Search
  • Follow NativePlanet
Share
» »పాలన్పుర్ - ఒక ప్రసిద్ధ రాచ విడిది !

పాలన్పుర్ - ఒక ప్రసిద్ధ రాచ విడిది !

By Mohammad

పాలన్పుర్ గుజరాత్ రాష్ట్రంలోని నవాబుల విడిదిగా ప్రసిద్ధికెక్కింది. అప్పట్లో రాజులు ఇక్కడికి వచ్చి సేదతీరేవారట. దీనిని ప్రహ్లాదన రాజు స్థాపించాడు. గుజరాత్ - రాజస్థాన్ సరిహద్దులోని కొన్ని రాజ్యాలు ఒకప్పుడు పార్మార్ రాజ్యం (ప్రస్తుత పాలంపూర్ లేదా పాలన్పుర్) లో భాగంగా ఉండేవి. ఈ ప్రాంతానికి ఓ వైపు ఆరావళి పర్వతాలు మరోవైపు సబర్మతి నది ఎల్లలుగా ఉన్నాయి.

ఇది కూడా చదవండి : జూనాగఢ్ - అరుదైన సంస్కృతి !

నవాబులు ఉన్న టైమ్ లో పాలన్పూర్ రాజభవంతులు రాచరికవిలాసాల్లో, ఆనందడోలికల్లో మునిగితేలేవి. ఈ నగరంలో ఏడు ద్వారాలున్న కోట ఒకటి ఉండేది. ఇప్పుడు అది శిధిలావస్థ దశలో ఉంది. యుద్ధాల్లో గెలిచినందుకు గుర్తుగా ఏర్పాటు చేసిన కీర్తి స్తంభం, రాజప్రసాదాలు మరియు ఆలయాలు గత వైభవ చిహ్నాలు గా పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి.

బలరాం ప్యాలెస్

బలరాం ప్యాలెస్

ఒకప్పుడు రాజుల వారాంతపు విడిదిగా బలరాం ప్యాలెస్ ఉండేది. ఇక్కడ వారు విశ్రాంతి తీసుకొని సరదాలు తీర్చుకొనేవారు. ఈ అందమైన భవనాన్ని 13 ఎకరాల అటవీ భూమిలో, నియో క్లాసికల్ నిర్మాణ శైలిలో కట్టించినారు. చుట్టూ అందమైన పచ్చిక బయళ్లు, రంగురంగుల పూల మొక్కల సువాసనలతో ఈ ప్యాలెస్ పర్యాటకులను మరిపిస్తుంది. ప్రస్తుతం ఈ ప్యాలెస్ హోటల్ గా సేవలందిస్తోంది.

చిత్ర కృప : TARIQ SINDHI

జెస్సోర్ అభయారణ్యం

జెస్సోర్ అభయారణ్యం

పాలన్పుర్ కి 45 కి.మీ. దూరంలో జెస్సోర్ అభయారణ్యం ఉన్నది. దీన్ని ప్రధానంగా అంతరించిపోతున్న ఎలుగుబంటిల పరిరక్షణకై ఏర్పాటు చేశారు. పులులు, జింకలు, తోడేళ్లు వంటి జంతువులకు మరియు వివిధ రకాల పక్షులకు ఈ స్యాంక్చురీ నివాస స్థలం. ఈ ప్రదేశం ఆరావళి కొండలపై ఉంటుంది.

చిత్ర కృప : anebelindasmith

కీర్తి స్తంభ్ లేదా కీర్తి స్తంభం

కీర్తి స్తంభ్ లేదా కీర్తి స్తంభం

కీర్తి స్తంభ్ నగరానికి నడిబొడ్డున ఉన్న ఒక చిహ్నం. పార్మార్ నవాబులు కొన్ని రాజ్యాలను జయించి తమ రాజ్యంలో కలుపుకున్నందుకు గుర్తుగా దీన్ని నిర్మించారు. ఇది పాలన్పూర్ పట్టణ స్మారకం గా పర్యాటకులను ఆకర్షిస్తున్నది.

చిత్ర కృప : KartikMistry

మోటు దేరసర్, నాను దేరసర్

మోటు దేరసర్, నాను దేరసర్

పాలన్పుర్ అధిక శాతం జైనమతంతో ముడిపడి ఉన్నది. అందుకే ఇక్కడ ఎక్కువగా జైన దేవాలయాలు కనపడతాయి. నగరంలోని మోటు దేరసర్ లేదా పల్లవియ పార్శ్వనాథ ఆలయం, నాను దేరసర్ ఆలయాలు ప్రధాన జైన మందిరాలు గా ఉన్నాయి. మోటు దేరసర్ మందిరంలో జైనమత 23 వ తీర్ధాంకుడు పార్శ్వనాథ విగ్రహం ఉన్నది.

చిత్ర కృప : Kailash Giri

బలరాం మహాదేవ ఆలయం

బలరాం మహాదేవ ఆలయం

బలరాం మహాదేవ ఆలయం పాలన్పూర్ కు 14 కి.మీ. దూరంలో ఉన్నది. ఇదొక ప్రసిద్ధి చెందిన శివాలయం. ఇందులో శివుడు విగ్రహ రూపంలో కొలువై ఉంటాడు. దీనికి సమీపంలోనే సంధియాల ఇలవేల్పు ధర్మత అనే మరో ఆలయం కూడా ఉన్నది.

చిత్ర కృప : Emmanuel DYAN

కేధర్నాథ్ మహాదేవ ఆలయం

కేధర్నాథ్ మహాదేవ ఆలయం

కేధర్నాథ్ మహాదేవ ఆలయం పాలన్పూర్ పట్టణానికి 32 కి.మీ. దూరంలో జెస్సోర్ లో కలదు. ఇదొక శివాలయం. దీనికి సమీపంలోనే ఎలుగుబంటి అభయారణ్యాన్ని సందర్శించవచ్చు.

చిత్ర కృప : Saumil Shah

పాతాలేశ్వర్ మహాదేవ ఆలయం

పాతాలేశ్వర్ మహాదేవ ఆలయం

పాలన్పుర్ నగరం నడిబొడ్డున ఉన్న కీర్తి స్తంభం సమీపంలో పాతాలేశ్వర్ మహాదేవ ఆలయం ఉన్నది. ఇదొక పురాతన శివాలయం. ఇక్కడ కూడా శివుడు ప్రధాన దైవం గా పూజింపబడతాడు.

చిత్ర కృప : KartikMistry

పాలన్పుర్ కు ఎలా చేరుకోవాలి ?

పాలన్పుర్ కు ఎలా చేరుకోవాలి ?

పాలన్పూర్ కు చేరుకోవటానికి రైలు, రోడ్డు మరియు వాయు మార్గాలు అందుబాటులో ఉన్నాయి.

వాయు మార్గం

140 కి.మీ. దూరంలో అహ్మదాబాద్ లోని సర్ధార్ వల్లభయ్ పటేల్ విమానాశ్రయం, పాలన్పుర్ కు సమీప విమానాశ్రయం. క్యాబ్ లేదా ట్యాక్సీ లలో ప్రయాణించి నవాబుల విడిది కి చేరుకోవచ్చు.

రైలు మార్గం

పాలన్పుర్ లో రైల్వే స్టేషన్ ఉన్నది. ఈ స్టేషన్ బెంగళూరు, హైదరాబాద్, ముంబై, ఢిల్లీ, జైపూర్ వంటి నగరాలకు చక్కగా అనుసంధానించబడింది.

రోడ్డు మార్గం

పాలన్పూర్ గుండా రెండు జాతీయ రహదారులు వెళ్తాయి. రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బస్సులు, ప్రవేట్ బస్సులు అహ్మదాబాద్, గాంధీనగర్, రాజన్పూర్, బేవార్ ప్రాంతాల నుండి ప్రతిరోజూ నడుస్తాయి.

చిత్ర కృప : dracy_cool9110

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X