Search
  • Follow NativePlanet
Share
» »కోటి వేల్పుల అండ ... కోటప్పకొండ !!

కోటి వేల్పుల అండ ... కోటప్పకొండ !!

By Mohammad

కోటప్పకొండ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాన ఉన్న ప్రముఖ శివాలయం. ఇది గుంటూరు జిల్లాలో నరసరావుపేట సమీపాన ఉన్నది. ప్రస్తుత ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి శాశ్వత రాజధాని అమరావతి నుండి 61 కి.మీ. దూరంలో, తాత్కాలిక రాజధాని విజయవాడ కు 95 కి.మీ. దూరంలో మరియు గుంటూరు నగరానికి 46 కి.మీ. దూరంలో కోటప్పకొండ కలదు.

మరింతగా చదవండి : గుంటూరు లో గల పర్యాటక ప్రదేశాలు !!

ఎంతో మంది ఋషులకు, దేవతామూర్తులకు జ్ఞానోపదేశం చేసిన పవిత్ర పుణ్య క్షేత్రం ఈ కోటప్పకొండ. మామూలు రోజుల్లో భక్త జన సందోహం పరిమితంగా ఉంటుంది అదే శివరాత్రి వచ్చిందంటే మాత్రం కొండ కింది నుంచి పై వరకు కాలు కిందకు పెట్టడానికి కూడా సందు దొరకదు. ఏటా లక్షల సంఖ్యలో హాజరయ్యే శివరాత్రి రోజున జరిగే జాతర దేశంలో కెల్లా ప్రసిద్ధి చెందినది.

మరింతగా చదవండి : విజయవాడ లో గల పర్యాటక ప్రదేశాలు !!

ఇక్కడ ఉండే కొండను ఏవిధంగా చూసిన మూడు శిఖరాలుగా కనిపిస్తాయి. వీటికే బ్రహ్మ, విష్ణు మరియు రుద్ర అని పేర్లు. కాబట్టి కొండపై వెలసిన దేవుణ్ణి త్రికూటేశ్వరుడు అని, ఈ ప్రదేశాన్ని త్రికూటాచలమని పిలుస్తారు. ఇక్కడ చూడవలసిన కొన్ని ప్రధాన ఆకర్షణలు ఒకసారి గమనించినట్లయితే ..మరింతగా

చదవండి : ప్రకాశం జిల్లాలో గల పర్యాటక ప్రదేశాలు !!

బ్రహ్మ శిఖరం

బ్రహ్మ శిఖరం

రుద్ర శిఖరానికి నైరుతి దిశలో బ్రహ్మ శిఖరం ఉంది. ఇక్కడ స్వయాన బ్రహ్మ దేవుడు నివసించాడని ప్రతీతి. జ్యోతిర్లింగం ఈ ప్రదేశంలో లేకపోవడం చేత బ్రహ్మ శివుణ్ని ప్రసన్నం చేసుకోవడానికి తపస్సు చేశాడు. అపుడు శివుడు ప్రత్యెక్షమై బ్రహ్మ కోర్కె తీర్చేందుకు జ్యోతిర్లింగంగా వెలిసాడు. ఆ జ్యోతిర్లింగమే ప్రస్తుతం పూజలందుకుంటున్న కొటేశ్వర లింగం.

Photo Courtesy: Dr.I.S.Prasad

విష్ణు శిఖరం

విష్ణు శిఖరం

ఈ శిఖరం రుద్ర శిఖరానికి పక్కనే ఉంటుంది. ఇక్కడ విష్ణువు శివుణ్ని గురించి తపస్సు చేసి ప్రసన్నం చేసుకున్నాడు. వెంటనే ఇంద్రాది దేవతలు అక్కడికి వచ్చి తాము దక్షుని యాగంలో హవిస్సు స్వీకరించి నందువల్ల దోషులు అయ్యమని, తమను పాప విముక్తులను చేయమని శివుణ్ని ప్రార్ధించారు. శివుడు తన వద్ద ఉన్న త్రిశూలాన్ని అక్కడే ఉన్న రాతి మీద పొడిచాడు. అంతే.. రాతి నుంచి పుట్టిన నీటి ధారల్లో శివుడు లింగ రూపం ధరించాడు. దేవతలు ఆ జలం తో స్నానం చేసి పాపవిముక్తులు అయ్యారు. అప్పటి నుంచి పాప లింగానికి వినాశ్వెశ్వరుడు అన్న పేరు వచ్చింది.

Photo Courtesy: Dr.I.S.Prasad

రుద్ర శిఖరం

రుద్ర శిఖరం

ఈ కొండ మీద కైలాసం నుండి త్రికూటాద్రికి వచ్చిన బ్రహ్మచారి అయిన దక్షిణామూర్తి(శివుడు) యోగనిష్టుడై బ్రహ్మ మొదలైన దేవతలకు బ్రహ్మోపదేశం చేస్తాడు. అందుకే ఈ క్షేత్రాన్ని రుద్ర శిఖరం అని పిలుస్తారు.

Photo Courtesy: viharikapavuluri

త్రికూట పర్వత దేవాలయం

త్రికూట పర్వత దేవాలయం

ఈ ఆలయ సన్నిధిని మూడు భాగాలుగా విభజించవచ్చు. మొదటి కొండ మీద ముసలి కోటయ్య గారి గుడి ఉంది. ఇది పూర్తిగా శిధిలావస్థలో ఉన్నది.

Photo Courtesy: drifter747

త్రికూట పర్వత దేవాలయం

త్రికూట పర్వత దేవాలయం

రెండవ కొండమీద త్రికూటేశ్వరస్వామి ఆలయం ఉన్నది. ఇక్కడ ఎర్రని కోతులు ఎక్కువ. ఇవి భక్తుల వద్ద ప్రసాదాలను, తినిబండారాలను లాక్కోని పరుగెత్తుతాయి. ఇక్కడే పెద్ద పుట్ట, నవగ్రహ దేవాలయం, ధ్యాన మందిరం తో పాటుగా ఆలయం వెనుక భాగమున కాటేజీలు ఉన్నాయి.

Photo Courtesy: Dr.I.S.Prasad

త్రికూట పర్వత దేవాలయం

త్రికూట పర్వత దేవాలయం

మూడవ కొండ మీద బొచ్చు కోటయ్య మందిరం మరియు కళ్యాణ కట్ట, సిద్ధి వినాయక ఆలయాలు ఉన్నాయి.

Photo Courtesy: T.sujatha

మెట్లు

మెట్లు

కొండ మీద పోవడానికి నిర్మించిన ఘాట్ రోడ్డు లో ప్రకృతి సౌందర్యాలను ఆస్వాదిస్తూ ఆలయం పై భాగానికి చేరుకోవచ్చు. నిటారుగా ఉండే మరో దారి గుండా కూడా ఆలయం వద్దకి చేరుకోవచ్చు. ఈ ఆలయానికి కాలి నడకన చేరుకోవాలంటే సుమారు వెయ్యి కి పైగా మెట్లు ఎక్కవలసి ఉంటుంది. ఆ.. మరి దేవుడు ఊరికే కనిపిస్తాడా ..!

Photo Courtesy: విశ్వనాధ్.బి.కె.

ప్రకృతి ఆభరణాలు

ప్రకృతి ఆభరణాలు

ఆలయానికి వెళ్లే మార్గంలో పూల తోటలు, జింకల పార్కు, పక్షుల పార్క్, జురాసిక్ పార్కు, పూర్తి ఎలక్ట్రానిక్ పరికరాలతో తోక, తల లను కదిలించే రాక్షస బల్లులను ఇక్కడ గమనించవచ్చు. రంగురంగుల పక్షులు, నెమాళ్లు ఒకటేమిటి అన్ని ఇక్కడే కనిపిస్తాయి.

Photo Courtesy: viharikapavuluri

లైబ్రేరీ

లైబ్రేరీ

కాళీయ మార్తనం అనే పేరు గల ఒక సరస్సు కూడా ఇక్కడ ఒకటి ఉంది. అలాగే ఎన్విరాన్‌మెంటల్ లైబ్రేరీ మరియు పురాతన పుస్తకాలు గల లైబ్రేరీ ఇక్కడ ఉన్నాయి. ఎంతో అందమైన రంగురంగుల చేపల తో కూడిన ఆక్వెరీయం లు కలవు.

Photo Courtesy: T.sujatha

వసతి

వసతి

కోటప్పకొండ మీద ఉండటానికి దేవస్థానం వారు కొన్ని వసతి గృహాలను ఇక్కడ ఏర్పాటు చేశారు. ఇవి సుమారుగా 30 వరకు ఉన్నాయి. అలాగే ప్రభుత్వ అతిధి గృహాలు ఇంకా కొన్ని ప్రైవేట్ లాడ్జీ లు కూడా ఉన్నాయి. కొండమీద తినటానికి హోటళ్లు, దుకాణాలు, కాఫీ, టీ స్టాళ్లు మరియు పిల్లల కొరకు ఆట వస్తువులు ఉన్నాయి.

Photo Courtesy: T.sujatha

కోటప్పకొండ ఆలయ పరిసరాలు

కోటప్పకొండ ఆలయ పరిసరాలు

మామూలు రోజులలో కోటప్పకొండ దర్శనం

Photo Courtesy: T.sujatha

కోటప్పకొండ ఆలయ పరిసరాలు

కోటప్పకొండ ఆలయ పరిసరాలు

కొండ మీద నుంచి కిందికి చూస్తే ...

Photo Courtesy: T.sujatha

కోటప్పకొండ ఆలయ పరిసరాలు

కోటప్పకొండ ఆలయ పరిసరాలు

పండగ సమయాలలో రాత్రి పూట విద్యుద్దీప కాంతులతో ప్రకాశిస్తున్న ఆలయం

Photo Courtesy: Pavuluri satishbabu 123

కోటప్పకొండ ఆలయ పరిసరాలు

కోటప్పకొండ ఆలయ పరిసరాలు

పగటి పూట ఆలయ ముఖచిత్రం

Photo Courtesy: విశ్వనాధ్.బి.కె.

కోటప్పకొండ ఆలయ పరిసరాలు

కోటప్పకొండ ఆలయ పరిసరాలు

ఆలయం లోపల గల నది విగ్రహం

Photo Courtesy: విశ్వనాధ్.బి.కె.

కోటప్పకొండ ఆలయ పరిసరాలు

కోటప్పకొండ ఆలయ పరిసరాలు

జాతర సమయంలో ...

Photo Courtesy: Svpnikhil

కోటప్పకొండ ఆలయ పరిసరాలు

కోటప్పకొండ ఆలయ పరిసరాలు

కొండ మీద గల కొన్ని దృశ్యాలు

Photo Courtesy: Dr.I.S.Prasad

కోటప్పకొండ కు ఎలా చేరుకోవాలి ??

కోటప్పకొండ కు ఎలా చేరుకోవాలి ??

వాయు మార్గం

కోటప్పకొండ కు సమీపాన గల విమానాశ్రయం గన్నవరం విమానాశ్రయం. ఇది విజయవాడ నగరంలో కలదు. విజయవాడ కోటప్పకోండకు 95 కి. మీ. దూరంలో ఉన్నది. విజయవాడ నుంచి ప్రవేట్ వాహనాల మీద కానీ, క్యాబ్ ద్వారా కానీ ఇక్కడికి చేరుకోవచ్చు

రైలు మార్గం

కోటప్పకొండ కు సమీపాన నరసరావుపేట రైల్వే స్టేషన్ ఉంది. ఇది 11 కి. మీ. దూరంలో ఉన్నది. గుంటూరు లేదా విజయవాడ వెళ్లే రైళ్లాన్ని ఇక్కడే ఆగుతాయి. కనుక నరసరావుపేట వద్ద దిగి, బస్సు ద్వారా కానీ, ఆటో లేదా ఇతర వాహనా ల మీద గాని ఎక్కి చేరుకోవచ్చు.

రోడ్డు మార్గం

కోటప్పకొండ కు విజయవాడ లేదా గుంటూరు లేదా నరసరావుపేట లేదా చిలకలూరిపేట ఊర్ల నుండి ప్రభుత్వ బస్సులు నడుస్తుంటాయి. కొండ మీదకి చేరుకోవడానికి కొండ కింది నుంచి బస్సులను దేవస్థానం వారు నడుపుతుంటారు.

Photo Courtesy: T.sujatha

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X