Search
  • Follow NativePlanet
Share
» »తెన్జాల్ - ఆహ్లాదపరిచే పర్యాటక ప్రదేశాలు !

తెన్జాల్ - ఆహ్లాదపరిచే పర్యాటక ప్రదేశాలు !

By Mohammad

ప్రతి పర్యాటకుడూ చూసి తీరాల్సిన మిజోరం లోని అధ్బుతమైన గ్రామం తెన్జాల్. సెర్చిప్ జిల్లా పరిధిలో వుండే ఈ గ్రామం కేవలం దట్టమైన అడవి మాత్రమే. మిజోరాం రాజధాని ఐజాల్ కు తెన్జాల్ 43 కిలోమీటర్ల దూరంలో వుంది.

తెన్జాల్ గ్రామం 1961 వ సంవత్సరం వరకు దట్టమైన అటవీ ప్రదేశంగా ఉండేది. ఎక్కడ పడితే అక్కడ నిత్యం వన్యప్రాణులు కన్పించేవి. అయితే, కొన్ని చట్టాలు తీసుకొని వచ్చి, ఈ అటవీ ప్రాంతాన్ని సాగులోకి, నివాసయోగ్యంగా మార్చారు. 1963 వ సంవత్సరంలో బెంఘవాయియాశై ఈ గ్రామాన్ని రూపొందించాడని చెప్తారు. అప్పటి నుండి ఇప్పటి వరకు తెన్జాల్ 'మిజో చేనేత పరిశ్రమ' కు పేరుగాంచింది.

తెన్జాల్ గ్రామం

తెన్జాల్ గ్రామం

చిత్ర కృప : Lalzarzoa Ralte

తెన్జాల్ ప్రత్యేక పర్యాటకానికి అనువైనది. ఇది జంతు, వృక్షజాతులు అధికంగా ఉండి పర్యాటకులను ఆకర్షిస్తున్నది. తెన్జాల్ పర్యటనలో ఆహ్లాదపరిచే పర్యాటక ప్రదేశాలు కొన్ని మాత్రమే ఉన్నాయి. తెన్జాల్ డీర్ పార్క్ అనేక రకాల జింకలకు నిలయంగా ఉంటే, వాన్తాంగ్ జలపాతం మిజోరం లోని అత్యంత పొడవైన జలపాతాలలో ఒకటిగా నిలిచింది.

ఇది కూడా చదవండి : లుంగ్లీ లో సందర్శించవలసిన పర్యాటక స్థలాలు !

వన్తాంగ్ జలపాతం

వాన్తాంగ్, మిజోరం రాష్ట్రంలో అత్యంత పొడవైన జలపాతం గా ప్రసిద్ధి చెందినది. ఇది దేశంలో అత్యంత పొడవైన జలపాతాలలో 13 వ స్థానంలో ఉన్నది. ఇది 229 మీటర్ల ఎత్తు నుండి రెండు అంచులుగా కిందకు పడుతుంది. తెన్జాల్ కి చాలా దగ్గరగా ఉన్న ఈ జలపాతాన్నిస్థానికులు 'వాన్తాంగ్ ఖవతల' అని పిలుస్తారు.

వన్తాంగ్ జలపాతం

వన్తాంగ్ జలపాతం

చిత్ర కృప : telugu native planet

వన్తాంగ్ జలపాతం సేర్చిపి నుండి 30 కిలోమీటర్ల దూరంలో మరియు ఐజ్వాల్ నుండి 137 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. సంవత్సరం పొడవునా నీటిధారతో కన్పించే ఈ జలపాతాన్ని పర్యాటకులు తప్పక సందర్శించాలి. జలపాతం ముందు నిలబడి అందమైన ఫోటోలు తీసుకోవచ్చు. మీ వద్ద కెమరా లేకపోతే అక్కడే ఉన్న ఫోటోగ్రాఫర్ కు చెప్పి ఫోటోలు తీయించుకోవచ్చు.

తెన్జాల్ జింకల పార్క్

తెన్జాల్ ఒకప్పుడు దట్టమైన అడవి. ఇది ఈమధ్యనే షుమారు 50 సంవత్సరాల నుండి అటవీ ప్రదేశాన్ని తగ్గించి మనుషులు నివాసం ఉండే ప్రదేశంగా ప్రారంభించబడింది. ఈ ప్రాంతంలో తరచుగా జింకలు కనిపించడమే దీనికి ప్రధాన కారణం. తెన్జాల్ జింకల పార్కు జింకలకు రక్షణ నిలయంగా రూపొందించబడింది.

తెన్జాల్ జింకల పార్క్

తెన్జాల్ జింకల పార్క్

చిత్ర కృప : Sankara Subramanian

ప్రస్తుతం, ఈ తెన్జాల్ జింకల ప్రార్కులో 11 మగ జింకలు, 6 ఆడ జి౦కలతో కలిపి మొత్తం 17 జింకలు ఉన్నాయి. అవి వాటి సహజ వాతావరణంలో, సరిహద్దుల ద్వారా మాత్రమే రక్షించబడుతున్నాయి. పర్యాటకులు ఈ అందమైన జంతువులను చాలా దగ్గరగా ఈ తెన్జాల్ జింకల పార్కులో చూడవచ్చు.

గ్రామానికి దగ్గరలో ఉన్న ఈ తెన్జాల్ జింకల పార్కుకు, ఈ గ్రామంలో ఉండే పర్యాటకులు తేలికగా నడిచి వెళ్ళవచ్చు. అయితే, ఐజ్వాల్ లో ఉండే పర్యాటకులు టాక్సీ బుక్ చేసుకుని లేదా బస్సులో తెన్జాల్ లోని ఈ గ్రామానికి చేరుకోవచ్చు.

తెన్జాల్ చేరుకోవడం ఎలా ?

సమీప విమానాశ్రయం

లెన్గపుయి(ఐజ్వాల్ విమానాశ్రయం) తెన్జాల్ కు సమీపాన ఉన్న విమానాశ్రయం. ఐజ్వాల్ నుండి ఇక్కడికి చేరుకోవటానికి గంట సమయం పడుతుంది. మిజోరాం రాష్ట్ర బస్సులు మరియు ఇతర ప్రవేట్ వాహనాల్లో ఎక్కి గమ్యస్థానికి సులభంగా చేరుకోవచ్చు. ఈ విమానాశ్రయం కలకత్తా, గౌహతి, అగర్తలా, ఇంఫాల్ నుండి చక్కగా అనుసంధానించబడింది.

సమీప రైల్వే స్టేషన్

తెన్జాల్ కు సమీపాన 266 కి. మీ ల దూరంలో సిల్చార్(అస్సాం రాష్ట్రానికి చెందినది) రైల్వే స్టేషన్ కలదు. ఇది చాలా చిన్న స్టేషన్. అగర్తలా, లమ్డింగ్ రైల్వే లైన్ లో ఇది ఉన్నది. గువాహటి నుండి రైల్లో ప్రయాణించి లమ్ డింగ్ చేరుకొని, అక్కడి నుండి సిల్చార్ వెళ్ళవచ్చు. స్టేషన్ బయట ప్రవేట్ ట్యాక్సీ లను అద్దెకు తీసుకొని తెన్జాల్ సులభంగా ప్రయాణించవచ్చు.

మిజోరాం ట్యాక్సీ

మిజోరాం ట్యాక్సీ

చిత్ర కృప : Lalzarzoa Ralte

బస్సు / రోడ్డు మార్గం

పర్యాటకులు ఐజ్వాల్ నుండి జాతీయ రహదారి 54 గుండా తెన్జాల్ చేరుకోవచ్చు. మిజోరం లోని ఐజ్వాల్ నగరానికి, తెన్జాల్ కు దూరం 43 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ప్రయాణ సమయం గంట పడుతుంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X