Search
  • Follow NativePlanet
Share
» »కాటమరాయుడా ... కదిరీ నరసింహుడా !

కాటమరాయుడా ... కదిరీ నరసింహుడా !

By Mohammad

కదిరి లక్ష్మి నరసింహ స్వామి దేవాలయం నవ నారసింహ స్వామి దేవాలయాలలో ఒకటి. ఇక్కడి విశేషమేమిటంటే మరే ఇతర దేవాలయాలలో లేనివిధంగా నరసింహస్వామి ప్రహ్లాదుని సమేతంగా దర్శనమిస్తాడు. కాటమరాయుడిగా భక్తులచే కొనియాడబడే ఈ నరసింహస్వామి విశిష్టత చాలా గొప్పది.

మద్యం మాన్పించే ఉంతకల్లు పాండురంగ స్వామి !మద్యం మాన్పించే ఉంతకల్లు పాండురంగ స్వామి !

అంతేకాదు, కదిరి కి సమీపాన 35 కి. మీ ల దూరంలో తిమ్మమ్మ మర్రిమాను చెట్టు కూడా తప్పక సందర్శించవలసిందే ! ఇది 'గిన్నిస్ బుక్' లో కెక్కింది. చెట్టుకు అనేక మంది పూజలు చేస్తారు. పిల్లలు లేని వారు చెట్టును పూజిస్తే వారికి పిల్లలు పుడతారని భక్తుల నమ్మకం. ప్రతి శివరాత్రి నాడు పెద్ద జాతర జరుగుతుంది.

కదిరి నరసింహ స్వామి దేవాలయం

కదిరి నరసింహ స్వామి దేవాలయం

కదిరి నరసింహ స్వామి దేవాలయం క్రీ. శ. 13 వ శతాబ్దానికి చెందినది. ఇది ఎత్తైన గోడలు, చుట్టూ నాలుగువైపులా నాలుగు ప్రహారీ గోడలు కలిగి, అద్భుత శిల్ప సంపదతో చూపరులను ఆకర్షిస్తుంది.

చిత్రకృప : రహ్మానుద్దీన్

హొయసుల వాస్తు శైలి

హొయసుల వాస్తు శైలి

ఆలయం హొయసుల వాస్తు శైలిని కలిగి ఉంటుంది. శిల్ప సంపద ద్రావిడ, విజయనగర కాలం నాటి శిల్పాలను పోలి ఉంటుంది. ఆలయ ప్రాంగణంలోని మండపాల్లో అశ్వం, ఏనుగు ... మొదలైన జంతువుల శిల్పాలను అందంగా చెక్కబడ్డాయి.

చిత్రకృప : Vinoth Chandar

భృగు తీర్థం

భృగు తీర్థం

ఆలయానికి వెనక భాగాన ఉన్న కోనేటిని 'భృగు తీర్థం' అని పిలుస్తారు. ఇందులో స్నానాలు చేస్తే రోగాలు దరిచేరవని భక్తుల నమ్మకం. ఇక్కడ స్వామి వారు అమ్మతల్లి, తాయారు, ప్రహ్లాదుని సమేతంగా దర్శనం ఇస్తాడు.

చిత్రకృప : Sri Kadiri Lakshmi NArasimha swamy temple kadiri

ఆలయ ధ్వజ స్థంభం

ఆలయ ధ్వజ స్థంభం

ఆలయంలో ధ్వజస్థంభం ప్రతిష్టించబడిన తీరు చూస్తే ఎవ్వరికైనా ఆశ్చర్యం కలగకమానదు. ధ్వజస్థంభం పునాదిలో కాకుండా ఒక బండరాయి మీద అలాగే నిలబడి ఉన్నది.

చిత్రకృప : Devathi Anil

రథం

రథం

ఏటా నిర్వహించే స్వామి వారి ఊరేగింపులో రథాన్ని వాడతారు. ఈ రథం సుమారు 120 టన్నుల బరువుతో, ఆరు చక్రాలతో, 45 అడుగుల ఎత్తులో ఉంటుంది. రథోత్సవం సమయంలో భక్తులు దవణం, పండ్లు ముఖ్యంగా మిరియాలు చల్లుతారు.

చిత్రకృప : Sri Kadiri Lakshmi NArasimha swamy temple kadiri

చూడవలసిన మరికొన్ని దర్శనీయ స్థలాలు

చూడవలసిన మరికొన్ని దర్శనీయ స్థలాలు

శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి దేవాలయం, శ్రీ మరకత మహాలక్ష్మి దేవాలయం, 12 కి. మీ ల దూరంలో యోగివేమన సమాధి(కటారుపల్లి), ముదిగుబ్బ దగ్గర జలాశయం, 10 కి. మీ ల దూరంలో పులివెందుల రహదారిలో బట్రేపల్లి జలపాతం, అదే దారిలో నామాల గుండు జలపాతం మొదలైనవి చూడదగ్గవి.

చిత్రకృప : India the Land of Colors

తిమ్మమ్మ మర్రిమాను

తిమ్మమ్మ మర్రిమాను

ఈ మర్రి చెట్టు కదిరికి 35 కి. మీ ల దూరంలో, అనంతపురం నగరానికి 100 కి. మీ ల దూరంలో కలదు. ఈ చెట్టు 5 చదరపు ఎకరాల కన్నా ఎక్కువ విస్తీర్ణాన్ని ఆక్రమించింది. ఇది 1889 లోనే గిన్నిస్ రికార్డ్ లోకి ఎక్కింది.

చిత్రకృప : Abdulkaleem md

నీటి కరువులోనూ

నీటి కరువులోనూ

రాయలసీమలో అనంతపురం జిల్లా అంతా నీటి కరువు ఉన్నప్పటికీ తిమ్మమ్మ మర్రిమాను వృక్షం ఆకాశం కనిపించనంత గుబురుగా పెరిగి, పచ్చని ఆకులతో, పక్షుల కిలకిల రావాలతో చూపరులను ఆకర్షిస్తుంది.

చిత్ర కృప : Mln Sai Prasad

విశేషాలు

విశేషాలు

పిల్లలు దేని దంపతులు ఈ మర్రి చెట్టు వద్ద పూజలు చేస్తే వారికి సంతానం సిద్ధిస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఇంకో విషయం ఈ చెట్టు మీద ఏ పక్షి రెట్ట వేయదు. సాయంత్రం ఆరు అయ్యిందంటే చెట్టుమీద ఏ పక్షి వాలదు. శివరాత్రి నాడు చెట్టు వద్ద పెద్ద జాతర నిర్వహిస్తారు.

చిత్ర కృప : Oleti Kiran Kumar

కదిరి ఎలా చేరుకోవాలి ?

కదిరి ఎలా చేరుకోవాలి ?

వాయు మార్గం : కదిరి కి సమీపాన 138 కి. మీ ల దూరంలో బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం, 145 కి.మీ ల దూరంలో తిరుపతి విమానాశ్రయం కలదు. ఈ రెండు విమానాశ్రయాల నుండి క్యాబ్ లేదా టాక్సీ లలో కదిరి చేరుకోవచ్చు.

రైలు మార్గం : కదిరి లో రైల్వే స్టేషన్ కలదు. తిరుపతి, బెంగళూరు, హైదరాబాద్, చెన్నై తదితర ప్రాంతాల నుండి స్టేషన్ మీదుగా రైళ్లు వెళుతుంటాయి.

బస్సు/రోడ్డు మార్గం : ధర్మవరం, అనంతపురం, కర్నూలు, బెంగళూరు, హైదరాబాద్, తిరుపతి,చిత్తూర్, కడప తదితర ప్రాంతాల నుండి కదిరి చక్కటి రోడ్డు వ్యవస్థను ను కలిగి ఉంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X