Search
  • Follow NativePlanet
Share
» »తిరువత్తర్ - 108 దివ్య క్షేత్రాలలో ఒకటి !

తిరువత్తర్ - 108 దివ్య క్షేత్రాలలో ఒకటి !

By Mohammad

ఆలయాల వద్ద సందడి వాతావరణాన్ని, కిటకిటలాడే జనాల్ని ఇంతవరకు గమనించి ఉంటాం. కానీ కొంత మంది ఏకాంతాన్ని, నిశ్శబ్దాన్ని బాగా ఇష్టపడతారు. అలాంటి వారి కోసమే ఈ ప్రస్తుత వ్యాసం.

"ఆలయాల రాష్ట్రం" గా పిలువబడే తమిళనాడులోని కన్యాకుమారి జిల్లాలో తిరువత్తర్ అనే పవిత్ర దివ్య క్షేత్రం కలదు. ఇది హిందువుల 108 దివ్య క్షేత్రాలలో ఒకటి. కనుక హిందూ యాత్రికులు తప్పక సందర్శించవలసిన క్షేత్రం ఇది. 'తిరు' అంటే తమిళంలో పవిత్రం అని, 'వత్త' అంటే చుట్టూ అని మరియు 'అర్' అంటే నది అని అర్థం. దేవాలయాలతో పాటు ఈ క్షేత్రం చుట్టుపక్కల సందర్శించటానికి అనేక పర్యాటక స్థలాలు ఉన్నాయి. అవేంటో, వాటి విశేషాలేంటో ఒకసారి తెలుసుకుందాం !

ఇది కూడా చదవండి : కన్యాకుమారి - దక్షిణ భారతదేశపు అగ్ర భాగం !

ఎలా చేరుకోవాలి ?

ఎలా చేరుకోవాలి ?

రైల్వే స్టేషన్ : కన్యాకుమారి సమీప రైల్వే స్టేషన్ (47 KM).
విమానాశ్రయం : తిరువనంతపురం సమీప విమానాశ్రయం (50 KM).
రోడ్డు/ బస్సు మార్గం : కన్యాకుమారి, నాగర్ కోయిల్ తో పాటు సమీప పట్టణాల నుండి ప్రభుత్వ. ప్రవేట్ బస్సులు, వాహనాలు తిరుగుతుంటాయి.

చిత్ర కృప : Taz

మాథుర్ హ్యాంగింగ్ బ్రిడ్జి

మాథుర్ హ్యాంగింగ్ బ్రిడ్జి

ఈ బ్రిడ్జిని పహ్రాలి నది పై నిర్మించారు. ఇదొక కృతిమ వంతెన. తిరువత్తర్ నుండి బ్రిడ్జ్ 3 కి.మీ ల దూరంలో, కన్యాకుమారి నుండి 60 కి. మీ ల దూరంలో కలదు. దక్షిణాసియా మొత్తం మీద ఈ బ్రిడ్జి అతి ఎత్తైన, అతి పొడవైన కృతిమ వంతెన గా ఖ్యాతిగాంచింది.

చిత్ర కృప : Infocaster

శ్రీ అది కేశవ పెరుమాళ్ ఆలయం

శ్రీ అది కేశవ పెరుమాళ్ ఆలయం

శ్రీ అది కేశవ పెరుమాళ్ ఆలయం, తిరువత్తర్ పట్టణంలో కలదు. ఇది 108 హిందూ దివ్య క్షేత్రాలలో ఒకటి అయినందున యాత్రికులు ఈ ఆలయానికి క్రమం తప్పకుండా వస్తుంటారు. ఆలయంలో ప్రధాన దైవం శివుడు. దీనిని కేరళ నిర్మాణ శైలిలో నిర్మించారు.

చిత్ర కృప : Infocaster

తిర్పరప్పు

తిర్పరప్పు

తిర్పరప్పు అనే గ్రామం జలపాతాలు ప్రసిద్ధి చెందినది. ఇది తిరువత్తర్ కు కేవలం 10 కి. మీ ల దూరంలో కలదు. స్థానిక పరిసర ప్రాంతాలు పర్యాటకులను మంత్ర ముగ్ధులను గురిచేస్తాయి. పర్యాటకులు జలపాతాలు వద్ద స్నానాలు ఆచరించవచ్చు.

చిత్ర కృప : Infocaster

మహాదేవ కోయిల్

మహాదేవ కోయిల్

జలపాతాలకు దగ్గరిలో 'మహాదేవ కోయిల్' ఆలయం కలదు. ఇక్కడి ప్రధాన దైవం శివుడు. జలపాతాలనికి వచ్చేవారు తప్పక ఈ ఆలయాన్ని సందర్శిస్తారు.

చిత్ర కృప : Vaikunda Raja

ఉదయగిరి కోట

ఉదయగిరి కోట

తిరువత్తర్ కు అతి సమీపంలో ఉన్న ఉదయగిరి కోట ను క్రీ.శ. 17 వ శతాబ్దంలో నిర్మించారు. ఈ కోటాలో మందుగుండు సామాగ్రి తయారు చేయటానికి ఉపయోగించేవారట. కోట లోని చెరసాలలో టిప్పు సుల్తాన్ కొంత కాలం బందీగా ఉన్నాడు. కోట ఇప్పటికీ పర్యాటకులను ఆకట్టుకుంటుంది.

చిత్ర కృప : Infocaster

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X