వద్ద జరిగే జాతరను 'సోమన్నజాతర' గా వ్యవహరిస్తారు. ప్రతి సంవత్సరం శివరాత్రి సమయంలో రెండు రోజులపాటు ఈ జాతర జరుపుకోవటం ఆనవాయితీ.

చిత్రకృప : రహ్మానుద్దీన్

వృక్షసంపద

వృక్షసంపద

జలపాతాలకు చుట్టు ఉన్న అడవి ఉష్ణమండల శుష్క ఆకురాలు వనాల రకానికి చెంది అన్ని జాతుల వృక్షాలు కలిగి అధికముగా టేకు చెట్లతో నిండి ఉన్నది. ఈ అడవిలో చాలా రకాల అటవీ జంతువులు మరియు పక్షులు ఉన్నాయి.

చిత్రకృప : Rajib Ghosh

వారాంతంలో

వారాంతంలో

ఆదిలాబాద్ కు 60 కి.మీ ల దూరంలో ఉన్న కుంటాల జలపాతాన్ని చూడటానికి తెలంగాణ రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా కర్ణాటక, మహారాష్ట్ర, ఛత్తీస్ఘడ్, ఆంధ్ర ప్రదేశ్ ప్రాంతాల నుంచి కూడా పర్యాటకులు వస్థుంటారు. శని, ఆదివారాలలో మరియు శివరాత్రి పర్వదినాన భక్తుల తాకిడి అధికంగా ఉంటుంది ఈ ప్రాంతంలో.

చిత్రకృప : రహ్మానుద్దీన్

వసతి

వసతి

జలపాతం వద్ద వసతి సౌకర్యాలు అంతగా చెప్పుకోదగ్గవిగా లేవు. కనుక నిర్మల్, ఆదిలాబాద్ లు వసతికి అనుకూలంగా ఉంటాయి. అయినా చాలా మంది పర్యాటకులు హైదరాబాద్ నుండి వన్ డే ట్రిప్ కు ఇక్కడికి వస్తుంటారు. ఉదయం వచ్చి .. సాయంత్రం తిరిగి వెళుతుంటారు. ఆదిలాబాద్ హోటల్ వసతుల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.

చిత్రకృప : telangana tourism

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X