Search
  • Follow NativePlanet
Share
» »సిలిగురి ఈశాన్య భారతావని ముఖద్వారం !

సిలిగురి ఈశాన్య భారతావని ముఖద్వారం !

By Mohammad

పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఉన్న సిలిగురి ఒక అందమైన కొండ ప్రాంతం. హిమాలయాల దిగువన ఉన్న ఈ ప్రాంతం, తూర్పు భారత స్వర్గ ధామంగా ప్రసిద్ధి చెందినది. సిలిగురి కి ఒకవైపున నేపాల్ మరోవైపున బంగ్లాదేశ్ లు సరిహద్దులుగా ఉంటాయి. ఈశాన్య భారతదేశంలోనికి ప్రవేశించాలంటే సిలిగురి మీదనే ప్రయాణించాలి. అందుకే స్థానికులు సిలిగురి ఈశాన్య భారతావని ముఖద్వారం అంటారు.

ఇది కూడా చదవండి : సిలిగురికి 120కి.మీ దూరంలో ఉన్న సందాక్ఫు పర్యాటక ప్రదేశాలు !

సిలిగురి కలకత్తా నగరానికి 561 కిలోమీటర్ల దూరంలో కలదు. సిలిగురి లో సందర్శించటానికి అనేక పర్యాటక ఆకర్షణలు ఉన్నాయి. వాటిలో ఇస్కాన్ ఆలయం, వన్య ప్రాణుల అభయారణ్యం, బోట్ క్లబ్, చల్సా మరియు మూర్తి ప్రముఖంగా చూడవలసినవి. వీటితో పాటు ఆశ్రమాలు, పార్కులు, బ్రిడ్జ్ లు మొదలగునవి కూడా వీలుంటే సందర్శించండి.

ఇది కూడా చదవండి : సిలిగురి కి 60 కి. మీ. దూరంలో ఉన్న డార్జీలింగ్ పర్యాటక ప్రదేశాలు !

కాళీ మందిర్

కాళీ మందిర్

కాళీ మాత కు అంకితం చేయబడి బిన్నగురి వద్ద ఉన్న ఈ ఆలయం తీస్తా నదికి చాలా దగ్గరగా ఉంది, ఇది ప్రత్యేకంగా కాళి, దుర్గ పూజ సమయంలో పర్యాటకులతో నిండి ఉంటుంది. ఈ ఆలయంలోని విగ్రహం అద్భుతమైన కవచం, కత్తులతో ధరించబడి యాత్రికుల దృష్టిని కట్టిపడేస్తుంది.

చిత్ర కృప : Subhajit Naug

కొరోనేషన్ బ్రిడ్జ్

కొరోనేషన్ బ్రిడ్జ్

ఎవరైనా సేవోకేశ్వర్ వద్ద ఉన్న కాళి మందిర్ వద్ద ఉంటే, 1930 లో కింగ్ జార్జ్ బాక్ గౌరవార్ధం నిర్మించిన ఈ బ్రిడ్జ్ ని చూడకుండా ఉండొద్దు. ఇది తీస్తా,రంగీత్ నదుల సంగమ ప్రదేశం పై కుడివైపు నిర్మించబడింది. ఈ బ్రిడ్జ్ సందర్శనకు విలువైన దట్టమైన పచ్చని పరిసరాలను అందిస్తుంది.

చిత్ర కృప : double_bass_player

ఇస్కాన్ ఆలయం

ఇస్కాన్ ఆలయం

సిలిగురి పట్టణంలో ఇస్కాన్ సంస్థవారు కృష్ణుని ఆలయాన్ని నిర్మించారు. ఇది దట్టమైన పచ్చదనాల మధ్య అల్లుకుని ధ్యానాన్ని, ముక్తిని ఒకేసారి భక్తులకు అందిస్తున్నది.

చిత్ర కృప : Neeraj Dhake

సలుగర ఆశ్రమం

సలుగర ఆశ్రమం

దలైలామా అనుచరులైన బౌద్ధ సన్యాసులు నడిపే సలుగర ఆశ్రమం 100 అడుగుల స్తూపనికి ప్రసిద్ది చెందింది. ఈ ఆశ్రమం లో కొంత సమయం గడిపితే చాలు మీ ఆలోచనా సరళిలో మార్పు వస్తుంది.

చిత్ర కృప : dhillan chandramowli

మహానంద వన్య ప్రాణుల అభయారణ్యం

మహానంద వన్య ప్రాణుల అభయారణ్యం

తీస్తా, మహానంద నదుల మధ్య ఉన్న మహానంద వన్య ప్రాణుల అభయారణ్యం ఫోటోగ్రాఫర్ల కలలు నెరవేర్చి, అద్భుతమైన వన్యప్రాణుల అనుభవాన్ని అందిస్తుంది.

చిత్ర కృప : vinodsrpura

ఉమ్రావ్ సింగ్ బోట్ క్లబ్

ఉమ్రావ్ సింగ్ బోట్ క్లబ్

ఉమ్రావ్ సింగ్ బోట్ క్లబ్ పర్యాటకులకు ముఖ్యంగా పిల్లలకు సాహసాలను అందిస్తుంది. ఇక్కడి దట్టమైన చెట్ల తోటల మధ్య ఉన్న సరస్సు లో బోట్ షికారు చేయవచ్చు. సాయంత్రంవేళ కుటుంబ సభ్యులతో వచ్చి గడపటానికి ఈ బోట్ క్లబ్ అనువైనది.

చిత్ర కృప : probal ghoshjr

చల్సా

చల్సా

చల్సా సిలిగురి మధ్య దూరం 60 కిలోమీటర్లు. ఇక్కడ చూడటానికి విస్తారమైన అడవులు, టీ తోటలు మరియు అందమైన నదులు ఉన్నాయి. పర్యాటకులు ఒక గైడ్ ను మాట్లాడుకోని స్థానిక అడవుల్లోకి వెళితే మొరిగే లేడి, ఏనుగులు, రైనోస్ మొదలగు వన్యప్రాణులు తారసపడతాయి.

చిత్ర కృప : Soumik Debnath

బుక్ష టైగర్ రిజర్వ్

బుక్ష టైగర్ రిజర్వ్

బుక్ష టైగర్ రిజర్వ్ చల్సా లో కలదు. బెంగాల్ పులుల స్థావరమైన ఈ రిజర్వ్ ఫారెస్ట్ విస్తీర్ణం 750 చ.కి.మీ. ఇక్కడి జంతు సంపదను వీక్షించటానికి విహారయాత్రికులు ఎక్కువగా వస్తుంటారు. బర్డ్ వాచింగ్ ఆసక్తి గలవారికి ఇదొక చక్కటి ప్రదేశం.

చిత్ర కృప : Piyukh Ranjan Das

చల్సా కు ఎలా చేరుకోవాలి ?

చల్సా కు ఎలా చేరుకోవాలి ?

విమాన మార్గం

చల్సా గ్రామంలో ఎటువంటి విమానాశ్రయం లేదు. సమీప విమానాశ్రయం 62 కిలోమీటర్ల దూరంలో ఉన్న సిలిగురి విమానాశ్రయం.

రైలు మార్గం

చల్సా లో రైల్వే స్టేషన్ ఉన్నది. ఈ రైల్వే స్టేషన్ సిలిగురి రైల్వే స్టేషన్ తో బాగా అనుసంధానించబడింది.

రోడ్డు మార్గం

సిలిగురి చల్సాకు ముఖ్య రవాణా కేంద్రంగా ఉన్నది. చల్సా చేరుకోవాలంటే తప్పక సిలిగురి చేరుకోవాల్సిందే ..! ప్రభుత్వ మరియు ప్రేవేట్ బస్సుల్లో/ వాహనాల్లో, జాతీయ రహదారి 31 మరియు 31 C గుండా సిలిగురి నుండి ప్రయాణించి చల్సా సులభంగా చేరుకోవచ్చు.

చిత్ర కృప : indiarailinfo

మూర్తి

మూర్తి

సిలిగురి నుండి మూర్తి 70 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. మూర్తి ఒక చక్కటి విహార స్థలం. కోలింగ్పొంగ్ కొండలు, దట్టమైన పచ్చదనం ఇక్కడి అందాలను మరింత పెంచుతాయి. ఏనుగుల మీద సవారీ చేస్తూ, అడవుల్లో సందర్శిస్తుంటే ఆ అనుభూతులే వేరు ..!

చిత్ర కృప : Pinakin Trivedi

మూర్తి ఎలా చేరుకోవాలి ?

మూర్తి ఎలా చేరుకోవాలి ?

మూర్తి సిలిగురి నుండి రోడ్డు మార్గం తో చక్కగా అనుసంధానించబడింది. దీనికి సమీపాన ఉన్న విమానాశ్రయం సిలిగురి/బాగ్దొర(70- 80 కి. మీ) విమానాశ్రయం . సమీప రైల్వే స్టేషన్ లు న్యూ మాల్ జంక్షన్ (17 కి.మీ) మరియు మేనగురి రైల్వే స్టేషన్ (40 కి. మీ) లు కలవు.

చిత్ర కృప : Kunal Majumdar

సిలిగురి పండుగలు, వేడుకలు

సిలిగురి పండుగలు, వేడుకలు

సిలిగురి లో బాగా జరుపుకొనే పండుగలు దీపావళి, భాయిటికా, దుర్గా పూజా, గణేశ్ ఉత్సవాలు. సంప్రదాయ దుస్తులు ధరించి స్థానికులు ఉత్సవాలలో కుటుంబ సభ్యులతో పాల్గొంటారు.

చిత్ర కృప : Amborish - Axis Images

ఆహారం

ఆహారం

కోడి మాంసం మరియు సంప్రదాయ కూరగాయలతో చేసిన మొమోలు(కుడుములు) తినటం మరించిపోవద్దు ..! అలాగే సాయంత్రంవేళ రోడ్డు పక్కన తోపుడు బండ్ల మీద చేసే స్థానిక వంటకాల కూడా రుచి చూడండి.

చిత్ర కృప : Manfred Sommer

సిలిగురి ఎలా చేరుకోవాలి ?

సిలిగురి ఎలా చేరుకోవాలి ?

సిలిగురి ఈశాన్య రాష్ట్రాలకు మరియు చుట్టుప్రక్కల గల ప్రాంతాలకు ప్రధాన రవాణా కేంద్రం గా ఉన్నది. చక్కటి రోడ్డు, రైలు మరియు విమాన సర్వీసులను కలిగి ఉన్నది.

విమాన మార్గం

సిలిగురి లో విమానాశ్రయం కలదు. స్థానికులు 'బగ్దొగ్ర' గా పిలిచే ఈ విమానాశ్రయం నగరం నుండి 12 -16 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. ఈ విమానాశ్రయం నుండి కలకత్తా, ఢిల్లీ, ముంబై, గౌహతి, గాంగ్‌టాక్ మొదలగు నగరాలకు ప్రయాణించవచ్చు.

రైలు మార్గం

సిలిగురి లో రైల్వే జంక్షన్ కలదు. ఇక్కడి నుండి ఈశాన్య రాష్ట్రాలకు, దేశంలోని ఇతర నగరాలకు రైళ్లు రాకపోకలు సాగిస్తుంటాయి.

బస్సు మార్గం

సిలిగురికి చక్కటి రోడ్డు మార్గం కలదు. ఈ పట్టణం గుండా జాతీయ రహదారులు 31 మరియు 31C వెళతాయి. ఈశాన్య రాష్ట్రాల నుండి, కలకత్తా నుండి రోజువారీ బస్సులు తిరుగుతుంటాయి.

చిత్ర కృప : noahax

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X