Search
  • Follow NativePlanet
Share
» »అయోధ్య - శ్రీరాముడు అవతరించిన నేల !!

అయోధ్య - శ్రీరాముడు అవతరించిన నేల !!

అయోధ్య ... ఈ పేరు వినగానే అందరికి గుర్తుకొచ్చేది శ్రీరాముడు !! రాముని జన్మభూమి గుర్తుకొస్తుంది! ఉత్తర ప్రదేశ్ లోని ఫైజాబాద్ జిల్లా సరయూ నది ఒడ్డున వెలసిన ఒక చారిత్రక నగరం మన ముందు ప్రత్యక్షమైతుంది. ఎం లేదండీ మొన్న ఒక వార్తాపత్రికలో దీనిమీద అంశం లేవనెత్తారు ఏమిటంటే ఆది ఒక అధికారి వ్రాసిన పుస్తకంలో అయోధ్య ఇది కాదంటున్నారు. అయోధ్య పేరుతో ఇప్పుడు పాకిస్థాన్ లో ఉన్న ప్రాంతంలో మరొక పట్టణం ఉండేదని ... అక్కడే రాముడు జన్మించారని చెబుతున్నారు. ఇందుకు చారిత్రక పరిశోధనలనే ఆధారాలుగా చూపించారు కూడా !!

ఆ పుస్తకంలోని సమాచారం ప్రకారం శ్రీరాముడు పుట్టిన అయోధ్య .... ఇప్పుడు యుపిలో ఉన్న అయోధ్య ఒకటికాదని, నిజానికి ఆది పాకిస్థాన్ లో ఉందని ప్రసిద్ధ పురాతత్వవేత్త అయిన జెస్సురామ్ తన సిద్ధాంత గ్రంథంలో వ్రాశాడట. అంతేనా అసలు అయోధ్య పేరుతోనే రెండు పట్టణాలున్నాయట. ఈ రెండు అయోధ్యలలో ఒకదానినేమో శ్రీరాముని ముత్తాత రాజా రఘు నిర్మించగా, మరొక అయోధ్య పట్టణాన్ని శ్రీరాముడే స్వయంగా కట్టాడట. రామాయణ కథ ప్రకారం ... నరయూ నది ఒడ్డున రాముడు మొదటి పట్టణాన్ని కట్టి దానికి అయోధ్య అని పేరు పెట్టాడు. ఐరావతి మరియు నరయూ నదుల మధ్యలో అయోధ్య ఉండేదని మహాభారతంలో కూడా పేర్కొనబడింది.

ఇక ఈ సరయూ నది ఒడ్డున వెలసిన హిందువుల పవిత్ర పుణ్యక్షేత్రం అయోధ్య పట్టణం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం !! విష్ణుమూర్తి అవతారాలలో ఏడవ అవతారం అయిన భగవాన్ శ్రీ రాముడితో ఈ పట్టణానికి ఎంతో అనుబంధం ఉంది. రామాయణం అనే ఇతిహాసం ప్రకారం శ్రీ రాముడు జన్మించిన రఘు వంశీకుల యొక్క రాజధానిగా పురాతనమైన అయోధ్య నగరం వ్యవహరించేది. రాకుమారుడైన రాముడి చుట్టూనే రామాయణం కథ మొత్తం తిరుగుతుంది.

హిందూ మతం తో పాటు అయోధ్యలో బౌద్ధ మతం, జైన మతం మరియు ఇస్లాం మతం జాడలు కూడా కనిపిస్తాయి. జైన్ తీర్థంకరులలో అయిదుగురు ఇక్కడే జన్మించారని నమ్ముతారు. మొదటి తీర్థంకరుడు అయిన రిషబ్దేవ్ కూడా ఇక్కడే జన్మించారని అంటారు. ఆధ్యాత్మికత కలిగిన వ్యక్తులకి అయోధ్య ...రారమ్మని పిలుస్తుంది. మరి ఇంత ఘన చరిత్ర గలిగిన ఈ నగరంలో ఏఏ ప్రదేశాలను చూడాలంటే ...

రామ్ జన్మ భూమి

రామ్ జన్మ భూమి

అయోధ్య శ్రీరాముని జన్మ స్థానంగా చెప్పబడినా , ఇక్కడి రామ్ కోట్ వార్డ్ లోని ప్రత్యేక ప్రదేశం శ్రీరాముడు పుట్టిన అసలు ప్రదేశం . దీనినే రామ్ జన్మ భూమి గా పిలుస్తారు . ఇక్కడ చిన్న శ్రీరాముని దేవాలయం నిర్మించారు. ఈ ప్రదేశాన్ని ఆక్రమించిన మొదటి ముఘల్ చక్రవర్తి అయిన బాబర్ 15 వ శాతబ్దం లో ఈ ఆలయం ప్రదేశంలో బాబ్రీ మసీదుని నిర్మించాడు. 1528 నుండి 1853 వరకు ముస్లిం ల ప్రార్ధనా స్థలం గా ఉన్నది. వివాదాస్పద ప్రదేశం అవడం వల్ల ప్రభుత్వం కల్పించుకొని హిందువులకు మరియు ముస్లిం ల కు వేరు వేరు ప్రార్ధనా ప్రదేశాలను ఏర్పాటు చేసింది.

Photo Courtesy: worldpress

హనుమాన్ ఘర్

హనుమాన్ ఘర్

అయోధ్యలో ఎక్కువగా సందర్శించబడే పవిత్ర క్షేత్రాలలో ఒకటి హనుమాన్ ఘర్లేదా హనుమంతుని నివాసం. హనుమంతుడికి అంకితమివ్వబడిన ఆలయం ఇది. అయోధ్ లోని ఒక మట్టి దిబ్బపై నెలకొని ఉన్న ఈ ఆలయాన్ని దూరం నుంచి కూడా వీక్షించవచ్చు. ఈ ఆలయానికి చేరడానికి 76 మెట్లు ఎక్కవలసి ఉంటుంది. హనుమాన్ ఘర్ ఒక కేవ్ టెంపుల్. చదరపు ఆకృతి కలిగిన కోట లాంటి భవనంలో ఇది ఉంది. ఈ భవనంలో వృత్తాకారం కోట బురుజులు నలు మూలల ఉన్నాయి. ఈ ఆలయంలోని గర్భ గుడిలోని అంజలీ దేవి బాల హనుమానుని తన ఒడిలో ఉంచుకున్న ప్రతిమ కనిపిస్తుంది. ఈ ఆలయాన్ని సందర్శిస్తే తమ చిరకాల కోరికలు తీరతాయని భక్తుల నమ్మకం. అందువల్ల, ఏడాది పొడవునా ఈ ఆలయానికి అధిక సంఖ్య లో భక్తులు విచ్చేస్తారు.

Photo Courtesy: Vishwaroop2006

రామ్ కి పైది

రామ్ కి పైది

రామ్ కి పైది అయోధ్య లో ని సరయూ నది ఒడ్డున నయఘాట్ మీద ఉంది. ఎంతో మంది భక్తులు ఈ చారిత్మక నది లో ని పవిత్ర జలాలతో స్నానం చేస్తారు. సరయు నది నుండి నీటి ని ఈ ఘాట్ కి మోటార్ పంపుల ద్వారా తరలిస్తారు. యుపి ప్రభుత్వ నీటి పారుదల శాఖ వారు నిరంతరాయ నీటి సరఫరా మరియు ఈ ఘాట్ యొక్క పర్యవేక్షణను చూసుకుంటున్నారు. శ్రీ రాముని యొక్క అనేక భక్తులను పండుగ దినాలలో ఈ రామ్ కి పైది విశేషంగా ఆకర్షిస్తుంది. ఇక్కడి సరయూ నదిలో స్నానం చెయ్యడం ద్వారా వారి వారి పాపాలు హరిస్తాయని భక్తులు విశ్వసిస్తారు.

Photo Courtesy: Ramnath Bhat

సీతా కి రసొయి

సీతా కి రసొయి

రాచరికపు వంటగదిగా కంటే ఒక దేవాలయం గానే సీతా కి రాసోయి ప్రసిద్ది. అయోధ్య లోని రామకోట్ లో రామ జన్మస్థానానికి వాయువ్య దిశ లో ఉన్న ఈ ప్రదేశం రామ్ చబూత్ర టెర్రస్ కి సమీపాన ఉంది. ఈ దేవాలయంలో రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు వారి వారి సతులైన సీతా, ఊర్మిళ, మాండవి మరియు శ్రుతికీర్తి సమేతంగా ఉన్న విగ్రహాలు ఉన్నాయి. చపాతీ పీట, కర్ర వంటి వంట సామాగ్రి వంటివి ఈ వంటశాలలో మనకు కనిపిస్తాయి. అప్పటి కాలం లో వారి ఆచారం ప్రకారం కొత్తగా వచ్చిన కోడలు కుటుంబం మొత్తానికి వంట చేయాల్సి ఉంటుంది. పురాణం ప్రకారం, సీతమ్మ వారు అన్నపూర్ణా దేవి లాగా ఒక కుటుంబానికే కాకుండా పూర్తి మానవ జాతికే సరిపడే విధంగా ఆహారాన్ని వండారని చెప్తారు.

Photo Courtesy: joshi

తులసీ స్మారక్ భవన్

తులసీ స్మారక్ భవన్

రామాయణాన్ని రచించిన భక్తుడు, కవి అయిన గోస్వామి తులసీ దాస్ గారికి నివాళిగా ఈ తులసి స్మారక్ భవన్ ని నిర్మించారు. ఇక్కడే తులసి దాసు రామాయణాన్ని రచించారని నమ్ముతారు. ఇక్కడ ఉన్న గ్రంధాలయం చరిత్రకులకు మరియు పండితులకు అత్యంత విలువైనది. శ్రీ రాముడి చరిత్రతో ముడిపడిన విశేషాలను ఇక్కడ సేకరించి, పొందుపరచి మరియు ప్రదర్శిస్తారు. అనేక సంస్కృతిక కార్యక్రమాలు ఇక్కడ నిర్వహిస్తారు. తులసి జయంతి ఇక్కడ శ్రావణ మాసంలో ఏడవ రోజున జరుపబడే పెద్ద పండుగ.

Photo Courtesy: Ram-Katha-Museum.jsp

చక్ర హర్జి విష్ణు టెంపుల్

చక్ర హర్జి విష్ణు టెంపుల్

సరయు నది ఒడ్డున ఉన్న గుప్తర్ ఘాట్ వద్ద ఫైజాబాద్ లో ఉన్న ఈ చక్ర హర్జి విష్ణు ఆలయం హిందువుల నుండి విశేష ఆదరణ రెండు విషయాల వల్ల పొందుతోంది. మొదటిది ఇక్కడ చక్రాన్ని ధరించిన విష్ణుమూర్తి యొక్క విగ్రహం అనేకమంది భక్తులని ఆకర్షిస్తోంది. సాధారణంగా సుదర్శన చక్రాన్ని శ్రీ కృష్ణుడు రాక్షసులని హరించడానికి వాడతాడు. విష్ణు మూర్తి ఈ చక్రాన్ని ధరించడం అరుదుగా ఉన్న అంశం. మరొక విశేషం శ్రీ రాముడి పాద ముద్రలు. ఇవి స్వయంగా శ్రీ రాముడి యొక్క పాద ముద్రలు కావడం భక్తులలో అత్యంత పవిత్రమైనవిగా, విలువైనవిగా నిలిచి ఉన్నవి.

Photo Courtesy: rama / Marcus334

దశరథ్ భవన్

దశరథ్ భవన్

దశరథ్ భవన్ నగర నడిబొడ్డున ఉన్నది. శ్రీరాముని తండ్రి అయిన దశరధుడు అసలయిన రాజ మందిరం ఉన్న చోటనే నిర్మించబడినదిగా నమ్ముతారు. శ్రీరాముడు తన సోదరులతో కలిసి తన బాల్యాన్ని మరియు యవ్వనాన్ని ఈ ప్రదేశం లోనే గడిపారు. ఈ భవనంలో సీతా సమేతుడయిన శ్రీరాముడు, లక్ష్మణుని సమేతంగా ఉన్న విగ్రహాలు ఉన్నాయి. ఈ మందిరానికి పెద్ద , రంగుల ప్రవేశ ద్వారం ద్వారా చేరుకోవచ్చు . ఈ ఆలయంలో ప్రవేశించగానే ఆధ్యాత్మిక పరిమళంతో కట్టిపడేస్తుంది. శ్రీరాముడు నివసించినదిగా భావించే ఈ ప్రదేశాన్ని చూడటానికి భక్త జనం విశేషం గా ఇక్కడికి విచ్చేస్తారు.

Photo Courtesy: ayodhya

బహు బేగం మక్బరా

బహు బేగం మక్బరా

మక్బరా లేదా బహు బేగం సమాధిని షుజ-ఉద్-దౌలా నవాబు అతని ప్రియమైన భార్య గుర్తుగా స్థాపించాడు. ఈ మక్బరా ముఘాట్ నిర్మాణశైలికి అద్భుతమైన ఉదాహరణ. చరిత్ర సమాధిలో తాజ్ మహల్ మహత్యానికి పునఃసృష్టి గా దీనిని 1816 లో స్థాపించారు. ఇది తెల్లని పాలరాయితో చంద్రకాంతిలో కనిపించే విధంగా మెరుపుని కలిగిఉంటుంది, ఈ సమాధి ప్రకాశవంతంగా అమరత్వాన్ని అందించేటట్టు కనిపిస్తుంది. ఇది 42 మీటర్ల ఎత్తులో ఉండి, రంగుల ఫైజాబాద్ దాని పరిసరాల అందమైన దృశ్యాలను అందిస్తుంది.

Photo Courtesy: up tourism

నాగేశ్వరనాథ్ టెంపుల్

నాగేశ్వరనాథ్ టెంపుల్

అయోధ్య లోని రామ్ కి పైరి లో ఉన్న ఈ ఆలయం పేరులో సూచించబడినట్టు నాగేశ్వర్నాథ్ మరియు నాగుల దైవంగా ప్రసిద్ది చెందినా మహా శివుడి కి అంకితమివ్వబడినది. ఈ ఆలయం గర్భగుడి లో 12 జ్యోతిర్లింగాల్లో ఒకటైన జ్యోతిర్లింగం ఉంది. పురాణాల ప్రకారం ఒక రోజు శ్రీ రాముడి చిన్న కుమారుడైన కుశుడు సరయు నది లో స్నానం చేస్తుండగా బాహుపురి నీళ్ళలో పడిపోయింది. ఎంత వెతికినా అతనికి దొరకలేదు. చివరగా మహా శివుడి భక్తుడైన ఒక సర్పం కుమార్తె అయిన నాగ కన్య ద్వారా ఆటను తిరిగి బాహుపురి ని దక్కించుకున్నాడు. కృతజ్ఞతగా నాగేశ్వర్నాథ్ ఆలయాన్ని కుశుడు నిర్మించాడు.

Photo Courtesy: Gopal Ganesh

ట్రేటా-కె-ఠాకూర్

ట్రేటా-కె-ఠాకూర్

శాసనాల ప్రకారం, రావనసురుడిపై విజయాన్ని పురస్కరించుకుని శ్రీరాముడు అశ్వమేధ యాగం నిర్వహించాడని అంటారు. ప్యాలెస్లో నిర్మించిన ట్రేటా-కె-ఠాకూర్ అనే ఆలయం లో ఈ యజ్ఞాన్ని నిర్వహించాడని అంటారు. హిమాచల్ ప్రదేశ్ లోని కులు రాజా అయోధ్య లోని నయాఘాట్ లో 300 ఏళ్ళ క్రితం ఈ ఆలయాన్ని నిర్మించారు. సరయు నది ఒడ్డున ఉన్న ముఖ్య మందిరం నుండి సీతా రాముల మరియు అయన ముగ్గురు సోదరుల ప్రతిమలను తీసుకువచ్చారని అంటారు. ఈ ప్రతిమలన్నీ ఒకే ఒక నల్ల రాతితో తయారు చేసారు. కార్తిక మాసంలో ని పదకొండవ రోజు లేదా ఏకాదశి రోజున మాత్రమే ఈ ఆలయం తెరువబడుతుంది. అనేక మంది భక్తులు శ్రీ రాముడి దీవెనల కోసం ఇక్కడికి విచ్చేస్తారు.

Photo Courtesy: Ajay Kumar

మణి పర్వతం

మణి పర్వతం

మేఘనాద్ తో యుద్ధంలో గాయ పడిన లక్ష్మణుడిని రక్షించడానికి హనుమంతుడు సంజీవని మూలిక కలిగిన పర్వతాన్ని మొత్తం ఎత్తాడని రామాయణంలో పేర్కొనబడింది. ఈ పర్వతం లో కొంత యొక్క భాగం అయోధ్యలో పడిపోయిందని పురాణాలు చెబుతున్నాయి. ఆ పడిపోయిన పర్వత భాగాన్నే మని పర్వత్ గా పిలుస్తారు. మని పర్వతం ఎత్తు 65 అడుగులు. ఈ పర్వతం పై ఎన్నో మందిరాలు ఉన్నాయి. ఈ పర్వతం పైన నించుని అయోధ్య నగరం మరియు చుట్టు పక్కల ప్రాంతాల యొక్క అందాలను వీక్షించవచ్చు. అయోధ్య లో ఆరేళ్ళ పాటు బుద్ధుడు నివసించాడని ధర్మం గురించి మని పర్వతం పైన ఎన్నో ప్రబోధాలు ఇచ్చారని అంటారు. అశోక చక్రవర్తి నిర్మించిన స్తూపాన్ని ఇక్కడ గమనించవచ్చు.

Photo Courtesy: Weekend Destinations

తులసీ ఉద్యాన్

తులసీ ఉద్యాన్

పేరు సూచిస్తున్నట్టు తులసి ఉద్యాన్ ఒక గార్డెన్ పార్క్. రామాయణం గా ప్రఖ్యాతి చెందిన రామ్ చరిత మానస్ రచించిన గొప్ప కవి అయిన తులసీ దాస్ జ్ఞాపకార్ధం ఇది ఏర్పాటు చేయబడింది. తులసీ దాస్ విగ్రహం ఈ అందమైన గార్డెన్ లో కనిపిస్తుంది. అయోధ్య బస్ స్టాండ్ కి సమీపం లో ఈ గార్డెన్ ఉంది. ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఉద్యాన్ విభాగ్ నిర్వహణ లో ఈ గార్డెన్ ఉంది.

Photo Courtesy: up tourism

రామ్ కథ పార్క్

రామ్ కథ పార్క్

రామ్ కథ పార్క్ ఈ ఆధ్యాత్మిక ప్రదేశాల లోని రద్దీ నుండి ఉపసమనం కలిగించటానికి నిర్మించ బడినది. నగరం యొక్క జనం తాకిడి నుండి దూరంగా చక్క గా నిర్వహించబడే అందమైన ప్రసాంతమైన ఉద్యానవనం . ఇక్కడి ఓపెన్ ఎయిర్ థియేటర్ ల లో సంస్కృతిక , ఆధ్యాత్మిక , మతపరమైన అనేకే కార్యక్రమాలను నిర్వహిస్తారు . అంతేకాక ఇక్కడి థియేటర్ లలో స్థానిక ,స్థానికేతర కళాకారులు నాట్యం , కవిత్వం , సంగీతం వంటి కళలలో తమ నైపుణ్యాన్ని ప్రదర్సించుకునే వీలు కలిగిస్తున్నది .ఈ పార్క్ వయోబేధం లేకుండా పిన్న పెద్దలు సాయం సమయాలలో , వారాంతంలో సందర్శించే ఆధ్యాత్మిక ప్రశాంత ప్రదేశంగా చెప్పవచ్చు.

Photo Courtesy: up tourism

అయోధ్యకు ఎలా చేరుకోవాలి ??

అయోధ్యకు ఎలా చేరుకోవాలి ??

వాయు మార్గం

అయోధ్య నుండి 150 కిలో మీటర్ల దూరంలో ఉన్న లక్నో విమానాశ్రయం అయోధ్యకి సమీపం లో ఉన్న విమానాశ్రయం. ఇక్కడ నుండి ఏదైనా ప్రైవేటు టాక్సీ లేదా బస్సు తీసుకుని నగరానికి రావచ్చు. అమౌసి, వారణాసి మరియు కాన్పూర్ వద్ద ఉన్న దేశీయ విమానాశ్రయాలు అయోధ్యకి సమీపం లో ఉన్నవే.

రైలు మార్గం

ఢిల్లీ, లక్నో, వారణాసి మరియు అల్లహాబాద్ వంటి ప్రధాన నగరాలకి అయోధ్య రైలు మార్గం ద్వారా చక్కగా అనుసంధానమై ఉంది. సమీపంలో రైల్ హెడ్స్ అలహాబాద్(జి కె ఫై ఎక్ష్ప్రెస్), కోల్కతా (దూన్ ఎక్ష్ప్రెస్), ఢిల్లీ(సరయు యమునా ఎక్ష్ప్రెస్), మరియు లక్నో (కైఫియత్ ఎక్ష్ప్రెస్) మరియు వారణాసి (మరుధర్ ఎక్ష్ప్రెస్)అందుబాటులో కలవు.

బస్సు మార్గం

లక్నో, అలహాబాద్, వారణాసి, గోరఖపూర్ మరియు ఇతర ప్రధాన నగరాల నుండి బస్సు సర్వీసు లు సులభం గా అందుబాటులో ఉంటాయి. రాష్ట్ర ప్రభుత్వం అలాగే ప్రైవేటు సంస్థల చే ఈ బస్సులు నడపబడుతున్నాయి. ఢిల్లీ వంటి నగరాల నుండి అయోధ్య కి డీలక్స్ బస్సులు అలాగే వోల్వో కోచ్ లు అందుబాటులో కలవు.

Photo Courtesy: Ajay Kumar

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X