Search
  • Follow NativePlanet
Share
» »గిరిదిహ్ - కొండలు మరియు గుట్టలు గల భూమి !!

గిరిదిహ్ - కొండలు మరియు గుట్టలు గల భూమి !!

గిరిదిహ్ జార్ఖండ్ ప్రసిద్ధ మైనింగ్ పట్టణాలలో ఒకటిగా ఉంది. ఉత్తర ఛోటా నాగ్పూర్ డివిజన్ కేంద్రంలో ఉన్నది. పాత మరియు అందమైన కొండల నడుమ ఉండుటవల్ల పొరుగు రాష్ట్రాల పర్యాటకులను ఆకర్షిస్తుంది. గిరిదిహ్ రూబీ మైకా మరియు బొగ్గు రంగంలో నిల్వ గృహాలను కలిగి ఉంది. "గిరిదిహ్" అనే పదానికి ఎత్తైన ప్రాంతంలో కేంద్రీకరించిన కొండలు మరియు గుట్టలు గల భూమి అని అర్థం. జిల్లాలో అత్యధిక భాగం అడవులతో కవర్ చేయబడి ఉంటుంది. ఇక్కడ చాలావరకు సాల్ చెట్లు మరియు వెదురు, స్మాల్, మహు మరియు పాలస్ వంటి చెట్లను కూడా గుర్తించవచ్చు. గిరిదిహ్ లో ఖనిజాలు మైకా వనరులు సమృద్ధిగా ఉన్నాయి.

గిరిదిహ్ హోటళ్ళ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

గోఐబిబో కూపన్లు : 10 % ఆఫర్ తో అన్ని దేశీయ విమానాలను బుక్ చేయండి లిమిటెడ్ ఆఫర్ త్వరపడండి

హరిహర్ ధామ్

హరిహర్ ధామ్

హరిహర్ ధామ్ జార్ఖండ్ రాష్ట్రంలో గిరిదిహ్ జిల్లాలో వాంటెడ్ పుణ్యక్షేత్రములలో ఒకటిగా ఉంది. హరిహర్ ధామ్ ఆలయం అని కూడా పిలుస్తారు. ఇది 65 అడుగుల ఎత్తు కలిగి ప్రపంచంలో అతిపెద్ద శివలింగంగా ప్రసిద్ది చెందింది. 25 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించిన ఈ ఆలయం చుట్టూ ఒక నది ఉంది. ఈ భారీ శివలింగాన్ని పూర్తి చేయటానికి 30 సంవత్సరాలు పట్టింది. భక్తులు సంవత్సరంలో ఏ సమయంలో నైన సందర్శించవచ్చు.

Photo Courtesy: Vsvinaykumar2

ఉశ్రి జలపాతం

ఉశ్రి జలపాతం

ఉశ్రి జలపాతం గిరిదిహ్ జిల్లా పట్టణానికి తూర్పున 13కిమీ దూరంలో ఉన్నది. ఉశ్రి జలపాతం రాష్ట్రంలో డిమాండ్ ఉన్న పిక్నిక్ ప్రదేశాలలో ఒకటిగా ఉంది. ఈ నది 40 అడుగుల లోతైన ఇరుకుదారి గుండా క్రిందికి వచ్చి మూడు వేర్వేరు ప్రవాహాలుగా విడిపోతుంది. పరస్నాథ్ హిల్స్ చుట్టూ ఉన్న అడవిలో ఉశ్రి జలపాతం ఉన్నది. పర్యాటకులు గిరిదిహ్ సమీప రైల్వే స్టేషన్ నుండి మూడు చక్రాల ఆటో రిక్షాలు,టాక్సీ లేదా టాంగా ద్వారా ఈ జలపాతంను చేరుకోవచ్చు. పర్యాటకులకు బస్సు స్టాండ్ నుండి బస్సులు సులభంగా అందుబాటులో ఉంటాయి.

Photo Courtesy: Debdutto Banerjee

పరస్నాథ్ హిల్స్

పరస్నాథ్ హిల్స్

పరస్నాథ్ హిల్స్ సముద్ర మట్టానికి 4480 అడుగుల ఎత్తులో ఉన్నది. ఇది జార్ఖండ్ లో ఎత్తైన పర్వత శిఖరం. అంతేకాక హిమాలయాల దక్షిణ భాగంలో కూడా అత్యంత ఎత్తైన పర్వతంగా ఉన్నది. ఈ ప్రదేశంలో 20 నుండి 24 వ తీర్థంకరుల వరకు మోక్షాన్ని పొందారు. ఈ కొండ చుట్టూ దట్టమైన అడవి ఉండుట వల్ల మధుబన్ అని పిలుస్తారు. ట్రెక్కింగ్ ఆసక్తి పర్యాటకులు మధుబన్ నుండి ప్రారంభించకుండా కొండ ఉత్తర దిశ నుండి ప్రారంభిస్తే సులభంగా ఉంటుంది.

Photo Courtesy: Ashish_J

మధుబన్

మధుబన్

మధుబన్ లో ట్రెకెర్స్ అధిరోహహించవలసిన దూరం 27కిమీ ఉంటుంది. నడవడానికి సాధ్యం కానీ పర్యాటకులు డోలి ల సహాయం తీసుకుంటారు. కొండ పైకి వెళ్ళినప్పుడు తప్పనిసరిగా టార్చ్ తీసుకువెళ్ళాలి. మార్గమధ్యంలో టీ, కాఫీ మరియు ఇతర శక్తివంత పానీయాల కొరకు దుకాణాలు ఉన్నాయి. పరస్నాథ్ ముందు గౌతమ్ స్వామి కొండ మరియు చంద్ర ప్రభు కొండ అనే రెండు పర్యాటక ఆసక్తి గల కొండలు ఉన్నాయి.

Photo Courtesy: telugu native planet

ఖందోలి

ఖందోలి

పర్యాటకులు సాధారణంగా అద్భుతమైన వలస పక్షులను చూడటానికి శీతాకాలంలో ఖందోలి వద్దకు తరలి వస్తారు.రాక్ అధిరోహకులు గ్రానైట్ రాళ్లతో ఏర్పడిన ఖందోలి హిల్ ను రాక్ క్లైంబింగ్, త్రాళ్ళతో అధిరోహించడం మరియు నదీ మరియు ఇతర సవాలుగా ఉన్న కార్యకలాపాలను ప్రయత్నించవచ్చు. ఖందోలి ఆనకట్ట మీద పెడల్ పడవలు,స్పీడ్ బోట్స్ మరియు నీటి స్కూటర్లు వంటి నీటి కార్యకలాపాలను చేసి ఆనందించవచ్చు. పర్యాటకులను ఆకర్షించడానికి పడవ పందెం, సెయిలింగ్, రింగో రైడ్ తెప్ప, వాటర్ స్కీయింగ్, సర్ఫింగ్, స్కూబా డైవింగ్ ఉన్నాయి.

Photo Courtesy: [email protected]

గిరిదిహ్ చేరుకోవడం ఎలా ??

గిరిదిహ్ చేరుకోవడం ఎలా ??

విమాన మార్గం

గిరిదిహ్ లో ఏ విమానాశ్రయం లేదు. సమీప విమానాశ్రయాలు రాంచి లో బిర్సా ముండా విమానాశ్రయం 208కిమీ దూరంలో, గయా విమానాశ్రయం 201 కిమీ దూరంలో, పాట్నాలో లోక్ నాయక్ జయప్రకాష్ విమానాశ్రయం 265 కిమీ దూరంలో మరియు కోలకతాలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయం 312 కిమీ దూరంలో ఉన్నాయి.

రైలు మార్గం

ఒక ప్యాసింజర్ రైలు మధుపూర్ జంక్షన్ నుండి గిరిదిహ్ స్టేషన్ కు ప్రతి రోజు ఐదు సార్లు నడుస్తుంది. వీటి మధ్య 54కిమీ దూరం ఉంటుంది. గిరిదిహ్ నుండి 48కిమీ దూరంలో మరొక ముఖ్యమైన స్టేషన్ పరస్నాథ్ స్టేషన్ ఉన్నది. నేరుగా ఒక రైలు గిరిదిహ్ నుండి కోలకతా మరియు పాట్నాకు నడుస్తుంది.

రోడ్డు మార్గం

గిరిదిహ్ రహదారులు ద్వారా బాగా అనుసంధానించబడింది. గిరిదిహ్ NH-2 మరియు NH-100 కూడలి వద్ద ఉంది. బస్ టెర్మినల్ నగరం మధ్యలో ఉండుటవల్ల సులభంగా చేరవచ్చు. ప్రైవేట్ మరియు ప్రభుత్వ బస్సులు అందుబాటులో ఉంటాయి. రవాణాకు ఇతర మార్గాలుగా ఆటోలు,రిక్షాలు,మినీ బస్సులు మరియు ప్రైవేటు టాక్సీలు కూడా ఉన్నాయి.

Photo Courtesy: indiarailinfo.com

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X