Search
  • Follow NativePlanet
Share
» »మూడు పదుల వయసు నిండే లోపుగా...?

మూడు పదుల వయసు నిండే లోపుగా...?

చిన్న వయసులో ఉత్సాహం అధికం. పర్యటనలపట్ల మరింత ఆసక్తి. కాని వయసు పెరిగే కొలది, కొన్ని ప్రదేశాల పర్యటనపట్ల ఆసక్తి తగ్గుతుంది. వయసు దాటిన తర్వాత శక్తి సన్నగిల్లుతుంది. ఏ ప్రదేశానికి వెళ్ళినా, గతంలోని ఉత్సాహం కొరవడి సాహస క్రీడలకు వెనక్కు తగ్గుతారు. అధిక ఆనందం అనుభవించలేరు. అందుకని మూడు పదుల వయసు ముగిసేలోపు చూసే కొన్ని అద్భుత పర్యాటక ప్రదేశాలు కలవు. వాటిని పరిశీలిద్దాం. కలలు కనండి, అన్వేషించండి, ఆనందించండి.

మూడు పదుల వయసు ముగిసే లోపు

మూడు పదుల వయసు ముగిసే లోపు

ఈ జర్నీ చేసేముందు మీ శారీరక సామర్ధత పరిశీలించుకోండి. సాధారణంగా వెళ్ళే ట్రైన్ జర్నీ కాకుండా దూద్ సాగర్ ఫాల్స్ కు ట్రెక్కింగ్ రూట్ ఎంచుకోండి. మీ స్నేహితులతో కలసి దూద్ సాగర్ జలపాతాల అందాలను చూసేందుకు రైల్వే ట్రాక్ వెంట ట్రెక్కింగ్ చేయండి.

pc: Sharat Chandra

 మూడు పదుల వయసు

మూడు పదుల వయసు

24 అందమైన శ్లిఖరాలు కల నీలగిరి కొండలు ప్రకృతి ప్రియులకు ఒక స్వర్గం. ఈ ప్రదేశాలకు ఊటీ , కూనూర్ ల మీదుగా చాలా మంది నీలగిరి కొండలకు ట్రెక్కింగ్ చేస్తారు. మీరు అందమైన ఈ లోయల గుండా సైక్లింగ్ చేసి ఆనందించండి.

pc: Shubha

మూడు పదుల వయసు

మూడు పదుల వయసు

మనాలి నుండి లెహ్ కు గల మార్గం ప్రపంచంలోని అన్ని బైక్ మార్గాలకంటే అతి ఎత్తైనది, మరియు కటినమైనది. ఈ బైకింగ్ సాధారనమైనది కాదు. ఈ సాహస క్రీడ కు వెళ్ళే ముందు మీరు తప్పక కొంత ట్రైనింగ్, సాధన చేయవలసి వుంటుంది. ఎంత శిక్షణ పొంది వెళ్ళినా సరే, అక్కడ కొంత కష్టపడవలసి వస్తుంది. అయితే, ఈ బైకింగ్ అక్కడ మీకు ఒక మరువలేని థ్రిల్లింగ్ ఇస్తుంది. అయితే, ఈ సాహసం మీరు 30 ల లోపే చేయాలి సుమా !

pc: Sundeep Gujjar

మూడు పదుల వయసు

మూడు పదుల వయసు

అన్నీ సాహస క్రీడలే అయితే, మీ చిన్న వయసులో ప్రశాంతత కొరవడుతుంది. అందుకని, ప్రశాంతంగా ఆచరించగల, చక్కటి అనుభూతులనిచ్చే, నదుల జల విహారాలు కూడా సాహసంగా చేసి ఆనందించండి. మీకు అత్యంత ప్రియులైన వారితో కలసి జల విహారాలు చేయండి. ఇండియా - ఇంగ్లాండ్ దేశాలు కలసి అస్సాం బెంగాల్ రూట్ లో చేపట్టిన జల ప్రయాణం మీకు గంగ, బ్రహ్మపుత్ర నదులపై చక్కని జలవిహారం అందిస్తుంది.

మూడు పదుల వయసు

మూడు పదుల వయసు

గోవా పేరు చెప్పగానే చాలామంది బీచ్ లు లేదా నైట్ లైఫ్ ఆనందాలు మాత్రమే అనుకుంటారు. గోవా ప్రదేశంలో ఎవరూ అన్వేషించని ప్రదేశాలు అనేకం కలవు. వీటిని ఒక క్వాడ్ బైక్ పై ఒక్క సారి చుట్టి రండి. మీలోని సాహసం పరీక్షించుకోనండి. మీ వెంట మీ స్నేహితులను కూడా తప్పక తీసుకు వెళ్లి ఆనందించండి.

pc: Chris_Parfitt

మూడు పదుల వయసు

మూడు పదుల వయసు

ఇండియా లోని అన్ని ప్రదేశాలకంటే కూడా రిశీకేష్ లో రాఫ్టింగ్ మరింత ఆనందంగా వుంటుంది. ఇక్కడ కల తెల్లటి నీటి ప్రవాహాల మధ్య రాళ్ళ మధ్య రాఫ్టింగ్ చేయండి. చుట్టూ కల అందమైన పరిసరాలను ఆనందించండి. సూర్యుడి వెలుగు పడే కొద్దీ నదిలోని నీరు బంగారు వన్నె కాంతిలో మెరిసి పోతూ వుంటుంది.

pc: Abhishek Singh Bailoo

మూడు పదుల వయసు

మూడు పదుల వయసు

ఈ వినోదం మీరు ఏ వయసులో అయినా సరే ఆనందించవచ్చు. అయితే, చిన్న వయసులో మన దేశ సరిహద్దు అయిన వాగా ప్రదేశంలో ప్రతి రోజు సాయంత్రం జరిగే మిలిటరీ బ్యాండ్ కార్యక్రమం వింటే, మీలోని దేశ భక్తి ఉప్పొంగుతుంది. దేశం అంటే అంకిత భావం మరింత అధికమవుతుంది. వాగా బోర్డర్ లో ఈ బ్యాండ్ మేళం 1959 నుండి నిర్వహిస్తున్నారు.

pc: Kamran Ali

మూడు పదుల వయసు

మూడు పదుల వయసు

అతిశయించిన ఆనందం కు అర్ధం తెలియాలంటే, మీరు కనీసం 3 రోజులు కూర్గ్ లో గడపాలి. ఇక్కడ కల ప్రకృతి అందాలు, ప్రశాంత దైవత్వం, సువాసనల మడికేరి కాఫీ తోటలు మీ యువతర పర్యటనా అనుభవాలలో జీవితాంతం మిగిలిపోతాయి.

మూడు పదుల వయసు

మూడు పదుల వయసు

ఒంటరిగా ప్రయాణించేవారు వారి సాహసాలను పర్వతారోహణలో పరీక్షించుకోనగలరు. హిమాచల్ ప్రదేశం టూరిజం శాఖ పర్వతారోహణలో కొన్ని కోర్స్ లు నిర్వహిస్తోంది. ఈ కోర్సులు వివిధ స్థాయిలలో వుంటాయి. ఈ క్రీడలకు మనాలి ప్రధాన ప్రాంతం. ఇక్కడ పర్వతారోహనే కాక మీరు ఆనందించే క్రీడలు ఇంకనూ కలవు.

మూడు పదుల వయసు

మూడు పదుల వయసు

ఇండియా లో రైల్వే మార్గాలు మీకు ఎన్నో వింతలు, విడ్డూరాలు చూపుతాయి. సరికొత్త అనుభవాలను ఇస్తాయి. వాటిలో గ్రీన్ రూట్ ఒకటి. బెంగుళూరు నుండి మంగళూరు కు గల రైల్వే మార్గంలో సుమారు 60 సొరంగాలు కలవు. వీటిలో మీ ధైర్యం ప్రదర్సిన్చుకోనండి. అయితే, మధ్య మధ్య లో ఈ సొరంగాల లో వచ్చే ట్రైన్ ల పట్ల శ్రద్ధ పెట్టండి.

మూడు పదుల వయసు

మూడు పదుల వయసు

హంపి లోని అవశేషాల మధ్య నడవండి. మీ నడకలో మీరు ఏ ప్రాంతంలో చూసినా సరే, ఒక చారిత్రక నిర్మాణం కనపడి, మిమ్ములను ఆహ్వానిస్తుంది. హంపి ఒక చారిత్రక ప్రదేశమే కాదు. ఆనందించదగిన ప్రదేశం కూడాను. అది రాతి రూపంలోని ఒక కవిత, కళ, గొప్ప జ్ఞాపకం, భోగం, గత కాల చరిత్రలో నడవండి. తుంగభద్రా నది నీరు ప్రవహించిన ఆ నాటి ప్రదేశ వైభవాలను మెచ్చుకోనండి.

మూడు పదుల వయసు

మూడు పదుల వయసు

బీర్, బిల్లింగ్ ప్రదేశంలో పారా గ్లైడింగ్ కు అద్భుత వాతావరణం వుంటుంది. ప్రపంచం మొత్తంలో ఇది ఒక ఉత్తమ పారా గ్లైడింగ్ ప్రదేశంగా చెపుతారు. ఈ ప్రదేశాలు ప్రతి సంవత్సరం అంతర్జాతీయ పోటీలు కూడా ఈ క్రీడలో నిర్వహిస్తాయి. ప్రతి సంవత్సరం, అక్టోబర్, నవంబర్ నెలల లో ఇక్కడ మేఘాలలో తేలియాడే పారా గ్లైడింగ్ క్రీడా సందర్శనకు అనేకమంది వస్తారు. మీరు కూడా ఒక పక్షి వలే అద్భుత నీలి ఆకాశం, పచ్చటి లోయల ప్రదేశాలలో విహరించండి.

మూడు పదుల వయసు

మూడు పదుల వయసు

రాజస్థాన్ రాష్ట్రంలోని ఆల్వార్ జిల్లలో కల భాన్ఘర్ టవున్ దర్శించండి. అక్కడి కోటను చూడండి. చీకటి పడిన తర్వాత ఈ కోటలోకి వెళ్ళినవారు ఎవరూ మరల తిరిగి రాలేదని చెపుతారు. ఈ కోటలో మానవాతీత శక్తులు వున్నాయని భావిస్తారు. ఈ ప్రదేశం పర్యటించి, కోటలో యువకులుగా మీ ధైర్యానికి పరీక్ష పెట్టండి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X