Search
  • Follow NativePlanet
Share
» »హరిహరేశ్వర్ శివభగవానుడి ఆలయానికి ప్రసిద్ధి !

హరిహరేశ్వర్ శివభగవానుడి ఆలయానికి ప్రసిద్ధి !

మహారాష్ట్ర లోని రాయ్ ఘడ్ జిల్లాలో హరిహరేశ్వర్ అనే ఊరు చుట్టూ నాలుగు కొండల మధ్య చిక్కుకున్నట్లు కనిపిస్తుంది. ఊరి చుట్టూ ఈ నాలుగు కొండలే కాకుండా అరేబియా సముద్రం కూడా అల్లుకొని ఉంటుంది. నిజానికి ఇదొక దీవి అనుకోండి ..! ఈ ఊరు చుట్టూ నాలుగు కొండలు రౌండప్ చేసినాయని తెలుసుకున్నాం కదా వాటి పేర్లు బ్రహ్మాద్రి, పుష్పాద్రి, హర్షిణాచల్ మరియు హరిహర్.

ఇది కూడా చదవండి : పూణే లోని సందర్శనీయ స్థలాలు !

హరిహరేశ్వర్ దేనికి ప్రసిద్ధి ? అక్కడ అంతగా చూసే విధంగా ఏమి ఉన్నాయి ?? అనే విషయానికి వస్తే .... హరిహరేశ్వర్ శివభగవానుడి ఆలయానికి ప్రసిద్ధి. కాలభైరవ ఆలయం మరియు యోగేశ్వరి ఆలయాలు కూడా ఇక్కడ సందర్శించవచ్చు. దాంతో పాటు అరేబియా సముద్ర తీరం నుంచి వీచే చల్లని గాలులు హాయినిస్తాయి.

గణేశ్ గిల్లీ, హరిహరేశ్వర్

గణేశ్ గిల్లీ, హరిహరేశ్వర్

గణేశ్ గిల్లీ హరిహరేశ్వర్ లో రెండు కొండల మధ్యలో ప్రవహిస్తుంది. ఇదొక కాలువ. కాలువ చివరన గణపతి విగ్రహం కనపడుతుంది. విగ్రహం కనుగొనిన చోటు పవిత్రమైనదిగా భావిస్తారు. నీటిలో సుమారు 30 అడుగుల లోతులో ఉండే ఈ విగ్రహం సముద్ర అలలు వచ్చే సమయంలో స్పష్టంగా కనిపిస్తుంది.

చిత్ర కృప : Amit Ghodke

కాల భైరవ ఆలయం, హరిహరేశ్వర్

కాల భైరవ ఆలయం, హరిహరేశ్వర్

హరిహరేశ్వర్ లోని కాల భైరవ ఆలయం పురాతమైనది మరియు ప్రసిద్ధి గాంచినది. ఏటా భక్తులు ఈ యాత్రా స్థలానికి అధిక సంఖ్యలో వస్తుంటారు. ఇక్కడి ప్రధాన దైవం శివ భగవానుడు. కాలభైరవుడు మంత్ర శాస్త్రాలకు అధిపతి. శివుడు కలభైరావున్ని సృష్టించి ఆయనకు అన్ని మంత్రాలను ప్రసాదించాడని కథనం.

చిత్ర కృప : Amit Ghodke

హరిహరేశ్వర్ బీచ్, హరిహరేశ్వర్

హరిహరేశ్వర్ బీచ్, హరిహరేశ్వర్

హరిహరేశ్వర్ బీచ్ విహారాలకు అనుకూలంగా ఉంటుంది. ఇక్కడ ఇసుక మెత్తగా ఉండి తెల్లగా ఉంటుంది. బీచ్ నుండి వీచే గాలి ఎంతో ఆహ్లాదకరంగా ఉండి ఉత్సాహాన్ని, ఆనందాన్ని ఇస్తుంది. ఈ ప్రాంతానికి మరొక అందం అరేబియా సముద్రం. నీరు అంటే ఇష్టపడేవారు బోటింగ్, వాటర్ స్కూటర్ రైడ్ వంటి ఆటలను ఆడవచ్చు కానీ ఆడేటప్పుడు చాలా జాగ్రత్త గా ఉండాలి. బీచ్ సందర్శన సమయం అక్టోబర్ నుండి మార్చి వరకు.

చిత్ర కృప : Ketan Nikharge

విష్ణు పాదాలు, హరిహరేశ్వర్

విష్ణు పాదాలు, హరిహరేశ్వర్

కొండ మీద మెట్ల మార్గం ద్వారా కిందకు దిగి వెళ్తే చదునైన కొండ గుట్టల మీద దర్శనమిస్తాయి విష్ణు పాదాలు. ఈ కొండ గుట్ట మీద భీముడు తన తండ్రి కి పితృసంస్కరణలు చేసాడని స్థానికులు చెబుతారు. భీముని పాద ముద్రికలు, దేవతామూర్తుల పాద ముద్రికలు కూడా ఇక్కడ గమనించవచ్చు.

చిత్ర కృప : Girish Gaikwad

గాయత్రి పాండ్, హరిహరేశ్వర్

గాయత్రి పాండ్, హరిహరేశ్వర్

గాయత్రీ పాండ్ చాలా మహిమ కలిగి ఉండేదని స్థానికుల కథనం. ఆ పాండ్ ఇప్పటికి ఎన్నో రూపాంతరాలు జరిగి, ఎలాగోలా .. కొండలోకి చొచ్చుకొని పొయి ఒక చిన్న గుంత, అందులో గుక్కెడు నీళ్ళగా మిగిలిపోయిందిట. అందరూ ఆ కొండ లోపలికి వంగి దాన్ని దర్శించుకుంటుంటారు.

చిత్ర కృప : Nagraj Salian

దివే ఘర్ బీచ్, హరిహరేశ్వర్

దివే ఘర్ బీచ్, హరిహరేశ్వర్

దివే ఘర్ బీచ్ హరి హరేశ్వర్ లో ఉన్న మరొక బీచ్. ఈ బీచ్ లో సూర్యోదయాలు, సూర్యాస్తమాలు అద్భుతంగా ఉంటాయి. స్థానికులు, యాత్రికులు బీచ్ వద్దకి వచ్చి పోటోలు తీసుకొని మురిశిపోతారు. ఇదొక కిడ్స్ ఫ్రెండ్లీ బీచ్. దీనికి దక్షిణాన ఉన్న బీచ్ ను శివవర్ధన్ బీచ్ అని అంటారు.

చిత్ర కృప : Clutter And Camera

భాగమండల, హరిహరేశ్వర్

భాగమండల, హరిహరేశ్వర్

హరి హరేశ్వర్ కు కొద్ది దూరంలో భాగమండల అనే చిన్న గ్రామం ఉంది. ఈ గ్రామం కూడా ఎంతో అందంగా ఉండి పర్యాటకులను ఆకర్షిస్తుంది. మరాఠా సామ్రాజ్య పాలకుడు పేష్వా ఈ గ్రామంలో వసతిని ఏర్పరుచుకొని కొన్ని సంవత్సరాల పాటు నివాసం ఉన్నాడు. వసతి అంటే ఏదో చిన్న ఇల్లు అనుకొనేరు ఇక్కడ కోట ఉంది. దాని పేరు బాన్ కోట్ కోట.

చిత్ర కృప : Khalil Sawant

హరి హరేశ్వర్ కి ఎలా చేరుకోవాలి ?

హరి హరేశ్వర్ కి ఎలా చేరుకోవాలి ?

వాయు మార్గం

హరిహరేశ్వర్ కి సమీప విమానాశ్రయం 171 కి. మీ. దూరంలో ఉన్న పూణే దేశీయ విమానాశ్రయం. 197 కిలోమీటర్ల దూరంలో ముంబై ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయంకూడా ఉంది. ఈ విమానాశ్రయాలు దేశంలోని అన్ని ప్రధాన నగరాలకు, ఇతర దేశాలకు చక్కగా అనుసంధానించబడింది. క్యాబ్ లేదా ఏదేని ఇతర ప్రవేట్ గాని, ప్రభుత్వ వాహనాల మీద కానీ ప్రయాణించి హరిహరేశ్వర్ చేరుకోవచ్చు.

రైలు మార్గం

హరిహరేశ్వర్ కి సమీప రైల్వే స్టేషన్ మంగోన్ రైల్వే స్టేషన్. ఇది 60 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. మంగోన్ కొంకణ్ రైలు మార్గంలో ఉండి పూణే, ముంబై మరియు మహారాష్ట్రలోని వివిధ ప్రాంతాలకు అనుసంధానించబడుంది.

రోడ్డు మార్గం

హరిహరేశ్వర్ చేరాలంటే దాని సమీప పట్టణాల నుండి ప్రభుత్వ లేదా ప్రవేట్ వాహనాల్లో, బస్సులో ప్రయాణించి చేరుకోవచ్చు. పూణే , హరిహరేశ్వర్ కు 171 కి.మీ. దూరం కాగా ముంబై సుమారు 195 కి.మీ. ల దూరంలో కలదు. ముంబై నుండి హరిహరేశ్వర్ కు రోడ్డు ద్వారా ప్రయాణించాలనుకునేవారు పాన్వేల్ - గోవా హై వే మీదుగా ప్రయాణించి మంగోన్ గ్రామం వద్ద మలుపు తిరగవచ్చు.

చిత్ర కృప : anoop22sharma

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X