Search
  • Follow NativePlanet
Share
» »ఓనం పండగ : 6 ప్రధాన ఆకర్షణలు !

ఓనం పండగ : 6 ప్రధాన ఆకర్షణలు !

By Mohammad

ఓనం (లేదా ఓణం/తిరుఓనం) కేరళీయులు అతి పెద్ద పండగ. ఈ పండగను మళయాళీలందరూ భక్తి శ్రద్దలతో, కుటుంబసభ్యులతో కలిసి ఆనందోత్సాహాల మధ్య ఘనంగా జరుపుకుంటారు. మన తెలుగువారికి 'ఉగాది' ఎట్లనో మలయాళీ హిందువులకు 'ఓనం' అలాగన్నమాట.

దాదాపు ప్రతిసంవత్సరం, మళయాళ క్యాలెండర్ ప్రకారం మొదటి నెల అయిన చింగం మాసంలో (ఆగస్టు - సెప్టెంబర్ మధ్య) వస్తుంది మరియు మహాబలి ఆ ప్రాంతమునకు తిరిగి రావటాన్ని సూచిస్తుంది.

ఇది కూడా చదవండి : ఓనం పండగ చరిత్ర ఏంటీ ? ఎలా జరుపుకుంటారు ?

కేరళలో ఓనం పండగ 10 రోజుల పాటు నిర్వహిస్తారు. ఈ పది రోజులు అనేక సాంస్కృతిక, జానపద కార్యక్రమాలతో పాటు వివిధ సాహస కార్యక్రమాలు చేపడతారు. ఒక్కోరోజు ఒక్కో కార్యక్రమం నిర్వహించే తీరు యాత్రికులను, స్థానికులను అలరిస్తుంది. ఒకరోజు చేసినట్టు ఇంకోరోజు కనిపించదు. ఇది ఇక్కడి ప్రత్యేకత.

ఓనం రోజు ఎక్కడ ఉంటె బాగుంటుంది ? అక్కడ ఏమేమి చూడవచ్చో, ఏ ఏ కార్యక్రమాలు తిలకించవచ్చో తెలుసుకుందాం పదండి !

త్రిపునితుర అత్తఛమయం

త్రిపునితుర అత్తఛమయం

సంప్రదాయం ప్రకారం, త్రిపునితుర లో ఓనం పండగ ఉత్సవాలు మొట్టమొదట ప్రారంభమవుతాయి. ఆరోజున ఊరిలోని పురవీధులన్నీ విద్యుద్దీపాలతో అందంగా ముస్తాబు చేస్తారు. ఏనుగులను అందంగా అలంకరించి వరుసలో నిలబెట్టుతారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన కళాకారుల సంగీత, నృత్య ప్రదర్శన ఆకట్టుకుంటుంది.

ఎక్కడ ఉంది ?

ఎర్నాకులం నుండి 8 కిలోమీటర్ల దూరంలో

చిత్రకృప : Captain

వామనమూర్తి టెంపుల్

వామనమూర్తి టెంపుల్

ఓనం పండగ రోజులలో కేరళలోని త్రిక్కకరలో గల వామనమూర్తి ఆలయంలో ప్రత్యేక పూజలు చేస్తారు. తమ తమ ఇళ్ల లో త్రిక్కకర అప్పన్‌ (వామనుడు) విగ్రహాలను ప్రతిష్టించి పూజిస్తారు. ఇక్కడ కూడా ఓనం పండగ ఘనంగా నిర్వహిస్తారు. వీధులెంబట స్టాల్స్, పూల అలంకరణలు అలరిస్తాయి.

ఎక్కడ ఉంది ?

ఎర్నాకులం నుండి 9 కి.మీ ల దూరంలో

చిత్రకృప : Brian Holsclaw

కోవలం

కోవలం

త్రివేండ్రం కు 16 కిలోమీటర్ల దూరంలో కోవలం కలదు. ఈ ప్రదేశం కథాకళి నృత్యానికి ఖ్యాతి గాంచింది. ఇక్కడ ఏ చిన్న వేడుక జరిగిన ఈ నృతాన్ని ప్రదర్శిస్తారు. ఓనం నాడు వందల కొలది కళాకారులు వరుసలో నిలబడి నృత్యం చేసే తీరు యాత్రికులను ఆకట్టుకుంటుంది.

చిత్రకృప : Bobinson K B

త్రిసూర్

త్రిసూర్

త్రిపునితుర లో జరిగే విధంగానే త్రిసూర్ లో కూడా ఓనం వేడుకలు కలర్ ఫుల్ గా జరుగుతాయి. వరుసలో పక్కపక్కనే అలంకరించిన ఏనుగులను నిలబెట్టుతారు. బాణాసంచా పేలుస్తారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరవుతారు.

చిత్ర కృప : Brian Holsclaw

స్వరాజ్ రౌండ్, త్రిసూర్

స్వరాజ్ రౌండ్, త్రిసూర్

త్రిసూర్ లోని స్వరాజ్ రౌండ్ లో పులికల్లి లేదా పులి ఆట ఆడతారు. ఇది ఓనం అతిపెద్ద ఆకర్షణ. రాష్ట్రం నలుమూలల నుండి వచ్చే కళాకారులు ఈ ఆట లో పాల్గొంటారు.

చిత్రకృప : Sooraj Kenoth

బోట్ రేస్

బోట్ రేస్

ఓనం పండగ మరో ఆకర్షణ స్నేక్ బోట్ రేస్. ఒక్కో బోట్ లో పదుల సంఖ్యలో కూర్చొని, మహాబలిని ప్రార్ధిస్తూ, పాటలు పాడుకుంటూ ఉత్సాహంగా పోటీలో పాల్గొంటారు.ఎక్కడ జరుగుతుంది ?

తయతంగడి (కొట్టాయం దగ్గర), పంపా నది (అరనుముల), పాపియాడ్ (క్విలాన్ దగ్గర)

చిత్ర కృప : Festival Internacional de Teatro Clásico de Almagro

త్రివేండ్రం

త్రివేండ్రం

రాష్ట్ర రాజధానైనా త్రివేండ్రంలో ఓనం వైభవంగా నిర్వహిస్తారు. రంగవల్లుల పోటీలు, డాన్స్ పోటీలు, సంగీత పోటీలు, హస్తకళా పోటీలు, స్టేట్ షోలు మొదలైన కార్యక్రమాలను చేపట్టుతారు.

చిత్ర కృప : Asif Musthafa

ఓనం ఫుడ్

ఓనం ఫుడ్

ఓనం నాడు కేరళ పర్యటనలో ఉన్నట్లయితే సంప్రదాయ రుచులను ఆస్వాదించండి.

చిత్ర కృప : Ramesh NG

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Nativeplanet sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Nativeplanet website. However, you can change your cookie settings at any time. Learn more