Search
  • Follow NativePlanet
Share
» »వీక్ ఎండ్ వచ్చేసింది ...ఎక్కడికెళ్ళాలి

వీక్ ఎండ్ వచ్చేసింది ...ఎక్కడికెళ్ళాలి

ఒక పక్క పిల్లలకు దసరా సెలవులు. ఖాళీగా వుంటే బోర్ అంటూ ఎక్కడికైనా ప్లాన్ చేయమని కోరతారు. వీక్ ఎండ్ లో వచ్చే రెండు రోజుల సెలవులకు ఎక్కడికెళ్ళాలి ?

By Venkatakarunasri

ఒక పక్క పిల్లలకు దసరా సెలవులు. ఖాళీగా వుంటే బోర్ అంటూ ఎక్కడికైనా ప్లాన్ చేయమని కోరతారు. వీక్ ఎండ్ లో వచ్చే రెండు రోజుల సెలవులకు ఎక్కడికెళ్ళాలి ? ఎక్కడి కి వెళ్ళినా మరల సోమవారం ఆఫీస్ కు హాజరు కావలసిందే ! ఇక ఆ వారానికి పూర్తి విశ్రాంతి లభించనట్లే. అయితే, ఎక్కడో దూర ప్రదేశాలకు వెళ్ళే కంటే, బెంగుళూరు లేదా చుట్టుపట్ల కల తక్కువ దూరం ప్రదేశాల పర్యటన చేస్తే అనే ఆలోచన వచ్చింది. ఎక్కడికి వెళ్ళాలి ? అనేది మరింత పరిశీలిస్తే...దిగువ ప్రదేశాల పర్యటన అద్భుతం అనిపించింది. మరి ఆ ప్రదేశాలు ఏవి ? అనేది చూడండి.

మహాబోధి సొసైటీ

మహాబోధి సొసైటీ

మహాబోధి సొసైటీ సిటీ లోని గాంధీనగర్ లో కలదు. నగర బిజి జీవితానికి ఈ ప్రదేశ వాతావరణం ముగింపు చెపుతుంది. పేరుకు తగినట్లే, ఈ బౌద్ధ ప్రదేశం పెద్ద పర్యటనా స్థలం కాకపోయినప్పటికీ, కొంత మేరకు విశ్రాంతిని ఇవ్వగలదు. బుద్ధుడు విగ్రహం, ఒక పెద్ద సభా ప్రాంగణం, ఒక స్తూపం వుంటాయి. విద్యార్ధులైన బౌద్ధ సన్యాసులు, భక్తులు తో విభిన్న వాతావరణం కనపడుతుంది. తప్పక చూడదగిన ప్రదేశం.

Pic credit: Shruthi C

ఓంకార్ హిల్స్

ఓంకార్ హిల్స్

ఓంకార్ హిల్స్ చాలామందికి తెలియని ప్రదేశం. ఓంకార్ హిల్స్ నుండి కిందకు చూస్తె, బెంగుళూరు అద్భుతంగా కనపడుతుంది. ఇక్కడే ఒక మర్రి చెట్టు దానితో పాటు, భారతీయ ఋషుల విగ్రహాలు కూడా కలవు. ఇక్కడ ఒక పెద్ద గడియారం కలదు. ప్రతి గంటకు గంటలు కొడుతుంది. కొత్తగా ఇక్కడ నిర్మించిన ద్వాదశ జ్యోతిర్లింగా టెంపుల్ మహాశివరాత్రి పండుగకు వేలాది భక్తులను ఆకర్షించినది.

Pic Credit: wikimapia.org

బిగ్ బనయాన్ ట్రీ

బిగ్ బనయాన్ ట్రీ

కన్నడంలో ఈ చెట్టును దొడ్డ ఆలద మర అంటారు. ఈ ప్రదేశం, మంచినబెలె డాం మరియు సావనదుర్గ హిల్ ల పర్యటనలో చేర్చాలి. ఇది రామోహళ్లి లో అంటే బెంగుళూరు కు 28 కి. మీ. ల దూరంలో కలదు. ఈ పెద్ద మర్రి చెట్టు 400 సంవత్సరాల పురాతనమైనది. మూడు ఎకరాలలో విస్తరించినది. ఈ చెట్టు నీడన చక్కగా ఆనందించవచ్చు. కోతులు వుంటాయి జాగ్రత్త సుమా ! బెంగుళూరు - మైసూరు రోడ్ లో కల ఈ ప్రదేశానికి కుమ్బాల్ గోడ్ వద్ద మలుపు తీసుకొని మరల 7 కి. మీ. లు ప్రయాణిస్తే, ఈ ప్రదేశం వచ్చేస్తుంది.

Pic Credit: Wiki Commons

నృత్య గ్రామం

నృత్య గ్రామం

ఈ నృత్య గ్రామం ప్రతిమా గౌరీ బేడి చే స్థాపించబడినది. మొదటి గురుకుల విద్యాలం. ఇక్కడ సాంప్రదాయక నృత్యాలు నేర్పుతారు. దీనిలోని గురువులు, శిష్యులు ఇక్కడ పంటలు పండించి వారి ఆహారం వారే తయారు చేసుకుంటారు. ఈ విలేజ్ సోమవారం నుండి శనివారం వరకూ పబ్లిక్ కు అందుబాటులో వుంటుంది.

Pic Credit: Wiki Commons

కబ్బన్ పార్క్

కబ్బన్ పార్క్

కబ్బన్ పార్క్ పచ్చటి ప్రదేశం. సుమారు 300 ఎకరాలలో బెంగుళూరు నగరం నడిబొడ్డున విస్తరించి వుంది. ఇక్కడ ఎంతోమంది ప్రకృతి ప్రియులు వచ్చి వేసవి వేడి నుండి రక్షనపొంది ఆనందిస్తారు. దీనిలో ప్రభుత్వ లైబ్రరీ, మ్యూజియం, పిల్లలకు ఒక టాయ్ ట్రైన్ అనేక విగ్రహాలు కూడా కలవు. ఉదయాలు, సాయంత్రాలు ఎంతోమంది జాగింగ్ కు వస్తారు.

Pic Credit: Wiki Commons

లాల్ బాగ్

లాల్ బాగ్

లాల్ బాగ్ బెంగుళూరు లో ప్రసిద్ధ బొటానికల్ గార్డెన్. 240 ఎకరాల విస్తీర్ణంలో కల ఈ ప్రదేశం లో ఎన్నో రకాల మొక్కల, వృక్షాలు కలవు. దీనిలో ఒక సరస్సు కూడా కలదు. ప్రతి సంవత్సరం రెండు మార్లు ఇక్కడ ఫ్లవర్ షో లు జరుగుతాయి. సిటీ జీవితం నుండి దూరంగా ఆనందించేందుకు అద్భుత ప్రదేశం. ప్రతి రోజూ ఇది ఉదయం 6 గం. నుండి సా. 7 గం. వరకూ తెరచి వుంటుంది. బెంగుళూరు మరిన్ని ఆకర్షణలకు ఇక్కడ చూడండి.

Pic Credit: Wiki Commons

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X