Search
  • Follow NativePlanet
Share
» »కుద్రేముఖ్ - పచ్చని ప్రదేశాల కనువిందు !!

కుద్రేముఖ్ - పచ్చని ప్రదేశాల కనువిందు !!

కుద్రేముఖ్ కర్నాటక రాష్ట్రం లో చిక్కమగళూరు జిల్లాలో ఉన్న పర్వత ప్రదేశం మరియు ప్రధాన హిల్ స్టేషన్ . ఇక్కడ పచ్చని ప్రదేశాలు, దట్టమైన అడవులు ఉండటంతో జీవ వైవిధ్యతతో విరాజిల్లుతుంది. ఈ ప్రదేశంలోని కొండ చివరి భాగం గుర్రపు ముఖం ఆకారంలో ఉండటం చేత దీనిని కుదురే ముఖ్ అని పిలుస్తుంటారు. కుదురే అంటే కన్నడ భాషలో గుర్రమని మీకు ఈ పాటికే అర్థం అయి ఉంటుంది.

రెడ్ బస్ కూపన్లు : బస్ టికెట్ ల మీద ఫ్లాట్ 40 % ఆఫర్ త్వరపడండి

కుద్రేముఖ్ లో కేవలం ప్రకృతిని మాత్రమే వర్ణించడం సబబు కాదు, ఎందుకంటే ఇక్కడ అపారమైన ఖనిజ సంపద దాగి ఉంది. ఈ ప్రాంతం ఏటా 7000 మీ. మీ. వర్షపాతం నమోదు చేస్తుంది అందువల్లే ఇక్కడ ఎల్లప్పుడు నీటి వంకలు నిండుగా కనిపిస్తాయి. నిరంతరం ప్రవహించే నీటి వంకల ఒకదానికొకటి కలిసి తుంగ, భద్ర మరియు నేత్రావతి నదులు ఏర్పడుతుంటాయి.

కుద్రేముఖ్ మరిన్ని విశేషాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండికుద్రేముఖ్ మరిన్ని విశేషాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

కుద్రేముఖ్ జాతీయ పార్క్

కుద్రేముఖ్ జాతీయ పార్క్

కుద్రేముఖ్ లో ప్రధానంగా చూడ వలసినది ఇక్కడున్న జాతీయ పార్క్. ఈ పార్క్ ఇక్కడున్న పర్యాటక ప్రదేశాలలో మొదటిది. ఈ పార్కు విస్తీర్ణం సుమారుగా 600 చ. మీ. ఎప్పుడూ పచ్చగా ఉండే ఈ ప్రదేశాన్ని చూసి, ప్రఖ్యాత పర్యావణవేత్త డా. ఉల్లాస్ కారంత్ దీనిని జాతీయ పార్కు గా ప్రకటించడానికి ప్రభుత్వం పై ఎంతో వత్తిడి తెచ్చాడు.

Photo Courtesy: Manjunath Bhat

కుద్రేముఖ్ జాతీయ పార్క్

కుద్రేముఖ్ జాతీయ పార్క్

ఈ జాతీయ పార్కు చిరుతలు, సింహాలు,కోతులు, అడవి పందులు, అడవి కుక్కలు వంటి జంతువులకు సంరక్షణ కేంద్రంగా మారింది. పార్కు మొత్తం సందర్శించాలంటే పర్యాటకులు ముందుగా అధికారుల ముందస్తు అనుమతి తీసుకోవాలి. కాస్త విశ్రాంతి తీసుకోవాలంటే అటవీ శాఖ వారి రెస్ట్ రూములు ఉన్నాయి. ఈ పార్కు సందర్శించడానికి పర్యాటకులు స్థానిక బస్సులు, ఆటో రిక్షాలను ఉపయోగించవచ్చు.

Photo Courtesy: Roshan Rao

కుద్రేముఖ్ కొండ శిఖరం

కుద్రేముఖ్ కొండ శిఖరం

సముద్ర మట్టానికి 1894 అడుగుల ఎత్తున ఉన్న కుద్రేముఖ్ కొండ శిఖరాన్ని పర్యాటకులు తప్పక సందర్శించాలి. ట్రెక్కింగ్ మరియు అడవులలో పరిశోధనలు చేసేవారికి కుద్రేముఖ్ శిఖరం ఎంతగానో తోడ్పడుతుంది. కుద్రేముఖ్ శిఖరం చేరిన వెంటనే పర్యాటకులు ప్రకృతి అందాలనూ చూసి పులకారించిపోతారు.

Photo Courtesy: telugu native planet

కుద్రేముఖ్ కొండ శిఖరం

కుద్రేముఖ్ కొండ శిఖరం

కొండ శిఖరం మీద నుంచి పశ్చిమాన ఉన్న అరేబియా సముద్రపు అందాలనూ చూస్తే పర్యాటకులు మిక్కిలి ఆనందం చెందుతారు. పర్యాటకులు ఇక్కడి నుంచి సింహాలను, కొండముచ్చులను చూస్తూ ఆనందించవచ్చు. కుద్రేముఖ్ శిఖరం వద్ద పర్యాటకులు వసతికై ఎటువంటి ఆందోళన చెండవలసిన అవసరం లేదు. ఇక్కడ అటవీ శాఖ గెస్ట్ హౌస్ లు, లాడ్జీ లు మొదలైనవి ఉన్నాయి. పర్యాటకులు సమీప కలాసా పట్టణం నుంచి సులభంగా చేరుకోవచ్చు.

Photo Courtesy: Mohandoss Ilangovan

హనుమాన్ గుండి జలపాతాలు

హనుమాన్ గుండి జలపాతాలు

కుద్రేముఖ్ వెళ్ళిన పర్యాటకులు హనుమాన్ గుండి జలపాతాలను తప్పక సందర్శించాలి. ఈ జలపాతాల లోని నీటి ధార సుమారుగా వంద అడుగుల మీద నుంచి కిందకు పడుతుంటాయి. ఈ జలపాతాలకు గల మరొక పేరు సుత్తాన్నబ్బే జలపాతాలు. ఇవి కుద్రేముఖ్ జాతీయ పార్కు యొక్క కొండ ప్రాంతాలలో ఉన్నాయి.

Photo Courtesy: Telugu native palnet

గుండి జలపాతాలు

గుండి జలపాతాలు

గుండి జలపాతాలు ప్రదేశం ట్రెక్కింగ్ చేయాలనుకునే వారికి బాగా ఉంటుంది. ఈ గుండి జలపాతాలు కర్కాల మరియు లాఖ్య డ్యామ్ ల మధ్యలో ఉన్నాయి. కనుక ప్రశాంతత కావాలి అనుకునే వారు ఇక్కడ కి వచ్చి చుట్టూ ఉన్న ప్రకృతి మధ్యలో కాస్తంత సమయం గడిపి ఆనందించవచ్చు.

Photo Courtesy: Sumeet Mulani

గుండి జలపాతాలు

గుండి జలపాతాలు

గుండి జలపాతాలలో సరక్షితంగా విహరించాలంటే పర్యాటకులు ఒక్కొక్కరూ 30 రూపాయలు చెల్లించాలి. ఇక్కడున్న అటవీ శాఖ పిల్లలు, పెద్దల కొరకై జాగ్రత్తగా దిగటానికి మెట్లను నిర్మించింది. ఈ మెట్ల ద్వారా పర్యాటకులు మెల్లగా కిందకు దిగి నీటిలో కేరింతలు కొట్టవచ్చు.

Photo Courtesy: Ashwin Kamath

కాదంబి జలపాతాలు

కాదంబి జలపాతాలు

కుద్రేముఖ్ జాతీయ పార్కు లో గల మరొక అందమైన జలపాతాలు కాదాంబి జలపాతాలు . ఇక్కడికి వచ్చే పర్యాటకులు సమయం దొరికిందంటే సందర్శించ వలసిన ప్రదేశాలలో మొదటిది ఈ జలపాతాలు. ఈ జలపాతాలు ఉన్న ప్రదేశం మనసుకి ఎంతో ఆహ్లాదాన్ని ఇస్తుంది. కాదాంబి జలపాతాల హోరు చెవులకి వినసొంపుగా ఉంటుంది.

Photo Courtesy: Girish Ramesh

ట్రెక్కింగ్

ట్రెక్కింగ్

కుద్రేముఖ్ ప్రదేశం వివిధ ట్రెక్కింగ్ మార్గాలకు అనువుగా ఉంది. ఈ ప్రదేశంలో ట్రెక్కింగ్ చేయాలనుకునే వారు ముందుగా అటవీ శాఖ అనుమతి తప్పక తీసుకోవాలి. కుద్రేముఖ్ లో ట్రెక్కింగ్ లోబో ప్లేస్ నుండి మొదలవుతుంది. అడవిలో కుద్రేముఖ్ శిఖర కొండ ఈ ప్రదేశం నుంచి మొదలవుతుంది.

Photo Courtesy: Binu K S

ట్రెక్కింగ్

ట్రెక్కింగ్

పర్యావరణంలో నేడు వస్తున్న ఎన్నో వాతావరణ మార్పులకి ఏ మాత్రం వన్నె తగ్గకుండా నిలిచింది కుద్రేముఖ్. విశ్రాంతి తీసుకొనేవారికి ఈ ప్రదేశం ఎంతో అనువైనది. సాహస క్రీడలు చేసే వారికి ఈ ప్రదేశం తప్పక ఆనందాన్ని కలిగిస్తుంది. ఒక్కసారి మీరు అటవీ శాఖ అనుమతులు తీసుకున్నారంటే మీకిష్టమైన రీతిలో, మూల మూల కలియతిరిగి ప్రదేశ సహజ అందాలనూ తనివితీరా ఆస్వాదించవచ్చు.

Photo Courtesy: Binu K S

కుద్రేముఖ్ ఎలా చేరుకోవాలి

కుద్రేముఖ్ ఎలా చేరుకోవాలి

విమాన ప్రయాణం

మంగుళూరు అంతర్జాతీయ విమానాశ్రయం కుద్రేముఖ్ పర్యటన స్ధలానికి దేశీయ మరియు అంతర్జాతీయ విమానాశ్రయంగా వ్యవహరిస్తుంది. ఇది కుద్రేముఖ్ కు సుమారు 130 కి.మీ. దూరంలో ఉంది. ఈ విమానాశ్రయానికి దేశం నలుమూలల నుంచి విమానాలు వస్తుంటాయి.

రైలు ప్రయాణం

కుద్రేముఖ్ లో రైలు స్టేషన్ లేదు. మంగుళూరు రైలు స్టేషన్ కుద్రేముఖ్ కు సమీప రైలు స్టేషన్. ఇది 110 కి.మీ. దూరం ఉంది. ఇక్కడినుండి ఇండియాలోని అన్ని ప్రధాన నగరాలకు రైలు సౌకర్యం ఉంది. ఈ రైలు స్టేషన్ నుండి కుద్రేముఖ్ చేరటానికి బస్ లు, ప్రయివేటు వాహనాలు ఎన్నో ఉన్నాయి.

బస్ ప్రయాణం

కర్నాటక రాష్ట్ర రోడ్డు రవాణా సంస్ధ కుద్రేముఖ్ కు అనేక వోల్వో, ఎయిర్ కండిషన్ బస్సులను కూడా నడుపుతోంది. కార్కాల నుండి 50 కి.మీ. మంగుళూరు నుండి 130 కి.మీ. బెంగుళూరు నుండి 350 కి.మీ. దూరంలో బస్ సౌకర్యం లభిస్తుంది.

Photo Courtesy: Manjunath Bhat

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X