Search
  • Follow NativePlanet
Share
» » లక్నో లో లక్కీ గా ఒక్క రౌండ్ !

లక్నో లో లక్కీ గా ఒక్క రౌండ్ !

ఉత్తర భారత దేశంలోని ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో కల లక్నోను నవాబుల నగరం అంటారు. ఈ నగరం చక్కని మర్యాదలకు ఆతిధ్యాలకు ప్రసిద్ధి. లక్నో లో మంచి వాణిజ్య కేంద్రాలు, ఆకర్షణీయ వినోద ప్రదేశాలు, బ్రిటిష్ కాలం నాటి సొగసైన భవనాలు నగరం అంతా విస్తరించి వున్నాయి. ఇక్కడ తయారు అయ్యే వస్తువులలో కూడా మంచి పని నైపుణ్యం, నాన్యతలు ప్రతిబింబిస్తాయి. కదక్ డాన్స్ కు లక్నో పుట్ట్నిల్లు. నగరంలో వివిధ భాషలు మాట్లాడే ప్రజలు కలరు. ఉర్దూ, హిందీ వంటి భాషలలో ఈ ప్రదేశం నుండి కొంతమంది కవులు కూడా ఖ్యాతి కెక్కారు. మరి లక్నో నగరం వెళ్ళినపుడు ఏమి చూడాలి ?

లక్నో పర్యాటక ఆకర్షణలు

లక్నో పర్యాటక ఆకర్షణలు

బారా ఇమామ్బర
బారా ఇమామ్బరను అసఫీ ఇమంబర అని కూడా అంటారు. ఈ పుణ్య క్షేత్రాన్ని అసఫ్ ఉద్ దౌలా, అనే లక్నో నవాబు 1784 లో నిర్మించాడు. లక్నో లో ఇది ఘనత వహించిన వైభవోపేత భవనం. ఇక్కడ కల దిగుడు బావి కారణంగా కూడా ప్రసిద్ధి చెందినది. Pic Credit: Bombman

లక్నో పర్యాటక ఆకర్షణలు

లక్నో పర్యాటక ఆకర్షణలు

చోటా ఇమామ్బర 1838 సంవత్సరంలో ఔద్ రాజ్య మూడవ నవాబు అయిన మహమ్మద్ ఆలి షా ఈ చోటా ఇమామ్బర అంటే సభా ప్రాంగణం నిర్మించాడు. ఇది అతని స్మారకంగా ను అక్కడే సమాధి చేయబడిన అతడి తల్లి సమాధి గాను కూడా చెప్ప బడుతుంది. మొహరం వంటి ప్రత్యేక వేడుకలలో ఈ భవనం అంతా విద్యుత్ వెలుగులతో నిండి పోతుంది కనుక దీనిని పాలస్ అఫ్ లైట్స్ అని కూడా పిలుస్తారు. ఈ భవనంలో మహమ్మద్ ఆలి షా కిరీటం కూడా చూడవచ్చు. ఇమామ్బర లోని కొన్ని భాగాలు తాజ్ మహల్ నిర్మాణాల తీరును పోలి వుంటాయి.

Pic Credit: Areeb Anwer

లక్నో పర్యాటక ఆకర్షణలు

లక్నో పర్యాటక ఆకర్షణలు

సత్ ఖండ
ఇమామ్బర కు వెలుపలి భాగంలో సత్ ఖండ అనబడే ఒక ఏడు అంతస్తుల అసంపూర్ణ వాచ్ టవర్ చూడవచ్చు. మహమ్మద్ ఆలి షా మరణం తర్వాత ఈ నిర్మాణం ఆపి వేయటం వలన నాలుగు అంతస్తులు మాత్రమే కనపడతాయి. స్థానికుల మేరకు, ఈ నిర్మాణం కుతుబ్ మినార్ మరియు లీనింగ్ టవర్ అఫ్ పైసా ల వలె అతడు నిర్మించదలిచాడు. లక్నో ఎలా చేరాలి ? లక్నో లో ఎక్కడ వసతి పొందాలి ? అనే వాటికి ఇక్కడ చూడండి. Pic Credit: Wiki Commons

లక్నో పర్యాటక ఆకర్షణలు

లక్నో పర్యాటక ఆకర్షణలు

రూమి దర్వాజ
రూమి దర్వాజా ను టర్కిష్ గేటు అని కూడా అంటారు. దీనిని 1784 లో నవాబ్ అసఫ్ ఉద్ దౌలా నిర్మించాడు. అవధి శిల్ప శైలి ఈ నిర్మాణంలో గోచరిస్తుంది. రూమి దర్వాజా అరవై అడుగుల ఎత్తు కలిగి ఇస్తాంబుల్ లోని సబ్ లిం పోర్ట్ ను పోలి వుంటుంది. ఈ కట్టడం, ఇమామ్బర పక్కన కలదు.

కధక్ డాన్స్ ల పుట్టినిల్లు!

కధక్ డాన్స్ ల పుట్టినిల్లు!

రెసి డెన్సి
బ్రిటిష్ రెసి డెన్సిఅనబడే ఈ భవనం బ్రిటిష్ రాజుల కాలంనాటి భవన సముదాయం. సిటీ కి మధ్య భాగంలో కలదు. ఈ భవనాన్ని 1857 స్వాతంత్ర పోరాటంలో బాగా ఉపయోగించారు. ప్రస్తుతం ఇది శిధిలమై వుంది. వీటిని అవధ రాజ్యానికి అయిదవ నవాబు అయిన రెండవ నవాబ్ సాదత్ ఆలి ఖాన్ పాలన కాలంలో నిర్మించారు. తర్వాతి కాలంలో ఇవి బ్రిటిష్ పాలకుల నివాసాలుగా మారాయి.

Pic credit: Bombman

కధక్ డాన్స్ ల పుట్టినిల్లు!

కధక్ డాన్స్ ల పుట్టినిల్లు!

లా మార్తినీర్ కాలేజ్
లా మార్తినీర్ కాలేజ్ లక్నో లో ప్రసిద్ధి గాంచిన విద్యా సంస్థ. ఈ కాలేజ్ లో బాలురకు, బాలికలకు రెండు కేంపస్ లు కలవు. బాయ్స్ కాలేజ్ ను 1845 లో నిర్మించగా, గరల్స్ కాలేజ్ ను 1869 లో నిర్మించారు. ప్రసిద్ధి గాంచిన ఈ విద్యా సంస్థలను మేజర్ జనరల్ క్లాడ్ మార్టిన్ స్థాపించారు.
Pic Credit: Bombman

కధక్ డాన్స్ ల పుట్టినిల్లు!

కధక్ డాన్స్ ల పుట్టినిల్లు!

అంబేద్కర్ మెమోరియల్
అంబేద్కర్ మెమోరియల్ భవనాన్ని మానవత, సమానత, సామాజిక న్యాయం వంటి విలువలకు పాటు పడిన జోయబ ఫూలే, నారాయణ్ గురు, శాహూజి మహారాజ్ మరియు భీమ రావు అంబేద్కర్ వంటి వారి జ్ఞాపకార్ధం నిర్మించారు. ఈ భవనం అంతా పూర్తిగా రాజస్తాన్ నుండి తెప్పించిన ఎర్ర రాతితో నిర్మించారు.
Pic Credit: Kavish Aziz

కధక్ డాన్స్ ల పుట్టినిల్లు!

కధక్ డాన్స్ ల పుట్టినిల్లు!

హుస్సైనాబాద్ క్లాక్ టవర్
బారా ఇమామ్బర సందర్శనకు టికెట్ ఇక్కడ ఇస్తారు. సూర్యాస్తమయం చూసేందుకు ఇది ఒక మంచి ప్రదేశం.

కధక్ డాన్స్ ల పుట్టినిల్లు!

కధక్ డాన్స్ ల పుట్టినిల్లు!

నోరు ఊరే రుచి కర ఆహారాలు
లక్నో వెళితే ఇక్కడ తయారు చేసే స్థానిక డిష్ లు తప్పక రుచి చూడండి. స్వీట్ లు, నాన్ వెజ్ డిష్ లు నవాబు పాలకుల వారసత్వంగా లక్నో అంది పుచ్చుకుంది. లక్నో నాన్ వెజ్ ఐటెం లకు ప్రసిద్ధి. వాటిలో కబాబ్ , బిర్యాని, పులావ్ లు లు మరింత ప్రసిద్ధి.
Pic Credit: Matt Stabile

కధక్ డాన్స్ ల పుట్టినిల్లు!

కధక్ డాన్స్ ల పుట్టినిల్లు!

స్వీట్ లు , పూరి లు
కాళి టెంపుల్ లో ఉదయమే దర్హనం చేసుకొనండి. ఆ వెంటనే, అక్కడ తయారు అయ్యే అతి రుచి కర పూరీలు ఈ బొమ్మలో చూపినవి తిని ఆనందించండి. ఇవి సిటీ లోని చౌక్ ఏరియా లో కల కాళి టెంపుల్ బేస్మెంట్ షాప్ లో లభిస్తాయి. వీటిని స్వచ్చమైన నేతితో తయారు చేస్తారు. వీటిలోకి ఇచ్చే కూర సొరకాయ తో తయారు చేస్తారు. ఫీర్ని అనే స్వీట్ ను షాహి తాకడా అనే స్వీట్ బ్రెడ్ ను తినటం మరువకండి.
Pic Credit: Syed Belal Jafri

కధక్ డాన్స్ ల పుట్టినిల్లు!

కధక్ డాన్స్ ల పుట్టినిల్లు!

షాపింగ్
రుచికర ఆహారాలు కడుపు నిండా లాగించి, ఇక ఆపై షాపింగ్ మొదలు పెట్టండి. లక్నో లో మీకు ఏమ్బ్రా ఇడరి బట్టలు చవక. కాటన్ దుస్తులపై చేతి పని చేస్తారు. ఇవి మహిళలకే కాక, పురుషులకు కూడా లభిస్తాయి. ఈ దుస్తులు వాటిపై కల పని తనాన్ని బట్టి రూ.500 - 5000 వరకూ కూడా కొనుగోలు చేయవచ్చు. షాపింగ్ కు ఓల్డ్ చౌక్, అమీనాబాద్ లు మంచి ప్రదేశాలు. అధిక ధరలు చెప్పే మోస పూరిత ప్రాంతాలతో జాగ్రత్తగా వ్యవహరించండి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X