Search
  • Follow NativePlanet
Share
» »మాల్డా...మ్యాంగో నగరం !!

మాల్డా...మ్యాంగో నగరం !!

మాల్డా .... ఈ పేరు మీరు ఎప్పుడైనా విన్నారా?? ఆంగ్ల బజార్ లేదా ఇంగ్రజ్ బజార్ ను స్థానికంగా లేదా కొన్ని సందర్భాల్లో " మామిడి నగరం " గా పిలువబడుతోంది. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఉత్తర నగరంగా ఉన్న మాల్డా, డార్జిలింగ్ మరియు సిలిగురి వంటి ఇతర ప్రముఖ యాత్రా స్థలములకు చేరువలో ఉన్నది. మాల్డా మహానంద నది ఒడ్డున ఉండుటవల్ల మాల్డా పర్యాటక రంగం ఎక్కువగా విజయవంతమైనది. ఉష్ణమండల వాతావరణం ఉండుటవల్ల దేశవ్యాప్తంగా అనేక మంది పర్యాటకులను ఆకర్షిస్తుంది. దక్షిణ బెంగాల్‌ నుంచి ఉత్తర బెంగాల్‌కు వెళ్లేవారికి మాల్డా సింహద్వారం.

మాల్డా...మ్యాంగో నగరం !!

మాల్డా ప్రకృతి అందాలు

Photo Courtesy: RECOFA

మాల్డా పట్టణాన్ని గౌరీపురగా పిలిచేవారని పాణిని వివరించాడు. పండువా రాజ్యాన్ని పుండ్రబర్ధనగా కూడా పిలిచేవారు. బెంగాల్‌ ప్రాచీన, మధ్యయుగ చరిత్రలో మాల్డాను గౌర్‌, పండువాగా పిలిచేవారు. మాల్డాకు కొత్త అందాలను కల్పించటంలో బౌద్ధ మత పాలా, హిందూ సేనా వంశంతో పాటుగా ముస్లిం నవాబులు తమ వంతు కృషి చేశారు. చారిత్రకంగా మాల్డాకు ఘన చరిత్రే ఉంది. గంగానది ప్రవహించే ప్రాంతం కావడంతో మాల్డాలో అతి మేలైన ఫాల్జా మామిడి పండ్లు పండుతాయి. దేశవ్యాప్తంగా పండే మామిడి పళ్ళలోకెల్లా అత్యంత తియ్యని మామడిగా ఫ్లాల్జా మామడి పళ్లకు మంచి గుర్తింపు ఉంది.

మాల్డా...మ్యాంగో నగరం !!

మాల్డా మామిడి పండు

Photo Courtesy: Mousam Samanta

మాల్డా మ్యూజియం

ఈ మ్యూజియం 1500 సంవత్సరాల పురాతనమైనది. ఇక్కడ మట్టి పాత్రలు,శిల్పాలు,చిత్రాలు,టెర్రకోట చేయబడిన పూలజాడీలు మరియు పింగాణీ కళాఖండాలతో సహా అనేక ప్రాంతీయ నమూనాలను కలిగి ఉంది. మ్యూజియం బాగా నిర్వహించబడుతుంది. ప్రత్యేకించి కళా ప్రేమికులకు మధురమైన అనుభూతిని కలిగిస్తుంది. ఇది ఆర్కియాలజీ పశ్చిమ బెంగాల్ డైరెక్టరేట్ ద్వారా పర్యవేక్షించబడిన చేయబడుతుంది.

మాల్డా...మ్యాంగో నగరం !!

మాల్డా మ్యూజియం

Photo Courtesy: telugu nativeplanet

గౌర్‌

బారా సోనా, ఖాదమ్‌ రసూల్‌, లత్తన్‌ మసీదులు గౌర్‌లో ఉన్నాయి. 1425లో నిర్మించిన దాఖిల్‌ దర్వాజా ఉంది. మాల్డాకు 12 కి.మీ. దూరంలో బంగ్లాదేశ్‌ సరిహద్దు దగ్గరలో గౌర్‌ ఉంది.

పండువా

సికిందర్‌ షా హయాంలో ముస్లిం వాస్తుకళతో అదీనా మసీదును 1369లో నిర్మించారు. భారతదేశంలో అతిపెద్ద మసీదుల్లో ఇది ఒకటి. దీనిని హిందూ దేవాలయంపై నిర్మించారని అంటారు. దీని పక్కనే అనేక చిన్న మసీదులు కూడా ఉన్నాయి. మాల్డాకు 18 కి.మీ. దూరంలో పండువా ఉంది.

మాల్డా...మ్యాంగో నగరం !!

మసీదు లోపలి భాగం

Photo Courtesy: pratyush datta

ఎలా వెళ్లాలి??

విమాన మార్గం

మాల్దాకు సమీపంలో గల విమానాశ్రయం కోల్‌కతా విమానాశ్రయం.

రైలు మార్గం

మాల్డా అతిపెద్ద రైల్వే స్టేషన్‌. కోల్‌కతా, గౌహతిల నుంచి నేరుగా రైళ్లు ఉన్నాయి.

రహదారి మార్గం

కోల్‌కతా నుంచి 340 కి. మీ. దూరంలో మాల్డా కలదు.

మాల్డా...మ్యాంగో నగరం !!

మాల్డా రైల్వే స్టేషన్

Photo Courtesy: Santulan Mahanta

మాల్డా హోటళ్ళ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X