Search
  • Follow NativePlanet
Share
» »కెమ్మనగుండి - మహరాజుల విశ్రాంతి ప్రదేశం !!

కెమ్మనగుండి - మహరాజుల విశ్రాంతి ప్రదేశం !!

సెలవుల్లో ఉన్నాం ...ఇక పిల్లలకి, పెద్దలకి ఒకటే ఆలోచన ... ఏమని ?? సెలవులు అయిపోతున్నాయి ఎక్కడికైనా వెళ్దాం అని !! మామూలుగా ఎండాకాలం అంటే అందరూ ఆలోచించేది ఏదైన చల్లని ప్రదేశం వెళ్దామని .. అవునా?? మరి ఉత్తర భారత దేశ యాత్రకి పోదాం అంటే మొన్న వచ్చిన భూకంపం భయం ఇంకా వీడలేదు, పోనీ ఊటీ , కొడైకెనాల్ వెళ్దాం అంటే పోయిన సారే వెల్లొచ్చాం కదా అని బుకాయింపు. మరి మీకు ఇట్లాంటి పరిస్థితులలో కూడా మీ నేటివ్ ప్లానెట్ మీకొక ప్రకృతితో పెనవేసుకున్న అందమైన హిల్ స్టేషన్ గురించి చెప్పబోతుంది అదే కెమ్మనగుండి !!

కెమ్మనగుండి కర్నాటక రాష్ట్రంలోని చిక్కమగళూరు జిల్లా తరికెరి తాలూకాలో కలదు. కెమ్మనగుండి ఒక హిల్ స్టేషన్ దీని చుట్టూ బాబా బూదాన్ గిరి కొండలు కలవు. ఎత్తైన కొండలు, జలపాత ధారాలు, దట్టమైన అడవులు, పచ్చటి మైదానాలు ఈ ప్రాంతాన్ని గొప్ప పర్యాటక ప్రదేశంగా మార్చాయి. కెమ్మనగుండి పర్వత కేంద్రంలో వాడేయార్‌ రాజు కృష్ణరాజ వాడేయార్‌ వేసవి విడిది చేసేవాడు కావున ఈ పర్వతశ్రేణులను కె.ఆర్‌. కొండలు అని కూడా పిలుస్తారు. ఈ పర్వత కేంద్రం సముద్ర మట్టానికి 1,434 మీటర్ల ఎత్తులో దట్టమైన అరణ్యాల మధ్య సంవత్సరం పొడవునా సెలయేళ్ళతో హరితంగా ఉంటుంది. పూల తోటలతో, కొండలోయలతో ఉండే ఈ పర్వత కేంద్ర సౌందర్యం వర్ణణాతీతం. అరణ్యాలు అన్వేషణ జరిపే వారికి ఈ పర్వత కేంద్రం నుండి అనేక మార్గాలు ఉన్నాయి. ఈ కొండ ప్రాంతంలో వివిధ ప్రదేశాల నుండి సూర్యాస్తమయాన్ని తిలకించ వలసిందే. కేంద్రం పైన గులాబీ తోటలు అనేకం ఉన్నాయి.మరి ఇంకెందుకు ఆలస్యం, ఇక్కడున్న ప్రదేశాలను ఒక్కొక్కటిగా తిలకిద్దాం పదండి.

నేటి ఉచిత కూపన్లు : బుక్కింగ్ ఖజానా వద్ద హోటళ్ళ బుక్కింగ్‌ల మీద 50% ఆఫర్ పొందండి

రాక్ గార్డెన్

రాక్ గార్డెన్

కెమ్మనగుండి పోతానే అటు ఇటు ఆలోచించకుండా గబుక్కున వెళ్ళి మొదట చూడవలసినది రాక్ గార్డెన్ . ఇది రాళ్ళతో మలచబడింది. వివిధ రకాల పూవులు చూడవచ్చు. అందమైన సూర్యాస్తమయం కొండలలోకి జారిపోవటాన్ని గమనిస్తారు. రాక్ గార్డెన్ చివరినుండి భద్ర రిజర్వాయర్ కూడా దర్శించవచ్చు. ఈ గార్డెన్ చూసేందుకు సూర్యాస్తమయ సమయాలు బాగుంటాయి. ఇక్కడికి దేశ, విదేశాలనుంచి యాత్రికులు, సాహసికులు, ప్రేమికులు ఒకటేమిటి అందరూ కూడా ఇక్కడికి వస్తుంటారు. ఇది మీరు తప్పక చూడాలి సుమి.

Photo Courtesy: native planet

జీ పాయింట్

జీ పాయింట్

రాక్ గార్డెన్ తరువాత తప్పక సందర్శించవలసిన మరొక అద్భుత పర్యాటక ప్రదేశం ఈ జీ పాయింట్ . ఎందుకంటే ఇది ఎత్తైన కొండ మీద ఉన్నది. ఇక్కడికి చేరాలంటే కేవలం నడకే ఉత్తమం. సుమారుగా ఈ కొండకి చేరటానికి పట్టే సమయం 30 నిమిషాలు. ఈ కొండ మీద నుంచి మీరు ప్రకృతి అందాలను, దగ్గరలో ఉండే జలపాతాన్ని చూసి ఆనందించవచ్చు. ఇక్కడ నుంచి ఫోటోలు తీసుకుంటే మంచి అనుభూతిని మీరు పొందుతారు. మీరు కెమెరా తీసుకొని వెళ్లండి, ఒకవేళ లేకున్న ఫరవాలేదు ఎందుకంటే ఇక్కడ ఫోటోలు దింపే ఫోటోగ్రాఫర్లు ఉంటారు.

Photo Courtesy: Kembootha

 హెబ్బే జలపాతం

హెబ్బే జలపాతం

ఇక్కడ మూడు జలపాతాలు ఉన్నాయి. వాటిలో చెప్పుకోదగ్గది హెబ్బే జలపాతం. ఇది అక్కడున్న జలపాతాలలో ముందుంది. అంతేనా పర్యాటక మదిలోకూడా ఇది తగుస్థానాన్ని ఆక్రమించింది. ఈ జలపాతానికి వెళ్లే దారి చాలా దారుణంగా ఉంటుంది. వెళ్తే నడిచి వెళ్లాలి లేదా జీపులో వెళ్లాలి, వేరే రకంగా వెళ్లే అవకాశమే లేదు. చూడటానికి 13 కి. మీ. దూరమే గానీ , నడుస్తుంటే మాత్రం ఒక ఊరికి వెళ్లినంత దూరం అనిపిస్తుంది. మరి అందమైన ఈ జలపాతాన్ని చూడాలంటే కాస్త కష్టపడక తప్పదు మరి. ఈ జలపాతం 168 మీటర్ల ఎత్తు నుండి పడుతుంది. ఈ జలపాతం రెండు గతిపథులుగా పడుతుంది. ఇలా పడుతూ ఉన్న నీటి ధారలో తడుస్తుంటే నడిచి వచ్చిన అలసట అంతా మటుమాయం అయిపోతుంది. ప్రశాంత వాతావరణం ఆనందించాలనుకునేవారికి హెబ్బే జలపాతాలు, చుట్టుపట్ల ప్రదేశాలు అనువుగా ఉంటాయి. పర్యాటకులు ఇక్కడ స్నానాలను కూడా చేయవచ్చు. ఈ జలపాత నీటిలో ఔషధ గుణాలున్నాయని, అవి చర్మ సంబంధిత వ్యాధులను, సాధారణ దగ్గు జలుబులను నివారిస్తాయని కూడా చెపుతారు.

Photo Courtesy: Pradeep Kumbhashi

కాళహట్టి జలపాతాలు

కాళహట్టి జలపాతాలు

కెమ్మనగుండి పర్యాటకులు కాళహట్టి జలపాతాలను తప్పక చూడాలి. వీటినే కాళ హస్తి జలపాతాలని కూడా అంటారు. ఇవి 122 కి.మీ. ఎత్తునుండి పడతాయి.స్ధానిక కధనాలమేరకు ఇవి మహర్షి ఆగస్త్యుడి సృష్టిగా చెపుతారు. ఈ జలపాతాల దగ్గరలో వీరభద్రుడి గుడి ఉంటుంది. ఇది విజయనగర కాలం నాటిది. దేవాలయ ప్రవేశంలో ఏనుగుల విగ్రహాలు అందంగా ఉంటాయి. ఇక్కడ జాతర్లు మనం గమనించవచ్చు. ఈ జాతర్లు సంవత్సరానికొకసారి జరుగుతాయి. ఇక్కడ నిర్వహించే జాతర్ల లో అనేక మంది పర్యాటకులు పాల్గొంటారు. హిందువులు, ముస్లిములు అనే తేడా లేకుండా ఇక్కడి జాతర్ల లో మతాసామరస్యం ప్రతిబింబిస్తుంది.

Photo Courtesy: Vinayak Kulkarni

శాంతి జలపాతాలు

శాంతి జలపాతాలు

కెమ్మనగుండి పర్యటించే వారికి శాంతి జలపాతాలను తప్పక సందర్శించాలి. ఎందుకంటే , ఈ జలపాతాలు కొండ పైభాగం నుండి పడతాయి. అందమైన ఒక లోయ దానికి ఇరుపక్కలా కొండలు కూడా చూడవచ్చు. బాగా గమనిస్తే, పడమటి కనుమల మైదానాలు కూడా కనపడతాయి. పర్యాటకులు జీ పాయింట్ ను కూడా దగ్గరగా చూడవచ్చు. పోయేదేముంది జీ పాయింట్ కళ్ళు మూసుకొని ఓ రెండడుగులేస్తే శాంతి జలపాతాలు వచ్చాయే !!

Photo Courtesy: Elroy Serrao

కెమ్మనగుండి ఎలా చేరుకోవాలి??

కెమ్మనగుండి ఎలా చేరుకోవాలి??

ఇంత బాగున్న ఈ ప్రదేశంకి అన్ని రకాల రవాణ సాధనాలు అందుబాటులో ఉన్నాయి.

విమాన ప్రయాణం

కెమ్మనగుండి చేరాలంటే, మంగుళూరు అంతర్జాతీయ విమానాశ్రయం 190 కి.మీ.ల దూరంగా ఉంటుంది. ఇక్కడినుండి దేశంలోని వివిధ నగరాలకు, విదేశాలకు కూడా ప్రయాణించవచ్చు. మంగుళూరు నుండి కెమ్మనగుండికి టాక్సీలు, క్యాబ్ లలో చేరవచ్చు. బెంగుళూరు అంతర్జాతీయ విమానాశ్రయం కెమ్మనగుండికి 295 కి.మీ.ల దూరంలో ఉంటుంది.

రైలు ప్రయాణం

కెమ్మనగుండికి రైలు స్టేషన్ లేదు. తరికెరె రైలు స్టేషన్ 15 కి.మీ.ల దూరంలో ఉంటుంది. ఈ రైలు స్టేషన్ దేశంలోని పట్టణాలకు, నగరాలకు అనుసంధానించబడింది. ఇక్కడనుండి కెమ్మనగుండికి టాక్సీలలో చేరవచ్చు.

బస్ ప్రయాణం

కెమ్మనగుండికి బెంగుళూరు(295 కి.మీ) నుండి మరియు మంగుళూరు (190 కి.మీ.), మరియు చిక్కమగళూరు (55 కి.మీ.) లనుండి కర్నాటక రాష్ట్ర రోడ్డు రవాణా సంస్ధ బస్సులను నడుపుతుంది.

Photo Courtesy: native planet

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X