• Follow NativePlanet
Share
» »బెంగుళూరులోని వివిధ ఆకర్షణలు

బెంగుళూరులోని వివిధ ఆకర్షణలు

Written By: Venkatakarunasri

బెంగళూరుని మొదట పశ్చిమ గంగ రాజులు, తరువాత హోయసల రాజులు పాలించారు. తరువాత ఆ ప్రాంతాన్ని హైదర్ అలీ, ఆ తరువాత అతని కుమారుడు టిప్పుసుల్తాన్ పరిపాలించారు. ఒకప్పుడు బెండకలూరు అని, తరువాత ఆంగ్లీకరణలో బాన్గలోర్ అని, ఇప్పుడు అధికారికంగా బెంగళూరు అని పిలవబడుతుంది.

ఈ నగరం గతంలో భారతదేశం యొక్క గార్డెన్ సిటీ గా పిలువబడింది, సాంకేతిక విప్లవం లో ప్రధాన కేంద్రంగా తన స్థాయి వల్ల ఇపుడు భారతదేశం యొక్క సిలికాన్ వ్యాలిగా పిలువబడుతోంది.

బెంగళూరు ఆగ్నేయ కర్నాటకలో, డెక్కన్ పీఠభూమి కి గుండెకాయ లాంటి మైసూరు పీఠభూమి లో నెలకొని వుంది. 741 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో, 5.8 మిలియన్ జనాభా కలిగిఉంది (మూడవ అత్యధిక జనాభా కలిగిన నగరం).

సముద్రమట్టానికి 3113 అడుగులు (949 మీ) ఎత్తులో వుండటంవల్ల, ఈ నగరం ఒక ఆహ్లాద కరమైన వాతావరణాన్ని కలిగివుంటుంది. ఉష్ణమండల వాతావరణ౦ వల్ల నగరంలో తరచుగా పడే వర్షాలతో పాటు వెచ్చని వేసవికాలం, చలిగా వుందే శీతాకాలాలను కలిగివుంటుంది. తన ఆహ్లాద కరమైన వాతావరణం వల్ల అన్ని రంగాల్లోని విశ్రాంత ఉద్యోగులు ఇక్కడికి ఆకర్షింప బడటంతో దీన్ని పెంషనర్ల స్వర్గధామం గా పిలిచే వారు. ఇక్కడి ఉష్ణోగ్రత సాధారణంగా వేసవిలో 20 డిగ్రీల నుండి 36 డిగ్రీల మధ్య, శీతాకాలంలో 17 డిగ్రీల నుండి 27 డిగ్రీల వరకు వుంటుంది.

బెంగుళూరులోని వివిధ ఆకర్షణలు

బెంగుళూరులోని వివిధ ఆకర్షణలు

ఫ్రెండ్స్ మీకు తెలుసా?షారూఖాన్, అమితాబచ్చన్, సోనియాగాంధీ కలిసి కబాడీ ఆడారు.కాంగ్రెస్, జనతా మంచి ఫ్రెండ్స్ అయిపోయాయి.అవును.మీరు వింటున్నది నిజమే.నేను అబద్దం చెప్పట్లేదు.

 హక్కిపిక్కీల వీళ్లు అర్థరాత్రి మాత్రమే పెళ్లి చేసుకుంటారు...

హక్కిపిక్కీల వీళ్లు అర్థరాత్రి మాత్రమే పెళ్లి చేసుకుంటారు...

ఏంటి మైండ్ బ్లాక్ అయిపోయిందా?అసలు విషయం ఏంటంటే ముందు చెప్పిన షారూఖాన్, అమితాబచ్చన్, సోనియాగాంధీ, కాంగ్రెస్, జనతాఇవన్నీ ఒక వూర్లో పిల్లలపేర్లు. అవునండీ.ఇవన్నీ పిల్లల పేర్లే.ఇవే కాదు ఇంగ్లీష్,కాఫీ, బస్,ట్రైన్,మిలట్రీ,హోటల్, అనిల్ కపూర్,డాలర్, ఎలిజిబెత్, గూగుల్ ఇంకా ఇలాంటివి చాలావిచిత్రమైన పేర్లు పిల్లలకి పెడుతున్నారు.ఇంతకీ ఎక్కడా అనుకుంటున్నారా?

ఎక్కడ వుంది?

ఎక్కడ వుంది?

హక్కి పక్కి విలేజ్. ఇది కర్ణాటకలో బెంగుళూరుకి దగ్గరలోనే వుంది. ఈ విలేజ్ లో పుట్టినపిల్లలకి ఇలా విచిత్రమైన పేర్లు పెట్టడం 11వ శతాబ్దం క్రిందటి నుండి ప్రారంభమైంది.

భద్రపుర వెళ్ళి 'కాఫీ' అని అడగొద్దు... షాక్ తింటారు!

భద్రపుర వెళ్ళి 'కాఫీ' అని అడగొద్దు... షాక్ తింటారు!

బెంగళూరు నగర శివారులో ఉన్న భద్రపుర గ్రామానికి వెళ్ళి 'కాఫీ కావాలి' అని అడిగి చూడండి! తప్పక షాక్ తింటారు! అలా అని ఇంగ్లీషు రాదా? అంటే, వచ్చు అని సమాధానమొస్తుంది!

భద్రపుర వెళ్ళి 'కాఫీ' అని అడగొద్దు... షాక్ తింటారు!

భద్రపుర వెళ్ళి 'కాఫీ' అని అడగొద్దు... షాక్ తింటారు!

కాఫీ అని అడిగితే, ఓ వ్యక్తి వచ్చి "నా పేరే కాఫీ... నాతో పనేంటి?" అంటాడు. దీంతో, నోళ్ళు వెళ్ళబెట్టడం అడిగిన వాళ్ళ వంతవుతుంది. ఎందుకంటే, ఆ ఊరి జనాల పేర్లన్నీ విచిత్రంగా ఉంటాయి. కాఫీ, ఇంగ్లీష్, హైకోర్టు, రాజ్ కపూర్, శశి కపూర్... ఇలాగన్నమాట. అంతేకాదండోయ్..! కాంగ్రెస్, జనతా అనే పేర్లు ఇక్కడ పలుకుబడిలో ఉన్నాయి.

హక్కిపిక్కీల వీళ్లు అర్థరాత్రి మాత్రమే పెళ్లి చేసుకుంటారు...

హక్కిపిక్కీల వీళ్లు అర్థరాత్రి మాత్రమే పెళ్లి చేసుకుంటారు...

ఈ గ్రామంలో నివసించేవారిలో అత్యధికులు 'హక్కి పక్కి' సంచార తెగకు చెందినవాళ్ళే. వారే ఇలాంటి అసాధారణమైన పేర్లను పెట్టుకుంటారు. పరిసరాలు, రోజువారీ ఎదురయ్యే వస్తువులు, పరిస్థితులు, వారు చూసిన సినిమాలు, తినే తిండి... ఇలా, 'కాదేదీ నామకరణానికి అనర్హం' అన్న రీతిలో ఈ తెగ వారు తమ పిల్లలకు పేర్లు పెట్టేసుకుంటారట.

హాయ్‌ 'గూగుల్‌'.. 'కాఫీ' వుందా!

హాయ్‌ 'గూగుల్‌'.. 'కాఫీ' వుందా!

ఆ ఊర్లో మైసూర్‌ పాక్‌, కాఫీ కలిసి షికారు వెళతాయి. గూగుల్‌ మామూలు మారం చేయదు. ఇంగ్లీష్‌ బడి ఎగ్గొట్టేసి గోళీలాడుకుంటాడు. నమ్మరా! అయితే మీరే వెళ్లి కర్నాటకలోని భద్రపుర గ్రామంలో తిరిగిరండి. అప్పుడు మీరే చెబుతారు హైకోర్ట్‌ను చంకనెక్కించుకుని ముద్దాడారని, కాంగ్రెస్‌తో కలిసి షికారుకెళ్లారని. ఇవన్నీ ఆ గ్రామ ప్రజల పేర్లు. నవ్వు తెప్పించే పేర్లకు కారణం వారి సంచార జీవనశైలే.

హాయ్‌ 'గూగుల్‌'.. 'కాఫీ' వుందా!

హాయ్‌ 'గూగుల్‌'.. 'కాఫీ' వుందా!

బెంగళూరు దగ్గర్లో ఉండే ఈ గ్రామం ఓ ప్రత్యేక సంచార జాతికి చెందినది. వారిని 'హక్కీ పిక్కీ తెగ' అంటారు. ఒకప్పుడు వన ఉత్పత్తులపై ఆధారపడిన ఈ జాతి ఆ తర్వాత వేటతో మనుగడ సాగించేది. కానీ అటవీ చట్టాలు కఠినతరం కావడంతో తొలుత భిక్షాటనకు మారారు.

వీళ్లు అర్థరాత్రి మాత్రమే పెళ్లి చేసుకుంటారు...

వీళ్లు అర్థరాత్రి మాత్రమే పెళ్లి చేసుకుంటారు...

ఆ తర్వాత రోడ్ల పక్కన ప్లాస్టిక్‌ వస్తువులు అమ్ముకుంటూ ఒక్కో ఊరు గుంపులుగా తిరిగేవారు. ఇలా అనేక ప్రభావాలతో వారి పేర్లను విచిత్రంగా పెట్టుకోవడం మొదలు పెట్టారు. తల్లి గర్భవతిగా ఉన్నపుడు ఏదన్నా ఊర్లో తొలిసారి మైసూర్‌ పాక్‌ రుచి చూసిందనుకోండి.

వీళ్లు అర్థరాత్రి మాత్రమే పెళ్లి చేసుకుంటారు...

వీళ్లు అర్థరాత్రి మాత్రమే పెళ్లి చేసుకుంటారు...

ఆమెకు అది నచ్చేస్తే అప్పుడే కడుపులో ఉన్న బిడ్డకు పేరు ఆ స్వీట్‌తో ఫిక్స్‌ అయిపోతుంది. మరో దంపతులకు పండంటి బిడ్డ ఏ కలకత్తాలోనో, ఢిల్లీలోనో కలిగితే ఆ ఊరి పేరే పెట్టేస్తారు. లేదా వారి వ్యాపారం ఏ హైకోర్ట్‌ దగ్గరో, సినిమా థియేటర్‌ దగ్గరో, పార్క్‌ దగ్గరో బాగా నడిస్తే వాటి పేర్లతో పిల్లల్ని పిలుచుకోవడం వాళ్లకు మామూలు విషయం.

వీళ్లు అర్థరాత్రి మాత్రమే పెళ్లి చేసుకుంటారు...

వీళ్లు అర్థరాత్రి మాత్రమే పెళ్లి చేసుకుంటారు...

ఇలా చెప్పుకుంటూ పోతే రాజ్‌ కపూర్‌, శశి కపూర్‌, మంత్రి, ట్రైన్‌, గ్లూకోజ్‌, బ్రిటిష్‌, బస్‌, హోటెల్‌, మిలిటరీ, డాలర్‌, జైలర్‌... ఇలా వారి ఇష్టం. వారి ఆధార్‌ కార్డులు, ఓటర్‌ కార్డులు ఇతర గుర్తింపు కార్డుల్లో అవే పేర్లు నమోదు చేసి ఉంటాయి.

వీళ్లు అర్థరాత్రి మాత్రమే పెళ్లి చేసుకుంటారు...

వీళ్లు అర్థరాత్రి మాత్రమే పెళ్లి చేసుకుంటారు...

స్థానికంగా పనిచేసే అంగన్‌వాడీలకు ఈ పేర్లతో పెద్ద తలనొప్పే. సంబరాలు, మేళాలు, ఉత్సవాలు ఎక్కడ జరిగితే అక్కడకు అలంకరణ వస్తువులు అమ్మడానికి వెళ్లిపోతూ సంచార జీవనం సాగిస్తారు హక్కీపిక్కీలు.

వీళ్లు అర్థరాత్రి మాత్రమే పెళ్లి చేసుకుంటారు...

వీళ్లు అర్థరాత్రి మాత్రమే పెళ్లి చేసుకుంటారు...

దేశంలోని ప్రతి కార్నర్‌ను టచ్‌ చేస్తూ సాగిపోయే ఈ సంచారులు ఆయా భాషల్లోని పదాల్ని ఎప్పటికప్పుడు తమ భాషలోకి లాగేసుకుంటారు. అందుకే వారి మాటల్లో ఇంగ్లీష్‌, హిందీ, కన్నడ, తెలుగు, తమిళ్‌, పంజాబీ, అస్సామీ ఇలా ప్రతి భాష ఛాయలు కనిపిస్తాయి.

వీళ్లు అర్థరాత్రి మాత్రమే పెళ్లి చేసుకుంటారు...

వీళ్లు అర్థరాత్రి మాత్రమే పెళ్లి చేసుకుంటారు...

అన్ని భాషల్ని కిచిడీ కిచిడీ చేసి చప్పరించేస్తుంటారు. ఎస్టీల కిందకు వచ్చే వీళ్లు 14 భాషల్ని కలగలపి మాట్లాడతారు. వీళ్లలో కొంత మంది వ్యాపారంపై విదేశాలకు వెళ్లొచ్చారు. ఇంకేముంది వారి పేర్లు జపాన్‌, చైనా, పాకిస్తాన్‌ అయిపోయాయి.

వీళ్లు అర్థరాత్రి మాత్రమే పెళ్లి చేసుకుంటారు...

వీళ్లు అర్థరాత్రి మాత్రమే పెళ్లి చేసుకుంటారు...

ఇప్పుడిప్పుడే వీళ్లు స్థిరపడుతున్నారు. కొందరు వ్యవసాయం చేస్తున్నారు కూడా. గ్రామంలో స్థిరపడిన వారు పిల్లల్ని బడికి పంపుతున్నారు. అయితే వీరి భాషతో మాస్టార్లకు పెద్ద చిక్కే వచ్చి పడింది. దీంతో ఒక్కో పాఠాన్ని పదిసార్లు చెప్పాల్సి వస్తోంది.

వీళ్లు అర్థరాత్రి మాత్రమే పెళ్లి చేసుకుంటారు...

వీళ్లు అర్థరాత్రి మాత్రమే పెళ్లి చేసుకుంటారు...

అది రెండు మూడు భాషల్ని మిక్స్‌ చేస్తూ పిల్లల పేర్లను చూసి నవ్వుకుంటున్న విషయం అర్థమై పేర్లను మారుస్తున్నారు. వీళ్ల సంచార జీవన శైలి కూడా ఓ పంథాన ఉండదు. రైళ్లో తప్ప మిగతా మార్గాల్లో ప్రయాణాలు చేయరు. ఒక ట్రైన్‌లో నుంచి టికెట్‌ లేదని దింపేస్తే వెంటనే పక్కనే ఉన్న మరో ట్రైన్‌లో ఎక్కేస్తారు. అది ఎక్కడికి తీసుకెళితే అక్కడకు వెళ్లి వ్యాపారం సాగిస్తారు.

నవ్వు రాదు

నవ్వు రాదు

వీరి పేర్ల తీరే కాదు ఆచారాలు, వ్యవహారాలన్ని మిగతా వారికి చాలా భిన్నంగా ఉంటాయి. హక్కీపిక్కీల పెళ్ళిళ్లు, విడాకులు, ఆరాధన అంతా విభిన్నంగా ఉంటాయి. కన్యాశుల్కం నడుస్తోంది. పెళ్లిళ్లన్నీ రాత్రుళ్లే జరుగుతాయి.

హక్కిపిక్కీల వీళ్లు అర్థరాత్రి మాత్రమే పెళ్లి చేసుకుంటారు...

హక్కిపిక్కీల వీళ్లు అర్థరాత్రి మాత్రమే పెళ్లి చేసుకుంటారు...

తాళి సరిగ్గా అర్ధరాత్రిన కడతారు. కట్నకానుకల కింద డబ్బుతో పాటు కోళ్లను, మద్యాన్ని, బియ్యాన్ని, ఫలాల్ని చదివిస్తారు. విడాకులకు అంత కష్టపడరు. విడిపోయేపుడు కన్యాశుల్కంగా వచ్చిన డబ్బులో సగం తిరిగిచ్చేయాలి.

హక్కిపిక్కీల వీళ్లు అర్థరాత్రి మాత్రమే పెళ్లి చేసుకుంటారు...

హక్కిపిక్కీల వీళ్లు అర్థరాత్రి మాత్రమే పెళ్లి చేసుకుంటారు...

వేరేవాళ్లను పెళ్లి చేసుకోడానికి ఏ అభ్యంతరాలుండవు. పిల్లలు మాత్రం తల్లితోనే ఉండాలి. విడిపోయిన తర్వాత కూడా పిల్లల పెళ్లిళ్ల భారాన్ని తండ్రే చూసుకోవాలి. వీరి పద్ధతుల్లో కొన్ని కఠినమైన నిబంధనలున్నాయి.

హక్కిపిక్కీల వీళ్లు అర్థరాత్రి మాత్రమే పెళ్లి చేసుకుంటారు...

హక్కిపిక్కీల వీళ్లు అర్థరాత్రి మాత్రమే పెళ్లి చేసుకుంటారు...

పక్క ఊరి అబ్బాయిని ప్రేమిస్తోందని సర్పంచ్‌ కూతురినే గ్రామం నుంచి వెలేశారు. గ్రామ దేవతల్ని పూజిస్తారు. వీరి పేర్లు నవ్వుగొలిపేలా ఉన్నా పట్టణీకరణ, వీరిని నిర్లక్ష్యం చేస్తోన్న అటవీ చట్టాలు వీరి జీవితాలపై ఎంత తీవ్ర ప్రభావం చూపుతున్నాయనే దానికి ఉదాహరణ.

హక్కిపిక్కీల వీళ్లు అర్థరాత్రి మాత్రమే పెళ్లి చేసుకుంటారు...

హక్కిపిక్కీల వీళ్లు అర్థరాత్రి మాత్రమే పెళ్లి చేసుకుంటారు...

తమవి కాని భాషలతో, తమది కాని జీవన శైలితో వారి అవస్థలు వర్ణనాతీతం. కొత్త ప్రదేశాలకు వెళ్లాక అక్కడి స్థానికులతో సర్దుబాటు చాలా కష్టమవుతుంది. కొన్ని చోట్ల దాడులు, దోపిడీలు సాధారణమే. విద్యకు చాలా దూరంగా సాగిపోతున్న వీరు అడుగడుగునా మోసాలకు గురౌతుంటారు.

హక్కిపిక్కీల వీళ్లు అర్థరాత్రి మాత్రమే పెళ్లి చేసుకుంటారు...

హక్కిపిక్కీల వీళ్లు అర్థరాత్రి మాత్రమే పెళ్లి చేసుకుంటారు...

రాజ్‌పుత్ర రాజు రాణా ప్రతాప్‌ సింగ్‌తో దగ్గరి సంబంధాలు నెరిపిన గొప్ప చరిత్ర వీరి సొంతం. కానీ వీరిలో చాలామందికి ఆ విషయం ఎరుకలో లేదు. వారు ఆరాధించే కొండలు, అటవీ ప్రదేశాల పేర్లతో పిల్లలకు నామకరణం చేయడం వందల ఏళ్ల క్రితం ఆచారంగా ఉండేది.

హక్కిపిక్కీల వీళ్లు అర్థరాత్రి మాత్రమే పెళ్లి చేసుకుంటారు...

హక్కిపిక్కీల వీళ్లు అర్థరాత్రి మాత్రమే పెళ్లి చేసుకుంటారు...

వీరిని బలవంతంగా అడవుల నుంచి బయటకు లాగేసేట్టు ప్రభుత్వ విధానాలు ఉండటంతో బ్రిటీష్‌ కాలం నుంచే సంచార జాతిగా మారడం మొదలైంది. వారి సొంత భాషలో చాలా పదాలు మాయమైపోయాయి.

హక్కిపిక్కీల వీళ్లు అర్థరాత్రి మాత్రమే పెళ్లి చేసుకుంటారు...

హక్కిపిక్కీల వీళ్లు అర్థరాత్రి మాత్రమే పెళ్లి చేసుకుంటారు...

సంచార జీవనశైలి వల్ల వారి పూర్వాచారాలు, పద్ధతుల్ని పూర్తిగా మరిచిపోయారు. వారి సంస్కృతిని కోల్పోయారు. తమిళనాడుకు చెందిన నరికురవ జాతికి, తెలుగు రాష్ట్రాల్లో కనిపించే దొమ్మరులకు వీరికి పోలికలున్నా మిగతా వారికన్నా పూర్తిగా ధ్వంసమైన జాతి అనొచ్చు. ఇదంతా తెలిశాక 'మైసూర్‌పాక్‌' పేరని చెబితే నవ్వు రాదు.

హక్కిపిక్కీల వీళ్లు అర్థరాత్రి మాత్రమే పెళ్లి చేసుకుంటారు...

హక్కిపిక్కీల వీళ్లు అర్థరాత్రి మాత్రమే పెళ్లి చేసుకుంటారు...

చార్మినార్‌ కావాలా అదిగో ఆ చెట్టు దగ్గర ఆడుకుంటోంది చూడండి అంటాడు హోటల్‌ కొడుకు కాఫీ. గూగుల్‌, సుప్రీంకోర్టు, మైసూర్‌ పాక్‌, బూందీలడ్డు... వీళ్ళంతా ఆమె ఫ్రెండ్సే. వాళ్ళు కూడా అక్కడే ఆడుకుంటారు మరి. ఏంటి ఏదేదో మాట్లాడేస్తున్నారు అనుకుంటున్నారు కదా!

హక్కిపిక్కీల వీళ్లు అర్థరాత్రి మాత్రమే పెళ్లి చేసుకుంటారు...

హక్కిపిక్కీల వీళ్లు అర్థరాత్రి మాత్రమే పెళ్లి చేసుకుంటారు...

మీరు ఆ ఊరికి వెళితే ఇలాంటి సంభాషణలే వినపడతాయి మరి. ఎందుకంటే అక్కడుండే వాళ్లందరికీ ఇలాంటి పేర్లే ఉంటాయి! దిమ్మదిరిగి పోయేలా ఏపేరు పడితే ఆ పేరు పెట్టుకోవడమే హక్కిపిక్కి తెగవారి ప్రత్యేకత.

హక్కిపిక్కీల వీళ్లు అర్థరాత్రి మాత్రమే పెళ్లి చేసుకుంటారు...

హక్కిపిక్కీల వీళ్లు అర్థరాత్రి మాత్రమే పెళ్లి చేసుకుంటారు...

పేర్లంటే శివ, సరస్వతి, రెహ్మాన్, సల్మాన్, పీటర్‌, జాన్ ఇలాంటి మతాలకు సంప్రదాయలకు సంబధించినవే ఉంటాయనుకుంటే పొరపాటుపడినట్లే. కర్ణాటకలోని భద్రపుర, మైసూర్‌, మాండ్య, రామనగర, శివమొగ్గ, చిక్‌మగ్‌ళూరు ప్రాంతాల్లో ఉండే హక్కిపిక్కి గిరిజనులు మాత్రం మిగిలిన వాళ్లలా ఇలాంటి పేర్లు అస్సలు పెట్టుకోరు. వారికి పదార్థాలూ, వస్తువులూ. దేశాలూ అదీ ఇదీ తేడా అన్నది ఏమీ లేదు. దేన్ని పడితే దాన్నే పేర్లుగా పెట్టేసుకుంటారు.

పేర్లు వింటే షాకే!

పేర్లు వింటే షాకే!

గూగుల్‌, గ్లూకోజ్‌. బూందీలడ్డు, చక్కెర, సెల్‌ ఫోన్, విమానం, మైసూర్‌పాక్‌, బెంగళూర్‌పాక్‌, కాఫీ, షుగర్‌, గ్రాస్‌, హైకోర్టు. సుప్రీంకోర్టు, హోటల్‌, సైౖకిల్‌, కాంపౌండ్‌, గవర్నమెంట్‌ లాయర్‌, ఇనస్పెక్టర్‌, రేడియో, మిలిటరీ, కాంగ్రెస్‌, జనతా, సౌతకొరియా, షేక్‌హ్యాండ్‌, వన్‌బైటు..లాంటి వింత వింత పేర్లెన్నింటినో వాళ్ల వాళ్ల పిల్లలకు పెట్టేసుకుంటారు.

ఇదేమిటీ వింత? అనుకుంటున్నారా!

ఇదేమిటీ వింత? అనుకుంటున్నారా!

ఒకప్పుడు నాగరిక ప్రపంచానికి దూరంగా అడవుల్లో ఉండేవారు ఈ గిరిజనులు. వేటాడటమే వీరి ప్రధాన వృత్తి. అయితే వన్యమృగాలనూ, అక్కడి గిరిజన ప్రజలను, అడవిని రక్షించే అటవీ చట్టాల్లో భాగంగా నాలుగు దశాబ్దాల క్రితం వీరిని అడవుల్లో నుంచి జనజీవనస్రవంతిలోకి తీసుకొచ్చింది స్థానిక ప్రభుత్వం.

మొదట గుర్తొచ్చిన పదమే బిడ్డపేరు

మొదట గుర్తొచ్చిన పదమే బిడ్డపేరు

వాళ్లకి మనసులో మొదట ఏ పదం గుర్తొస్తే అదే పేరు తమ పిల్లలకు పెట్టుకుంటారు. ఒకప్పుడు కొండలు, నదుల పేర్లనే పెట్టుకునేవారట. అయితే అడవినుంచి దూరంగా వచ్చేసరికి బాహ్య ప్రపంచంలో వాళ్ళు విన్న కొత్త కొత్త పదాలన్నింటినీ పిల్లలకు పేర్లుగా పెట్టుకోవడం మొదలు పెట్టారు. అంతేకాదు ఇలా పేర్లు పెట్టుకోవడంలో కూడా ఆదీవాసీ పద్థతిని పాటిస్తారు. అదేంటంటే బిడ్డ పుట్టగానే మనసులో మొదట ఏ పదం తోస్తే అదే పదం వారికి పేరుగా పెట్టేస్తారు. ఇలా విచిత్రమైన పదాలను పేర్లుగా పెట్టేసుకున్న ఈ ఆదీవాసీలు ఈ పేర్ల పుణ్యమా అని స్థానికంగానే కాదు, అంతర్జాతీయంగానూ వార్తల్లోకెక్కారు.

పాస్‌పోర్టుల్లోనూ అవే పేర్లు

పాస్‌పోర్టుల్లోనూ అవే పేర్లు

హక్కిపిక్కీలు ఎక్కువ భాషల్ని మాట్లాడగలరు. ప్రస్తుతం వీరిలో ఎక్కువ మంది ప్లాస్టిక్‌ పువ్వులూ ఇతర గృహాలంకరణ వస్తువులను తయారు చేస్తూ ఉపాధి పొందుతున్నారు. అయితే ఒకప్పుడు అడవి జంతువుల కొమ్ములూ, తోళ్ళు, మసాజ్‌ నూనెలు అమ్మే వారిలో కొందరు ఇప్పుడు వాటిని కృత్రిమంగా తయారుచేసి విదేశాల్లో అమ్ముతున్నారు.

హక్కిపిక్కి

హక్కిపిక్కి

భాషతో సమస్య లేదు కాబట్టి ఆయా ఉత్పత్తుల్ని తీసుకుని విదేశాలకు పర్యాటకుల్లా వెళ్తారు. వీరికి పాస్‌పోర్టులు రావడం దగ్గర్నుంచి విదేశాలకు తీసుకెళ్లడం వరకూ మధ్యవర్తులే ఆ తతంగమంతా నడిపిస్తారు. అలా హక్కిపిక్కి తెగలో దాదాపు వందమందికి పైగా పాస్‌పోర్టులున్నాయి. అయితే ఇలా వారు వింత వింత పేర్లు పెట్టుకోవడం వెనుక మరో కారణం నేర ప్రవృత్తే అంటున్నారు స్థానిక అధికారులు. నేరం చేసినప్పుడు పట్టుబడకుండా ఉండేందుకు కొందరు ఇలా వింత వింత పేర్లు పెట్టకుంటున్నారట.

జీవన విధానం చాలా విభిన్నం

జీవన విధానం చాలా విభిన్నం

ఈ హక్కిపిక్కి వారి గురించి స్థానిక గిరిజన అధ్యయన శాఖాధికారిని అడిగితే ఒకప్పుడు హిక్కిపిక్కి ఆదీవాసీలు రాజపుత్రరాజు రాణాప్రతాప్‌ సింగ్‌కు అనుచరులుగా ఉండేవారనీ వీళ్లు చాలా తెలివిగల వాళ్లనీ అంటారు. ఈ ఆదీవాసీల జీవన విధానం చాలా భిన్నంగా ఉంటుంది. వీరిలో పెళ్ళిళ్ళు కూడా విభిన్నమే. సరిగ్గా అర్థరాత్రి సమయంలోనే వధువు మెళ్లో వరుడు తాళి కడతాడు. పెళ్లికొడుకే పెళ్లికూతురికి ఎదురు కట్నం ఇస్తాడు. తర్వాత ఏదైనా కారణంతో విడాకులు తీసుకుంటే పెళ్లి సమయంలో ఇచ్చిన కట్నంలో సగాన్ని తిరిగి అతడికి ఇచ్చేయాల్సి ఉంటుంది మరి. ఇదండీ హక్కిపిక్కీల వింత పేర్ల వెనుక కథ.

ఎలా వెళ్ళాలి?

ఎలా వెళ్ళాలి?

ఈ నగరం చాలా బాగా అనుసంధానించబడి వుండడం వల్ల నగరం లోకి, పరిసరాలకీ ప్రయాణాలు చాలా సులభంగా ఉంటాయి. నగరం లోపల ప్రయాణం చేయడానికి ప్రజలు బస్సులు, ఆటో రిక్షాలు, కాబ్స్, ఇంకా మెట్రో రైళ్ళు(ఇది విడుదల చేయాలని ఆలోచిస్తున్నారు) పై ఆధారపడుతున్నారు. వాయు వజ్ర బస్సులు విమానాశ్రయానికి నగరాన్ని కలుపుతాయి. బెంగళూరు రోడ్డు, రైలు, విమానాల ద్వారా ఇతర ప్రాంతాలకు అనుసంధానించబడి ఉంది.

ఎలా వెళ్ళాలి?

ఎలా వెళ్ళాలి?

బెంగళూరు భారతదేశంలోని నైరుతి రైల్వే ప్రధాన కేంద్రం, దీని చుట్టూ ఇంకొన్ని రైల్వే స్టేషన్లు వున్నాయి - సిటీ సెంట్రల్, యశ్వంతపూర్, కంటోన్మెంట్, కే.ఆర్ పురం లాంటివి. నగరానికి 40 కిలోమీటర్ల దూరంలో వున్నదేవనహళ్లి లోని బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం దేశీయ, అంతర్జాతీయ ప్రయాణీకులకు సేవలను అందిస్తుంది.

పర్యాటకానికి సంబంధించిన వివరాలు తెలుసుకోండి
పర్యాటక చిట్కాలు, పర్యాటకానికి సంబంధించిన కథాలు తక్షణం పొందండి

We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Nativeplanet sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Nativeplanet website. However, you can change your cookie settings at any time. Learn more