Search
  • Follow NativePlanet
Share
» »జలంధర్ – చరిత్ర, సంస్కృతుల నిలయం !!

జలంధర్ – చరిత్ర, సంస్కృతుల నిలయం !!

పంజాబ్ రాష్ట్రంలో కల జలంధర్ ఒక పురాతన నగరం. ఈ నగరం పేరు 'జలంధరుడు' అనే రాక్షసుడి పేరుపై పెట్టబడింది. జలంధరుడి పేరు పురాణాల లోను, మహాభారతం లోను కూడా పేర్కొనబడింది. హిందీ భాషలో జలంధర అంటే 'నీటి అడుగున వున్న ప్రాంతం' అని అర్ధం చెపుతారు. స్థానికుల మేరకు ఈ ప్రాంతం రెండు నదులు (బియాస్ మరియు సట్లేజ్) మధ్యగల ప్రదేశంగా చెపుతారు. స్వాతంత్రం తర్వాత ఈ నగరం 1953 వరకు పంజాబ్ కు రాజధానిగా వ్యవహరించింది. పట్టణానికి గల సంస్కృతి సాంప్రదాయాలు టూరిస్ట్ లను అధిక సంఖ్యలో ఆకర్షిస్తూ, జలంధర్ ను ఒక ఆకర్షణీయ పర్యాటక ప్రదేశం గా తీర్చిదిద్దాయి.

జలంధర్ లో అనేక కోటలు దేవాలయాలు, మ్యూజియంలు కలవు. ఇవి ఆ నగరంలో ముఖ్యమైనవి కూడా! ప్రజల సంస్కృతిని అద్దం పడుతూ నగరంలోని వివిధ ప్రాంతాలాలలో అనేక గురుద్వారాలు కూడా కలవు. సిటీ లో అనే మాల్స్, షాపింగ్ సెంటర్ లు కూడా ఉండటంతో ఈ పట్టణం షాపర్లకు ఒక స్వర్గం వలే వుంటుంది. ఇక్కడున్న కొన్ని పర్యాటక ప్రదేశాలను ఒకసారి గమనిస్తే ...

జలంధర్ లోని హోటళ్ళ వసతి కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

దేవి తాలాబ్ మందిర్

దేవి తాలాబ్ మందిర్

దేవి తాలాబ్ మందిర్ ప్రసిద్ధ పుణ్య క్షేత్రం. జలంధర్ సిటీ రైలు స్టేషన్ కు కొద్ది దూరంలో వుంటుంది. ఇది 51 శక్తి పీఠాలలో ఒకటి. ప్రజల మేరకు, ఈ టెంపుల్ ను మాత సతీ దేవి యొక్క కుడి వక్ష భాగం పడిన ప్రదేశంలో నిర్మించారు. 200 ఏళ్ల చరిత్ర కల ఈ టెంపుల్ లో దుర్గ మాత విగ్రహం వుంటుంది. ఒక పవిత్ర సరస్సు కూడా కలదు. ఈ టెంపుల్ లో శివుడి అవతారం అయిన భీషణ్ భైరవ్ విగ్రహం కూడా కలదు. ప్రతి సంవత్సరం డిసెంబర్ లో హరి వల్లభ సంగీత సమ్మేలన్ నిర్వహిస్తారు. ఇక్కడే ఒక కాళి మాత మందిరం కూడా కలదు. ఈ టెంపుల్ అమరనాధ్ టెంపుల్ ను పోలి వుంటుంది.

Photo Courtesy:Gopal Aggarwal

కర్తార్పూర్ గురుద్వారా

కర్తార్పూర్ గురుద్వారా

కర్తార్పూర్ గురుద్వారా ను శ్రీ గురు హరగోవింద్ సాహిబ్ జి నిర్మించారు. ఇది జలంధర్ సిటీ కి 16 కి.మీ.ల దూరంలో వాయువ్యంలో వుంటుంది. ప్రతి సంవత్సరం గురువు యొక్క జయంతి నిర్వహిస్తారు. సందర్శకులు ఇక్కడ ఒక పెద్ద బావిని చూడవచ్చు. ఈ గురుద్వారాను ఈ బావి కారణంగా శ్రీ చౌబాచా సాహిబ్ అని కూడా అంటారు. ఇక్కడ శ్రీ గురు హరగోవింద్ సాహిబ్ జి జర్నెయిల్ పాండే ఖాన్ తో చెస్ ఆట ఆడేవారు.

Photo Courtesy: krish

రంగ్లా పంజాబ్ హవేలీ

రంగ్లా పంజాబ్ హవేలీ

రంగ్లా పంజాబ్ హవేలీ జిటి రోడ్ లో కలదు. ఇది గ్రామీణ జీవన విధానం చూపుతుంది. ఇది ఒక ఆదర్శ గ్రామం. దీనిలో సాంప్రదాయ దుస్తులు ధరించిన మహిళల, పిల్లల విగ్రహాలు వుంటాయి. సందర్శకులను వైటర్లు కుర్తాలు, జాకెట్లు దుస్తులతో ఆహ్వానిస్తారు. ఇక్కడ పంజాబీ డాన్స్ లు, భాంగ్రా వంటివి, రుచికర పంజాబీ ఆహారాలు ఆనందించవచ్చు. ప్రతి రోజూ అనేక కల్చరల్ ప్రోగ్రామ్స్ నిర్వహిస్తారు. ఫోటోలు, సంగీత సాధానాలు కూడా ప్రదర్శిస్తారు.

Photo Courtesy:Gopal Aggarwal

తులసి మందిర్

తులసి మందిర్

తులసి మందిర్ ను వ్రిందా దేవి టెంపుల్ అని కూడా అంటారు. ఈమె జలంధర రాక్షసుడి భార్య. ఈ టెంపుల్ లోపల ఒక చెరువు కలదు. గతంలో ఈ చెరువు రాక్షసుడికి స్నానపు ప్రదేశంగా వుండేది. ఈ టెంపుల్ సమీపంలో ఒక గుహ కలదు. దీనిలో మాత అన్నపూర్ణ విగ్రహం కలదు. హిందువులు ఈ దేవతను పంటలను ఆహారాన్ని ఇచ్చే దేవతగా భావిస్తారు. ఇక్కడే కల శీతల దేవి టెంపుల్ చాలా పురాతనమైనది. చుట్టపట్ల శివుడికి అనేక గుడులు కలవు. ఒక బ్రహ్మ కుండ్ కూడా కలదు.

Photo Courtesy: Gopal Aggarwal

శివ మందిర్

శివ మందిర్

శివ మందిర్ ను సుల్తాన్ పూరి లోది నవాబ్ గుర్ మంది లో నిర్మించాడు. స్థానికుల కథనం మేరకు నవాబు ఒక వివాహిత మహిళపై కన్ను వేయగా ఆమె శివ భక్తురాలు కావటంతో శివుడి నాగుపాము ఆమెను రక్షించిందనీ, నవాబ్ ఆమెను క్షమా బిక్ష వేడుకోగా ఆమె కరుణించి నవాబును శివ టెంపుల్ కట్టించమని ఆదేసిన్చిందని చెపుతారు. ఆమె ఆదేశాలపై నవాబు ఈ దేవాలయం నిర్మించాడు. టెంపుల్ ముఖ ద్వారం మసీదుని పోలి వుండగా, లోపలి భాగం అంతా టెంపుల్ వలెనె వుంటుంది.

Photo Courtesy: Gopal Aggarwal

సెయింట్ మేరీ కేథడ్రాల్

సెయింట్ మేరీ కేథడ్రాల్

సెయింట్ మేరీ కేథడ్రాల్ నగరంలో ఒక ప్రసిద్ధ ఆకర్షణ. ఈ చర్చిని ఒకప్పుడు లాహోర్ చర్చి పాలించినది. దీనికి ఎత్తైన గోపురాలు, శిలువలు వుంటాయి. ఈ చర్చి చుట్టూ వుండే గార్డెన్ లో వివిధ రకాల అందమైన పూవులు, వృక్షాలు వుంటాయి.

Photo Courtesy:The Discoverer

షహీద్ - ఇ - ఆజమ్ సర్ధార్ భగత్ సింగ్ మ్యూజియం

షహీద్ - ఇ - ఆజమ్ సర్ధార్ భగత్ సింగ్ మ్యూజియం

షహీద్ - ఇ - ఆజమ్ సర్ధార్ భగత్ సింగ్ మ్యూజియాన్ని 23 మార్చి 1981 వ సంవత్సరంలో స్థాపించినారు. ఇది భగత్ సింగ్ 50 వ వర్ధంతి రోజున ఆయన గుర్తుగా ఇక్కడ ప్రారంభించబడినది. ఇది స్వాతంత్ర్య యోధుడు అయిన ఖత్కర్ కలియన్ గ్రామంలో నెలకొల్పబడినది. ఇది జలంధర్ నుంచి సుమారుగా 55 కి. మీ. దూరంలో ఉంది. ఇక్కడ భగత్ సింగ్ ఆనాడు ఉపయోగించిన పరికరాలు, వస్తువులు మరియు దుస్తులను సేకరించి వాటిని ఒక మ్యూజియంగా తీర్చిదిద్దినది. భగత్ సింగ్ తో పాటుగా ఉరి తీయబడ్డ రాజ్ గురు ,సుక్‌దెవ్ లు ఆనాడు సంతకం చేయడానికి ఉపయోగించిన కలము (పెన్ను) ఇప్పటికీ ఆ మ్యూజియంలోనే భద్రపరిచారు.

Photo Courtesy: telugu nativeplanet

వండర్ ల్యాండ్ థీం పార్క్

వండర్ ల్యాండ్ థీం పార్క్

వండర్ ల్యాండ్ థీం పార్క్ డాబా ప్రాంతంలో కలదు. ఇది తప్పక చూడవలసిన పర్యాటక ఆకర్షణ. ఇది దేశంలోని ప్రసిద్ధ అమూజ్ మెంట్ పార్క్ లలో ఒకటి. అన్ని వయసుల వారూ ఆనందిస్తారు. అనేక వినోద అంశాలతో టూరిస్ట్ లను ఆకర్షిస్తుంది. ఈ పార్క్ లో కల హర్రర్ హౌస్ ఒక ప్రత్యేక ఆకర్షణ.వాటర్ పార్క్ బే సైడ్, వేవ్ పూల్, వండర్ ఫాల్ , ఇండోర్ ఆక్వా డాన్స్, జైంట్ మరియు స్పీడ్ స్లయిడ్ వంటివి కలవు. పచ్చటి లాన్ మరియు ఒక గిఫ్ట్ స్టోర్ కూడా కలవు.

Photo Courtesy:Glassworld

పుష్ప గుజ్రాల్ సైన్స్ సిటీ

పుష్ప గుజ్రాల్ సైన్స్ సిటీ

పుష్ప గుజ్రాల్ సైన్స్ సిటీ, జలంధర్ - కపుర్తల రోడ్డు మార్గాన 72 ఎకరాల సువిశాలమైన మైదానంలో నెలకొల్పబడినది. ఇక్కడ చిన్నారులు, విద్యార్థులు చేసిన సైన్స్ ప్రాజెక్ట్ లను చూడవచ్చు. ఇక్కడ ఇంజనీరింగ్, జీవ శాస్త్రం, భౌతిక శాస్త్రం, న్యూక్లియర్ సైన్స్, మనో విజ్ఞాన శాస్త్రం ఇలా అన్ని ఇక్కడ ప్రదర్శనకై ఉంచుతారు. లేజర్ షోలు, కాసింత ఎంటటేన్‌మెంట్ ఇక్కడ దొరుకుతుంది. ఈ సైన్స్ మ్యూజియంలోనే రెస్టారెంట్లు కూడా ఉన్నాయి. ఈ రెస్టారెంట్లలో మనకు ఇష్టమైన భోజనం ఆర్డర్ ఇచ్చి మరీ చేపించుకోవచ్చు. ఈ ప్రదేశం పిల్లలకి ఎంతో ఆటవిడుపుగా ఉంటుంది. ఇక్కడికి పిల్లలతో పాటుగా పెద్దలు వస్తుంటారు.

Photo Courtesy: VarinderKalsi1

జలంధర్ ఎలా చేరుకోవాలి ??

జలంధర్ ఎలా చేరుకోవాలి ??

బస్ ప్రయాణం

పంజాబ్ లోని ప్రధాన నగరాలు, చుట్టూ పట్ల రాష్ట్రాలలోని ప్రధాన భాగాలు నుండి జలంధర్ బస్సు లలో చేరవచ్చు. వోల్వో, డీలక్స్ మరియు సెమి సెమి డీలక్స్ బస్సులు అందుబాటులో ఉంటాయి. మీరు నగరంలో తిరగటానికి ఆటోల సదుపాయం కలదు.

రైలు ప్రయాణం

జలంధర్ నగరం లో రైల్వే స్టేషన్ ఉంది. ఈ జలంధర్ సిటీ రైలు స్టేషన్ ఢిల్లీ - అమృత్‌సర్ రైల్వే లైన్ లో కలదు. కనుక రైలు సదుపాయం సులభంగా ఉంటుంది, సౌకర్యవంతం కూడాను! శతాబ్ది, జమ్మూ మెయిల్ వంటి ట్రైన్ లు ఢిల్లీ - జలంధర్ మార్గం లో రెగ్యులర్ గా నడుస్తాయి.

విమాన ప్రయాణం

జలంధర్ కు అమృత్‌సర్ లోని రాజా సంసి ఎయిర్ పోర్ట్ 90 కి. మీ. దూరం లో వుంటుంది. అమృత్‌సర్ చేరే వారు టాక్సీ లలో జలందర్ చేరవచ్చు. అమృత్‌సర్ నుండి రోడ్డు మార్గం గుండా జలంధర్ కు వచ్చినట్లయితే ఒకటిన్నర గంటలో చేరుకోవచ్చు.

Photo Courtesy:Debatra Mazumdar

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X