Search
  • Follow NativePlanet
Share
» »యుక్సోం - సన్యాసుల మఠం !

యుక్సోం - సన్యాసుల మఠం !

By Mohammad

యుక్సోం సిక్కిం లోని పశ్చిమ జిల్లాలో ఉంది. చుట్టూ పలురకాల ధార్మిక ప్రదేశాలతో, గెయ్జింగ్ లోని ఈ చారిత్రిక పట్టణం సిక్కిం వద్ద ఒక ప్రసిద్ధ పర్యాటక ప్రదేశంగా ఉంది మరియు పర్వతారోహకుల మధ్య కూడా అంతే ప్రజాదరణ పొందింది. సముద్రమట్టానికి 1780 మీటర్ల ఎత్తు ఉన్న యుక్సోం, కంచన్జుంగా పర్వత ప్రవేశద్వారంగా ఉంది.

యుక్సోం లోను, చుట్టుపక్కల ఉన్న పర్యాటక ప్రదేశాలు యుక్సోం లో చాలా ఆశక్తికర ప్రదేశాలు ఉన్నాయి. వాటిలో కొన్ని: రాతోంగ్ చు నది, ఖేచియోపల్రి సరస్సు, టిబెటన్ల బౌద్ధ ఆశ్రమం, దుబ్డి ఆశ్రమం, కర్తోక్ ఆశ్రమం, తశిదింగ్ ఆశ్రమం మొదలైనవి.

యుక్సోం గ్రామం ముఖ చిత్రం

యుక్సోం గ్రామం ముఖ చిత్రం

చిత్ర కృప : Kothanda Srinivasan

యుక్సోం చరిత్ర ప్రకారం చూసినట్లయితే సిక్కిం పూర్వ రాజధాని యుక్సోం. యుక్సోం అంటే "ముగ్గురు పండిత సన్యాసులు మాట్లాడుకునే ప్రదేశం" అని అర్ధం. ముగ్గురు సన్యాసులు టిబెట్ నుండి యుక్సోం కి తిరిగి వచ్చారు కాబట్టి ఈ ప్రదేశానికి ఆపేరు వచ్చింది.

<strong>నామ్చి - హిమాలయాల ఒడిలో విహారం !</strong>నామ్చి - హిమాలయాల ఒడిలో విహారం !

ఏడాది పొడవునా ఈ ప్రదేశాలలో వాతావరణం సాధారణ ఎత్తువద్ద ఉన్న యుక్సోం లో ఒక మోస్తరు వాతావరణం ఉంటుంది. మార్చ్ - జూన్, సెప్టెంబర్- నవంబర్ మధ్య ఈ ప్రదేశం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది.

దుబ్డి ఆశ్రమం

సిక్కిం రాష్ట్రంలో ఏదైనా పురాతన గోమ్ఫా ఉందంటే అది దుబ్డి ఆశ్రమమే. ఇది బౌద్ధ ధార్మిక కూటములలో ఒకటి. దీనిని సన్యాసుల సెల్ అని కూడా అంటారు. దీనిని ఒక కొండపై సుమారు 7000 అడుగుల మీటర్ల ఎత్తులో ఎంతో ఉన్నతంగా, కళాత్మకంగా తీర్చిదిద్దారు.

దుబ్డి ఆశ్రమం

దుబ్డి ఆశ్రమం

చిత్ర కృప : Kothanda Srinivasan

గోమ్ఫా గోడలపై దేవుళ్ళ, సాధువుల బొమ్మలను ఎంతో అందంగా తీర్చిదిద్దారు. ఆశ్రమంలో పుస్తకాల సేకరణ, గ్రంథాలు, చేతి ప్రతులు ఉన్నాయి. అంతేకాకుండా దుబ్డి ఆశ్రమ స్థాపనకు కారణమైన ముగ్గురు స్థాపకులు (లామాలు) విగ్రహాలు కూడా చూడవచ్చు.

<strong>లచెన్ - ఒత్తిడి తగ్గించుకోండి ... సేదతీరండి !</strong>లచెన్ - ఒత్తిడి తగ్గించుకోండి ... సేదతీరండి !

తశిదింగ్ ఆశ్రమం

సిక్కిం లో ఉన్న మరో అద్భుతమైన పవిత్ర ప్రదేశం తశిదింగ్ ఆశ్రమం. పద్మసంభవ గురువు క్రీ. శ. 8 వ శతాబ్దంలో ఈ భూమిని దీవించాడని చెబుతారు. గుండె ఆకారంలో చూస్తే చాలు ఆకట్టుకొనేవిధంగా ఉంటుంది ఈ ఆశ్రమ ప్రదేశం. ఈ ప్రాంతం నుండి కంచన్జుంగా పర్వతాన్ని అందంగా చూడవచ్చు. దీనిని తోంగ్ - వారంగ్- డోల్ అని పిలుస్తారు అంటే అర్థం 'దృష్టి ద్వారా రక్షించబడటం' లేదా 'చల్లని చూపు ద్వారా అనునిత్యం రక్షించడం' అని.

తశిదింగ్ ఆశ్రమం

తశిదింగ్ ఆశ్రమం

చిత్ర కృప : walter callens

తశిదింగ్ ఆశ్రమంలో ఉత్సవాలు ప్రతిఏటా జరుగుతాయి. ఇక్కడ గోమ్ఫా లు ప్రతి సంవత్సరం "నీటి పండుగ" లను వైభవంగా నిర్వహిస్తారు. ప్రతి ఏటా లూనర్ నెల రెండవ వారంలో 14,15 తేదీలలో భుమ్చు వేడుకను జరుపుకుంటారు. అప్పుడు భక్తులు ఈ నీటితో ఆశీర్వదించబడతారు.

పర్వతారోహణ

యుక్సోం పర్వతారోహణకు అనువైనది. ఇది పర్వతారోహకులకు ఒక స్థావరం లాంటిది. ఇక్కడి చాలా మనది సాహసికులు ట్రెక్కింగ్, పర్వతారోహణకు వెళుతుంటారు.

పర్వతారోహణ మార్గాలలో ఒకటి

పర్వతారోహణ మార్గాలలో ఒకటి

చిత్ర కృప : Kothanda Srinivasan

తశిదింగ్ / గోయెచా లా అధిరోహణ లేదా కాచుపురి సరస్సుకు ట్రెక్కింగ్ అధిరోహణ చేయటానికి ఒకరోజు, కంచన్జుంగా పార్క్ అధిరోహించటానికి రెండు గంటల సమయం పడుతుంది.

<strong>ఇండియాలో 5 ప్రసిద్ధ బౌద్ధ ఆరామాలు !</strong>ఇండియాలో 5 ప్రసిద్ధ బౌద్ధ ఆరామాలు !

ఖేచియోపల్రి సరస్సు

పురాణాల ప్రకారం ఖేచియోపల్రి చాలా మహిమ కల సరస్సు. బౌద్ధ మతస్థులు దీనిని ఎంతో పవిత్రంగా పరిగణిస్తారు. పద్మసంభవుడు ఈ సరస్సు ఒడ్డున 100 యోగినీలకు జ్ఞాన బోధ చేసాడని, తారా మాత ఆలయం యొక్క పాద ముద్రికలు ఈ సరస్సు ఒడ్డున ఉన్నాయని నమ్ముతారు.

ఆశ్రమంలో గౌతమ బుద్ధుని విగ్రహం

ఆశ్రమంలో గౌతమ బుద్ధుని విగ్రహం

చిత్ర కృప : Shillika

ఈ నీటికి సంబంధించి ఒక ఆసక్తికరమైన సన్నివేశం ఉంది. అదేమిటంటే, పక్షులు సరస్సులో ఆకులు పడిన వెంటనే పై నుండి ఎగిరి వచ్చి దాన్ని పట్టుకొని విసిరేస్తాయి.

కార్టోక్ ఆశ్రమం

కార్టోక్ ఆశ్రమం సిక్కిం లో ఉన్న మరో అందమైన ఆశ్రమం. కార్టోక్ సరస్సుకు ఎదురూగా ఉన్న ఈ గోమ్పా సిక్కిం తొలిపాలకుడు లామా పేరుమీద వచ్చింది. యుక్సోం లో ఉన్న మూడు ప్రధాన గోమ్పా లలో ఇది ఒకటి.

రబ్డెంట్స్ పాలెస్

రబ్డెంట్స్ పాలెస్

చిత్ర కృప : Ayan Banerjee

ఎలా చేరుకోవాలి ?

వాయు మార్గం : బాగ్దోగ్రా సమీపాన ఉన్న ఎయిర్ పోర్ట్. ఇక్కడి నుండి క్యాబ్ లేదా టాక్సీ లలో 170 కి. మీ ల దూరంలో ఉన్న యుక్సోం కు చేరుకోవచ్చు.

రైలు మార్గం : యుక్సోం కు సమీపాన న్యూ జల్పాయిగురి రైల్వే స్టేషన్ 150 కి. మీ ల దూరంలో కలదు. ఈ స్టేషన్ నుండి టాక్సీ లో యుక్సోం కు చేరుకోవచ్చు.

రోడ్డు/ బస్సు మార్గం : గేజింగ్, గాంగ్టక్ తదితర సమీప పట్టణాల నుండి, ప్రాంతాల నుండి యుక్సోం కు ప్రభుత్వ బస్సులు, ప్రవేట్ వాహనాలుతిరుగుతుంటాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X