Search
  • Follow NativePlanet
Share
» »మంత్రాలయం - దక్షిణ బృందావనం !!

మంత్రాలయం - దక్షిణ బృందావనం !!

మంత్రాలయం ... దక్షిణ భారత దేశ రాష్ట్రమైన ఆంధ్ర ప్రదేశ్ లోని కర్నూల్ జిల్లాలో ఉంది. ఈ పట్టణం తుంగభద్ర నదీ తీరంలో ఉంది. కర్ణాటక రాష్ట్రంతో సరిహద్దు పంచుకుంటుంది. ఈ పట్టణం " మంచాలే " అనే పేరుతో ప్రసిద్ధికెక్కింది. గురు రాఘవేంద్ర స్వామి నిర్మించిన బృందావనం వల్ల తెలుగు వారిలో ఇది బాగా ప్రాచుర్యం పొందింది. శ్రీ రాఘవేంద్ర స్వామి, కుంబకోణంకి చెందిన శ్రీ సుధీంద్ర తీర్థుల యొక్క శిష్యుడు మరియు అనుచరుడు. ఆయనే రాఘవేంద్ర స్వామికి ద్వైత వేదాంతాన్ని, వ్యాకరణాన్ని అలాగే ప్రాచీన సాహిత్య రచనలు మరియు వేద పాఠాలు నేర్పారు. ఇక్కడున్న పుణ్య ప్రదేశాల గురించి ఒక్కొక్కటిగా ...

మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి : మంత్రాలయం - రాఘవేంద్రుని సన్నిది !!

ఉచిత కూపన్లు : ఇప్పుడు అన్ని వయకాం కూపన్లు సాధించండి ఉచితంగా !!

రాఘవేంద్ర స్వామి బృందావనం

రాఘవేంద్ర స్వామి బృందావనం

కర్నూల్ జిల్లాలో ఉన్న ఒక చిన్న గ్రామం లో రాఘవేంద్ర స్వామి బృందావనం ఉంది. రాఘవేంద్ర స్వామి సమాధి ఉన్న ప్రాంతాన్ని బృందావనం గా పిలుస్తారు. అందమైన ప్రకృతి నడుమ తుంగభద్ర నది ఒడ్డు న ఉన్న ఈ మఠం శ్రీ రాఘవేంద్ర స్వామి నివాసం. వేల మంది భక్తులు ఈ సమాధి ని సందర్శించి శ్రీ రాఘవేంద్ర స్వామి ఆశీస్సులు అందుకోవడానికి ప్రతి రోజు విచ్చేస్తారు. స్వామి 1671 లో జీవ సమాధి చెందారు. స్వామి ఏంతో మంది భక్తుల సమస్యలను ఎన్నో అధ్బుతాలు చేసి పరిష్కరించారు. రాఘవేంద్ర స్వామి భక్తులకి కలలో కనిపించి సమస్యలు పరిష్కరిస్తారని ఎన్నో గాధలు ఉన్నాయి. భక్తుల కోరికలు తీర్చే స్వామిని కామధేను మరియు కల్పవృక్షం గా భక్తులు పిలుచుకుంటారు.

Photo Courtesy: Vinay Raj

శ్రీ గురు రాఘవేంద్ర స్వామి ఆలయం

శ్రీ గురు రాఘవేంద్ర స్వామి ఆలయం

మంత్రాలయంలోని శ్రీ గురు రాఘవేంద్ర స్వామి ఆలయం ఈ ప్రాంతపు అతి ముఖ్యమైన సందర్శక ప్రదేశం. గురూజీ శ్రీ మహా విష్ణువు భక్త తత్పరుడైన ప్రహ్లాదుని అవతారమని నమ్మకం. శ్రీ గురు రాఘవేంద్ర స్వామి బృందావనం ఏర్పాటుచేయడానికి మంత్రాలయాన్నే ఎంచుకున్నారు. జీవ సమాధి చెందడం ద్వారా స్వామి బృందావనం లోకి ప్రవేశించారని (సజీవ బృందావనం) అక్కడ నుండి మరి కొన్ని వందల సంవత్సరాల వరకు భక్తుల కోరికలు నేరవేరుస్తారని భక్తుల విశ్వాసం.

Photo Courtesy: Raghunathan Krishnarao

ఉత్సవాలు

ఉత్సవాలు

మహారథొత్సవం మరియు శ్రీ గురు రాఘవేంద్ర స్వామి ఆరాధనోత్సవం మంత్రాలయం లో పెద్ద ఎత్తున నిర్వహింపబడే పండుగలు. వేలాది భక్తులు తప్పనిసరిగా ప్రతి సంవత్సరం గురు జయంతి రోజు ఆలయాన్ని సందర్శించుకుంటారు. జయంతి రోజు ఉత్సవాలు జరుపుకోవటం వల్ల ఆలయం విభిన్న కార్యకలాపాలతో కోలాహలంగా ఉంటుంది. రెండు రోజులు పాటు సాగే ఈ వేడుకలలో హాజరుకావటానికి వేలాది మంది భక్తులు మతాలకు అతీతంగా ఏడాది పొడవునా మంత్రాలయానికి చేరుకుంటారు.

Photo Courtesy: Latha

బిక్షాలయ

బిక్షాలయ

స్థానిక భాషలో 'బిచాలి' గా పిలవబడే బిక్షాలయ, మంత్రాలయానికి సుమారు 20 కి.మీల దూరంలో ఉంది. శ్రీ అప్పనాచార్య జీవితంలో అధిక భాగం ఇక్కడే జీవించిన ప్రదేశంగా దీనికి పేరు. శ్రీ అప్పనాచార్య గురు రాఘవేంద్ర స్వామి కి పరమ భక్తుడే గాక శిష్యుడు కూడా. గురు రాఘవేంద్ర స్వామి బిక్షాలయలో శ్రీ అప్పనాచార్య తో పాటు 13 సంవత్సరాలు జీవించారన్న విషయం విదితమే. తుంగభద్ర నదీ తీర ప్రాంతపు అత్యద్భుతమైన అందాల మధ్యల ఉండటం వల్ల బిక్షాలయలో పచ్చ పచ్చని మరియు ప్రశాంతమైన వాతావరణం నెలకొని ఉంది. నగర జీవనపు ఉరుకులు పరుగులు నుంచి తప్పించుకోవటానికి నేడు చాలా మంది ఇక్కడికి వస్తున్నారు. ఈ చోటు వారికి ధ్యానం చేసుకుని తమ అంతర్గత వ్యక్తులను తెలుసుకునేందుకు కావలసిన శాంతిని, ప్రశాంత పరిసరాలను అందిస్తుంది.

Photo Courtesy: Raghunathan Krishnarao

మాంచాలమ్మ ఆలయం

మాంచాలమ్మ ఆలయం

మంత్రాలయం మఠ సముదాయంలో సమాధి ఆలయం వద్ద నెలకొని ఉన్న ఆలయం మాంచాలమ్మ ఆలయం. మంత్రాలయం గ్రామ దేవతగా మాంచాలమ్మని కొలుస్తారు. పార్వతి దేవి యొక్క అవతారంగా మాంచాలమ్మ ని భావిస్తారు. శ్రీ రాఘవేంద్ర స్వామి బృందావనాన్ని దర్శించుకునే ముందు భక్తులు మాంచాలమ్మ వారి ఆలయాన్ని దర్శించుకుంటారు. ఈ ఆచారం ఎప్పటి నుంచో ఉంది. రాఘవేంద్ర స్వామి వారు ఈ మాంచాలమ్మ వారిని ప్రతి రోజు పూజించే వారని అంటారు. మాంచాలమ్మ దర్శనం పొందిన రాఘవేంద్ర స్వామి అమ్మ వారి అనుగ్రహం తోనే ఇక్కడ కొలువున్నారని గాధలు చెబుతున్నాయి. ఈ ప్రాంతాన్ని సందర్శించే వారు మూల బృందావనంలోని శ్రీ రాఘవేంద్ర స్వామి ని దర్శించుకునే ముందు మాంచాలమ్మ ఆలయాన్ని సందర్శించాలని రాఘవేంద్ర స్వామి సూచించారు. ఇప్పటికీ ఈ ఆచారాన్ని భక్తులు పాటిస్తున్నారు.

సందర్శించు సమయం : ఉదయం ఆరుగంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు అలాగే సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాల నుండి రాత్రి ఎనిమిది గంటల వరకు ఈ ఆలయం తెరిచి ఉంటుంది.

Photo Courtesy: Raghunathan Krishnarao

పంచముఖి ఆంజనేయ ఆలయం

పంచముఖి ఆంజనేయ ఆలయం

పంచముఖి ఆంజనేయ ఆలయం మంత్రాలయం పట్టణం నుంచి సుమారు 5 కి.మీల దూరం లో ఉంది. ఆంజనేయ స్వామి లేదా హనుమాన్ ఈ ఆలయంలోని ఆరాధ్య దైవం. అందమైన పరిసరాల మధ్య ఒక చిన్న కొండపై ఈ ఆలయం ఉంది. ఏభై మెట్లు ఎక్కి ఈ ఆలయానికి చేరుకోవచ్చు. ఇక్కడి విగ్రహానికి గరుడ, నరసింహ స్వామి, హయగ్రీవ, హనుమాన్ మరియు వరాహ స్వాములను ప్రాతినిధ్యం వహిస్తూ అయిదు తలలు ఉంటాయి. శ్రీ గురు రాఘవేంద్ర స్వామి శ్రీ రామునికి మరియు హనుమాన్ కి గొప్ప భక్తుడని నమ్ముతారు. 12 సంవత్సరాల ఘోర తపస్సుకు మెచ్చి హనుమాన్ గురూజీ కి ప్రత్యక్షమయ్యారు. హనుమాన్ గురూజీ కి పంచముఖి ఆంజనేయునిగా దర్శనమిచ్చారు. ఈ మందిరానికి చేరే దారి ఇరుకుగా ఉంటుంది. అందుచేత భక్తులు ఒకే లైన్ లో ఒకరి వెనుక ఒకరు దర్శనానికి చేరుకోవాలి.

Photo Courtesy: karthik327

హనుమాన్ ఆలయానికి వెళ్లే దారిలో ...

హనుమాన్ ఆలయానికి వెళ్లే దారిలో ...

రాళ్ల మధ్య ఉన్నా సుందరమైన నిర్మలమైన భూభాగం మీద ఈ ఆలయం నిర్మించబడింది. ఆలయానికి వెళ్ళే దారి లో మీకు మంచం, తలగడ, దేవతల విమానం లాంటి సహజ ఆకృతి లో ఉన్న రాళ్ళు ఎదురుపడతాయి.

Photo Courtesy: Subha Wedding

మంత్రాలయం ఎలా వెళ్ళాలి??

మంత్రాలయం ఎలా వెళ్ళాలి??

రోడ్డు మార్గం

మంత్రాలయం ఆదోని పట్టణం నుంచి 53 కి. మీ. దూరంలోను, ఎమ్మిగనూరు పట్టణం నుంచి 24 కి. మీ. దూరంలోను, కర్నూల్ నగరం నుంచి 100 కి. మీ. దూరంలో ఉన్నది. అంతేకాక బళ్ళారి నుంచి 120 కి. మీ. దూరంలో, రాయ్‌చూర్ నుంచి 35 కి. దూరంలో ఉంది. కనుక రోడ్డు రవాణా చాలా సాఫీగా ఉంటుంది.

రైల్వే స్టేషన్

మంత్రాలయం చేరువలో ఉన్న రైల్వే స్టేషన్ మంత్రాలయం రోడ్. ఇక్కడి నుంచి సుమారుగా 16 కి. మీ. దూరంలో ఉంది. ఇది గుంతకల్ - రాయ్‌చూర్ వెళ్లు మార్గంలో ఉన్నది. ఈ స్టేషన్ లో సమీప నగరాలకు రెగ్యులర్ రైల్ సర్వీసులు అందుబాటులో ఉన్నాయి.

విమానాశ్రయం

మంత్రాలయం దగ్గరలో ఉన్న విమానాశ్రయం బళ్ళారిలో కలదు. ఇక్కడి నుంచి 120 కి. మీ. రోడ్డు మార్గాన వెళితే మంత్రాలయం చేరుకోవచ్చు. హైదరాబాద్ లో ఉన్న అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగి ,అక్కడి నుంచి రోడ్డు మార్గాన 250 కి. మీ. ప్రయాణించి ఇక్కడికి చేరుకోవచ్చు.

Photo Courtesy: Jpullokaran

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X